ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైమానిక స్థావరాలు ఏర్పాటుకు, భారత వాయుసేన సిద్ధమైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవి రానున్నాయి. అయితే, వీటి ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో,ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో భారీ హెలికాప్టర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అనంతపురం జిల్లాలో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని, అమరావతిలో సైబర్‌ సెక్యూరిటీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆలోచిస్తోంది. వీటికి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. అదేవిధంగా రాజమహేంద్రవరం, విజయవాడ విమానాశ్రయాలను యుద్ధవిమానాలు, ఇతర విమానాల మోహరింపు స్థావరంగా వినియోగించుకోవడానికి ప్రతిపాదించింది.

vayusena 17092018 2

తూర్పు తీర ప్రాంతంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న రాజమహేంద్రవరం, విజయవాడల్లోని విమానాశ్రయాలను స్థావరాలుగా వినియోగించుకోవాలని ఐఏఎఫ్‌ భావిస్తోంది. ప్రస్తుతం చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానికదళ స్థావరం ఉంది. నౌకాదళానికి విశాఖపట్నంలో ఐఎన్‌ఎస్‌ డేగ కేంద్రం ఉంది. తూర్పు తీర ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలోనూ, ఈ ప్రాంతంలో చైనా వేగంగా విస్తరిస్తున్న సందర్భంగానూ ఐఏఎఫ్‌ కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రాల స్థావరంగా మలచుకోవాలని భావిస్తోంది.

vayusena 17092018 3

అంతేకాకుండా ప్రకృతి విపత్తులు వంటివి సంభవించిన సందర్భాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు వినియోగించే హెలికాప్టర్లు, విమానాలను ఈ స్థావరాల్లో మోహరిస్తారు. ఈ ప్రాజెక్టుల విషయమై ఐఏఎఫ్‌ ఉన్నతాధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పటికే మూడు దఫాలు చర్చలు జరిపారు. గత వారం ఐఏఎఫ్‌ దక్షిణాది కమాండ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ బి.సురేష్‌, ఆయన బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయుసేన స్థావరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ ప్రతిపాదనలపై ఐఏఎఫ్‌తో సమన్వయం చేసుకోవాలంటూ మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ను సీఎం ఆదేశించారు.

అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలంలో ఉద్రిక్తతలు తగ్గించాల్సింది పోయి, మన ప్రతి పక్ష నాయుకుడు ఇంకా పెంచుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రభోదానందస్వామి వర్గీయులు, గ్రామస్థుల పై దాడి చేసి, ఒక వ్యక్తిని చంపిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా, ఇలాంటి బాబాని మన ప్రతిపక్ష నాయుడు జగన్ వెనకేసుకుని వచ్చాడు. ఈ రోజు ఈ బాగా భక్తులుగా పేరున్న ఉన్మాదులు, వైజాగ్ వెళ్లి జగన్ ని కలిసి, గ్రామస్థులే మా పై దాడి చేసరాని, జేసీ దివాకర్ రెడ్డి, దగ్గరుండి దాడి చేపించారని చెప్పారు. దీంతో జగన్, ఈ బాబాగారికి పూర్తి మద్దతు ప్రకటించారు.

prabodha 17092018 2

అయితే ఈ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమంలా ఉందని, పోలీసులు అంటున్నారు. భక్తులంతా ప్రార్థనలు, పూజలు చేస్తారనే చెబుతున్నా.. వారి వ్యవహార శైలి అనేక సందేహాలను కల్పిస్తోందని పోలీసులు, రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఆశ్రమంలోకి ఇతరులు ఎవరినీ అనుమతించరు. ఆశ్రమం చుట్టూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చడం, బయట ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అలాగే భక్తులను అప్రమత్తం చేసేందుకు సైరన్‌ కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఆశ్రమంలోపల పెద్దఎత్తున కర్రలు, రాళ్లు సిద్ధంగా ఉన్నాయి. మరో పక్క, ఈ బాబా ప్రవచనాలు కూడా హిందూ ధర్మానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.

