వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పై మాట్లాడే ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ మరోసారి ఢిల్లీ నుంచి, ఏపి విషయాలు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పై జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఐటీ కంపెనీల పేరుతో ఏపీలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ప్రోత్సాహకాల ముసుగులో షెల్‌ కంపెనీలు సృష్టించారని విమర్శించారు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ స్వయంగా చూస్తున్న ఐటీ శాఖలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఏమీలేవన్నారు. ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారని చెప్పారు.

gvl 021020108 2

వేల కోట్లు చేతులు మారాయని చెప్పడానికి 2014 నుంచి విడుదలైన జీవోలే ఉదాహరణ అన్నారు. ఐటీ శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లబోతున్నామని ప్రకటించారు. ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో.. వాటి వివరాలు ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వమంటే ఇవ్వడం లేదని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వద్దకు చేరాల్సిన సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2014 నుంచి 2020 వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జీవోలు విడుదల చేశారని జీవీఎల్ ఆరోపించారు. అనేక సంస్థలను తెచ్చారని, ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల డబ్బులు దండుకున్నారని వివరించారు.

gvl 021020108 3

ల్యాండ్‌లు నామమాత్రపు ధరలకు ఇచ్చి.. మూడేళ్ల తర్వాత కమర్షియల్‌ రేట్లకు అమ్ముకోవచ్చని కూడా చెప్పారని తెలిపారు. తక్కువ ధరకు భూమిచ్చి ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా వీలు కల్పించారని ఆరోపించారు. ఐటీ శాఖలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్‌ సమాధానం చెప్పాలని కోరారు. జీవోల పేరుతో ప్రజలను మాయ చేశారని వ్యాఖ్యానించారు. తాము అడిగిన సమాచారాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అయితే ఇదే కేసులో పోయిన వారం లోకేష్, చంద్రబాబు పై కోర్ట్ కి వెళ్తే, ఈ కేసు కనీసం అడ్మిట్ కూడా చేసుకోకుండా, కోర్ట్ కేసు కొట్టేస్తాం అంటే, కేసు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే..

జగన్‌ పర్యటనతో విజయనగరం వైసీపీలో గ్రూపు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తనను, కోలగట్లను దీవించాలని జగన్‌ బహిరంగ సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో కోలగట్ల వర్గంలో హర్షాతి రేకాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్‌ ప్రకటనతో అవనాపు బ్రదర్స్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీనికి కారణం వారు ఈ టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా రు. బొత్సా కూడా వీరికి భరోసా ఇచ్చారు. జగన్ తో మాట్లాడానని, పదవి నీకే అని భరోసా ఇచ్చినట్టు కూడా చెప్పారు. మరో పక్క విజయనగరంలో వైసీపీ జెండాను ప్రప్రథమంగా పట్టుకుంది వారి తండ్రి అవనాపు సూరిబాబే అని, మాకు జరిగిన అవమానం ఇది అని వారు అంటున్నారు.

botsa 02102018

తండ్రి మరణాంతరం కూడా విక్రమ్‌, విజయ్‌ పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతూ వస్తున్నారు. కోలగట్లకు ఎమ్మెల్సీ పదవి ఉన్నందున తమకు ఈ సారి టిక్కెట్టు వస్తుందని వారు భావించారు. దీనికి తోడు బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చి బొత్స అనుచరులుగా మెలుగుతూ వస్తున్నారు. అయితే సోమవారం విజయనగరంలో పాదయాత్ర సందర్భంగా మూడు లాంతర్లు వద్ద బహిరంగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్‌ తన ప్రసంగం చివర్లో వచ్చే ఎన్నికల్లో తనను, కోలగట్లను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. దీంతో కోల గట్ల వర్గం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.

botsa 02102018

ఈ నిర్ణయంతో బొత్సకు కూడా చెక్‌ పెట్టినట్టే. ఇంత వరకు బీసీ నినాదంతో అవనాపు సోదరులను ముందుంచి కోలగట్లకు చెక్‌ పెట్టాలని ఆయన చూశారు. అంతేగాకుండా ఈయన వర్గం చేపడుతున్న కార్యక్రమాలకు అవనాపు సోదరులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తూ వచ్చారు. విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఏ కార్యక్రమం జరగాలన్నా.. అందుకు వారు ఆర్థిక సాయం అందించేవారు. ఇంతలో జగన్‌ వచ్చే ఎన్నికల టిక్కెట్టు విషయంలో స్పష్టతనివ్వడంతో వారు నిరాశకు గురయ్యారు. దీంతో గ్రూపుల గోల మరింత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

