కల్లోల కేరళకు ఆంధ్రప్రదేశ్‌ అందజేసిన ఇతోధిక సాయానికి అక్కడి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. తమ రాష్ట్రానికి ఇంత భారీ సాయం మరే రాష్ట్రం నుంచి అందలేదని పేర్కొంది. వరదల వల్ల కష్టాల్లో ఉన్న కేరళకు ఏపీ ప్రభుత్వం రూ.51 కోట్లకు పైగా సాయాన్ని పంపింది. కేరళ సచివాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ తరఫున ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చెక్కులు అందించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ విదేశీ పర్యటనకు వెళ్లడంతో చెక్కులను ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి జయరాజన్‌కు అందించారు. ఉపముఖ్యమంత్రి వెంట రియల్‌టైం గవర్నెన్స్‌ సొసైటీ సీఈవో బాబు ఉన్నారు.

kerala 14092018 2

ఈ సందర్భంగా జయరాజన్‌ మాట్లాడుతూ కష్టకాలంలో అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కేరళను అన్ని విధాల ఆదుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారన్నారు. కేరళకు అందించిన రూ.51కోట్ల సాయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10కోట్లు, ఏపీ ఎన్జీవోల ఒకరోజు వేతనం రూ.20కోట్లు, తదితరాలు ఉన్నట్లు తెలిపారు. వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా దెబ్బ‌తిన్న కేర‌ళ రాష్ట్రానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.51 కోట్ల‌కుపైగా సాయం అంద‌జేయ‌నుంది.

kerala 14092018 3

రాష్ట్ర ప్రభుత్వం రూ.51.018 కోట్ల న‌గ‌దు, స‌హాయ సామ‌గ్రిని మంగళవారం కేర‌ళ‌కు పంపింది. ఇందులో రూ.35 కోట్ల విరాళం కాగా, మిగిలినవి సహాయ సామ‌గ్రి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.10 కోట్లు, ఏపీ ఎన్జీఓలు త‌మ ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన .20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.కోటి, పీఐఐసీ నుంచి రూ.17 ల‌క్ష‌ల విరాళం, ఆర్టీజీఎస్ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.8.09 ల‌క్ష‌లు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ పంపిన రూ.6 కోట్ల విలువైన 2,014 మెట్రిక్ ట‌న్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన రూ.కోటి విలువైన సామ‌గ్రి, విశాఖ‌ప‌ట్నం నుంచి పంపిన రూ.10వేల దుప్ప‌ట్లు ఇత‌రత్రా స‌హాయ సామ‌గ్రి ఇందులో ఉన్నాయి.

బండ్ల గణేష్... ఈయన పేరు తెలియని పవన్ కళ్యాణ్ అభిమాని ఉండడు.. ఎప్పుడు అవకాసం వచ్చినా, పవన్ కళ్యాణ్ భజన మాములుగా చేసే వాడు కాదు... మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటూ హంగామా హంగామా చేసే వాడు. నాకు పవన్ దేవడు అంటూ, ఒక రకమైన ఉన్మాదం చూపించే వాడు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత కూడా, మా పవన్ ఒక గాంధీ, మా పవన్ ఒక వివేకానంద అంటూ, భజన చేసిన కచేరీలు ఎన్నో.. ఇలాంటి బండ్ల గణేష్ ఈ రోజు ఉన్నట్టు ఉండి కాంగ్రెస్ లో చేరుతునట్టు ప్రకటించారు. అంతే కాదు, ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు.

bandla 14092018 2

బండ్ల గణేష్‌తోపాటు టీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీనియర్ నేతలు నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. ఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం అధ్యక్షుడు రాహుల్ నివాసానికి వెళ్లిన ఇద్దరు ఆయన సమక్షంలో తమ మద్దుతుదారులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని నిర్మాత బండ్ల గణేష్‌ కొనియాడారు. ఎన్నికల్లో పార్టీ కోరితే పోటీ చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా.. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

