తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దని, రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని తాను ఎన్నోసార్లు చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రాగానే టీఆర్‌ఎస్‌ వైఖరి మారిపోయిందన్నారు. తెలుగుజాతి కోసం కలిసుందామని టీఆర్‌ఎస్‌ను చాలా సార్లు కోరామని చంద్రబాబు పేర్కొన్నారు. మొన్నటి వరకు హోదాకు సహకరించిన టీఆర్ఎస్, ఎన్డీఏతో విడిపోగానే ఆ పార్టీ వైఖరి మారిందన్నారు. ఎప్పుడైతే ప్రధాని మోదీతో తాము విభేదించామో, అప్పటి నుంచి టీఆర్ఎస్ తమతో విభేదించడం మొదలు పెట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన టీఆర్ఎస్... ఆ తర్వాత మాట మార్చిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్ని పార్టీలు చెప్పినా.. ఇవ్వడానికి బీజేపీకి అభ్యంతరం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.

cbn trs 18092018 2

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుండగా... కేంద్రం మాత్రం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలుగు వాళ్లం సోదరులుగా విడిపోయాం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఇద్దరినీ కూర్చోబెట్టి... అన్యాయం జరిగితే చక్కదిద్దాలి. కానీ, ప్రధాని ఈ పని చేయకపోగా రెండు రాష్ట్రాల మధ్య తగవులు పెట్టాలని చూశారు’’ అని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉందన్నారు. రాజకీయ సుస్థిరత కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు చేయలేదన్నారు. విభజన హామీల్లో 90 శాతం అమలు చేసినట్లు కేంద్రం, బీజేపీ నాయకులు చెబుతున్నారని... ఇలా అవాస్తవాలతో ఎవరి చెవిలో పూలు పెడతారని చంద్రబాబు మండిపడ్డారు.

cbn trs 18092018 3

రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను రైట్‌ టర్న్‌ తీసుకున్నానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రధాని స్థాయి వ్యక్తి యూటర్న్‌ అని మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం రోజు నాటికి వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడరు, టీడీపీని మాత్రం ప్రశ్నిస్తారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తనను యూటర్న్ తీసుకున్నాని అంటారా?, తమపై కోపం ఉండొచ్చు కానీ.. ప్రజలు ఏం చేశారన్నారు. ప్రజలు పన్నులు కట్టడం లేదా? అని సీఎం ప్రశ్నించారు. రహస్య అజెండాను అమలు చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొడతారన్నారు. తాను ఏ తప్పుచేయలేదని.. చేయనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్, సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు.. అయితే, తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదనతో స్పందించారు. ఆయన సోమవారం అసెంబ్లీలో, ఈ విషయం పై మాట్లాడుతూ కులాలకతీతంగా పెళ్లిళ్లు జరిపించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. అహంభావంతో చంపించే పరిస్థితికి దిగజారడం బాధాకరమన్నారు. పెళ్లికానుక తేవడంలో ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రొత్సహించడమేనని ఆయన అన్నారు. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, అందుకే చంద్రన్న పెళ్లికానుక విషయంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

miryalaguda 18092018 2

మిర్యాలగూడలో ఇద్దరు కులాంతర వివాహం చేసుకుంటే తక్కువ కులం అనే ఉద్దేశంతో యువతి తండ్రే చంపించాడంటే, సమాజంలో ఎంత మూఢనమ్మకం, అహంకారం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామని భావించినప్పుడు తల్లిదండ్రులు వాళ్లను ఆశీర్వదించాలని చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్లని వదిలేయాలన్నారు. అంతేకాని దారుణంగా చంపించడంవల్ల అతను సాధించిందేమీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

 

miryalaguda 18092018 3

ఈ పరువు హత్య కేసులో ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రణయ్‌ హత్య కేసులో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన రౌడీషీటరే హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీం స్నేహితుడు ఖాసీం ద్వారా రాయబారం నడిచినట్లు సమాచారం. ఖాసీం ద్వారా అబ్దుల్‌బారీ అనే వ్యక్తి హంతకుడిని పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో భారీ మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. హంతకుడికి రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

