నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి కీలక ప్రాంతమైన, విజయవాడలో మొదటి ఫైవ్ స్టార్ట్ హోటల్ రెడీ అవుతుంది. అదేంటి, ఇప్పటి దాక విజయవాడకు ఫైవ్ స్టార్ హోటల్ లేదా అని ఆశ్చర్యపోతున్నారా ? ఏమి చేస్తాం అండి అన్నీ మనమే నిర్మించుకుందాం. ఇప్పటికే బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడుకు వెళ్ళే సర్వీస్ రోడ్ లో, వినాయక్ ధియేటర్ ఎదురుగ నోవాటెల్‌ ఫైవ్ నక్షత్రాల స్టార్‌ హోటల్‌ నిర్మాణంలో ఉంది. నోవాటెల్‌ మొత్తం 16 ఫ్లోర్స్ లో కడుతున్నారు. ఈహోటల్‌లో సకల సౌకర్యాలు గల 110 గదులు ఉంటాయి. వరుణ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఈ హోటల్‌ నిర్మాణం జరుగుతుంది.

novotel 19102018 2

ఇప్పటికే చాలా వరకు పనులు అయిపోయాయి, త్వరలోనే ప్రారంభిస్తారని వరుణ్‌ గ్రూప్‌ చెప్తుంది. ఇంటీరియర్ అంతా రెడీ అయిపొయింది. బయట చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నోవాటెల్‌ ఫైవ్ స్టార్ట్ హోటల్‌ విజయవాడకు ప్రథమ ఆకర్షణగా ఉండనుంది. అమరావతి పరిధిలో గుంటూరు, విజయవాడ పరిధిలో మరిన్ని ఫైవ్ స్టార్ట్ హోటల్స్ రానున్నాయి.. ఐటీసీ.. మారియేట్.. నోవాటెల్.. గ్రీన్‌పార్క్.. కీస్(కేఈవైఎస్) వంటి అనేక స్టార్ హోటళ్లు నగర పరిసర ప్రాంతాలకు రానున్నాయి. కొన్ని ఇప్పటికే, నిర్మాణాలు కూడా మొదలుపెట్టాయి.

novotel 19102018 3

అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.

డ్వాక్రా మహిళలకు చేస్తున్న సాయం పై, దాని పై జగన్ చిమ్ముతున్న విషం పై మంత్రి పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. "డ్వాక్రా మహిళలకు ‘పసుపు-కుంకుమ’ తుది విడత నిధులు కూడా విడుదల చేశాం. మరో 10రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాలలో పడుతుంద‌ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ప‌రిటాల సునీత తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడ‌దుల చేశారు. రుణమాఫీ అమలు కోసం నియమించిన కోటయ్య నేతృత్వంలోని నిపుణుల కమిటి సూచనల మేరకే ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని అమలుచేస్తున్నాం. రుణాలు తీసుకున్న వారికి, తీసుకోనివారికి, లోను కట్టినవారికి, కట్టనివారికి, ఎక్కువ రుణం తీసుకున్నవారికి, తక్కువ రుణం తీసుకున్నవారికి అందరికీ సమానంగా ఆర్ధికసాయం అందించడానికే ‘పసుపు-కుంకుమ’ పథకం తెచ్చాం. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10వేలు అందించి సాంఘిక ఆర్ధిక న్యాయం చేశాం. ఇందులో రహస్యం ఏమీలేదు, ఈ విషయం ప్రతి డ్వాక్రా మహిళకు తెలుసు. ఈ సొమ్మును విత్ డ్రా చేసుకునే స్వేచ్ఛ, వారి సొంతానికి వినియోగించుకునే స్వేచ్ఛ డ్వాక్రా మహిళలకు ఉంది. వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు."

