ఇంద్రకీలాద్రి పై చోటు చేసుకుంటున్న వరుస వివాదాలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలి, పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆయన అసహనానికి గురయ్యారు. దసరా ఉత్సవాల కంటే ఆలయంలో వివాదాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని మండిపడ్డారు. తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని సీఎం హెచ్చరించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని ఆయన కార్యాలయ అధికారులు పాలకమండలి చైర్మన్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఆలయంలో వివాదాలకు స్వస్తి పలకాలని, అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు.

cbnwarning 17102018 2

ఉత్సవాల మొదటిరోజే లిఫ్ట్‌ల్లో భక్తులు కొండపైకి వస్తున్నప్పుడు వాటిని ఆపేశారు ఓ ఉన్నతోద్యోగి. అకస్మాత్తుగా లిఫ్టులు ఆగిపోవడంతో భక్తుల హహాకారాలు చేశారు. గందరగోళ పరిస్ధితి తలెత్తింది. ఇక, తిరుమలతిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన సారే సమర్పించే విషయంలోనూ పాలకమండలి సభ్యులు.. ఆలయ ఈవోను టార్గెట్ చేశారు. స్ధానిక శాసనసభ్యుడు, టీటీడీ మెంబరు బోండా ఉమాకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంతో తనకు సంబధం లేదని చెప్పినా వినకుండా కోటేశ్వరమ్మ పై తీవ్ర విమర్శలు చేశారు.

cbnwarning 17102018 3

అటు, తన కుటుంబ సభ్యులను నేరుగా అంతరాలయంలోకి అనుమతించలేదని, ఆలయ ప్రాంగణంలో కూర్చొని పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు నిరసన తెలిపారు. ఇలా ప్రతి విషయంలోనూ ఈవోనూ, అధికారులను టార్గెట్ చేసుకుని జరిగిన ఘటనలతో ఈవో కోటేశ్వరమ్మ మనస్తాపానికిగురయ్యారు. అయితే, రోజుకి ఒకసారి ఇలా ఇంద్రకీలాద్రి అనవసరమైన గొడవల్లో వార్తల్లోకి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళంలో ఉన్నా, ఆయనే స్వయంగా కలగచేసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.

తిత్లీ తుపాన్ తాకిడితో శ్రీకాకుళం జిల్లా  అత‌లాకుల‌మైంది. ప్ర‌జ‌లు తుపాన్ దెబ్బ‌కు తీవ్రంగా న‌ష్ట‌పోయి పుట్టెడు క‌ష్టాల్లో ఉన్నారు . ప్ర‌భుత్వ యంత్రాంగం అహోరాత్ర‌లు క‌ష్ట‌ప‌డి బాధితుల క‌ష్టాలు తీర్చే ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది రేయింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు మాని స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా త‌మ‌కు తోచిన రీతిలో బాధితుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించాలి. ఈ క‌ష్ట‌స‌మ‌యంలో మేమంతా మీకు తోడుగా ఉన్నామ‌న్న భ‌రోసా క‌ల్పించాలి. దురుదృష్ట‌వ‌శాత్తూ రాష్ట్రంలో కొన్ని శ‌క్తులు బాధితులను ఆదుకోక‌పోగా, వారి క‌ష్టాలు, క‌న్న‌ళ్ల‌ను రాజ‌కీయం చేస్తున్నాయి. బాధిత‌ల‌ను రెచ్చ‌గొట్టి స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగించి వికృత పోక‌డ‌ల‌కు పాల్ప‌డుతున్నాయి . క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంతో క‌ష్ట‌ప‌డి బాధితుల‌కు అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు దిస్తోంది. అది చూసి ఓర్వ‌లేని శ‌క్తులు అక్క‌డ స్థానికంగా ఉన్న బాధితుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు సాఫీగా జ‌ర‌గ‌కుండా అడ్డుకునేలా ప్రేరేపిస్తున్నారు. తిత్లీ తీరం దాటిన మ‌రుస‌టి రోజు నుంచి ఒక ప‌థకం ప్ర‌కారం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు..

