శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నగారా మోగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి శాసనమండలికి మార్చిలోగా జరిగే ఎన్నికకు అప్పుడే హడావుడి మొదలైంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు మొదలుకావడంతో అభ్యర్థులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కృష్ణాజిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తుంటే, గుంటూరు జిల్లా నుంచి జడ్పీ మాజీ చైర్మన్‌ రాయపాటి శ్రీనివాస్‌, గ్రంథాలయాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాజా మాస్టారు రేసులో ఉన్నారు. అయితే టిడిపిని ఎలా అయినా ఓడించటానికి, పీడీఎఫ్‌ తో కలిసి పని చెయ్యాలని, వైసీపీ, జనసేన ఒకటవుతున్నాయి.

pkjagan 07102018

టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మూడు చోట్ల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరిగా యి. రెండు చోట్ల టీడీపీ ఓటమి చెందగా, విశాఖ సీటును టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ దక్కించుకుంది. కాంగ్రెస్‌, వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పట్టభద్రుల ఎన్నికల్లో బలమైన అభ్యర్థికి ఆ పార్టీలు మద్దతును ఇస్తున్నాయి. 2019 మా ర్చిలోగా జరగనున్న పట్టభద్రుల ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాజధాని జిల్లాలు కావటంతో వచ్చే ఎన్నికల్లో ఈ సీటును దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఎన్నికలకు ఓటు నమోదు చేయించుకో నున్నారు. పార్టీ రహిత ఎన్నికలైనందున ప్రత్యక్షంగా పార్టీ అభ్యర్థిని నిలపటమా? లేక చిగురుపాటి వంటి సేవా రంగ అభ్యర్థినే బలపర్చటమా? అనేది ఆ పార్టీ ముందున్న ప్రశ్న.

pkjagan 07102018

రెండు జిల్లాల్లో 25 వేల మంది ఉపాధ్యాయులు ఉండడంతో పట్టభద్రుల ఎన్నికలో వారి పాత్ర కీలకం కానున్నది. ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు నిలబెట్టే అభ్యర్థినే వామపక్షాలు కూడా బలపర్చే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిని ఓడించటానికి వైసీపీ, జనసేన ఒకటయ్యాయి. అయితే బీజేపీ మాత్రం ఒంటిరిగా పోటీకి సిద్ధమైంది. 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎన్నిక జరుగుతుండటంతో ప్రజల్లో కూడా ఆసక్తి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కూడా వ్యూహరచన చేస్తోంది.

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే., జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేద్దామని ఆయన ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులు చేస్తోందనే విషయాన్ని సీబీడీటీకి ఫిర్యాదు చేయటంతో పాటు అక్కడ నిరసనలు తెలపాలని ఎంపీల భేటీలో నిర్ణయించారు. అమరావతి ప్రజా వేదికలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై ఇందులో ప్రధానంగా చర్చించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాజకీయ పరిణామాలు, పొత్తులపైనా కీలక చర్చ జరిగింది. 36 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తున్న రాజకీయ విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

cbn bjp 07102018 2

‘మనం భాజపాయేతర పార్టీల సహకారం తీసుకోవాలి. భావసారూప్య పార్టీలతో కలసి పనిచేయాలి. 36 ఏళ్లుగా తెదేపా రాజకీయ విధానమదే. మనముందున్న ప్రత్యామ్నాయాలు రెండే. కాంగ్రెస్‌పై వ్యతిరేకంగా ఉండటమా? భాజపాకు వ్యతిరేకంగా పనిచేయడమా? భాజపా మనపైకి ఒంటికాలిపై వస్తోంది. ఈ నేపథ్యంలో భాజపాయేతర పార్టీల సహకారం తీసుకోక తప్పని పరిస్థితి మనది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ అయినా, యునైటెడ్‌ ఫ్రంట్‌ అయినా.. ఆ తర్వాత యూపీయే, ఎన్డీయే అయినా ప్రజాస్వామ్య అనివార్యతల వల్ల ఏర్పడినవే’ అని గుర్తుచేశారు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్రంపై పోరాట కార్యాచరణ, దేశ రాజకీయాల్లో తెదేపా పోషించాల్సిన పాత్ర తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. చారిత్రక కారణాల వల్లే తెలంగాణలో కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలన్నదే తెదేపా లక్ష్యమని, ఎన్టీఆర్‌ తెదేపా స్థాపించిందే అందుకోసమని చంద్రబాబు పేర్కొన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రెండు సదస్సులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు…సర్కారియా కమిషన్ సిపార్సులపై మొదటి సదస్సు నిర్వహించాలని., రైతు సమస్యలపై రెండో జాతీయ సదస్సు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. శీతాకాల సమావే శాల్లోపు పోరాట ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కేంద్రం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎలా అడ్డుకోవాలో తెలియక ఐటీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. దొంగ సర్వేలతో నైతిక స్థయిర్యం దెబ్బతీయాలని బీజేపీ-వైసీపీ చూస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. లాలూచి రాజకీయాలు చేస్తున్నాయన్ని ధ్వజమెత్తిన ఆయన.., వారి కుట్రలు నెరవేరవని తేల్చిచెప్పారు. తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా ఏ పార్టీతోనూ తెదేపాకు పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ టైటిల్ చూసి, తెలంగాణాలో ఎన్నికలకు పవన్ కళ్యాణ్ శంఖం పురిస్తున్నాడు అనుకునేరు.. మనోడికి అంత దమ్ము లేదు.. యుద్ధం జరిగేది, ఈయన గారు ఉండే తెలంగాణాలో... కత్తులు తిప్పేది మాత్రం ప్రశాంతంగా పరిపాలన జరుగుతున్న ఆంధ్రాలో.. ఏమి చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరే ప్రతి ఒక్కడు తోక జాడించేది.. అందుకే ఇక్కడకు వచ్చి కవాతులు, అరుపులు, కేకలు, గాల్లో పిడి గుద్దులు, చంపేస్తున్నారు, డ్రోన్లు తిప్పుతున్నారు, అంటూ లేని పోని హంగామా.. మొన్న ఒక వారం రోజులు తిరిగి, మూడు రోజులు రెస్ట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, తన ఫాన్స్ కి ఒక పిలుపు ఇచ్చారు.