bandla 14092018 3

ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా బండ్ల చెప్పారు. జనసేనలో చేరకుండా, కాంగ్రెస్ లో ఎందుకు చేరారు అంటే, దానికి బండ్ల మాట్లాడుతూ, "సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన నాకు దేవుడితో సమానం. ఆయనే నాకు గురువు. కాని రాజకీయాల్లో, కాంగ్రెస్ అంటే నాకు అభిమానం." అంటూ బండ్ల గణేష్ చెప్పారు. ఎంతో మంది విశ్లేషకులు చెప్పేది కూడా ఇదే. అప్పుడు చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ అయినా, ఒక సినిమా ఆక్టర్ గా అందరూ అభిమానిస్తారు, కాని ఓటు మాత్రం, ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుపడుతుందో, వారికే వేస్తారు. చిరంజీవి లాంటి వాడికే 18 వస్తే, పవన్ కళ్యాణ్ కి సున్నా రావటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని, పవన్ వెనుక ఉండే సంగం మందికి ఓటు హక్కు కూడా ఉండదని, మిగతా సగం మంది రాష్ట్ర శ్రేయస్సు కోరేవారికి ఓటు వేస్తారని, చివరకు పవన్ వెంట ఉండే 5-10 శాతం మంది కూడా ఓటు వెయ్యరని, అది చిరంజీవి విషయంలోనే తేలిపోయింది అని, పవన్, చిరంజీవి కంటే గొప్ప వారేం కాదు కదా అని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎప్పుడో, 2010లో జరిగిన ప్రజా ఆందోళన... అప్పట్లోనే మహరాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు పై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంది.. అయితే, ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళ తరువాత, ఎవరో పిటీషన్ వేసి, ఆ కేసు ఏమైంది అని అడగటం, ఆ కేసు ఇంకా ఓపెన్ చేసే ఉంది, వాయదాలకు రావటం లేదు అని తెలుసుకుని, నాన్ బైలబుల్ వారంట్ ఇవ్వటం, చంద్రబాబుకి నోటీసులు, అరెస్ట్ అంటూ వార్తలు రావటం, ఇవన్నీ ఇప్పుడు ఎందుకో ఎవరికీ అర్ధం కావటం లేదు. నువ్వు మాకు ఎదురుతిరిగావ్, నీ మీద కేసులు పెడుతున్నాం, సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, ఇన్కమ్ టాక్స్ వస్తుంది అంటూ, గత ఆరు నెలలుగా బీజేపీ నాయకులు చేస్తున్న హంగామా చూస్తున్నాం..

uno 14092018 2

వారినికి ఒక ఆరోపణ తీసుకువచ్చి, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ గాల్లో కబురులు చెప్పి, అదిగో చంద్రబాబు అరెస్ట్, ఇదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ, చివరకి ప్రజా ఆందోళన పై చేసిన ఒక పిల్ల కేసు తీసుకుని నోటీసులు ఇచ్చి, అరెస్ట్ వారంట్ ఇచ్చారు. అంటే, చంద్రబాబు అవినీతి పై వీళ్ళకు ఆధారాలు ఏమి దొరక్క, వీళ్ళ ఇగో చల్లార్చుకోవటానికి, ఇలా నోటీస్ పంపించారా ? లేక తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, అది దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది అనే భయంతో, చంద్రబాబుకి వార్నింగ్ లాగా, ఈ కేసు బయటకు తీసారా ? ఇన్ని చర్చలు జరుగుతున్న సమయంలో, తెలుగుదేశం పార్టీ మరొక చర్చకు కూడా తెర లేపింది.

uno 14092018 3

మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు, ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ఎనిమిది ఏళ్ళుగా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్ని తెలుగు దేశం నేతలు తప్పుబడుతున్నారు. ఈ నెల 23న చంద్రబాబు అమెరకా వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు నిలిచిపోనుంది. ఇవన్నీ తట్టుకోలేని ఢిల్లీ పెద్దలు, ఈ టూర్ ఆపటానికి, సరిగ్గా చంద్రబాబు అమెరికా బయలుదేరే సెప్టెంబర్ 21 నే ఎంచుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అమెరికా పర్యటన ఆగదని, కోర్ట్ కి విషయం చెప్పి, అమెరికా పర్యటనకు వెళ్లి, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అమెరికాలో, ఐక్యరాజ్య సమితిలో ఎగరేస్తామని, ఎవరు అడ్డుపడినా, ఆగేది లేదని అంటున్నారు.

