జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి దాడి చేసింది, తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్న సుబ్బరాజు టీవీ9తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ కు అభిమాని. ఎలాంటి గొడవలు కూడా పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్ పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10 వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు' అంటూ చెప్పాడు.
మరో పక్క ప్రాథమిక విచారణ తర్వాత నిందితుడు శ్రీనివాసరావు, వైకాపా అభిమాని అని, 2014 లో వైకాపా అధికారం లోకి రాకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యాడని, ఇప్పుడు హత్యా యత్నం లాంటిది జరిగితే వచ్చే సింపతీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుఅయ్యే ఆలోచనతో హత్యా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. హోటల్ లో పని చేసే వాళ్ళు కూడా, ఆటను ఎప్పుడూ జగన్ గురించే చెప్తూ ఉండేవాడని, చంద్రబాబుని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడని, ఈ సారి మా అన్నకు తిరుగు లేదని చెప్తూ ఉండేవారని అంటున్నారు.
జగన్పై దాడి ఘటనను ఏపీ ప్రభుత్వం ఖండించింది. విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికి దాడులకు ఈ సమాజంలో తావు లేదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా.. ఉంటే ఏపీ ప్రభుత్వంతో పాటు పలువురు మంత్రులు ఘటనపై స్పందించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావని పేర్కొన్నారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ శ్రీనివాస్ అన్న చెప్పిన వీడియో చూడవచ్చు https://www.facebook.com/SaahoChandrababu/videos/274358636525989/