రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని బుధవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా రాజధానిలో భూములు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా, వివధ సంస్థల ప్రతినిధులు ప్రెజంటేషన్ ఇచ్చారు. జంషెడ్‌పూర్‌లోని ప్రఖ్యాత ‘జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ అమరావతిలో ఎక్స్‌ఎల్ఆర్ఐ వర్శిటీ ఏర్పాటు చేస్తోంది. 2500 మంది విద్యార్ధులు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు, మరో 2500 మంది విద్యార్థులు అండర్ ‌గ్రాడ్యుయేషన్ కోర్సులకు అవకాశం కల్పిస్తామని జేవియర్ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు. నీరుకొండ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలను చేపడుతున్నట్టు తెలిపారు. మొత్తం నిర్మాణంలో 47 శాతం ఓపెన్ స్పేస్‌గా వుంచుతున్నామని చెప్పారు.

amaravati 20092018 2

వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎక్స్‌ఎల్ఆర్ఐ ప్రతినిధికి సూచించారు. భవన నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామని, సాధ్యమైనంత వేగంగా నిర్మాణాన్ని పూర్తిచేసి తరగతులను ప్రారంభిస్తామని అమృత వర్శిటీ ప్రతినిధి ముఖ్యమంత్రికి చెప్పారు. వచ్చే నెలలో భవన నిర్మాణానికి పునాదిరాయి వేస్తున్నట్టు ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదిలోగా మొత్తం నిర్మాణాన్ని పూర్తిచేసి వైద్య సేవలు ఆరంభిస్తామని తెలిపారు. వచ్చే జనవరిలో నిర్మాణాన్ని ఆరంభించి 18 మాసాల వ్యవధిలో హోటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని దసపల్లా ప్రతినిధికి ముఖ్యమంత్రి సూచించారు.

amaravati 20092018 3

భవంతుల నిర్మాణాలను పూర్తిచేసి 2019 నాటికి తరగతులను ప్రారంభిస్తున్నట్టు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి చెప్పారు. మొత్తం 9 బ్లాకులుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధి వివరించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. 7 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం జరిపిన భవంతులలో ఈ ఏడాది 20 రాష్ట్రాల నుంచి వచ్చిన 1200 మంది విద్యార్ధులు ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యను అందుకుంటున్నారని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రొ.వీసీ సత్యనారాయణ ముఖ్యమంత్రికి వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ సమావేశాల అనంతరం బుధవారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆక్టివ్ గా లేని వారి పై ఫైర్ అయ్యారు. ఎంతో చేస్తున్నా, సానుకూలతను ప్రజలకు చెప్పలేకపోతున్నారని, ప్రతిపక్షాల విమర్శలు సమాధానం కూడా ఎవరూ చెప్పటం లేదని అన్నారు. ప్రతిపక్షం విమర్శలపై సమాధానం చెప్పడానికి ముగ్గురు, నలుగురు మించి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌కు వెళ్లడం లేదు, ఇలా అయితే ఎలా అంటూ, మందలించారు. ఎవరు ఎలా పని చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, అంతా రికార్డు అవుతుందని, మీరు పని చేసే దాన్ని బట్టే నేను మీకు సహరిస్తా అని అన్నారు.

cbn buddha 20092018 2

ఈ సందర్భంగా, మీడియాలో సత్వ ర స్పందన బాగుంటోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను చంద్రబాబు ప్రశంసించారు. ‘‘వెంకన్న రఫ్‌ అని అనుకొనే వాడిని. కానీ, తనను తాను బాగా తీర్చిదిద్దుకొన్నాడు. ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే తక్షణం మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నాడు. ఆయనకు నేను చెప్పలేదు. తనకు తాను స్పందించి పనిచేస్తున్నాడు. వెంకన్నకు నా అభినందనలు’’ అని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. విభిన్న రాజకీయ అంశాల మీద కూడా వెంకన్న చక్కగా మాట్లాడుతున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. సాధారణంగా చంద్రబాబు ఎవరినీ అంతగా పొగడరు. అలాంటిది అందరి ముందు ఆయన వెంకన్నను మెచ్చుకోవడంతో సమావేశం ముగియగానే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బుద్దా వెంకన్నను అభినందించారు.

