మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ అంశం ఒక అడుగు ముందుకు పడింది. రైతుల భూములుకు నష్టపరిహారం ఇచ్చే అంశంలో ఇప్పటివరకూ రైతులు, ప్రభుత్వం మధ్య కొంత సందిగ్ధత నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరా ఒక్కింటికి గరిష్టంగా రూ. 25 లక్షలు చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు జరిపిన భూ సేకరణలో ఆయా రైతులకు ఇచ్చిన రేట్లకంటే ఇదే అత్యధిక ధరగా నిలువనుంది. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి 2,159.25 ఎకరాల పట్టా భూమిని రైతుల నుండి సమీకరించాల్సి ఉంది. మచిలీటపట్నం మండలంలోని మంగినపూడి, కరఅగ్రహారం, తవిశపూడి, గోపువాని పాలెం గ్రామాలకు చెందిన రైతుల నుండి ఈ భూ సేకరణ జరగాల్సి ఉంది.

bandar 18102018

మార్జిన్‌ అమౌంట్‌ కేటాయించిన అనంతరం భూ సమీకరణకోసం రుణం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భూములు ఇచ్చే రైతులకు నష్టపరిహారాన్ని నిర్ణయించింది. ఇప్పటికే అనేక సార్లు రైతులతో చర్చలు జరిపిన అనంతరం ఇప్పుడు రూ. 25 లక్షల వంతున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూసేకరణలోని ఆలస్యాన్ని పరిగణలోకి తీసుకుని పరిమిత ల్యాండ్‌ పూలింగ్‌ పథకాలను కూడా పరిగణలోకి తసుకున్న అనంతరం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథా రిటీ (ముడా) వైస్‌ ఛైర్మన్‌, పోర్టు నిర్వహణ ఏజెన్సీ ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. రైతుల భూములకు సంబంధించి లాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద ధర నిర్ణయించేందుకు ఒక కమిటీని నియమించాలని ఆ నివేదికలో కోరారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయానికి ఈ ఏడాది మే నెలలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రైతులతో అనేకమార్లు చర్చలు జరిపిన అనంతరం రైతుల అంగీకారం మేరకు రూ. 25 లక్షలకు ఒక్కో ఎకరం అమ్మేందుకు వారిని ఒప్పించింది.

bandar 18102018

వాస్తవంగా 2008-09లోనే ఈ పోర్టు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచినప్పటికీ భూసేకరణ పెద్ద అడ్డుగా నిలచింది. ముఖ్యంగా భూసే కరణ అంశంలో ప్రభుత్వ భూములే తీసుకోవా లంటూ ప్రజలు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపద్యంలో భూసేకరణ చేపట్టడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీనికితోడు నిధుల కొరత కూడా ఉండటంతో పోర్టు నిర్మాణంపై అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో నిధుల కొరతను అధిగమించేందుకు ఫైన్షియల్‌ ఇనిస్టిట్యూష న్స్‌ నుండి రుణం పొందేలా ముడాకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చర్యలను చేపట్టడంతో మచి లీపట్నం పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకులు తొలగినట్లయింది.

తిత్లీ తుపాన్ బాధితులకు హెరిటేజ్ఫుడ్స్,హెరిటేజ్ ఉద్యోగుల భారీ విరాళాలు అందచేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునకు స్పందించిన హెరిటేజ్ సంస్థ,సామాజిక బాధ్యతగా మొత్తం రూ.66,16,971 విరాళంగా అందచేసింది. స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్ ఫౌండేషన్ కు రూ.48,50,000 విరాళం అందించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, హెరిటేజ్ ఉద్యోగుల సంక్షేమనిధి నుంచి రూ.17,66,971 విరాళంగా ఇచ్చారు. రెండు చెక్కులను ముఖ్యమంత్రికి అందజేసిన సంస్థ ప్రతినిధులు అందచేసారు. నగదు సాయంతో పాటుగా తుపాన్ బాధితులకు హెరిటేజ్ ద్వారా తాగునీటి పాకెట్ల పంపిణీ. తుపాన్ ప్రభావిత గ్రామాలలో పశువైద్య సేవలు కూడా అందించారు.

brahmini 18102018 2

ఇప్పటిదాకా 13.40లక్షల తాగునీటి పాకెట్ల పంపిణీ చేసారు. విశాఖ,విజయనగరం డెయిరీల్లో పాకెట్ల ద్వారా తాగునీటి అందచేసి,హెరిటేజ్ ద్వారా 2సంచార పశువైద్య క్లినిక్స్. 27 గ్రామాలలో ఫశువైద్య సేవలు హెరిటేజ్ వైద్యబృందాలు అందిస్తున్నాయి. పశువులను కోల్పోయిన పాడిరైతులకు బాసటగా హెరిటేజ్ నిలిచింది. బీమా దరఖాస్తులు నింపడంలో రైతులకు చేయూత. మరో పక్క, తిత్లీ తుఫాను బాదితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తిత్లీ తుపాను కారణంగా ఉత్తరాంధ్రలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఆస్తి నష్టం చోటు చేసుకోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

brahmini 18102018 3

తమ వంతు సహాయంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరపున ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ (అమరావతి) ఛైర్మన్లు పి. అశోక్ బాబు, బొప్పరాజు వెంకటేశ్వర్లు కొంత మొత్తం సహాయం చేయడానికి ప్రభుత్వానికి అంగీకార పత్రం సమర్పించారు. రిటైర్డు ఉద్యోగులు, లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులు రూ. 200 చొప్పున, ఆ పై ఉద్యోగులు రూ. 500లు చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇవ్వనున్న జీతాలు, పెన్షన్ నుంచి ఈ మేరకు మినహాయించుకోవాలని వారు ప్రభుత్వానికి ఇచ్చిన అంగీకార పత్రంలో కోరారు. దీనివల్ల సుమారు రూ. 30 కోట్లు పైగా తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి సమకూరుతుందని తెలిపారు. బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తుందని ఏపీ జేఏసీ ఛైర్మన్ పి. అశోక్ బాబు, ఏపీ జేఏసీ (అమరావతి) ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