ఉత్తర తెలంగాణ ఎడారి కాకూడదంటూ పోరాడినందుకు బాబ్లీ కేసులో చంద్రబాబు గారికి ఇన్ని సంవత్సరాల తరువాత నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబ్లీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందంటూ 2010లో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఆందోళన చేశారు. బాబ్లీ నిర్మాణం ఆపివేయాలని తెలంగాణ సరిహద్దు దాటి టీడీపీ బృందం చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో మహారాష్ట్రకు వెళ్లింది. మహారాష్ట్రలో ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటానికి ఇప్పుడు 8 సంవత్సరాల తరువాత హడావుడిగా నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయాలని కొత్తగా వత్తిడి మొదలైంది. అయితే, ఆ ఐదు రోజులు ఏం జరిగింది? మహారాష్ట్ర ప్రభుత్వం తెదేపా ప్రజా ప్రతినిధులను మన రాష్ట్ర పరిధిలోనే అరెస్టు చేసి ధర్మాబాద్‌కు తీసుకెళ్లిన నాటి నుంచి... తిరిగొచ్చే వరకు పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది? ధర్మాబాద్ నుంచి హైదరాబాద్ వరకు నేతల ప్రస్థానం ఎలా సాగింది? దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు జూలై 22, 2010న చెప్పిన మాటలు ఇవి...

babli 14092018 2

వివరాలు ఆయన మాటల్లోనే... చుట్టూ దీపాలు... మాకే చీకటి.. 'మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాబ్లీకేనా?' రాష్ట్ర సరిహద్దులో మమ్మల్ని పోలీసు వ్యానుల్లోకి ఎక్కించాక మేం అడిగిన మొదటి ప్రశ్న అది. బాబ్లీకే అని పోలీసు అధికారులు అన్నారు. రక్షణ కోసం పోలీసు వ్యానుల్లో ఎక్కించారని, బాబ్లీకే తీసుకెళ్తున్నారని భావించాం. 2 కిలోమీటర్లు వెళ్లాక మళ్లీ అడిగాం ఎక్కడికని. సమాధానం లేదు. కాసేపట్లోనే ధర్మాబాద్ ఐటీఐ కళాశాల ముందు వాహనాలు ఆపారు. కళాశాల వూరికి చివరన విసిరేసినట్లుంది. చుట్టూ పొలాలున్నాయి. అందర్నీ కిందకి దింపారు. మమ్మల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. అలా మా ప్రస్థానం మొదలైంది. అది ఎన్ని రోజులుంటుందో మాకెవరికీ తెలీదు. బాబ్లీని చూసే తిరిగిరావాలని బలంగా అనుకున్నాం. మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. అప్పటికి సాయంత్రం అవుతుంది. లోపలికి తీసుకెళ్లి ఒక హాలులో నేలమీద కూర్చోబెట్టారు. పోలీసు వాహనంలో కిక్కిరిసి వెళ్లాం. ఆ భవనంలో విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఫ్యాన్ కూడాతిరగడం లేదు. మంచినీళ్లూ ఇవ్వలేదు. హాల్‌లో అలాగే కింద కూర్చున్నాం. చీకటైంది. వూరంతా లైట్లు వెలుగుతున్నాయి. మాకు మాత్రం విద్యుత్ లేదు. పోలీసు అధికారుల్ని నిలదీశాం. చివరకు రాత్రి 7.30కు వారు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. భోజనంగా చపాతీ అందించారు. తెల్లార్లు నిద్రలేదు. నాలుగుసార్లు విద్యుత్ తీసేశారు. దోమలు, ఈగలు. దుప్పట్లేమీ సరిగా ఇవ్వలేదు. 72 మంది అరెస్టు కాగా, 10 మంది మహిళలున్నాం. అందరికీ ఒకే హాలు. పశువుల కొట్టంలా ఉంది.

