విజయవాడ సెంట్రల్‌ టికెట్‌ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. టికెట్‌పై వంగవీటి రాధా వెనక్కి తగ్గలేదు. అయితే సెంట్రల్‌ బాధ్యతలు మల్లాది విష్ణుకే అని వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగానే తెలుస్తోంది. ఇంత వరకూ రాధాతో జిల్లా కీలక నేతలు ఎవ్వరూ టచ్‌లోకి రాలేదు. వైసీపీ నేతల తీరుతో రాధా తీవ్ర మనస్తాపం చెందారు. మంగళవారం మధ్యాహ్నం రంగా, రాధా మిత్రమండలితో కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ తొందరపడొద్దని.. చర్చించి నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలు, అభిమానులకు ఈ సందర్భంగా రాధా పిలుపునిచ్చారు.

radha 18092018 2

ఐతే.. మూడు రోజులు ఓపిక పెట్టాలని వారికి రాధా సూచించారు. 'మనం ఇంకా పార్టీలోనే ఉన్నాం..అధిష్టానంతో మాట్లాడదాం' అని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని రాధా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాధా అనుచరులు మాట్లాడుతూ.. జగన్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకు అన్యాయం చేస్తే జగన్‌కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు. జగన్‌ డబ్బుకు అమ్ముడు పోయి రాధాకు ద్రోహం చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

radha 18092018 3

రెండురోజులుగా ఆందోళనలు జరుగుతున్నా జగన్‌ స్పందించకపోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శలు గుప్పిస్తున్నారు. రాధాకు సీటివ్వకపోతే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా అనుచరులు చెబుతున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం ఇంత వరకూ స్పందించిన దాఖలాల్లేవ్. ఇదిలా ఉంటే.. భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేం రాధా వెంటే ఉంటామని.. రాధా ఏ పార్టీలో ఉంటే మేం అదే పార్టీలో ఉంటామని రంగా అభిమానులు స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ సభ్యత్వ ప్రతులను రాధారంగా అభిమానులు తగలబెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. ఈ ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయనేదానిపై ఆధికారులతో సమీక్షించారు. 20,010 ఖాళీల భర్తీకి ఈ సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నియామకాల ప్రక్రియను త్వరిత గతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.

cbn green 18092018 2

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ... ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం.. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ మొత్తం నియామకాల వివరాలు : గ్రూప్-1 ఖాళీలు 150, గ్రూప్-2 ఖాళీలు 250, గ్రూప్-3 ఖాళీలు 1,670, డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275, పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ ఖాళీలు 3,000, వైద్య శాఖలో ఖాళీలు 1,604

cbn green 18092018 3

ఇతర ఖాళీలు 1,636, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310, జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200, ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10, ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200, సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి, డీపీఆర్‌వో పోస్టులు 4, ఏపీఆర్‌వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5..

వివిధ రాజకీయ పార్టీల్లో ఏమన్నా సమస్య వస్తే, అధినేత స్పందించటం కాని, లేకపోతే సీనియర్ నేతలతో చర్చలు జరపటం కాని చేసి, సమస్యను పరిష్కరిస్తారు. మన ప్రతిపక్ష నేత జగన్ పార్టీలో మాత్రం అందుకు భిన్నం. అధినేత జగన్ కేమో ఇగో. అసలు తగ్గే సమస్యే ఉండదు. ఇక ఆ పార్టీలో సీనియర్ అనే వాడు ఉండడు. ఉన్నా, విజయసాయి రెడ్డి లాంటి మహా ఘనులు ఉంటారు. అలాంటి వాడి మాటలు కోర్ట్ లోనే వినరు, ఇంకా పార్టీలో ఎవరు ఉంటారు. అందుకే మన జగన్ బాబు, వెరైటీగా అలోచించి, విజయవాడ గొడవ సైలెంట్ చెయ్యటానికి, కొడాలి నానిని రంగంలోకి దించాడు.

nani 18092018

ఇక్కడ ఇంకో వెరైటీ ఏంటి అంటే, ఈ కొడాలి నానికి టిడిపిలోకి ఎంట్రీ లేక, జగన్ దగ్గర ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇతనికే ఈ సారి గెలిచే దికానం లేదు అనే టాక్ నడుస్తుంటే, ఇతను వచ్చి, మరొకరికి అభయం ఇస్తున్నాడు అంటే, ఆ పార్టీ ఏంటో, ఆ అధినేత ఏంటో, ఈ మధ్యవర్తులు ఏంటో... అందుకు కాదు వంగవీటి రాధా అలిగింది... ఇక విషయానికి వస్తే, విజయవాడ నగర వైసీపీలో నిన్న జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. సెంట్రల్‌ నియోజకవర్గం సీటు, ముందుగా రాధాకు ఇస్తా అని మాటిచ్చి, ఇప్పుడు మల్లాది విష్ణుకు సీట్ ఇవ్వటంతో, జగన్ వైఖరి పై వంగవీటి రాధా వర్గం భగ్గు మంది. నిన్న విజయవాడలో జగన్ కి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేసింది ఈ వర్గం.