pk 07102018 2

ధవళేశ్వరం బ్యారేజీపై అక్టోబర్ 15న నిర్వహించనున్న జనసేన కవాతు గురించి మాట్లాడుతూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవాతుతో జనసేన సత్తా ఏంటో దేశమంతా తెలియాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి జనసేన సత్తా ఏంటో రాష్ట్రానికే కాదు... దేశమంతా తెలియాలి. అది ఎలా అంటే దద్దరిపోవాలి. ఒకటే టార్గెట్ పెట్టుకోండి. దేశమంతా ఇది మాట్లాడుకోవాలి. తూర్పుగోదావరిలోకి ఎంటరవుతూనే దేశమంతా మాట్లాడుకోవాలి. దానికి మీరేం చేస్తారో చెయ్యండి. నేను సిద్ధంగా ఉన్నాను.’’ అంటూ పవన్ పిలుపు ఇచ్చారు.

pk 07102018 3

మొన్న జగన్ చేసిన హంగామాకి మించి చెయ్యాలని, పవన్ పిలుపిచ్చారు. అయితే, ఈ కవాతు 9 వ తారీఖు జరగాల్సి ఉంది. ఎందుకు వాయిదా పడిందో తెలియదు. పవన్ ఛానల్ లో మాత్రం, ఆ బ్రిడ్జి పై అంత మంది వెళ్తే ప్రమాదమని, జగన్ చేసిన తప్పే మనం చెయ్యకూడదు అని, అందుకే రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. ప్రకటించిన రెండో రోజే, దేశమంతా మాట్లాడుకోవాలని పవన్ అంటున్నారు. దేశమంతా మాట్లాడుకోవటం అంటే, మళ్ళీ ఏ ట్రైన్ లు తగల బెడతారో లేక ఆ బ్రిడ్జి కూలిపోయేలా చేస్తారో.. బ్రిడ్జి కులితే, ఈ కవాతు చేసే పిల్లకాయలు సంగతి తరువాత, అక్కడ దాదాపు కొన్ని వందల సంఖ్యలో లంక గ్రామాలు కొట్టుకుపోతాయి. ప్రభుత్వం ఈ విషయంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఈ మాటలను బట్టి చూస్తుంటే, వీళ్ళు ఎదో తేడాగా ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేసారు. ఈసీ ప్రకటనతో వైసీపీ డ్రామాలు బయటపడ్డాయన్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ, ఏపీలో ఉప ఎన్నికలు నిర్వహించబోవడం లేదని స్పష్టం చేసింది. దీని పై లోకేష్ ఇలా ట్వీట్ చేసారు. "మధ్యలో ఎన్నికలు రావని తెలిసి, కేంద్రంతో రాజీ. ఆంధ్రా ప్రజలకు నామం పెడుతూ వైకాపా వేసిన రాజీనామా డ్రామా బట్టబయలైంది. లోపాయికారి ఒప్పందం బహిర్గతం అయ్యింది. ఆంధ్రా ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టాలి అని ప్రయత్నించిన కుయుక్తులకు ప్రజలే సమాధానం చెబుతారు."

lokesh 07102018 2

లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాల చివరిరోజు ఈ ఏడాది ఏప్రిల్‌ 6న వైసీపీ లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు తక్షణం ఆమోదం పొందితే తప్ప వారు ప్రాతినిథ్యం వహించిన స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాసం లేదు. ఆ తరువాత సరిగ్గా రెండు నెలలకు, ఈ ఏడాది జూన్‌ ఆరో తేదీన వైసీపీ ఎంపీల రాజీనామాను ఆమోదిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది లోపు అయితేనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కావాలని రెండు రోజులు ఆలస్యంగా రాజీనామాలను ఆమోదించిన కారణంగా, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరగబోవని అందరికీ తెలుసు.

lokesh 07102018 3

శనివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు లేవని ఈ సందర్భంగా చేసింది. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని వ్యూహాత్మక తప్పిదంగా రాష్ట్ర రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు .. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఉదహరిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. ప్రత్యేక హోదాను కోరుతూ ప్రధాని మోదీ సర్కార్‌పై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానానికి కాంగ్రె్‌సతో సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తెలుగుదేశం ఎంపీలతో సహా .. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇతర ముఖ్యనేతలూ దేశానికి తెలియజేశారు. ఈ సమావేశాల్లో వైసీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు. సభలో టీడీపీ, ఇతర ఎన్డీయేతర పక్షాల సభ్యులు ప్రత్యేక హోదా సహా అనేక అంశాల్లో మోదీ సర్కారును ఎండగడుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీలు తమ రాజీనామా కారణంగా ఆ విలువైన కాలమంతా లోక్‌సభ బయటే గడపాల్సి వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read