జగన్ మోహన్ రెడ్డి ఏమి చేసినా, అద్భుతం, మహా అద్భుతం, అసలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే జరగలేదు అని చెప్పే బ్లూ మీడియా, అలాగే పేటీయం బ్యాచ్ చేసే హడావిడి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలాంటి డబ్బానే మళ్ళీ మొదలు పెట్టారు. ఈ రోజు ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను ప్రకటించారు. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ కాగా, మొత్తం నాలుగు స్థానాలు వైసీపీకే వచ్చాయి. అయితే ఈ నాలుగు స్థానాల పేర్లు చూసి, బిత్తరపోవటం, రాష్ట్ర ప్రజల వంతు అయ్యింది. ఒకటి విజయసాయి రెడ్డికి ఇచ్చారు. ఇది ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే, ఇవ్వక పోతే, కేసులతో ముడి పడి ఉన్న వ్యవహారం. పదవి లేకపోతే, రేపు కోర్టులో మినహాయింపులు, వగైరా వగైరా చేయటానికి వీలు ఉండదు. జగన్ కేసులతో ముడి పడిన అంశం కాబట్టి, ఇవ్వక తప్పదు. ఇక మరో స్థానం, నిరంజన్ రెడ్డి. ఈయన జగన్ కేసులు వాదించే లాయర్. జగన్ అక్రమ ఆస్తులు కేసులో, ప్రతి రోజు వాదించేది ఈయనే. కాబట్టి ఈయనకు కూడా ఇవ్వక తప్పదు. అంటే ఇక్కడ నాలుగు స్థానాలు ఉంటే, రెండు రెడ్లకే ఇచ్చేసారు జగన్ రెడ్డి. జనాభాలో 4శాతం ఉన్న కులానికి, 50% స్థానాలను కేటాయించారు. అదేమని ప్రజలు, విపక్షాలు అడుగుతారు కాబట్టి, మిగతా రెండు బీసీలకు ఇచ్చేస్తున్నాం అంటూ, దాన కర్ణుడిలా ప్రకటించారు.
అందులో ఒకరు బీదా మస్తాన్ రావు అనే వ్యాపారవేత్త. మరోకాయినా తెలంగాణాకు చెందిన ఆర్.కృష్ణయ్య. ఇదే కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అమ్మనా బూతులు తిట్టిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మరో టికెట్ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీసిలే లేరు అనే విధంగా, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి పదవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో, దేని కోసం ఇచ్చారో, ఎలా ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఇలా రెడ్లకు 50% ఇచ్చి, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నా అంటూ డబ్బా కొట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినీ నటుడు ఆలీని నాలుగు నెలల క్రిందట, జగన వద్దకు పిలిపించారు. ఆయన తన భార్యతో కలిసి వచ్చారు. ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తున్నారు అనే ప్రచారం జరిగింది. ఆలీకి గుడ్ న్యూస్ త్వరలోనే అని జగన్ కూడా చెప్పి పంపించారు. ఇప్పుడు రాజ్యసభ ఇవ్వకుండా, రెండు రెడ్లకు ఇచ్చి, మైనారిటీకి వెన్నుపోటు పొడిచారు. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ల ఎంపికలో, మంత్రి వర్గం లాగే గందరగోళం చేసి పడేసారు.