"ఈ నిర్ణయాన్ని సామూహిక సమాచార వ్యవస్థ (మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్) ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు అందరికీ తెలియజేశాం. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమాచారం తమకు తెలుసని 4లక్షల మంది వీడియో క్లిప్పింగ్‌లను కూడా అక్నాలెడ్జ్‌మెంట్‌గా తీసుకోవడం జరిగింది. మహిళలేమీ అమాయకులు కాదు సహాయం అందకుండా అందినట్లు చెప్పడానికి. వడ్డీ రాయితీ కింద ఈ రోజు వరకు రూ.2,514కోట్లు అందజేశాము. త్వరలోనే మరో రూ.2,275 కోట్లు అందజేస్తాము. తన తండ్రి హయాంలో కేవలం రూ.276కోట్లు మాత్రమే అందజేశారన్న వ్యధతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రూ.1,118 కోట్లు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి అదనంగా మరో రూ.2,275 కోట్లు త్వరలోనే అందజేస్తాము. దానితో ప్రస్తుతం చంద్రబాబు హయాంలో మొత్తం రూ.13,500కోట్లు ఇచ్చినట్లు అవుతుంది. ఇంత పెద్దఎత్తున మూలనిధి సాయం డ్వాక్రా మహిళలకు అందించడం చూసి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఒక్క మహిళ కూడా తనకు ఓటేయదనే మనోవ్యధతో పిచ్చపిచ్చ వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్ర సభల్లో కాగితాలు చూపించిన బురద మనిషి(జగన్మోహన్ రెడ్డి)కి ఆ కాగితాల్లో ఏముందో కూడా అర్ధం కాలేదా..? లేక అర్ధం అయి కూడా ప్రజలను పక్కదారి పట్టిద్దామనే కుట్రలో భాగంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారా..? అని ప్ర‌శ్నించారు."

వైఎస్ రాజశేఖర రెడ్డి 5ఏళ్ల పాలనలో మహిళలకు ఎంత సాయం చేశారో,తరువాత 5ఏళ్లలో ఎంత చేశారో, ప్రస్తుతం చంద్రబాబు 53నెలల పాలనలో ఎంత సాయం అందించారో డిబేట్ కు నేను సిద్ధం. మరి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా..? అసెంబ్లీలో చర్చకు ఎటూ రాకుండా పారిపోయాడు. మరో తటస్థ వేదిక ఎంచుకునే స్వేచ్ఛ జగన్ కే వదిలేస్తున్నాను. ఏ తటస్థ వేదికపైనైనా జగన్మోహన్ రెడ్డితో నేను చర్చకు సిద్ధం..? జగన్మోహన్ రెడ్డి సిద్దమా అని ఛాలెంజ్ చేస్తున్నాను.
రాక్షస భాష, రాక్షస కార్యాలలో నిన్ను మించిన రాక్షసుడు మరొకరు లేరు. నీవా ప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబును నారాసురుడు అనేది..?అసలు సిసలు మహిషాసురుడివి నీవు కాబట్టే 2014ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్ధన చేశారు. మళ్లీ రేపటి ఎన్నికల్లో ‘జగనాసురుడి’ని పూర్తిగా మర్ధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు రాక్షసులో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు, రాక్షస సంతతి ఏదో మహిళలు అందరికీ తెలుసు. ఈ విధమైన రాక్షస వ్యాఖ్యలు, రాక్షస పనులు మానుకోకపోతే మహిళలే నీకు తగిన బుద్ది చెబుతారు. నీకులాగా దొంగ లెక్కలు రాయడం, తప్పుడు షేర్ వాల్యూలు చూపించి మోసగించడం, నమ్ముకున్న అధికారులను, పారిశ్రామిక వేత్తలను జైలుకు పంపించడం మాకు చేతకాదు. దయచేసి బహిరంగ సభల్లో తప్పుడు అంకెలు, బోగస్ ఆరోపణలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని హెచ్చరిస్తున్నాను. నీ మాయ మాటల్లో పడటానికి ఆంధ్రప్రదేశ్ మహిళలు సిద్ధంగా లేరు. వారికి తోడుగా ప్రతి ఇంటి పెద్దకొడుకుగా చంద్రన్న ఉన్నాడనేది గుర్తుంచుకోవాల‌న్నారు.

పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, గతంలో జగన్ బావ బ్రదర్ అనిల్ తో, రాంగోపాల్ వర్మ, పార్క్ హయత్ హోటల్ లో చర్చలు జరిపిన విషయం కూడా తెలిసిందే... అయితే ఎందుకో కాని, అప్పట్లో ఆ సినిమాను పక్కన పెట్టేసిన వర్మ, ఇప్పుడు మళ్ళీ పక్కన లక్ష్మీ పార్వతిని వేసుకుని, తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. ఈ రోజు సినిమాని మొదలు పెడుతున్నా అంటూ హడావిడి చేస్తున్నారు.

ycp 19102018 2

అయితే జగన్ పార్టీ, ఈ సినిమాకు బహిరంగంగా మద్దతు తెలుపుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా తిరుపతిలోని శిల్పారామం వద్ద వైసీపీ పోస్టర్లు వెలిశాయి. సినిమా ముహూర్తం షాట్‌కు ఆహ్వానిస్తూ వైసీపీ ప్రముఖ నేతల ఫొటోలతో పోస్టర్లు ఏర్పాట్లు చేశారు. ఈ పోస్టర్లలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజాతో సహా ఇతర నేతలను చిత్రించారు. రాంగోపాల్ వర్మ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందం శ్రీవారిని దర్శించుకున్నారు.

