సిపిఐ, సిపిఎం పార్టీలు గత నాలుగు ఐదు నెలలుగా, పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నాయి. ఆంధ్రాలో ఎక్కువగా టచ్ లో ఉన్నాయి. తెలంగాణాలో కూడా మొన్నటి వరకు సానుకూలంగానే ఉన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, మోడీ పై ప్రేమ చూపిస్తూ, సీరియస్-నెస్ లేని రాజకీయం చేస్తూ ఉండటంతో, సిపిఐ పార్టీ తెలంగాణాలో నమస్కారం చెప్పేసింది. తెలుగుదేశం పై వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, కెసిఆర్, మోడీకి అనుకూలంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంది. మరో పక్క సిపిఎం మాత్రం, ప్రస్తుతానికి పవన్ తోనే వెళ్ళటానికి డిసైడ్ అయ్యిందిఅనుకుంటున్న టైంలో, ఈ రోజు సిపియం కూడా పవన్ వైఖరితో విసుగు చెందింది.

cpm 14092018 1

ఈ రోజు తెలంగాణా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణా ఎన్నికలు, పొత్తుల పై మీడియాతో మాట్లాడారు. మేము జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటానికి చర్చలు జరిపాము. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాతో పొత్తు పై మాట్లాడుకుని, పవన్ మమ్మల్ని పిలుస్తారని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా మమ్మల్ని పిలవటం లేదు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమో అని తమ్మినేని వీరభద్రం సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ కోసం నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని జనసేన ప్రతినిధులు చెప్తున్నారని తెలిపారు.

cpm 14092018 1

రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన తమతో కలిసి రాకపోవచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్ సహా వివిధ పార్టీలతో ఇంకా చర్చలు జరుపుతామని, ఎవరూ రాకపోతే, అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్, కెసిఆర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ, వారం రోజుల క్రిందట తెలంగాణా సిపిఐ ప్రకటించి, మహా కూటమిలో చేరింది. ఈ రోజు, సిపీఎం కూడా, పవన్ కళ్యాణ్, కెసిఆర్ కు వ్యతిరేకంగా పని చెయ్యటానికి సిద్ధంగా లేరు అంటూ, సందేహం వ్యక్తం చేసింది. మొత్తానికి, పవన్ విషయంలో అందరికీ క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా సిపిఐ, సిపిఎం, పవన్, మోడీకి ఎలా సహకరిస్తున్నారో తెలుసుకునే రోజు కూడా తొందరలోనే ఉంది.

స్వ‌చ్ఛ‌ధార‌తో ప్రాణాంత‌క వ్యాధులు దూరం అవుతాయ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పారు. ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక వ‌ద్ద శుక్ర‌వారం స్వ‌చ్ఛ‌ధార వాహ‌నాల‌ను జెండా ఊపి గ్రామాల‌కు పంపించారు. అత్యాధునిక జ‌ర్మ‌న్ టెక్నాల‌జీని వినియోగించి వాట‌ర్ ట్యాంకుల‌ను ప‌రిశుభ్రం చేసే ల‌క్ష్యంతో స్వ‌చ్ఛ‌ధార కార్య‌క్ర‌మాన్ని పంచాయ‌తీరాజ్‌శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తాగునీటి కాలుష్యం కార‌ణంగానే 60 నుంచి 80 శాతం ప్రాణాంత‌క వ్యాధులు వ్యాపిస్తున్నాయ‌ని సీఎం వివ‌రించారు. కేవ‌లం వాట‌ర్ ట్యాంకులు అప‌రిశుభ్రంగా ఉండ‌టం వ‌ల్లే తాగునీరు కాలుష్యం అవుతోంద‌న్నారు.

