చాలా రోజుల తరువాత కేంద్రంలోని బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడారు. ఎప్పటిలాగే మీకు వేల కోట్లు, లక్షల కోట్లు ఇచ్చేసాం అని అన్నారు. మన రాష్ట్రానికి వచ్చింది సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ‘‘ కాంగ్రెస్‌ ఉచ్చులో చిక్కుకున్నవారెవరూ బయటపడలేరు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. ఎన్డీఏను చంద్రబాబు ఎందుకు వీడారో ఇప్పటికీ నాకు తెలియదు. విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నాం."

rajnadh 16102018 2

"ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇస్తున్నాం. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీనే కాదు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం. విజయవాడ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశాం. తెలంగాణకు నాలుగు బెటాలియన్లు ఇస్తే ఏపీకి 8 ఇచ్చాం. అన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తీసుకోవడానికి వాళ్లే సిద్ధంగా లేరు.’’ అని అన్నారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు.

rajnadh 16102018 3

భాజపా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. భాజపాకు ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీకీ ఉండరన్నారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 2014లో భాజపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంకల్పాలు తీసుకున్నామని, కూటమి మిత్ర ధర్మం పాటించేందుకు భాజపా పూర్తిస్థాయిలో కృషిచేసిందని చెప్పారు.

ధవళేశ్వరం బ్యారేజ్‌పై కవాతు చేశాక.. పవన్ చేసిన వ్యాఖ్యలు విశాఖలో అగ్గి రాజేశాయి. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర్రావును మావోయిస్టులు హత్య చేయడాన్ని సమర్థిస్తున్నట్టుగా పవన్ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగంతో సతమతం అవుతున్న యువత.. విప్లవోద్యమాలవైపు ఆకర్షితులు అవుతున్నారంటూ జనసేనాని ధవళేశ్వరం సభలో మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సర్వేశ్వర్రావు భార్య విశాఖపట్నంలో దీక్షకు దిగారు. ఓ ప్రజా ప్రతినిధిని కొందరు హత్య చేస్తే.. దాన్ని ఓ పార్టీ నాయకుడిగా పవన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారామె.

pk 16102018 1

మావోయిస్టులకు అనుకూలంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు నేత మీనాదే ప్రాణమా?..కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శించడం తగదని సోమ భార్య హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఇలా అనటం మొదటి సారి కాదని, పదే పదే తన భర్త తప్పు చేసినట్టు, చంపిన మావోయిస్టులను వెనకేసుకుని వస్తున్నాడని, నిన్న ఏకంగా పబ్లిక్ మీటింగ్ లో అలా అనటం బాధ వేసింది అన్నారు ఆమె.

pk 16102018 1

నిన్న పవన్ కల్యాణ్ ధవళేశ్వరం బేరేజు వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయ నేతల అవినీతి వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెదేపాలోకి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచు.. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్‌ వ్యాఖ్యానించారు. అయితే, తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలుచేయడం తమనెంతగానో బాధించిందని .. కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని ఆమె కోరారు.

శ్రీకాకుళం తుపాను బాధితులకు సహాయం చేయడానికి యువ కథానాయకుడు నిఖిల్‌ స్వయంగా ఆ జిల్లాకు వెళ్లారు. బియ్యం, దుపట్లు, జనరేటర్ల‌తో పాటు ఆహారం పంపిణీ చేశారు. బాధితులకు ఆయన స్వయంగా ఇవన్నీ పంచడం విశేషం. అంతేకాదు వారితో కలిసి భోజనం చేశానని, ఇది చాలా సంతృప్తిని ఇచ్చిందని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. అక్కడ తీసిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఎంతో సంతృప్తి పొందిన ఈ రోజు.. మనస్ఫూర్తిగా భోజనం చేశా. 500 దుప్పట్లు, విద్యుత్‌లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం పోర్టబుల్‌ జనరేటర్లు, 3వేల మందికి భోజనం.. శ్రీకాకుళంలో పంపిణీ చేశాం. శ్రీకాకుళం ప్రజలు ధైర్యంగా ఉండాలి’ అని నిఖిల్‌ సోమవారం రాత్రి ట్వీట్లు చేశారు.