prabodha 17092018 3

బ్రహ్మ విష్ణు మహేశ్వరులను బూతులతో పోల్చి, రాముడు కిరాయి హాంతకుడు అని, వినాయక చవితి , కార్తీకమాసం దీపాలు పెట్టడం అని హేళన చేసి , వెంకటేశ్వర స్వామిని నీచంగా మాట్లాడి, ఆర్యులు ద్రావిడులు అంటూ దేశ విచ్ఛిన్న సిద్ధాంతంని లక్షంగా, ఈ బాబా ప్రవచనాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. ఇలాంటి బాబాని జగన్ సపోర్ట్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, ఈ బాబా కొడుకులు ఇద్దరూ బీజేపీలో మంచి ఆక్టివ్ ఉంటారు. ఆశ్రమ నిర్వాహకులు యోగానంద చౌదరి, ఆయన సోదరుడు జలందర్‌చౌదరి గత సంవత్సరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి హిందూ మతం వ్యతిరేకిని, హింస ప్రేరేపించే ఉన్మాదిని, బీజేపీ పార్టీలో చేర్చుకోవటం, జగన్ సపోర్ట్ చెయ్యటం చూస్తుంటే, ఈ సంఘటన ఎందుకు జరిగిందో ఇట్టే అర్ధమవుతుంది.

విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. పార్టీలో కాపు నేతలకు అన్యాయం జరుగుతోందంటూ ఉయ్యూరు కౌన్సిలర్‌, జిల్లా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ వంగవీటి శ్రీనివాస ప్రసాద్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్‌ రాజీనామా వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా.. మల్లాది విష్ణుకు కేటాయించారంటూ ప్రచారం జరగడంతో విభేధాలు భగ్గుమన్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాధా అనుచరులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

radha 17092018 2

ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని విమర్శలు గుప్పిస్తున్నారు. సారా కాంట్రాక్టర్లు, అవినీతి పరులకు వైసీపీలో సీట్లు కేటాయిస్తారా..? అని రంగా, రాధా మిత్రమండలి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇదిలా ఉంటే.. వంగవీటి రంగా విగ్రహం దగ్గర రాధా అనుచరులు నిరసనకు దిగారు. రంగా ఇంటి దగ్గర, ఆఫీస్‌ దగ్గరున్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రంగా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని రాధా అనుచరులు అంటున్నారు. మరో పక్క కొంత మంది ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యబోతే, అక్కడ ఉన్న వారి వారించారు.

radha 17092018 3

రాధాకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అయితే వారిని గమనించిన రాధా అడ్డుకుని వారించారు. పెట్రోల్ చింది ఇద్దరి కళ్లల్లో పడడంతో ఆస్పత్రికి తరలించారు. సీటు మారినట్టు తనకు సమాచారం లేదని రాధా చెప్పారు. భవిష్యత్‌ కార్యాచరణపై వంగవీటి కుటుంబ సభ్యులు, అనుచరులతో రాధాకృష్ణ నిన్న రాత్రి పొద్దుపోయేవరకు మంతనాలు జరిపారు. రాధాకృష్ణ సోదరుడు ఇవాళ వైకాపాకు రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. అసంతృప్తితో ఉన్న వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణ సహా ఆయన అనుచరులను బుజ్జగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు.

అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రభోదానందస్వామి వర్గీయులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోగా మరో 45 మందికి గాయాలు అయ్యాయి. వారిలో సీఐతోపాటు పది మంది పోలీసులు కూడా ఉన్నారు. గ్రామస్తులపై దాడికి దిగిన ప్రభోదానందస్వామి వర్గంపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు భైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిన్న రాత్రి అంతా పీఎస్ ముందే ఉన్న ఆయన ఇప్పటికి కూడా అక్కడి నుంచి కదలలేదు.

tadipatri 170920188

ఉద్రిక్త పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీసి విచారణకు కమిటీ వేయాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, ఆర్డీవో ఎమ్మార్వోతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భేటీలో అనంతపురం జిల్లా తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

tadipatri 170920188

పార్టీలకు అతీతంగా పోలీసులు అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేసి తాడిపత్రిలో పరిస్థితిని వివరించారు. ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీఎంను జేసీ కోరారు. మరో పక్క ఆక్టోపస్ ని రంగంలోకి దించాలని, గంట గంటకు పరిస్థితి సమీక్షిస్తూ, సాయంత్రానికి ఆర్డర్ లోకి రావాలని పోలీసులకి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని బలగాలను తాడిపత్రికి రప్పించారు. ఆక్టోపస్‌ను బృందాలు కూడా రప్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరినీ బయటకు పంపేస్తామని ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read