swachhadara 14092018 2

ఈ ప‌రిస్థితి పై అధ్య‌య‌నం చేసిన మంత్రి లోకేష్‌, పంచాయ‌తీరాజ్‌, ఆర్‌డ‌బ్ల్యుఎస్ అధికారులు స్వ‌చ్ఛ‌ధార ప‌థ‌కాన్ని రూపొందించి ప్రారంభించ‌డం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని సీఎం అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్‌, స్వ‌చ్ఛ ఆంధ్ర కార్పొరేష‌న్‌ ఎండీ ముర‌ళీధ‌ర్‌రెడ్డి, పంచాయ‌తీరాజ్ డైరెక్ట‌ర్ రంజిత్ భాషాలు పాల్గొన్నారు. స్వ‌చ్ఛ‌ధార కార్య‌క్ర‌మం ప్ర‌త్యేక‌త‌లు... గ్రామీణ‌ప్రాంతాల‌లో వాట‌ర్ హెడ్ ట్యాంకులు ప‌రిశుభ్రంగా లేక‌పోవ‌డంతో తాగునీరు కాలుష్య‌మై ప్రాణాంత‌క వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయి. కామెర్లు, క‌ల‌రా, డైసెంట‌రీ, డ‌యేరియా, గ్యాస్ట్రో ఎంట‌రైసిస్‌, థైరాయిడ్ వంటి వ్యాధులతో ఆరోగ్య‌ప‌రంగా, ఆర్థికప‌రంగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్న ప‌రిస్థితికి అడ్డుక‌ట్ట వేయాల‌ని ఐటీ, పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రి లోకేష్ ఆలోచించారు.

swachhadara 14092018 3

అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించారు. గ్రామాల్లో వాట‌ర్ హెడ్ ట్యాంకుల‌ను జ‌ర్మ‌న్ టెక్నాల‌జీతో ఆరు ద‌శ‌ల్లో ప‌రిశుభ్రం చేసే వాహ‌నాల‌ను కొనుగోలు చేశారు. ఆరునెల‌ల‌కోసారి రాష్ట్ర‌వ్యాప్తంగా గ్రామాల‌లోని అన్ని వాట‌ర్ ట్యాంకుల‌నూ క్లీన్ చేసే విధంగా రూపొందించిన ఈ ప‌థ‌క‌మే పేరే ``స్వ‌చ్ఛ‌ధార‌``. జ‌ర్మ‌నీ టెక్నాల‌జీ వినియోగించుకుంటూ వాట‌ర్ హెడ్ ట్యాంకుల‌ను క్లీన్ చేసే కార్య‌క్ర‌మం చేప‌ట్టిన మొట్ట‌మొద‌టి రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్.

వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యల పై హీరో శివాజీ స్పందించారు. నాలుగు రోజుల క్రితం చంద్రబాబుకి నోటీసులు వస్తాయి అంటూ, శివాజీ చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై జగన్ పార్టీ నేత, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వెటకారంగా స్పందించారు. శివజీ బీజేపీని టార్గెట్ చేస్తుంటే, తట్టుకోలేని జగన్ పార్టీ, శివాజీ పై మాటల దాడి చేస్తుంది. ఈ క్రమంలోనే, ఆపరేషన్ గరుడను ఆపరేషన్ పెరుగు వడ అంటూ శ్రీకాంత్ రెడ్డి వెటకారం చేసారు. అయితే, ఈ వ్యాఖ్యలా పై హీరో శివాజీ ఈ రోజు స్పందించారు. అప్పుడప్పుడు వచ్చి ఏదో మాట్లాడిపోతుంటాడని తనను ఉద్దేశించి అన్నారని... తనకేం పనీపాటా లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

sivajis 14092018 2

'మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మహాత్ముడా? రోజు రెండు లక్షల మంది ఆయన వెనక తిరగడానికి జనాలేమైనా పిచ్చోళ్లా? నాకంటే చిన్నోడు జగన్. ఆయనేమైనా గాంధీలా త్యాగాలు చేశాడా? లేక పోరాటాలు చేశాడా? ది గ్రేట్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు... అంతవరకు నేను ఒప్పుకుంటా. వైయస్ కు ఒక చరిత్ర ఉంది. జగన్ వెనుక లక్షలాది మంది తిరుగుతున్నారంటున్నారు. పనీపాటాలేకుండా లక్షలాది మంది ఎందుకు తిరుగుతారు? నేను కేవలం జగన్ ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్న రాజకీయ పెట్టుబడి ఇది. సభల కోసం రాజకీయపార్టీలు లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నాయి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

