ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసిందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలోప్రస్తుతం ఉన్న 7500 ప్రభుత్వాసుపత్రులను ఎలక్ట్రానిక్ ఆస్పత్రులకుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇకపై అన్ని ఆసుపత్రులలోనూ, ఆరోగ్య ఉపకేంద్రాలలోనూ రోగులకు సంబంధించిన హెల్త్ రికార్డులను, హెల్త్ కార్డులను, ఈ- హెల్త్ రికార్డులుగా భద్రపరచనున్నారు.

health 03102018 2

వీటితో పాటు ఆయా వైద్య కేంద్రాలలో టెలీ మెడిసిన్ సెంటర్లును ఏర్పాటు చేయనున్నారు. వైద్యారోగ్య రంగంలో ఈ తరహా ప్రయోగం ప్రపంచంలోనే మొదటిగా వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 1147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 192 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 31 ఏరియా అసుపత్రులు, 13 జిల్లా అసుపత్రులు, 23 బోధనా అసుపత్రులు ఇకపై ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లుగా రూపాంతరం చెందనున్నాయి. వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ లీడర్ జార్జ్ కొరసా, సీనియర్ ఆపరేషన్స్ అధికారి, హార్ట్ హెల్త్ స్పెషలిస్టు మోహిని కక్ తదితరులతో కూడిన ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబును కలిసి ఈ అంశాలపై చర్చించారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆరోగ్యశాఖ సలహాదారు డాక్టర్ జితేందర్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి గిరిజాశంకర్ తదితరులు ఈ కొత్త ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు వివరాలు తెలిపారు.

health 03102018 3

ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే 7500 ఆసుపత్రుల్లో టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 65 ఆసుపత్రుల్లో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరంభించిన ఈ సేవలకు అపూర్వమైన ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో ఉన్న సమస్యలను అధిగమించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులనుండి సహకారం అందించడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఐటీ ఆధారిత నైపుణ్యానికి సమర్థంగా ఉపయోగించుకుంటూ వైద్యారోగ్య రంగంలో తాము ఎటువంటి ప్రగతి సాధించింది ముఖ్యమంత్రికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వివరించారు. ఏపీలో ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ప్రపంచ దేశాల్లో వున్న అత్యుత్తమ విధానాలను తమకు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.

వారానికి ఒక ఆరోపణ తీసుకువచ్చి, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ గాల్లో కబురులు చెప్పి, అదిగో చంద్రబాబు అరెస్ట్, ఇదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ, చివరకి ఎప్పుడో 8 ఏళ్ళ క్రిందట ప్రజా ఆందోళన పై చేసిన ఒక పిల్ల కేసు తీసుకుని నోటీసులు ఇచ్చి, అరెస్ట్ వారంట్ ఇచ్చారు. అంటే, చంద్రబాబు అవినీతి పై వీళ్ళకు ఆధారాలు ఏమి దొరక్క, వీళ్ళ ఇగో చల్లార్చుకోవటానికి, ఇలా నోటీస్ పంపించారు. మొన్నటికి మొన్న చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు అనే ముందు రోజు, జీవీఎల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానం పంపింది.

gvl 03102018 2

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు నిలిచిపోనుంది. ఇవన్నీ తట్టుకోలేని ఢిల్లీ పెద్దలు, రగిలిపోతున్నారు. అందుకే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వాడు ఉన్నట్టు ఉండి హడావిడిగా విజయవాడ వచ్చారు. చంద్రబాబు అమెరికా వెళ్లి గంటల ముందు, ప్రజల్లో ఆలోచన రేపటానికి, చొవ్కబారు ఆరోపణలతో ముందుకువచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో.. వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే వెంటనే సియంఓ ఆఫీస్ ఆ లేఖ బయట పెట్టింది.

gvl 03102018 3

దీంతో జీవీఎల్ మరో వింత ఆరోపణతో బయటకు వచ్చారు. చంద్రబాబుకు లేఖ రాసిన, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్ పెద్ద ఫ్రాడ్ అతను అని, ఆయన మీద అసలు మంచి అభిప్రాయం లేదు అంటూ ఒక ట్వీట్ చేసాడు. అయితే ఇప్పుడు అదే ట్వీట్ జీవీఎల్ పరువు పోయేలా చేసింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక అవార్డు ఇచ్చారు. మరి చంద్రబాబుకి ఆహ్వానం పంపితే ఫ్రాడ్ అయిన ఆయన, అదే ప్రధానికి అవార్డు ఇస్తే మాత్రం, డప్పు కొట్టుకుంటున్నారు. ఇది జీవీఎల్ వరుస. ఇప్పుడు జీవీఎల్ పెట్టిన ట్వీట్ ని, పట్టుకుని, మీ పార్టీ వాళ్ళే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్ ను ఫ్రాడ్ అంటున్నారని, అలాంటి వ్యక్తి చేత ప్రధాని అవార్డు తీసుకున్నారని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో, జాతీయ స్థాయి బీజేపీ నేతలు , జీవీఎల్ పై మండి పడుతున్నారు. పావలా ఆక్షన్ చెయ్యమంటే, రూపాయి ఆక్షన్ చేస్తే, ఇలాగే ఉంటుందని, జీవీఎల్ ని తిట్టి పోస్తున్నారు.