nani 18092018

ఆందోళనలో భాగంగా బందరురోడ్డులోని రంగా విగ్రహం ఎదుట బైఠాయించారు. రాధా అభిమానులు ఇద్దరు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అదే సమయానికి రాధా రావడంతో రెచ్చిపోయిన అభిమానులు రంగా కుటుంబం కోసం, రాధా కోసం ప్రాణాలిస్తామంటూ నినదించారు. పెట్రోలు పోసుకున్న వారిపై రాధా నీళ్లు చల్లి సముదాయించారు. అయితే, రాధాను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం గుడివాడ ఎమ్మెల్యే నాని రంగంలోకి దింపింది. వీరు రాధా కార్యాలయానికి చేరుకుని చాలాసేపు ఆయనతో మంతనాలు జరిపారు. కొడాలి నాని, రాధకు అభయం ఇచ్చారని, బందర్ ఎంపీగా పోటీ చెయ్యి,నిన్ను నేను గెలిపిస్తా అని రాధాకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే రాధా మాత్రం, ససేమీరా అంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, కొడాలి నాని లాంటి వాడిని, జగన్ ఇలా వాడాడు అంటే గ్రేట్ కదా...

మన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నా ఆల్ ఇండియా నెంబర్ వన్ గానే ఉంటాడు. అప్పట్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా, అత్యంత ధనవంతుడైన ఎంపీగా పేరు తెచ్చుకున్నాడు జగన్. ఇప్పుడు ఎమ్మల్యేగా కూడా, అలాంటి ఘనతే సాధించాడు. ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తూ, ఏ వ్యాపారం లేకుండా (జగన్ చెప్పిన లెక్కలు ప్రకారం), అత్యంత ధనవంతుడు జగన్. అయితే, మిగతా వ్యాపారాలు చేసే వాళ్ళతో పోల్చుకుంటే, మనోడు అయిదవ స్థానంలో ఉన్నాడు. ఈ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం, వృత్తిపై ప్రజాస్వామ్య సంసంస్కరణల సంఘం (ఏడీఆర్‌) నివేదిక విడుదల చేసింది.

jagan 18092018

ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా 4,086 సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 3,145 మంది వార్షిక ఆదాయ వివరాలను వెల్లడించింది. 3,145 మందిలో , మన జగన్ బాబు టాప్ లో ఉన్నాడు. కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్‌ వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.13.92 కోట్లు ఉందని ఏడీఆర్‌ తెలిపింది. ఆయన జీవిత సహచరి, ఇతర కుటుంబ సభ్యుల ఆదాయంతో కలుపుకొని మొత్తం రూ.18.13 కోట్లు ఉంటుందని పేర్కొంది. అత్యధిక ఆదాయం కలిగిన టాప్‌-20 ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి (14) కూడా ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఆదాయం రూ.6.48 కోట్లు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కలుపుకొని రూ.7.96 కోట్ల వార్షిక ఆదాయం ఉంటుందని ఏడీఆర్‌ సంస్థ తేల్చింది.

jagan 18092018

దేశంలోని మొత్తం 4,086 మంది ఎమ్మెల్యేల్లో 3,145 మంది తమ ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించారు. వీరిలో 33 శాతం మంది ఐదో తరగతి నుంచి ఇంటర్ పూర్తిచేసిన వారు ఉన్నారు. వీరి వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.31.03 లక్షలు కాగా, 63 శాతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేల వ్యక్తిగత సగటు ఆదాయం రూ.20.87 లక్షలే కావడం విశేషం. వ్యవసాయం, వ్యాపారాన్ని వృత్తిగా ప్రకటించిన 13% మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం అందరికంటే ఎక్కువగా (రూ.57.81 లక్షలు) ఉంది. శాసనసభ్యుల్లో 25-50 ఏళ్ల మధ్య 1,402 మంది, 51-80 లోపు 1,727 మంది, 82-90 మధ్య 11 మంది, ఆపై వయసున్నవారు ఇద్దరు ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో 8 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. పురుష ఎమ్మెల్యేల సగటు వార్షికాదాయం రూ.25.85 లక్షలుకాగా, మహిళల ఆదాయం రూ.10.53 లక్షలే!..గృహిణులైన మహిళ ఎమ్మెల్యేల వ్యక్తిగత వార్షిక సగటు ఆదాయం రూ.3.79 లక్షలు.

Advertisements

Latest Articles

Most Read