sivajis 14092018 3

ప్రజల ముందు ఏ పార్టీ అయినా ఒకటే అని శివాజీ అన్నారు. టైమ్ వచ్చినప్పుడు, ప్రజావ్యతిరేకత వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందేనని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఏం చేస్తున్నానని శివాజీ ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖలో ఉన్న జగన్... విశాఖ రైల్వే జోన్ కోసం ఏం చేయబోతున్నారో చెప్పడం లేదని... ప్రతిరోజు కులాల మీటింగ్ లు, మతాల మీటింగ్ లు పెట్టుకుంటూ రాజకీయ స్వార్థం చూసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకుంటే... జగన్ ను జనాలు గెలిపిస్తారని చెప్పారు. జనవరిలో ఏపీకి ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలరని శివాజీ ప్రశ్నించారు. ఏదో ఒక విధంగా చంద్రబాబును కూలదోసి, అధికారంలోకి రావాలనేదే కుట్ర అని చెప్పారు.

రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు భద్రత కల్పించే బాధ్యత ఏపీ పోలీసు శాఖ భుజానికెత్తుకుంది. విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపించడంలో కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా దేశీయ, విదేశీ, ప్రవాస భారతీయుల పెట్టుబడులకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ తమ లక్ష్యమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ఏపీ పెట్టుబడుల భద్రత, రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసు సీఐడీ విభాగానికి అనుసంధానంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ విభాగం రూపుదిద్దుకుంది. ఏపీ ఇనె్వస్ట్‌మెంట్ సెల్‌తో పాటు ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదుల పరిష్కార విభాగం కూడా నెలకొల్పారు. పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం డీజీపీ ఠాకూర్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఏపీకి చెందిన తెలుగువారు సుమారు 25 లక్షల మంది ఉన్నారని తెలిపారు.

nri 14092018 2

ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు అదుపులో ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని, దేశీయ, విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందనడానికి సందేహమే లేదన్నారు. అందువల్ల పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు ధైర్యంగా రాష్ట్రానికి వచ్చేందుకు అనుకూల వాతావరణం కల్పించడంలో పోలీసు శాఖ ప్రధాన పాత్ర వహిస్తోందన్నారు. దీనిలోభాగంగా సీఐడీ పర్యవేక్షణలో కొత్తగా విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రవాస భారతీయ, దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల సమస్యల సత్వర పరిష్కారం ద్వారా నమ్మకాన్ని కలిగించడం తమ ఉద్దశ్యమన్నారు. ఏపీ డీజీపీ, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, సీఐడీ అదనపు డీజీ వంటి ఉన్నతాధిరులు, సీనియర్ పోలీసు అధికారులతో కూడిన సలహా మండలి ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.

nri 14092018 3

ఇతర ప్రభుత్వ అధికారులు, ఐటీ, ఫార్మా పరిశ్రమల ప్రతినిధులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ వాణిజ్య సమాఖ్య, తెలుగు ప్రవాస భారతీయ ప్రతినిధులు సలహా మండలిలో సభ్యులుగా ఉంటారని ఆయన వివరించారు. ప్రభుత్వానికి, తెలుగుజాతికి, పోలీసుకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలనేదే లక్ష్యమని డీజీపీ ఠాకూర్ వివరించారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ మాట్లాడుతూ కొత్త రాష్ట్రం అభివృద్ధికి విదేశాల్లో ఉన్న తెలుగువారు ముందడుగు వేస్తున్నారని, మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా పోలీసు శాఖ నడుం బిగించిందన్నారు. ఏపీ పెట్టుబడుల భద్రత, రక్షణ విభాగానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. విలేఖరుల సమావేశంలో సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్, శాంతిభద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్ గుప్తా, ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రవి వేమూరి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read