ycp 19102018 3

అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు మద్దతుగా ఇప్పుడు తిరుపతి నగరంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, వైసీపీ అధినేత జగన్ బావ బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్‌రెడ్డి కూడా ఉన్నారు. మామూలుగా వర్మ ఎవరితో సమావేశమయ్యారనేది పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు వర్మ హాట్ టాపిక్. తెలుగువారి కీర్తి పతాకను ఎగురవేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ భాగాన్ని తెరమీదకు ఎక్కిస్తానని ఓ పోస్టర్ విడుదల చేసి వర్మ హాడావిడి చేశారు. ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టేశారు. వైసీపీ నేతను నిర్మాతగా ప్రకటించారు.

ఆరు రోజుల తరువాత, శ్రీకాకుళం వచ్చిన పవన్ కళ్యాణ్, కేవలం రాజకీయం చేస్తూ, మూడు రోజుల నుంచి, రోజుకి రెండు గంటల చొప్పున పర్యటన చేసి, ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. తుఫాను ప్రభావం ఏంటో కూడా తెలియకుండా, ఇప్పుడు అక్కడకి వచ్చి, ఇప్పటి వరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదు ? ఆ యాప్ దేనికి ఉపయోగం అంటూ, పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తూ, తన ఫాన్స్ ని రంజింప చేస్తున్నారు. ఇలాంటి నీఛ రాజకీయం చెయ్యటంలో జగన్ ని మించిపోయాడు పవన్. నిన్న ట్వీట్ చేస్తూ, తుఫాను బాధితుల కోసం ఒక 'యాప్' ఇచ్చి, దాంట్లో కష్టాలు చెప్పమంటున్నారు, అసలు ఈ యాప్ ఎందుకు, అంటూ, బుర్రలో గుజ్జులేని వాడిలా ఒక ట్వీట్ చేసారు. తెలిసి చేసాడో, తెలియక చేసాడో, తెలిసీ తెలియక చేసాడో కాని, మరోసారి పవన్ కు ఎంత పరిజ్ఞానం ఉందో అర్ధమవుతుంది.

app 19102018 2

అయితే వాస్తవంలో మాత్రం, తిత్లీ తుపాను బాధితులు సత్వర సాయం పొందేందుకు రూపొందించిన ‘పీపుల్‌ ఫస్ట్‌ సిటిజన్‌ యాప్‌’కు విశేష స్పందన లభిస్తోంది. బాధితులు నష్టానికి సంబంధించిన చిత్రాలు, పూర్తి వివరాలను ఈ యాప్‌కు పంపి సత్వర పరిహారం పొందవచ్చు. ఈ యాప్‌ను ఇంతవరకు 17వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఆర్టీజీఎస్‌ అధికారులు వెల్లడించారు. యాప్‌ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్‌ తక్షణ చర్యలు తీసుకుంటోంది. యాప్‌కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే 1100 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. నష్టానికి సంబంధించిన మూడు ఫొటోలు, బాధితుని పూర్తి పేరు, చిరునామా, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌తోపాటు జీపీఎస్‌ వివరాలు కూడా స్పష్టంగా పేర్కొంటే పరిహారం త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది.

app 19102018 3

ఇప్పటి వరకు, ఈ యాప్ ద్వారా 4368 మంది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో, వీళ్ళందరూ పిచ్చి వాళ్ళా ? ఎదో విమర్శ చెయ్యాలని చెయ్యటం, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం విమర్శించటం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కాని ఒక పక్క తుఫాను వచ్చి వారం అవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగులు ఫీల్డ్ లో అంత కష్టపడుతున్నారు. ఇవన్నీ వదిలేసి, ఆరు రోజులు తరువాత లార్డ్ లాగా వచ్చి, కరెంటు ఎందుకు ఇవ్వలేదు, ఈ యాప్ ఏంటి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, తోలు తీస్తా, తొక్క తీస్తా, కాళ్ళు విరగ్గోడతా అంటూ గాల్లో పిడి గుద్దులు గుద్దితే, చివరకు ఏమి మిగులుద్దో ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయాల్లో రాజకీయం చెయ్యకూడదు అనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా, పవన్ ప్రవరిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మనం చూసేదే ప్రపంచం అనుకోమాకండి పవన్ కళ్యాణ్ గారు.

Advertisements

Latest Articles

Most Read