lokeshletter 17102018 2

ఉదాహ‌ర‌ణ‌ల‌కు కొన్ని... 13.10.2018.. తిత్లీ తుపాన్ సంభ‌వించిన వెంట‌నే మంత్రులు ఆయా ప్రాంతాల్లో బాధితుల క‌ష్టాలు తెలుసుకుని వారికి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి వెళ్లారు. వ‌జ్ర‌పుకొత్తూరుకు ఇలా వెళ్లిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడుని వాహానాన్ని అడ్డుకునేలా అక్క‌డ స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్రేరేపించాయి. 13.10.2018.. క‌విటి మండ‌లం జ‌గ‌తి గ్రామంలో కూడా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాన్వాయ్‌ను అడ్డుకునేలా అక్క‌డ స్థానిక రాజ‌కీయ నేత‌లు పుర‌మాయించారు. నిజానికి అక్క‌డ వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని వారికి స‌హాయ‌క‌చ‌ర్య‌లు ఎలా జ‌రుగుతున్నాయో తెలుసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి వ‌చ్చారు. వారి బాధ‌లు తెలుసుకున్నారు. ఇది చూసి ఓర్వ‌లేనిస స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాయి. ఉద్దానంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అక్క‌డ ప‌రిస్థితుల‌ను స్వ‌యంగా తెలుసుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల్లో స్వ‌యంగా పాల్గొన్నారు. అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లుస స‌రిగ్గా సాగ‌డం లేద‌ని ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడులూ ఆయ‌న కాన్వాయ్‌ను కూడా అడ్డుకునేంద‌కు అక్క‌డ స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్ర‌య‌త్నించాయి.

cycylonerajakeeyam 17102018

ప‌లాస ఎమ్మెల్యే గౌతు శివాజీ మంద‌స మండ‌లం హ‌రిపురంలో బాధితుల క‌ష్టాల‌ను తెలుసుకున్నారు. అక్క‌డ కొంత‌మంది ప్ర‌త‌పక్షాల‌కు చెందిన నేత‌లు స్థానికుల‌ను రెచ్చ‌గొట్టి ఆయ‌న వాహ‌నాన్ని అడ్డుకుని గంద‌ర‌గోళం సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్‌.ఎన్‌.పేట మండ‌లంలో మిరియా ప‌ల్లిలో  స‌హాయ‌క చ‌ర్య‌లు సాఫీగా సాగిస్తూ అక్క‌డ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను చూర‌గొంటున్న స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ శైల‌జ వాహ‌నాన్ని కూడా అడ్డుకునే అక్క‌డ స్థానిక రాజ‌కీయ శ‌క్తులు ప్రేరేపించాయి. త‌ద్వారా అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగించి రాజ‌కీయంగా లబ్ది పొందాల‌ని చూశాయి. సోంపేట మండ‌లం రుషికుడ్డ గ్రామంలో తుపాన్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షుస్తున్న ఐఏఎస్ అధికారి నిశాంత్ కుమార్‌ను నిల‌దీసేలా స్థానికుల‌ను అక్క‌డ స్థానిక విప‌క్ష నేత‌లు ప్రేరేపించారు. నిజానికి అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు చాలా బాగా జ‌రుగుతున్నాయ‌ని కొంత‌మంది స్తానికులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాశీబుగ్గ మండ‌లంలో తుపాన్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారి బాధ‌లు తెలుసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చిన సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, క‌మ్యూనిస్టు పార్టీ నేత‌లు కొంత‌మంది అక్క‌డ స్థానిక మ‌హిళ‌ల‌ను రెచ్చ‌గొట్టారు. వారు ముఖ్య‌మంత్రి కాన్వాయ్‌ను అడ్డ‌కునేలా చేశారు. అయినా ముఖ్య‌మంత్రి వారిని క‌లుసుకుని వారి ఇబ్బందుల‌ను ఓపిగ్గా విని వాటి ప‌రిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు.