cbn buddha 20092018 3

ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతూ బిజీగా ఉంటారని ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీలు మీడియా ముందుకు, టీవీ డిబేట్లకు వెళ్ళవచ్చు కదా అని సిఎం ప్రశ్నించారు. అతిగా వ్యవహరించినా, మందకొడిగా ఉన్నా నష్టాలే అన్నారు. ఏ కొందరు నాయకుల వల్లో పార్టీకి చెడ్డ పేరు రాకూడదన్నారు. ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినా ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పార్టీపై పడుతుందని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం కలిగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. విశ్వసనీయత అనేది రాత్రికి రాత్రే రాదని కొనే్నళ్లు, దశాబ్దాల కష్టం ప్రజల్లో మన పట్ల విశ్వసనీయతకు కొలమానమని ఉద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో ఏ తప్పుచేసినా దశాబ్దకాల కష్టం నిరుపయోగంగా మారుతుందని హితవు పలికారు. ప్రతిపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆరోపణలు నిగ్గుతేల్చకపోతే నిజాలని భ్రమపడే ప్రమాదం ఉందని ఇంటింటికీ వెళ్లి ఆత్మీయంగా పలుకరించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా మోసం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. మీకు అన్నీ ఇస్తాం అని నమ్మించి మోసం చేసారు. మూడున్నర ఏళ్ళు తరువాత కూడా, అదిగో ఇదిగో అని మోసం చెయ్యాలని చూస్తూ ఉండటంతో, చంద్రబాబు వెంటనే తేరుకున్నారు. కేంద్రం మనల్ని నమ్మించి, మోసం చేస్తుందని గ్రహించారు. కేంద్రంతో పోరాటం ఎంచుకున్నారు. ముందుగా రెండు నెలల పాటు ఆందోళన చేసారు. మిత్రపక్షంగా ఉంటూనే, పార్లమెంట్ లో, బీజేపీ పై పోరాడారు. అప్పటికీ కేంద్రం దిగి రాకోవటంతో, మంత్రుల చేత రాజీమానా చేపించారు, చివరగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, మోడీ పై పూర్తి స్థాయి పోరాటం మొదలు పెట్టారు. మనం పోరాటం చేస్తుంది, విభజన హామీల కోసం.

modishah 19092018

అయితే, ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన విషయం వింటే, విభజన హామీల కంటే, ఘోరమైన మోసం చేస్తుంది కేంద్రం. ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నామని, ఈ విషయం గ్రహించిన ఢిల్లీ పెద్దలు, ఇలా అయితే తెలుగు రాష్ట్రాలు కలిస్తే, తెలుగు వారి బలపడతారాణి భావించి, టీఆర్ఎస్, టీడీపీ కలవకుండా అడ్డుకుందని ఆరోపించారు. బీజేపీ పెద్దలు, రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు పెడుతోందని మండిపడ్డారు. టీడీపీని దెబ్బతీయడం, ఏపీకి అన్యాయం చేయడమే బీజేపీ ఉద్దేశం అని కేంద్రం తీరును దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకుండా చూసి, తద్వారా లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ కుట్రను చంద్రబాబు బయట పెట్టారు.

modishah 19092018

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత, కొన్నాళ్ళు ఆ విభజన వేడి ఉన్నా, చంద్రబాబు ముందు చూపుతో అమరావతి వచ్చేయటంతో, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకటం ప్రారంభించారు. చంద్రబాబు చొరవ తీసుకుని కెసిఆర్ ను అమరావతి శంకుస్థాపనకు కూడా పిలిచారు. తరువాత కెసిఆర్ కూడా హోమం ఎదో చేస్తూ, చంద్రబాబుని ఆహ్వానించారు. చిన్న చిన్న ఇబ్బందులు మినిహా, రెండు రాష్ట్రాల మధ్య పెద్దగా ఇబ్బందులు లేవు. అవిశ్వాస తీర్మానం చర్చ కంటే ముందు జరిగిన సమావేశాల్లో ప్రత్యెక హోదాకి కెసిఆర్ పూర్తి మద్దతు కూడా ప్రకటించారు.

