కేంద్రం పై భారీ పోరాటానికి ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికే ధర్మపోరాటం పేరుతో ఆరు వేర్వేరు వేదికలపై కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు, మిగిలిన జిల్లాల్లో కూడా ఇవి త్వరగా పూర్తి చేసి, అమరావతిలో భారీ సభ పెట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు ఓ వైపు పెట్టుబడుల ఆకర్షణ.. సంక్షేమ పథకాలతో బిజీగా ఉంటూనే, బహిరంగ సభలతో విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ధర్మ పోరాట దీక్షను కొనసాగిస్తున్నారు.

amaravatifight 01102018

నెలకొక ధర్మ పోరాట సభను నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుట్రలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే తిరుపతి, ఒంగోలు, విశాఖ, కాకినాడ, కర్నూల్‌, తాడేపల్లి గూడెం నగరాల్లో సభల్లో నిప్పులు చెరిగిన ఆయన, మగిలిన జిల్లాల్లో ఇవి త్వరతిగతిన పూర్తి చెయ్యనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లోనూ.. నెలకొక్కటి చొప్పున ధర్మ పోరాట సభలు నిర్వహించి.. ఫైనల్‌గా జనవరిలో.. విజ‌య‌వాడ, గుంటురు జిల్లాల‌కు సంబంధించిన ధర్మపోరాటస‌భను అమ‌రావ‌తిలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది టీడీపీ.

amaravatifight 01102018

ఆఖరు స‌భ‌కు జాతీయ స్దాయి నేత‌ల‌ను సైతం పిలవాల‌నే ఆలోచ‌నలో కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున వీలైనంత త్వరగా.. ధర్మ పోరాట సభలు పూర్తిచేస్తే పార్టీకి బూస్ట్‌లా ఉపయోగపడుతుందనేది చంద్రబాబు ఆలోచనగా అనిపిస్తోంది. ధర్మ పోరాట సభల ద్వారా పార్టీకి మంచి మైలేజ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతుండ‌డంతో దానికి తగ్గట్టుగానే వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ధీటుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని, రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధిని.. ఈ ధర్మపోరాట సభల్లోనే వివరించాలని, తద్వారా ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని భావిస్తున్నారు.

విజయవాడలో ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించటం అవసరమని భావించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పొడిగింపునకు ప్రతిపాదించారు. విజయవాడ నగరంలో సీఎం చంద్రబాబు ఆకస్మికంగా తనిఖీలు చేసిన సందర్భంలో ఎన్‌హెచ్‌ - 16 ను విస్తరించటానికి సర్వే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ఎన్‌హెచ్‌- 16 విస్తరణకు సంబంధించి సర్వే చేపట్టింది. భూసేకరణ కంటే ఫ్లై ఓవర్‌ పొడిగించటం ద్వారానే ప్రభుత్వం పై భారం తక్కువుగా ఉంటుందని భావించిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ప్రతిపాదన తీసుకు వెళ్లారు.

benz 011102018

 దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. అమెరికా నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సీఎం నివాసానికి వెళ్లిన కలెక్టర్‌ దీనిపై ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. సీఎం దీనిపై సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లాలని మౌఖికంగా కలెక్టర్‌కు సూచించారు. జాతీయ రహదారుల సంస్థ ఎంత వరకు భరించగలదో చూసి, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరించటానికి తన సంసిద్ధతను కలెక్టర్‌కు ముఖ్యమంత్రి తెలిపినట్టు సమాచారం. వెంటనే దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను పంపవలసిందిగా సీఎం కోరినట్టు సమాచారం.

benz 011102018

 బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ ఎస్‌వీఎస్‌ జంక్షన్‌దగ్గర ప్రారంభమై నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌దగ్గర 1.4 కిలోమీటర్ల దూరంలో ఎండ్‌ అవుతుంది. ఇక్కడి నుంచి నిడమానూరు వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఐదు కిలోమీటర్ల దూరానికి దాదాపుగా రూ. 500 కోట్ల మేర అంచనా వ్యయం అవుతుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రస్తుత మొదటి వరుసను 1.4 కిలోమీటర్ల దూరానికి రూ. 75 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. అయితే ఈ కసరత్తు అంతా పూర్తయ్యి, ఈ ప్రతిపాదన పట్టాలు ఎక్కాలి అంటే, ఎన్నికలు అయిన తరువాతే ముందుకు వెళ్ళే అవకాసం ఉంది.