8 ఏళ్ళ తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ కేసులో, నాన్ బైలబుల్ అరెస్ట్ వారంట్ ఇవ్వటం పై చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో స్పందించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాబ్లీపై నోటీసులు పంపింది మీ (బీజేపీ) ప్రభుత్వమేనని ఆయన విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి అన్నారు. తాను నాటకాలాడుతున్నానని అంటున్నారని.. ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. అరెస్ట్ వారెంట్ పంపింది కాక, డ్రామాలాడుతున్నారంటూ తిరిగి మమ్మల్నే విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు. ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన వారెంట్ పై చర్చిస్తున్నామని... ఏం చేయాలి? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

cbn notiece 17092018 2

ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2010లో తాము బాబ్లీ నిరసన చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే తాము పోరాడామని చెప్పారు. ఆ సందర్భంగా తమను నిర్బంధించారని... వివాదం ముదరడంతో, ఎలాంటి కేసు లేదంటూ బలవంతంగా విమానం ఎక్కించి తమను అక్కడ నుంచి హైదరాబాదుకు పంపించేశారని అన్నారు. తనకెప్పుడూ నోటీసులు రాలేదని చెప్పారు. తెలుగు ప్రజల కోసం తానెప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఉత్తర తెలంగాణకు అన్యాయం జరగకూడదనే ప్రతిపక్ష నేతగా తాను పోరాడానని చెప్పారు.

cbn notiece 17092018 3

మరో పక్క, రాష్ట్ర మంత్రులు, తెదేపా ముఖ్య నేతలు, అధికారులతో చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. బాబ్లీ ఎపిసోడ్, వారెంట్ల జారీ అంశంపై వారితో సమాలోచనలు జరిపారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు, వారెంట్లు ఏమైనా వచ్చాయా ? అని సీఎం అధికారులను ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు, వారెంట్లు జారీ కాలేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాజాగా జారీ అయిన అరెస్ట్ వారెంట్ అందినట్టుగా చంద్రబాబుకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అనగా.. ప్రత్యామ్నాయాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు ఆయనకు సూచించినట్టు సమాచారం. మంగళవారం మరోసారి నేతలతో చర్చించి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

తాడిపత్రిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదం చల్లారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో ప్రబోదానందస్వామి భక్తులు, పక్క గ్రామాల మధ్య జరిగిన వివాదం, జేసి ఆందోళనతో వాతావరణం హీట్ ఎక్కింది. దీనికి తోడు భక్తుల ముసుగులో ఉన్మాదంగా ప్రవర్తించి, గ్రామస్తులని గాయపరిచి, ఒకరిని చంపటంతో, మరింత టెన్షన్ వాతావరణం పడింది. అయితే చంద్రబాబు కేసు క్లోజ్ గా ఫాలో అవ్వాతం, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇచ్చారు. చివరకు ఆక్టోపస్ ను కూడా రంగంలోకి దించారు.

jc 17092018

ఈ నేపధ్యంలో ఆశ్రమ నిర్వాహకులతో కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం జరిపిన చర్చలు ఫలించాయి. ఆశ్రమం వదిలి స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు అంగీకరించారు. ఆధార్ కార్డులు, స్థానికులుగా ఉన్నవాళ్లను మాత్రమే కుటుంబాలతో సహా అక్కడే స్థిరపడ్డవాళ్లను లోపల ఉండేందుకు అధికారులు అనుమతించారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించేవరకు, అందులో అక్రమంగా ఉంటున్నవాళ్లందరిని వెళ్లగొట్టే వరకు కదలబోనని భీష్మించుకుకూర్చున్న జేసీ దివాకర్ రెడ్డి కూడా శాంతించారు. ఆదివారం సాయంత్రం నుంచి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించిన జేసీ సోమవారం సాయంత్రం 4-30 గంటలకు తన దీక్షను విరమించారు.

jc 17092018

ప్రభోదానంద ఆశ్రమం దగ్గర ప్రస్తుత పరిస్థితులు, అక్కడినుంచి స్థానికేతనులను బస్సుల్లో పంపించిన వైనాన్ని ఎంపీకి పోలీసు అధికారులు వివరించారు. ఇకపై ఆశ్రమం దగ్గర అరాచకాలపై కన్నెస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో జేసీ తన ఆందోళనను విరమించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆశ్రమంలో ఉన్నవారిని తరలించేందుకు నిన్న రాత్రే పోలీసులు 15 ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. అధికారులతో చర్చలు సఫలం కావడంతో 9 బస్సుల్లో భక్తులను వారివారి ప్రాంతాలకు తరలించారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మాత్రం అనంతపురం బస్టాండ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisements

Latest Articles

Most Read