రాజధాని అమరావతి విజ్ఞాన ఖనిగా మారబోతుంది. ఇప్పటి కే జాతీయస్థాయి గురింపు పొందిన విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థలు ప్రవేశించి బోధనను ఆరంభించిన సంగతి తెలిసిందే. మరో పక్క అమృత యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క, రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ వస్తోంది. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) సంస్థ అమరావతిలోని ఐనవోలు సమీపంలో క్యాంపస్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఎకరం రూ.10 లక్షల చొప్పున 50 ఎకరాలు కేటాయించింది.

amarvati 03102018 2

మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 1949లో జంషెడ్‌పూర్‌లో ప్రారంభమైన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ.. భువనేశ్వర్‌లో రెండో క్యాంపస్‌ ఏర్పాటు చేసింది. మూడో ప్రాంగణాన్ని ఇప్పుడు అమరావతిలో ప్రారంభిస్తోంది. మొత్తం విద్యార్థులు: 5 వేలు.. కోర్సులు: మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు.. అకడమిక్‌ బ్లాక్‌: 17 ఎకరాల్లో జీ+5 విధానంలో నిర్మిస్తారు. 84 తరగతి గదులు, 7 లెక్చర్‌ హాళ్లు, 500 ఫ్యాకల్టీ కార్యాలయాలు, 40 కాన్ఫరెన్స్‌ రూంలు, మినీ ఆడిటోరియం, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటివి ఉంటాయి.

amarvati 03102018 3

ఇవికాకుండా పరిపాలన విభాగం, గ్రంథాలయం, ఆరోగ్య కేంద్రం, ఇంటర్నేషనల్‌ సెంటర్‌, వినోద, క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు... డిగ్రీ, పీజీ విద్యార్థులకు జీ+15 అంతస్తుల్లో వేర్వేరుగా హాస్టల్‌ భవనాలు; బోధన, బోధనేతర సిబ్బందికి జీ+17 విధానంలో నివాస భవనాలు నిర్మిస్తారు. మరో పక్క, అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు, అకాడెమీలు, క్రీడా వసతులతో అమరావతిని ప్రపంచంలో అగ్రగామి క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రణాళిక రూపొందించింది. దీనికి అనుగుణంగా అమరావతిలో ప్రత్యేకంగా క్రీడా నగర (స్పోర్ట్స్‌ సిటీ) అభివృద్ధికి మెకన్సే సంస్థ ఒక వ్యూహ పత్రం సిద్ధం చేసింది. స్పోర్ట్స్‌ సిటీలో రెండు దశల్లో క్రీడా వసతులను అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదు. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారో, ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు ఎటు వెళ్తారో, ఎప్పుడు ఎవరికి సపోర్ట్ ఇస్తారో, రాత్రికి రాత్రి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పై ఎలా రివర్స్ అవుతారో, అన్నీ సస్పన్స్.. తన మీద నిఘా ఉందని, తన ఇంటి పై డ్రోన్ లు తిప్పుతున్నారని చెప్పిన పవన్, బహుసా అందుకే, తాను ఎప్పుడు ఏమి చేసేది కనీసం, తన పార్టీ వాళ్లకి కూడా చెప్పకుండా, తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆగష్టు 14న ఏపి నుంచి తెలంగాణా వెళ్ళిపోయి, దాదాపు 40 రోజుల తరువాత బయటకు వచ్చారు. వచ్చీ రావటంతోనే, ఒక వారం రోజులు, అద్భుతమైన జ్ఞాన గుళికలు వదిలారు.

pk 03102018

చింతమనేని పై విమర్శలు, నా పై ముగ్గురు హత్యాయత్నం చేస్తున్నారని, తన ఇంటి పై డ్రోన్ తిప్పుతున్నారని ఇలా అనేక అర్ధం కాని ఆరోపణలు చేసిన పవన్, ఉన్నట్టు ఉండి యాత్ర ఆపేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. దీని గురించి కనీసం పార్టీ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో, పవన్ ఇక జనాల్లోనే ఉంటారని అనుకున్న టైంలో, మరోసారి తన నిలకడ లేని తనం చూపించారు పవన్. వారం రోజులు తిరిగి, ఇక నా వల్ల కాదు అని, హైదరాబాద్ వెళ్ళిపోయారు. కనీసం, తన క్యాడర్ కి ఈ విషయం కూడా తెలియదు. ఎందుకు వెళ్ళిపోతాడో, ఎందుకు వస్తాడో, ఏమి మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు.

pk 03102018

అయితే ఈ విషయం పై అభిమానల్లో గందరగోళం ఉండటంతో, పవన్ మళ్ళీ 6 వ తేది తిరిగి వస్తారని, 9న పశ్చిమగోదావరి జిల్లాలో పోరాట యాత్ర ముగించుకుని కొవ్వూరు నుండి గోదావరి బ్రిడ్జి మీదుగా రాజమండ్రికి కవాతు నిర్వహిస్తారని చెప్పారు. మరో పక్క, పవన్ చేస్తున్న అర్ధం లేని ఆరోపణల పై తెలుగుదేశం మండి పడుతుంది. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, చిరంజీవికి పాలకొల్లులో ఎదురైన పరాభవమే ఎదురవుతుందని తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టే ఆయన్ను చూడటానికి జనం వస్తున్నారని, వారిలో ఓట్లు వేసేవారుండరని వ్యాఖ్యానించారు. పవన్ వాపును చూసి బలుపని అనుకుంటున్నారని, ఆయన ఘోరమైన ఓటమికి అతి దగ్గరలో ఉన్నారని అన్నారు. బీజేపీ నుంచి అందిన ఆదేశాల మేరకు చంద్రబాబును విమర్శిస్తున్న ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read