modishah 19092018

ఇరు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటి పై, కేంద్రంతో పోరాడి సాధించుకుందాం అని కూడా చెప్పారు. అయితే ఏమైందో ఏమో కాని, అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే సరికి, దేశంలో అన్ని పార్టీలు సహకరించినా, తెరాస మాత్రం సహకరించలేదు. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందో, తెరాస అప్పటి నుంచి కేంద్రానికి దగ్గరయింది. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా ఉంటే, కేంద్రానికి ఇబ్బందులు వస్తాయని గ్రహించి, తెలుగు జాతిలో చీలీక తెచ్చారని, కెసిఆర్ ని నా పై ఉసుగొలుపుతున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతికి ద్రోహం చెయ్యాలనుకునే ఎవరూ బాగుపడలేదని, అది చరిత్ర చెప్తున్న సత్యమని చంద్రబాబు అన్నారు.

బుధవారం రాత్రి అసెంబ్లీ కమిటీ కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు ప్రధానమే.. అన్ని నియోజకవర్గాల్గో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, పార్టీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయన్నారు. కొత్త రాష్ట్రంలో ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉండి కూడా గతంలో ఎన్నడూ జరగనన్ని పనులు చేస్తున్నాం, కాని అవి సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు అని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో సానుకూలతే నాకు కొలబద్ద, దాని కోసం అందరూ పని చెయ్యండి అని చంద్రబాబు అన్నారు.

cbn 20092018 2

ఈ సందర్భంగా తెలంగాణాలో జరుగుతున్న పరిస్థితి పై స్పందించారు. ‘‘తెలంగాణలో అధికార పక్షానికి అంతా బాగుందని మీడియాలో చూసేవాళ్లం. కానీ, అసెంబ్లీ రద్దు తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్తే నిలదీతలు ఎదురవుతున్నాయి. ఇక్కడ మన వద్ద ఏం జరుగుతున్నా మీడియా రాస్తోంది.. చూపిస్తోంది. దీనివల్ల లోపం ఉంటే దిద్దుకోగలుగుతున్నాం. తెలంగాణలో పరిస్థితిని తెచ్చుకోకూడదనుకొంటే మరింతగా ప్రజల్లో ఉండండి. ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే కనిపిస్తున్నారని... అంతకుముందు అందుబాటులో లేరని అనిపించుకోవద్దు’’ అని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలతో చాలా మంది ఎమ్మల్యేలు అవాక్కయ్యారు. మీడియాలో ఏపి పట్ల చూపిస్తున్న వివక్ష పై, చంద్రబాబు ఫైర్ అవ్వల్సింది పోయి, దీన్ని కూడా పోజిటివ్ గా తీసుకుని, మన తప్పులు సరిదిద్దుకునే విధంగా చేస్తున్నారని, చంద్రబాబు బలే పోజిటివ్ అని అంటున్నారు.

cbn 20092018 3

ప్రతినెలా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరును విశే్లషిస్తున్నా.. ప్రజలతో వినయంగా ఉండాలని.. కార్యకర్తలను గౌరవంగా చూడాలన్నారు. ప్రతిపక్షంపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రజలతో సాన్నిహిత్యం, కార్యకర్తల పట్ల గౌరవం, ప్రతిపక్షంతో కఠినంగా వ్యవహరించటం నాయకత్వ లక్షణాలని వివరించారు. ఏపీలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినన్ని పనులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దీంతో ఏకీభవిస్తున్నారా అని ప్రశ్నించగా... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా చేతులు ఎత్తారు. పనులు ఇంత బాగా జరిగితే ఎమ్మెల్యేలకు సునాయాస విజయం చేతికి అందాలని, ఎందుకు కష్టపడాల్సి వస్తోందో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీల్లో విశ్రాంతి ధోరణి మరింత పెరిగిపోయిందన్నారు. ఇక నిరంతరం ప్రజల్లో ఉండాలని నిర్దేశించారు. గ్రామ వికాసం, వార్డు వికాసం కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ప్రతిరోజు పనితీరును విశే్లషించు కోవాలన్నారు. గ్రామ వికాసం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 22 శాతం మాత్రమే పూర్తయిందని, వచ్చే మూడు నెలల్లో నూరు శాతం పూర్తిచేయాలన్నారు. గ్రామ వికాసంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాం పెరగాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read