lokeshletter 17102018 2

15.10.2016.. మంద‌స  మండ‌లంలో జ‌డ్పీ ఛైర్మ‌న్ చౌద‌రి ధ‌న‌ల‌క్ష్మీని స్థానికులు నిల‌దీశారు. అయితే వారి వెనుక అక్క‌డ వైసీపీ నేత‌లు కొంత‌మంది ఉన్నారు. ఆందోళ‌న చేసిన‌ వారిలోనూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు ఉండ‌టం గ‌మనార్హం. నిజానికి మంద‌స‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు అత్యంత వేగంగా జ‌రుగుతున్నాయి. రెచ్చ‌గొట్టే మాట‌లు. శ్రీకాకుళం జిల్లాలో ఒక‌వైపు ముఖ్య‌మంత్రి మొద‌లు, మంత్ర‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌ర్వం తుపాన్ బాధితుల‌కు స‌హాయ చేయ‌డం కోసం క్షేత్ర‌స్థాయిలో క‌ష్ట‌ప‌డుతుంటే విప‌క్ష పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ధ‌ర్మాన ప్ర‌సాదరావు, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, త‌మ్మినేని సీతారం, సీపీఐ, సీపీఎం నేత‌లు స్థానికంగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ అక్క‌డ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగాల చేస్తున్నారు. ప్ర‌భుత్వ అధికారుల‌ను నిల‌దీయండి అంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారులు క్షేత్ర‌స్తాయిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు వారి వాహ‌నాల‌ను అడ్డుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం క‌లిగించేలా స్థానిక తుపాన్ బాధితుల ముసుగులో స్థానిక కార్య‌క‌ర్త‌ల‌ను వ్యూహాత్మ‌కంగా ఉసిగొలుపుతున్నారు.

‘నువ్వు సీఎంను కలవడమేంటి? ఆయన అవార్డు ఇవ్వడమేంటి’? అంటూ ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన శివజ్యోత్స్న తల్లిదండ్రులు హేళనగా అన్న మాటలకు బాలిక లోలోపల కుంగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి నుంచి అవార్డు తీసుకునే సమయంలో ఆమె బాధ కన్నీటిరూపంలో పెల్లుబుకింది. ఆంగ్లంలో ప్రసంగం అదరగొట్టింది. అందరి మన్ననలు పొందింది. లోలోపల ఆవేదనను అణచుకుంది. ఉప్పొంగుతున్న ఉద్వేగాన్ని ఆపలేకపోయింది. అవార్డు తీసుకుంటూనే సీఎంకు తనలోని బాధను వెల్లడించింది. చిత్తూరులోని ఆదిశంకర పాఠశాలకు చెందిన విద్యార్థిని జయకృతిక పురస్కారం అందుకున్న వేళ.. తనకు వైద్యురాలిని కావాలని ఉందని, కానీ ఆర్థిక స్థోమత లేదని ఉద్వేగంగా చెప్పింది. దీని పై స్పందించిన ముఖ్యమంత్రి నీకు అండగా ఉంటానంటూ ఊరడించారు.

cbn 17102018 2

పుత్తూరు మండలం పైడిపల్లెకు చెందిన ఓ పేద కర్షకుడి కూతురు కోరిన కోరికను నెరవేర్చుతానని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలులో జరిగిన ‘ప్రతిభ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టెన్త్‌ పరీక్షల్లో పదికి పది పాయింట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చింది. ఈ సందర్భంగా పైడిపల్లెకు చెందిన కృతిక ప్రతిభా అవార్డు స్వీకరించిన సందర్భంలో సీఎం చంద్రబాబుకు తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించింది. తనకు డాక్టర్‌ కావాలని ఉందని, అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగించేలా లేదని కన్నీటితో వివరించింది.

cbn 17102018 3

చిన్న రైతు అయిన తన తండ్రి లాభసాటి కాకపోవడంతో వ్యవసాయం మానేసి రెండు ఆవులు పట్టుకుని పాల అమ్మకంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడంది. తన అక్క ఇంజనీరు కావాలన్న పట్టుదలతో పదికి పది మార్కులు సంపాదించి చదువుతోందని, తనకు కూడా పదికి పది వచ్చాయని, అయితే ఏం చేయాలో తెలియడం లేదంది. మీరే ఆదుకోవాలని చంద్రబాబును కోరింది. స్పందించిన ఆయన వెంటనే చదువు కొనసాగించమని సూచించారు. తాను అండగా వుంటానంటూ భరోసా ఇచ్చారు.