babli 14092018 3

ఒకే మరుగుదొడ్డి... విరేచనాలు: తెల్లారి లేచాక కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలకు నీళ్లు లేవు. పది గంటలకు గొడవ చేస్తే తెప్పించారు. 72 మందికి ఒకటే బాత్‌రూం. ఒకటే లెట్రిన్. ప్రజాప్రతినిధులం క్యూ కట్టి వెళ్లాల్సి వచ్చింది. దీనికి నిరసనగా మహారాష్ట్ర పోలీసులు ఇచ్చిన అటుకులు, ఉప్మాల అల్పాహారాన్ని నిరాకరించాం. బయటి నుంచి అల్పాహారం తెప్పించుకున్నాం. తర్వాత నాందేడ్ మేజిస్ట్రేట్ వచ్చారు. బెయిల్ తీసుకుని వెళ్లిపోండన్నారు. మేం ఏం నేరం చేశామని, బెయిల్ తీసుకోవాలి? ఇదే ప్రశ్న సూటిగా అడిగాం. రెండు రోజుల రిమాండ్ విధించారు. మేమంతా చర్చించుకున్నాం. ఈ దాష్టీకానికి నిరసనగా 19న బంద్‌కు పిలుపిచ్చాం. సాయంత్రానికి కొందరు ఎమ్మెల్యేల ఆరోగ్యం దెబ్బతింది. అపరిశుభ్ర బాత్‌రూమ్‌ను 72 మంది ఉపయోగించుకోవాల్సిన పరిస్థితుల్లో హిందూపూర్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి డయేరియా వచ్చింది. 12 సార్లు విరేచనానికి వెళ్లారు. ప్రత్యక్ష నరకం. మండవ వెంకటేశ్వరరావుదీ అదే పరిస్థితి. అశోక్ గజపతి రాజుకు బీపీ, షుగర్ అదుపు తప్పాయి. మీనాక్షినాయుడు, రామకోటయ్యకు జ్వరాలొచ్చాయి. ఆదివారం అంతా కలిసి మాట్లాడుకున్నాం. జల వనరులపై కింది రాష్ట్రాల పరిస్థితిపై చర్చించుకున్నాం. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా హర్తాళ్‌లో ఉంటారని. ఆ సమయంలో మేం భోజనం చేయడమేంటని, నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం.

babli 14092018 4

శవాల బండెక్కించి తాళం: సోమవారం మొత్తం నిరాహారదీక్ష చేశాం. మహారాష్ట్ర పోలీసులు తెచ్చిన అల్పాహారాన్ని తిరస్కరించాం. నిరాహారదీక్ష అని చెప్పాం. బాబ్లీ పరిరక్షణ సమితి, అన్ని పార్టీలు కలిసి చేసిన నాందేడ్ బంద్ ప్రభావం ప్రభుత్వంపై పడింది. మమ్మల్ని అక్కడ్నించీ తరలించేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. సోమవారం రాత్రి అందర్నీ ఔరంగాబాద్ తరలిస్తున్నామని, వాహనాల్లోకి ఎక్కాలన్నారు. నిరాహారదీక్ష నీరసం, అలసటతో ఉన్నామని, మహిళలు కూడా ఉన్నారని, రాత్రిపూట తరలింపేంటని అడిగాం. వినలేదు. ఎక్కించారు. మహిళా ప్రజాప్రతినిధులందర్నీ ఒక టెంపోలో వేసి దానికి తాళం వేసేశారు. లోపల గాలి ఆడడం లేదు. తాళం తీయండి. కాసేపు గాలి పీల్చుకుంటామంటే వినడం లేదు. ఆ టెంపోలో శవాల వాసన వస్తోంది. ఇదిచూసి చలించిపోయాం. మా కంట కన్నీరు ఉబికొచ్చింది. పోలీసులపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశాం. నిరసనగా ప్రాంగణం బయటే కూర్చుని, అక్కడే పడుకున్నాం. దాంతో ఆ రాత్రికి తరలింపు ఆపారు. పడుకునే సరికి అర్థరాత్రి దాటింది

babli 14092018 5

వూహించని దాడి: మంగళవారం ఉదయం మహారాష్ట్రలో మా ఆఖరి రోజు. అల్పాహారం కూడా ఇంకా తీసుకోలేదు. పలువురు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మేజిస్ట్రేట్, ఎస్పీ వచ్చారు. ఔరంగాబాద్ జైలుకు వెళ్లాలన్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్నామని చెప్పాం. వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ తీసుకుని వెళ్లిపోండన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పూచీగాపెట్టే ప్రశ్నే లేదన్నాం. వారు ప్రాంగణం బయటకు వెళ్లారు. అంతే...! ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి పోలీసులు వచ్చి దండులా మీదపడ్డారు. లాఠీలు, తుపాకీ మడమలతో పొట్టలో కొట్టారు. ఎక్కడపడితే అక్కడ బాదేశారు. అస్వస్థతతో బాధ పడుతున్నవారి సెలైన్ సూదులు పీకేశారు. మహిళలను జుట్టు పట్టుకున్నారు. మాకు పరిస్థితి అర్థమైంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదని. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసించి పంపించేయాలని అనుకుంటున్నారని. ఐటీఐ కళాశాలలో మేం ఉంటున్న గదుల నుంచి రోడ్డుపై వాహనాలుంచిన ప్రదేశానికి 200 మీటర్ల దూరం ఉంది. ఆ దారికి అటూఇటూ రెండు వరుసలుగా పోలీసులు నిలబడ్డారు.