nikhil 16102018

శ్రీకాకుళం జిల్లాకు స్వయంగా వెళ్లి బాధితులకు సహాయం అందిస్తున్న తొలి హీరో నిఖిల్‌ కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిమానులు కామెంట్లు చేశారు. నటుడు సంపూర్ణేష్‌ బాబు తొలుత శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళం ప్రకటించారు. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ తమవంతు ఆర్థిక సహాయం అందించారు. మరో పక్క, బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు తెలుగు సినీ లోకం పెద్ద ఎత్తున స్పందించింది. తమవంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, అభిమానులు కూడా స్పందించాలంటూ పిలుపునిచ్చింది.

nikhil 16102018

ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన ‘తిత్లీ’ తుపాను బాధితుల సహాయార్థం అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ రూ. 15 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ రూ. 5 లక్షలు ప్రకటించారు. యువ కథానాయకులు వరుణ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ చెరో రూ. 5 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి రూ. లక్ష, సంపూర్ణేష్‌ బాబు రూ. 50 వేలు తిత్లీ బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు వెల్లడించారు.

మొన్న విజయవాడలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ, మీడియా సమావేశంలో పవన్ ఒక మాట చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అని. అదే విధంగా, ఈ మధ్య తరుచూ, జగన్ తో నాకు వ్యక్తిగత కక్ష ఏమి లేదు, జగన్ అంటే నాకు కోపం లేదు అంటూ, పవన్ పదే పదే చెప్తున్నారు. నిజానికి పవన్ చెప్పింది కరెక్ట్ కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అందుకే రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన మోడీని ఎదుర్కుంటానికి, కాంగ్రెస్ పార్టీ సహయం కూడా తెలుగుదేశం తీసుకుంటుంది. అయితే ఇక్కడ మాత్రం, ఏపికి చంద్రబాబు చేస్తున్న సేవలు నచ్చక, పవన్, జగన్, బీజేపీ ఒక్కటై, పని చేస్తున్నారు.

pk 16102018

ఇది ఇలా ఉంటే, నిన్న "కారులో కవాతు" చేసిన పవన్, తరువాత ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో, ఎప్పటిలాగే లోకేష్ భజన చేసి, చంద్రబాబుని, చింతమనేని తిట్టారు. మోడీ అనే మాట కూడా పలకలేదు. ఇవన్నీ ఇట్లా ఉంటే, పవన్ కళ్యాణ్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఆలోచింప చేసే లా ఉన్నాయి. అవినీతి పై యుద్ధం అంటున్న పవన్, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ మోహన్ రెడ్డి అవినీతి చేసాడని ఎవరికి తెలుసు, అది దేవుడికే తెలియాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. జగన్‌ మీద తనకు కోపం లేదని..ఆయన లక్ష కోట్లు తిన్నారో లేదో.. ఆ భగవంతుడికి తెలియాలని పవన్‌ అన్నారు.

pk 16102018

అంతే కాదు వైఎస్ పై మాత్రం కోపం ఉంది అంటూ, దానికి కారణం చెప్పారు. 2007లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓ సినిమా తీయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, కోట్ల మంది అభిమానులున్న తనలాంటి వాడినే అలా బెదిరిస్తే సామాన్యులను ఎంత బాధపెడతారో అని కోపం వచ్చిందని పవన్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, అందరూ అనుకుంటున్న విధంగానే, అమిత్ షా డైరెక్షన్ లో, పవన్, జగన్, కలిసి ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మోడీని చంద్రబాబు డీ కొడుతున్నారు కాబట్టి, అమిత్ షా వీళ్ళ ఇద్దరినీ కలిపి, చంద్రబాబు మీదకు వదులుతున్నాడు అనేది స్పష్టం.

Advertisements

Latest Articles

Most Read