 

చలించే ప్రతి హృదయానికి.. అక్టోబర్ 11న 165 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు, వరదలు, 10 సెం. మీ నుంచి 43 సెం. మీ. భీకర వర్షంతో తిత్లీ తుఫాను శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో విరుచుకుపడింది. గౌర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ప్రభుత్వం సకాలంలో స్పందించి లోద్వారా భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది. శ్రీకాకుళంలో 23 మండలాలు, 1114 గ్రామాలు, 2517 నివాస ప్రాంతాలు మరియు 6 పట్టణాల్లో తిత్లీ తుఫాను మునుపెన్నడూ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించింది. రహదారులు, పంటలు, మౌలిక వసతులు, వేలాది గృహాలు, ప్రాథమిక సౌకర్యాలు తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్నాయి. తుఫాను ధాటికి 36 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు, 2.5 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలు, 36 వేల హెక్టార్ల ఉద్యాన పంటలను నష్టపోయిన రైతుల బాధని చూసి నా హృదయం ద్రవించింది.

lokeshletter 17102018 2

అక్టోబర్ 12 నుంచి ప్రభావిత ప్రాంతంలోనే ఉంటూ వేలాది మంది ప్రజల బాధలను స్వయంగా తెలుసుకొని అధికారుల్ని సమన్వయము చేస్తూ నా పూర్తి బాధ్యతలని వినియోగించి బాధితుల కష్టాలను తొలగించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఇప్పటికే విభజన కష్టాలను ఎదుర్కొంటూ, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి తిత్లీ తుఫాను రూ. 3435 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది. ( విద్యుత్ : రూ. 505 కోట్లు, R&B రూ. 406 కోట్లు, PR&RD : రూ. 140 కోట్లు, వ్యవసాయం : రూ. 802 కోట్లు, హార్టికల్చర్ : రూ. 1000 కోట్లు, పశుసంరక్షణ : రూ. 50 కోట్లు, మత్స్యకారులు : రూ. 50 కోట్లు, RWS : రూ. 100 కోట్లు, ఇరిగేషన్ : రూ. 100 కోట్లు, నివాస గృహాలు : రూ. 220 కోట్లు, సివిల్ సప్లైస్ : రూ. 50 కోట్లు, మెడికల్ & హెల్త్ : రూ. 1 కోటి, పట్టణాభివృద్ధి : రూ. 9 కోట్లు.. మొదలగునవి )

lokeshletter 17102018 3

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత మంత్రులు, వేలాది మంది ఉద్యోగులు బాధితులకు ఆహరం, మంచినీరు, విధ్యుత్ వంటి కనీస సౌకర్యాలను పునరుద్ధరించడానికి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి, బాధాతప్త హృదయాలలో భరోసా కల్పించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. శ్రీకాకుళం తిరిగి సాధారణ పరిస్థితికి రావడనికి చాలా సమయం పడుతుంది. అంతవరకు ఆ ప్రాంతాన్ని మేము పసిపాపలా కాపాడుకుంటాం. ఈ ఆపద సమయంలో శ్రీకాకుళం ప్రజలకు మీ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. సీఎం సహాయనిధికి విరాళాల రూపంలో మీ ఆపన్న హస్తాన్ని అందించి వారిని తిరిగి తమ కాళ్ళమీద నిలబడేలా చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద దెబ్బతున్న గ్రామాలను కూడా మీరు దత్తత తీసుకోవచ్చు ( www.smart.ap.gov.in ) రండి.. మీ వంతుగా సహకారం అందించండి. పేరు : CM Relief Fund, బ్యాంకు : ఆంధ్రాబ్యాంక్, ఏపీ సచివాలయం బ్రాంచ్, వెలగపూడి, అకౌంట్ నెంబర్ : 110310100029039, IFSC Code : ANDB0003079... మీ భవదీయుడు, నారా లోకేష్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ITE&C శాఖా మంత్రి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Advertisements

Latest Articles

Most Read