ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో 15వ ఆర్థిక సంఘం చైర్మెన్ ఎస్ కె సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ పునర్విభజన చట్టం విషయంపై అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విభజన చట్టాల అమలులో ప్రత్యేక వ్యవస్థ వుండేది. ఏపి పునర్విభజన చట్టం అమలుకు ప్రర్యవేక్షణ వ్యవస్థ అనేదే లేదు. గతంలో విభజన చట్టం అమలులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉండేవారు. ఏపి పునర్విభజన చట్టం పార్లమెంట్ కు వచ్చినప్పుడు నేను రాజ్యసభలోనే ఉన్నాను. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు.. రెనెన్యూ లోటు భర్తీ విషయమై రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తాం ప్రత్యేక హోదాను తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకు గా చూపారు అని అయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ అంశం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ సమావేశం అనంతరం సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆయన అభిఫ్రాయాలను సేకరించారు. అనంతరం ఎన్.కె.సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా.. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని చెప్పారు. ఏపీ అవసరాలపై తమకు సానుభూతి ఉందని, తమ పరిధిలో చేయగలిగినంత సాయం చేస్తామని ఎన్.కె.సింగ్ హామీ ఇచ్చారు. రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. ఏపీ విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు తాను కూడా రాజ్యసభలో ఉన్నానని తెలిపారు.
నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై 15వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని సీఎం చెప్పారు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ అమలు చేయలేదన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ సంపద వృద్ధికి దోహదపడేలా మా కృషి సాగుతోందని పేర్కొన్నారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని కోరారు. కేంద్రం ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకుందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై కేంద్రం మాటమార్చిందని సీఎం ధ్వజమెత్తారు.