babli 14092018 6

ఒక బ్యాచ్ పోలీసులు తలుపులు పగలగొట్టి మరీ గదుల్లో ఉన్నవారందరినీ కొట్టి, నిలబడ్డ పోలీసు బారుల మధ్యకు తోసేస్తున్నారు. అక్కడి నుంచి వాహనాల్లోకి ఎక్కేవరకు ఏ పోలీసుకు కోపం వచ్చినా కొట్టడమే. చాలామందికి దెబ్బలు తగిలాయి. కనీసం చెప్పులు వేసుకోనివ్వలేదు. లగేజీ తీసుకోనివ్వలేదు. మెడలో చైన్లు, చెవి రింగులూ కూడా లాగేసుకున్నారు. సహాయకుల్ని, గన్‌మెన్‌లను కూడా తీవ్రంగా కొట్టారు. నా వ్యక్తిగత సహాయకుణ్ని ఆరు కిలోమీటర్ల దూరం వెంటాడి కొట్టారు. ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్లు లాగేసుకున్నారు. నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. అక్కడి పోలీసులు మా పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ప్రాణాలతో తిరిగి వస్తామని అనుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రజాప్రతినిధులకు ఇంత దారుణమైన ట్రీట్‌మెంట్ ఇవ్వడం చూడలేదు. అంత దౌర్జన్యంగా ప్రవర్తించారు మహారాష్ట్ర పోలీసులు. మేమేం నేరం చేశాం? ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడు కూడా మేం ఢిల్లీ, బెంగుళూరు తిరిగాం. ఎక్కడా ఎవర్నీ కొట్టలేదు. మహారాష్ట్ర నుంచి బతికొస్తామని అనుకోలేదు. రాష్ట్ర ప్రజల అభిమానం, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్‌ల ఆశీస్సులతోనే తిరిగొచ్చాం.

babli 14092018 7

మరోసారి మోసం: అక్కడినుంచి వాహనాలు బయల్దేరాయి. ఔరంగాబాదా? నాసిక్‌కా? ఎక్కడికనేది ఎవరూ చెప్పలేదు. ఉదయం 10 గంటలకు వాహనాలెక్కితే సాయంత్రం ఆరుగంటల వరకూ ఏకధాటిన ప్రయాణం. అసలే శారీరకంగా, మానసికంగా అలసిపోయి, పోలీసు దెబ్బలతో ఉండగా ఈ ఏకధాటి ప్రయాణంతో ఒళ్లు కమిలిపోయింది. ఎవరికీ అన్నం లేదు. అందరికీ ఆకలే. బీపీలు, చెక్కర వ్యాధులు ఉన్నవారి పరిస్థితి ఇంకాఘోరం. చివరకు ఔరంగాబాద్‌కు కొద్దిగా ఇవతల జాల్నా వద్ద ఒక దాబాలో ఆపారు. తలో రెండేసి చపాతీలు ఇచ్చారు. అక్కడి నుంచీ ఔరంగాబాద్ జైలు దగ్గరే. 26 వరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో మానసికంగా సిద్ధమయ్యాం. అక్కడి నుంచి బస్సులు బయల్దేరాయి. ఇక్కడా మోసమే. జైలుకని చెప్పి విమానాశ్రయానికి తీసుకెళ్లారు. 'తీసుకెళ్తే జైలుకు, లేదంటే బాబ్లీకి' అంటూ నిరసనకు దిగాం. బస్సులను నేరుగా రన్‌వే వరకు తీసుకెళ్లారు. రన్‌వేపైనే నిరసన తెలుపుతూ బైఠాయించాం. మరోసారి మహారాష్ట్ర లాఠీలు విరుచుకు పడ్డాయి. విమానం బయల్దేరింది. (సేకరణ: ఈనాడు)...

Advertisements

Latest Articles

Most Read