గన్నవరం నుంచి దిల్లీకి మరో భారీ విమాన సర్వీసు ఆరంభమైంది. విమానాశ్రయం నుంచి 72 సీట్ల చిన్న ఏటీఆర్‌ విమాన సర్వీసులనే ఇప్పుడువరకూ ఇండిగో నడుపుతోంది. మొదటిసారి 180 సీట్లు ఉండే ఎయిర్‌బస్‌ను గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి ప్రారంభించింది. దీంతో దిల్లీకి ఇప్పటివరకూ మూడు ఎయిరిండియా సర్వీసులు గన్నవరం నుంచి నడుస్తుండగా.. ఇది నాలుగోది. దిల్లీలో మధ్యాహ్నం 13.25 గంటలకు ప్రారంభమై.. విజయవాడకు 03.20కు చేరుకుంది. 65 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి వచ్చింది. విమానం గన్నవరం చేరుకున్న వెంటనే.. అగ్నిమాపక వాహనాల ద్వారా నీటిని గాలిలోకి చిమ్ముతూ.. ఘనంగా స్వాగతం పలికారు.

gannavaram 02102018

విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు, ఇండిగో స్టేషన్‌ మేనేజర్‌ కౌశిక్‌ ఆధ్వర్యంలో విమానం వద్దకు చేరుకుని సిబ్బందిని అభినందించి కేక్‌ కట్‌ చేశారు. దిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌బస్‌కు విజయవాడకు చెందిన రాజేష్‌ చంద్‌ పైలెట్‌గా ఉన్నారు. ఈ తాజా విమాన సర్వీసుతో దిల్లీ విమాన టిక్కెట్ల కోసం ప్రయాణికులు పడుతున్న అవస్థలు కొంతవరకూ తగ్గనున్నాయి. విజయవాడ నుంచి నిత్యం వెళ్లే మూడు దిల్లీ విమాన సర్వీసులకు భారీగా డిమాండ్‌ ఉంటోంది. నిత్యం 80శాతం ఆక్యుపెన్షీతో నడుస్తున్నాయి. ఎయిరిండియా మొదట దిల్లీకి నిత్యం ఒక సర్వీసును ప్రారంభించింది. తర్వాత.. డిమాండ్‌ను బట్టి మరో రెండు సర్వీసులను ఆరంభించింది.

gannavaram 02102018

వీటిలో రెండు మాత్రమే నేరుగా గన్నవరం నుంచి దిల్లీకి ఉండగా.. ఒక సర్వీసు హైదరాబాద్‌ మీదుగా నడుస్తోంది. తాజాగా ఇండిగో ఎయిర్‌బస్‌ను దిల్లీకి ఆరంభించింది. మధ్యాహ్నం 13.25కు దిల్లీలో బయలుదేరి 3.20కు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4.10కు బయలుదేరి దిల్లీకి 6.10కి చేరుతుంది. దిల్లీకి ఇప్పటివరకూ ఎయిరిండియా సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇండిగో రాకతో.. విమాన ఛార్జీలు సైతం తగ్గనున్నాయి. ముందుగా బుక్‌ చేసుకునే వారికి రూ.3500 నుంచి ఇండిగో అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం దిల్లీకి టిక్కెట్‌ ధర రూ.6 వేలకు పైన ఉంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసత్యాలను భుజాన వేసుకుని రాష్టమ్రంతటా తిరుగున్నారని విమర్శించారు. సోమవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ, జనసేనలపై నిప్పుల చెరిగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక కష్టనష్టాలు ఎదురవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి 1500 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా నిలిపారని కొనియాడారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ బీజేపీ, వైసీపీ, జనసేనపార్టీలు విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు.

bjp 02102018 2

జగన్, పవన్‌లు బీజేపీకి చెందిన జెండా, అజెండాను చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. కళ్లకు కనబడే అభివృద్ధిని కళ్లుండీ చూడలేక పోతున్నారని, అభివృద్ధి ఎక్కడ జరగలేదో ఆ మూడు పార్టీలు నిరూపించాలని, దీనిపై రాష్ట్రంలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పవన్‌కు ఏమైందో అర్థం కావడం లేదని, కేంద్రం నుంచి రావాల్సినవి అడగకుండా మళ్లీ ప్రశ్నించడానికే పుట్టానంటూ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 18 విభజన హామీలపై పల్లెత్తు మాటకూడా మాట్లాడని పవన్ రాష్ట్రంలో రెండు మూడు సీట్లు గెలుచుకుని రిటైల్‌గా అమ్ముకుందామని చూస్తున్నాడని విమర్శించారు. అన్న చిరంజీవి పిఆర్‌పిని హోల్‌సేల్‌గా అమ్మేస్తే, పవన్ రిటైల్‌గా అమ్ముకుందామని చూస్తున్నాడని ఆరోపించారు.

bjp 02102018 3

దళితులపై జగన్ కపటప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందుతున్నారంటే చంద్రబాబు చేస్తున్న కృషి, చూపుతున్న చొరవేనని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఖర్చుచేయని విధంగా తెలుగుదేశం హయాంలో దళితుల సంక్షేమం కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అమరావతి దళితుల కంచుకోట అని, వారి అభ్యున్నతి కోసమే అమరావతి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ధర్మపోరాట దీక్షకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తిరిగి మొత్తం 15 సీట్లు గెలవడం ఖాయమని మంత్రి జవహర్ స్పష్టంచేశారు.

Advertisements

Latest Articles

Most Read