తిత్లీ తుపానుకు అతలాకుతలమైన పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రూపురేఖలు మార్చి విశాఖపట్నం మాదిరిగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ తుపాను సహాయ కార్యక్రమాలపై తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విజయానికి సంకేతం విజయదశమి అంటారని, అందుకే గురువారం నుంచే ఇక్కడ అభివృద్ధికి నాంది పలుకుతున్నానన్నారు. ‘సూర్యుడు ఉదయించే జిల్లా సిక్కోలు. జిల్లా అభివృద్ధి కోసం కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నా’ అని ప్రకటించారు.

cbn rewlief 18102018

‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరిగా.. కొబ్బరిచెట్టుకు రూ.1200, జీడిమామిడికి హెక్టార్‌కు రూ.25వేలు ప్రకటించాను. కాని అందరి కష్టాలు చూసిన తర్వాత కొబ్బరి చెట్టుకు రూ.1500, జీడిమామిడికి హెక్టారుకు రూ.30 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గీత కార్మికులకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం అందిస్తానని ఉద్దానంలో చెట్లు పడిపోతే తొలగించుకోటానికి చెట్టుకు రూ.300 చొప్పున అందిస్తామని ప్రకటించారు. బోర్లు వేసుకుంటామంటే ఉచితంగా వేసి విద్యుత్తు అందిస్తామని తెలిపారు. ఉద్దానాన్ని ఉద్యానవనంగా మార్పు చేసేందుకు అందరం కలసి కష్టపడదామని పిలుపునిచ్చారు.

cbn rewlief 18102018

నిత్యావసర సరకులను గులాబీ కార్డుదారులకు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఎంతగా పనిచేస్తుందో అంతే బాధ్యతగా కార్యకర్తలంతా తమ భుజస్కందాలపై భారం వేసుకొని సమన్వయంతో పనిచేయాలని ఉద్బోధించారు. తిత్లీ తుఫానుకు సంబంధించి నష్టపరిహారం చెక్కులను ఈ నెలాఖరులో 29 నుంచి 31 మధ్య బాధితులకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామ సభలు నిర్వహించి అక్కడ అందరికీ ఒకేరోజున అందజేయాలని సూచించారు.

ఉద్దానం గుండెకు గాయమైంది. మును పెన్నడూ లేని విధ్వంసంతో కకావికలమైంది. ఓ వైపు లక్షలాది ఎకరాల్లో పంటలు పోగా, మరోవైపు వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ ఉద్దానం గుండెకు అండగా నిలవాలి. బాధితులను ఆదరించాలి. ప్రభుత్వమే కాకుండా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు తలో చేయి వేసి సాంత్వన చేకూర్చాలి. కానీ ఓ పార్టీ మాత్రం ఈ సందర్భాన్ని రాజకీయ అవకాశంగా మల్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తను లాభపడేందుకు వాడుకుంటోంది. ప్రభుత్వం తరఫున అందుతున్న సాయాన్ని చూపించకుండా బాధితులకు అసలేం జరగడం లేదంటూ స్వయంగా కేడర్‌ను రంగంలోకి దించి నిర సనలను ప్రోత్సహిస్తోంది.

cbn rewlief 18102018

హైవే ముట్టడుల దగ్గర నుంచి రహదారులపై వాహనాలను అడ్డుకోవడం మొదలు.. బాధితులకు సాయం అందడం లేదనే సాకుతో పెట్రోలు పోసుకునే వరకు రాజకీయంగా వాడుకుంటోంది. చివరకు సీఎం చంద్రబాబు ముందే ప్రభుత్వ సాయం పై అబద్ధాలు ప్రచారం చేయడంతో సాక్షాత్తూ ఆయనే రంగంలోకి దిగి అదంతా ప్రతిపక్షం ఉద్దే శపూర్వక ప్రచారంగా తేల్చడం విశేషం. బుధవారం టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళిలో సాక్షాత్తూ సీఎం సమక్షంలోనూ సదరు పార్టీ అదృశ్యశక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చ చేశారు. ఇక్కడ బాధితులతో సీఎం మాట్లాడుతూ ‘మీ అందరికి భోజనాలు అందుతున్నాయా’? అని ప్రశ్నించారు. అందులో కొందరు అందడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆగ్రహించిన సీఎం అధికారులను ప్రశ్నిస్తే భోజనం ఇస్తున్నట్లు చెప్పారు.

cbn rewlief 18102018

ఇస్తుంటే లేదంటున్నారేంటి అని తిరిగి అక్కడున్న బాధితులను ప్రశ్నించగా అందడం లేదనే సమాధానం వచ్చింది. దీంతో అధికారుల తప్పు ఉందేమో అని, వారిని మందలిస్తూనే, అనుమానం వచ్చిన సీఎం సమీపంలో పాఠశాలకు వెళ్లి పరిశీలిస్తే బాధితులు చెప్పింది అబద్ధం అని తేలింది. వెంటనే సీఎం ప్రసంగిస్తూ ఓ పార్టీ రాజకీయం చేసి బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించడం విశేషం. కాగా వరుసగా ప్రభుత్వం సాయం అందడం లేదనే ఆందోళన వెనుక సదరు పార్టీ హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసుశాఖ అటువంటి నిరసనలు జరిగే ప్రాంతంలో ఇప్పుడు బందోబస్తును పెంచి ఎక్కడా పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Advertisements

Latest Articles

Most Read