టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఈ నెల 21న మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ న్యాయస్థానానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. 2010లో బాబ్లీ ప్రాజెక్టుపై చేసి న పోరాటంలో నమోదైన కేసులో ఆయన్ను, మరో 15 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ధర్మాబాద్‌ మేజిస్ట్రేట్‌ అరెస్టు వారెంటు జారీ చేశారు. దీనిపై సీఎం బుధవారమిక్కడ సమీక్ష జరిపారు. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రిపై అరెస్టు వారెంటు జారీ అయినట్లుగా మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఎస్పీ మన డీజీపీకి లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ లేఖతోపాటు అరెస్టు వారెంటును కూడా జతపరచాల్సి ఉందని.. కానీ పంపలేదని, దీంతో వారెంటు అందలేదని వివరిస్తూ న్యాయవాది ద్వారా ఈ నెల 21న ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.

cvbn 20092018 2

బాబ్లీ కేసు వ్యవహారంపై మంత్రులు, అధికారులతో రెండు రోజులుగా చంద్రబాబు చర్చించారు. వారెంట్‌పై ఎలా ముందుకెళదామని నేతల వద్ద ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను గౌరవించి.. కోర్టుకు వెళ్దామని బాబు అంటే.. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారట. రీ కాల్ పిటిషన్ వేస్తే కోర్టుకు వెళ్లే పని ఉండకపోవచ్చని.. ఆ దిశగా కూడా ఆలోచన చేయాలన్నారట. మరో పక్క, ఒక వేళ ఏమన్నా కుట్ర దాగి ఉన్నా, లేని పోని ఇబ్బందులు లేకుండా, రీకాల్ పిటిషన్‌ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మరో పక్క 21 శుక్రవారం కావటం, ఎమన్నా ఇబ్బందులు వచ్చినా కోర్ట్ లో శనివారం, ఆదివారం కుదరదు, మరో పక్క చంద్రబాబు 22న అమెరికా వెళ్ళాలి, ఈ పరిస్థితులు అన్నీ బేరీజు వేసుకుని, రేపు లాయర్ ని పంపించాలని, రేపు కోర్ట్ ఆదేశాలను బట్టి, తరువాత వాయిదాకు ఏమి చెయ్యాలి అనే దాని పై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు నిర్ణయించారు.

cvbn 20092018 3

మరో పక్క చంద్రబాబు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి శాయిప్రసాద్‌, మరో ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, బ్లూంబర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించనున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు జరగనుంది. అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు. నెవార్క్‌ నగరంలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో ఈ నెల 23న సభ జరగనుంది.

అనంతపురం తాడిపత్రి మండలంచిన్నపొలమడలోని, ప్రబోధానంద ఆశ్రమంలో అధికారుల బృందం తనిఖీలు, విచారణ కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం చిన్నపొలమడలో ఉన్న ఆశ్రమాన్ని మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు అధికారులు శోధించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలను మాత్రం వెల్లడించలేదు. తనిఖీల్లో మరో 30 మంది ఆధార్‌కార్డులు లేకుండా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వారిని బయటకు తీసుకొచ్చి స్వస్థలాలకు పంపేశారు. ఈ క్రమంలో, ఈ రోజు మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

prabonadhana 200092018 2

ప్రబోధానంద స్వామి ఆశ్రమం చుట్టూ పోలీసులు కంచె వేయడం ప్రారంభించడంతో కొందరు భక్తులు రెచ్చిపోయారు. కంచె వేసేందుకు యత్నిస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులు కొందరు ఆశ్రమ వర్గీయులపై రాళ్లను విసిరారు. వీరికి స్థానిక మహిళలు సహకారం అందించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు కంచె వేసే పనిని కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆశ్రమం వద్దకు ప్రబోధానంద భక్తులు భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘటనాస్థలానికి రావొద్దని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

prabonadhana 200092018 3

మరో పక్క, అనంతపురం జిల్లా గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ప్రబోధానంద స్వామిపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ తెదేపా నేత మధుసూదన్‌ గుప్తా ప్రబోధానందపై ఫిర్యాదు చేసి.. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై కేసు నమోదు చేశారు. చిన్నపొలమడ గ్రామం వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రబోధానందపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే తాజాగా గుత్తికి చెందిన తెదేపా నేత మధుసూదన్‌ బుధవారం ఆయనపై ఫిర్యాదు చేసి.. సీడీలు, పెన్‌డ్రైవ్‌లు సాక్ష్యాలుగా అందజేశారు. దీంతో పోలీసులు ఆయనపై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రబోధానంద ఎక్కడుంటారన్న దానిపై పోలీసుల వద్దా సమాచారం లేనట్లు తెలుస్తోంది.

సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, గత కొన్ని రోజులుగా, ఆంధ్రప్రదేశ్ పై, చంద్రబాబు పై, లోకేష్ పై, ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో చూస్తున్నాం. జీవీఎల్ నరసింహారావు వారినికి ఒకసారి వచ్చి, ఎదో ఆరోపణ చేసి వెళ్ళిపోతారు. సోము వీర్రాజు అయితే, నెలకు ఒకసారి వచ్చి, ఎదో ఒక రాయ వేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇలా విమర్శ చేసారో లేదో, కొన్ని హైదరాబాద్ మీడియా ఛానల్స్ హడావిడి చేస్తాయి. ఎదో అయిపోతుంది అనే హంగామా చేస్తాయి. అలాంటి ఆరోపణల్లో ఒకటి ఇళ్ళ నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, దీంట్లో 6 వేల కోట్ల స్కాం జరిగిందని, పేదలకు ఇచ్చే ఇళ్ళలో చంద్రబాబు డబ్బులు నోక్కేసారని, ఇలా నోటికి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసారు.

gvl 20092018

కట్ చేస్తే, దేశం మొత్తం మీద, గృహ నిర్మాణల్లో అవలంభిస్తున్న విధానాలకు, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖకు అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ, సంస్థకు వివిధ విభాగాలలో అవార్డులు వరించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 స్కోచ్ అవార్డులు ప్రకటించింది. గృహ నిర్మాణ శాఖకు కార్పొరేట్ ఎక్సలెన్సు ప్లాటినం అవార్డుతో పాటు 11ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్స్‌ని వివిధ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ సాధించింది. 3 అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కి గోల్డెన్ అవార్డులు లభించాయి. విశాఖలో సొంతంగా స్థలాలు కలిగి ఉండి, ఇల్లు నిర్మించుకోవాలని ఆశగా ఉన్న లబ్దిదారులకు చేసిన వినూత్న ప్రయోగానికి గోల్డెన్ అవార్డ్ వరించింది.

gvl 20092018

సంస్థ చేపట్టిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లబ్దిదారులకి నేరుగా బ్యాంక్ ద్వారా డబ్బులను పంపించడం వంటి ప్రతిభ‌కి అవార్డ్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో గిరిజనులకు పక్కా ఇళ్లకు అందించడం వలన అవార్డ్ లభించింది. ఇన్ని అవార్డులు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖకు రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో గడిచిన ఏడాదినర కాలంలో వినూత్న ప్రయోగాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించామని ఆయన తెలిపారు. మరి ఇవన్నీ చూస్తున్న, జీవీఎల్, సోము, తలకాయి ఎక్కడ పెట్టుకుంటారు ? మీరు చెప్పినవి నిజం అయితే, ఇన్ని ఇన్ని అవార్డులు రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి ?

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో పదేపదే ప్రస్తావించే అంశం నవరత్నాలు. అయితే ఈ నవరత్నాల కాన్సెప్ట్ వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్టు తెలిసింది. వైసీపీ అధినేత జగన్ నియమించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ నవరత్నాల కాన్సెప్ట్‌ను ఓ వ్యూహంలో భాగంగా జగన్‌కు సూచించారట. బీహార్‌లో అమలు చేసిన నితీష్ ఏడు వాగ్దానాల కాన్సెప్ట్‌ మాదిరిగానే పీకే ఈ నవరత్నాల కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారట. బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీష్ పదేపదే ఏడు హామీలను గురించి ప్రస్తావించేవారు. ‘సాత్ నిశ్చయ్’ (ఏడు నిర్ణయాలు) అనే పేరుతో బీహార్‌లో జేడీయూ ప్రచారం జోరుగా సాగింది. ఆ హామీల ఫలితం ఎన్నికల్లో బాగానే కనిపించింది.

pk 20002018 2

ఈ ఎన్నికల్లో 243 సీట్లకు గానూ ఆర్జేడీ, జేడీయూ కూటమి 178 స్థానాలకు కైవసం చేసుకుని కమలం పార్టీకి షాకిచ్చింది. బీహార్‌లో ఈ ప్రయోగం సఫలం కావడంతో ఏపీలో కూడా వైసీపీకి నవ రత్నాలను వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ సూచించారట. నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్‌కు పీకే సూచించినట్లు తెలిసింది. తన వ్యూహం ఏపీలో కూడా సఫలమై జగన్‌కు అధికారాన్ని కట్టబెడుతుందనేది ఆలోచనతో పీకే ధీమాగా ఉన్నట్లు సమాచారం. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

pk 20002018 3

బీహార్ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు పొంతనే లేదని.. బీహార్‌తో పోలిస్తే ఏపీలో రాజకీయ చైతన్యం ఎక్కువేనని చెబుతున్నారు. పైగా ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో నవరత్నాల అమలు సాధ్యమేనా అనే సందేహాలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు జగన్ ప్రచారం చేసే ఈ నవరత్నాలను ఎంత వరకూ నమ్ముతారనేది కూడా సందేహమేనని అంటున్నారు. మన బడ్జెట్ ఎంత, జగన్ ఇచ్చే హామీలు ఎలా ఉన్నాయి, ఇవి సాధ్యమేనా అనే చర్చ కూడా ప్రజల్లో మొదలైంది. జగన్ ఇచ్చిన హామీలలో మద్యపాన నిషేధం, 45ఏళ్లు నిండిన వారికి పింఛన్లు వంటి హామీల సాధ్యాసాధ్యాలపై రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయినా, ఆయన చెప్పిన దాని పై మాత్రం, ఇంకా జగన్ పట్టుకుని వేలాడుతున్నాడు.

Advertisements

Latest Articles

Most Read