కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు శ్రీవారి ఆలయన్నే తమ ఆధీనంలోకి తీసుకుందామని అనుకున్నారు. దీనికి బీజం వేస్తూ, తిరుమలను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరు చేసి, కేంద్రానికి ఇవ్వాల్సిందిగా సుప్రీంలో కేసు వేసారుసుభ్రమణ్య స్వామి. ఈ విషయం పై అప్పట్లో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. ఇలా కేసులు వేసి, మన వెంకన్న స్వామిని తన, హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలని, బీజేపీ పన్నాగం పన్నింది. అయితే కేంద్రం కంటే, రాష్ట్రం కంటే, వెంకన్నకు తనని తాను కాపాడుకోవటం బాగా తెలుసు. పావురాల గుట్ట సాక్షిగా అది రుజువైంది కూడా.
ఈ సారి కూడా, వెంకన్న తన పవర్ చూపించారు. టీటీడీ పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టీటీడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయనే స్వయంగా వాదించారు. అయితే కోర్ట్ మాత్రం, ఆయన వాదనతో ఏకీభవించలేదు. స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
అయితే ఈ పరిణామాల పై, రాష్ట్ర ప్రజలు మండి పడుతున్నారు. మా తిరుపతి పై నీ పెత్తనం ఏమిటి మోడి అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాం.. మద్రాసు పోయినా తిరుమల ఉందని సంతోషించాం.హైదరాబాద్ పోయింది.తిరుమల ఉందని ఊపిరి నిలుపుకున్నాము.తిరుమల జోలికి రావద్దు. తిరుమల మాదే, ఏడుకొండలు మావే ! వెంకటేశ్వరుడు మా దేవుడే !! ఇందులో ఎలాంటి డౌటు లేదు. అనవసర ప్రయాసలు మానుకోండి!! అసలే ఆంధ్రులు అసంతృప్తి చూసి వెంకన్న ఆగ్రహంతో ఉన్నాడు. పొరపాటు జరిగిందో ఇక మీకు శంకరిగిరి మాన్యాలే గతి అంటూ సగటు ఆంధ్రుడు, కేంద్రానికి అర్ధమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఇక వారి ఇష్టం... మిగతాది వెంకన్నే చూసుకుంటాడు.