ప్రబోధానంద ఆశ్రమ వివాదం నేపథ్యంలో, అనూహ్యంగా మరో అంశం తెరపైకి వచ్చింది. ప్రబోధానంద మొదటి భార్యగా చెబుతూ రంగ మ్మ అనే వృద్ధురాలు తన కు న్యాయం చేయాలం టూ శనివారం మీడియా ఎదుట ప్రత్యక్షమైంది. తా డిపత్రి ఆశ్రమ వివాదానికి సంబంధించి వార్తలు వ స్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రబోధానంద అసలు పే రు పెద్దన్నగా బయటకొచ్చింది. దీంతో విషయం తెలుసుకొన్న ఆయన మొదటి భార్య రంగమ్మ.. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లయిన కొత్తలో తీయించుకొన్న ఫొటోను మీడియాకు చూపించారు.

prabodhanda 23092018

‘మాది కనగానపల్లి మండలం వేపకుంట. నాన్న ముసలప్ప, అమ్మ వెంకటమ్మ. 1977 ఆగస్టు 26న తాడిపత్రిలోని నందలపాడులో పెద్దన్న(ప్రబోధానంద)తో పెళ్లయింది. ఆయన ఆర్‌ఎంపీ డాక్టర్‌. కొన్నేళ్లు తర్వాత ఏమైందో కానీ నన్ను పుట్టింటికి పంపేశాడు. నేను వేపకుంటలోని అమ్మవాళ్ల దగ్గర ఉండగా.. చంటిబిడ్డతో ఉన్న మహిళను తీసుకొచ్చి 6 నెలలపాటు మా ఇంట్లోనే ఉన్నారు. ఆపై వెళ్లిపోయారు. అప్పటికి మాకు పెళ్లై 8 ఏళ్లు. ఆ తర్వాత నన్ను పట్టించుకోలేదు. అన్నయ్య రామకృష్ణ ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ముసలి వయసులో పింఛన్‌ సొమ్ముతో బతుకుతున్నాను’ అని రంగమ్మ వివరించారు.

prabodhanda 23092018

హైకోర్టులో విచారణ.. ఆశ్రమంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్న 10 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ప్రబోధానందకు చెందిన ఒక ప్రతినిధి శనివారం హౌస్‌ మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ పేర్కొన్న 10 మందిని శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని, వారిని 24గంటల్లో కోర్టులో హాజరుపరుస్తారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఈ వాదనలను రికార్డు చేసిన హైకోర్టు విచారణ ఇంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించింది.

విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు గంట ముందు ఏం జరిగిందనే విషయానికొస్తే, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

somu 23092018 2

అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాల పై వారు ఎమ్మెల్యేతో గంటసేపు చర్చించారు. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. బెదింపులకు దిగడం సరికాదని వారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు తుపాకుల ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

somu 23092018 3

ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇరువురి గన్‌మెన్ల తుపాకులకు లాక్కున్నట్టు సమాచారం. అయితే, అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారోత్సవాలు జరపడం, పోస్టర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లొద్దని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఈ క్రమంలోనే భద్రత లేకుండా గ్రామ పర్యటనకు వెళ్లిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మావోయిస్టుల తూటాలకు బలయ్యారు. ఎమ్మెల్యే కిడారి పర్యటన పై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు కూడా చెప్తున్నారు.

రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్నారు అనుకున్న మావోయిస్టులు, ఒకేసారి పంజా విసిరారు. ఏకంగా ఎమ్మెల్యే పై దాడి చేసి, హతమార్చారు. విశాఖ జిల్లా అరకులో, ఈ దాడి జరిగింది. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనాస్థలంలోనే కన్నుమూసిన ఎమ్మెల్యే కిడారి కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోముని కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మావోల కాల్పుల్లో ఇరువురూ మృతి చెందారు.

naxals 23092018 2

కాగా ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోల పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. కిడారి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. డంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్టు దగ్గర ఈ దాడి జరిగింది. కార్యకర్తలతో కలిసి, బస్సులో వెళ్తూ ఉండగా, ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేని దించి, ఆయన్ను కాల్చినట్టు చెప్తున్నారు.

naxals 23092018 3

ఒకేసారి 150 నుంచి 200 మంది మావోయిస్టులు బస్సుని అడ్డగించి,ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడి ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అనేది, ఎందుకు ఈయన్నే టార్గెట్ చేసారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరో పక్క రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దాడి జరిగిన చోట పోలీసులు, నక్సల్స్ కోసం గాలింపు చేస్తున్నారు. మొత్తం ఏరియా మొత్తం జల్లిడి పడుతున్నారు.

అరకులోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం.

maoists 2392018

కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. కిడారి, ఆయన అనుచరుల పై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు.

maoists 2392018

మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండటంతో, సియంఓ అధికారులు అలెర్ట్, మొత్తం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి, పరిస్థితి సమీక్షిస్తూ, గ్రే హౌండ్స్ బలగాలను పంపిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులకు, పోలీసులకి సమాచారం ఇవ్వకుండా, బయటకు వెళ్ళవద్దు అంటూ సూచనలు ఇచ్చారు. విజయనగరంలో, జగన్ పాదయత్రలో భద్రత పెంచారు. డీజీపీ ఠాకూర్ విశాఖ బయలుదేరి వెళ్లారు. సంఘట జరిగిన ప్రాంతం అంతా పోలీసులు జల్లిడి పడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read