రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం వృద్ధిని ఉదారతను అభినందించిన సీఎం చంద్రబాబు ఆయన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు... అడుగు తీసి అడుగు వేయలేని నిస్సహాయత...తోడు ఒకరుంటేనేగానీ బయటకు రాలేని వృద్ధుడు...వాకర్ స్టాండు లేకుండా నిటారుగా నిలబడలేని నిస్సత్తువ...అయినా గుడివాడ నుంచి రాజధాని వెలగపూడికి యువకుడిని తోడు తీసుకుని వచ్చారు...శాసనసభ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు...రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు...
గుడివాడ నివాసి, ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ చేసిన టి.వి.ఆర్. కుటుంబరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ఆ మేరకు చెక్కును అందజేశారు...నడవలేనిస్థితిలోనూ దూరాభారం అని లెక్క చేయకుండా వచ్చి రాజధాని నిర్మాణానికి విరాళం అందించి ఉదారతను చాటుకున్న కుటుంబరావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. నవ్యాంధ్ర పౌరుడిగా తనవంతు బాధ్యతగా విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న తపన, కృషిని స్పూర్తిగా తీసుకుని సొంత రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుదామని వచ్చానని వివరించాడు...పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బు నుంచి విరాళమిచ్చిన వృద్ధ, విశ్రాంత ఉపాధ్యాయుడి ఉదారత, సేవాభావానికి మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభివాదం చేశారు.