జనం మెచ్చి నేత.. సమస్యల పరిష్కారంలో ఘనత ఆపన్నులను ఆదుకొంటూ సాంత్వన చేకూరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.... రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్న ప్రజావేదిక... ప్రతి సోమవారం తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియలో ప్రజలు రాష్ట్రం నలుమూలల నుండి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి ఒక్కరి సమస్యలను వినడం అక్కడికి అక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజావేదికకు ప్రజాదరణ పెరుగుతూ ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రత్యేక శ్రద్ద వహించి ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజల సంతృప్తి స్థాయిని పెంచుతుంది.

cm relief 01102018 2

రాష్ట్రంలో 1100 ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నా. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు, కార్యదర్శులు కూడా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ క్ర‌మంలోనూ ప్రతి సోమవారం భారీ సంఖ్యలో ప్రజలు ప్రజావేదికకు వస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం భారీ సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకుని పరిష్కరించుకునేందుకు ప్రజావేదికకు వచ్చారు. ముఖ్యమంత్రి ఓపికగా ప్రతి ఒక్కరి సమస్య సావధానంగా విని వారి సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించారు.

cm relief 01102018 3

ముఖ్యంగా వికలాంగులు తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పగా వెంటనే వాటిని పరిష్కరించారు. పేద ప్రజలకు సంబంధించిన పింఛన్లు, గ్రామీణ గృహనిర్మాణం, మంజూరు, చెల్లింపులు, త్రాగునీటి సమస్యలు, అక్కడికక్కడే పరిష్కరించారు. వయోవృద్దులకు వైద్య ఖర్చుల కొరకు ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు, శస్త్రచికిత్సలు కొరకు ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. అలాగే వివిధ వైద్య ఖర్చులకి, అధికంగా డబ్బులు కావాల్సి ఉన్న పేద వారు, వారి సమస్యలు చెప్పగానే, వాటిని పరిశీలించి, పెద్ద ఎత్తున సియం రిలీఫ్ ఫండ్ నుంచి, మంజూరు కూడా చేసారు.

రాజధాని ప్రాంతానికి ఐటీ కళను తీసుకురానున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ పార్కు నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఐటీ మంత్రి లోకేశ్‌ దీనికి భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈఓ రోషిణీ నాడార్‌ మల్హోత్రా, హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ వైస్‌ చైర్మన్‌ శిఖర్‌ మల్హోత్రా, హెచ్‌సీఎల్‌-విజయవాడ డైరెక్టర్‌ ఆర్‌.శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొంటారు. ఆకట్టుకునే ఆర్కిటెక్చర్‌ నైపుణ్యంతో కూడిన భవన సముదాయ నమూనాలను హెచ్‌సీఎల్‌ విడుదల చేసింది.

hcl 01102018 1

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా పచ్చటి ప్రకృతి నడుమ దీనిని నిర్మించనున్నారు. టెక్నాలజీ పార్కులో మొత్తం మూడు బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తారు. వీటికి అభిముఖంగా వలయాకారంలో మరో భవనం నిర్మిస్తారు. విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున... ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అనుమతించిన ఎత్తులోనే భవనాలను నిర్మిస్తారు. మొత్తం 27 ఎకరాల్లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటవుతుంది. ‘ఫార్చూన్‌’ కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్‌ 650 స్థానంలో ఉంది. 41 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన దేశంలో 140 చోట్ల హెచ్‌సీఎల్‌ కార్యాలయాలు ఉన్నాయి.

hcl 01102018 1

ఈ సంస్థలో మొత్తం 1.24 లక్షల మంది పని చేస్తున్నారు. ఐటీ, అర్‌అండ్‌డీ రంగాలలో హెచ్‌సీఎల్‌కు ఎంతో పేరుంది. విజయవాడలో హెచ్‌సీఎల్‌కు ప్రభుత్వం ఎకరం రూ.16 లక్షలకు కేటాయించింది. ఈ సంస్థ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) కింద టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో భూమి పూజలో ఆలస్యం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు రావడంతో... ఇప్పుడు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read