పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా గ్యాలరీ వాక్ చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణం స్పిల్ వే గ్యాలరీ. దీని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పోలవరం గ్యాలరీ విషయానికి వస్తే... దీని ఎత్తు 2 మీటర్లు, వెడల్పు రెండున్నర మీటర్లు. గ్యాలరీలో చిమ్మచీకటి ఉంటుంది. వెలుతురు కోసం ప్రత్యేకంగా లైట్లను అమర్చుకోవాలి. డ్యామ్ కింద భాగంలో ఇది ఉంటుంది. 26వ బ్లాక్ నుంచి 31వ బ్లాక్ వరకు గ్యాలరీ చాలా లోతులో ఉంటుంది.

gallery 13092018 2

కొన్ని చోట్ల 18 మీటర్ల లోతు నుంచి దీన్ని నిర్మించారు. దీంతో, ఆ ప్రాంతంలో దాదాపు 14 అంతస్తుల భవనం దిగి, మళ్లీ అంత భవనాన్ని ఎక్కే స్థాయిలో మెట్లు ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హుషారు అందరికీ తెలిసిందే. గతంలో తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లినప్పుడు... ఎక్కడా ఆగకుండా పైకి ఎక్కిన ఘనత ఆయనది. నిన్నటి గ్యాలరీ వాక్ లో కూడా ఆయన అంతే హుషారుగా నడిచారు. ఆయనతో పాటు నడవడానికి మంత్రులు, అధికారుల చాలా ఇబ్బంది పడ్డారు. ఆయనను అందుకోవడం వారికి కష్టసాధ్యంగా మారింది. పరిస్థితిని గమనించిన జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ సీఎం వద్దకు వెళ్లి, 'కాసేపు ఆగుదాం సార్' అని చెప్పారు. దీనికి సమాధానంగా, 'నడవలేక పోతున్నారా?' అంటూ చంద్రబాబు సరదాగా ప్రశ్నించారు.

gallery 13092018 3

గ్యాలరీలో ముందస్తుగానే పెద్దసంఖ్యలో ఆక్సిజన్‌ సిలెండర్లు, స్టాండింగ్‌ ఎసిలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీని 2మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తులో 1069.5మీటర్ల పొడవునా స్పిల్‌వే లోపల సొరంగం తరహాలో నిర్మించారు. జలాశయం నిండి అదనంగా వచ్చే వరద నీటిని గేట్ల ద్వారా నది దిగువకు విడుదల చేయడానికి స్పీల్‌వే ఉపయోగపడుతుంది. స్పిల్‌వేలో అంతర్భాగంగా ఈ గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీ వల్ల భూమి అడుగునుండి డ్యామ్‌ మీద పడుతున్న ఊర్ధ్వ పీడన ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంటుంది. గ్యాలరీ సొరంగం తరహాలో ఉండడం వల్ల లోపల ఆక్సిజన్‌ సమస్య తరచూ తలెత్తుతుంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా కొన్ని గొట్టాలేర్పాటు చేశారు. గ్యాలరీలోని ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌ రూమ్‌ను నెలకొల్పారు.

ఏపీ రాజధాని జిల్లా గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌(ఎన్‌ఐడీ) పేరును మారుస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్‌ఐడీ-విజయవాడ పేరుతో ఉన్న ఈ సంస్థను ఎన్‌ఐడీ-అమరావతిగా మార్పు చేశారు. అందప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంస్థలో ప్రొఫెసర్‌ హోదాకు సమానంగా ప్రిన్సిపల్‌ డిజైనర్‌ను నియమించాలని బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ చట్టం-2014’ను సవరించి పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కూడా కేబినెట్‌ అంగీకరించింది.

nid 13092018

014 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చట్టంద్వారా ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా దేశంలో మరో మూడు సంస్థలు ఎన్‌ఐడి భోపాల్ (మధ్యప్రదేశ్), ఎన్‌ఐడీ జోర్‌హాట్ (అసోం), ఎన్‌ఐడీ కురుక్షేత్ర (హర్యానా)లను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నాలుగు సంస్థలను జాతీయ ప్రాధాన్యత గల సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర మంత్రి మండలి చట్ట సవరణ చేసేందుకు ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌తో సమానంగా జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తించబడుతుంది. వచ్చే శీతాకాల సమావేశంలో జాతీయ ప్రాముఖ్యత సంస్థలుగా ఈ చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనివల్ల డిజైన్లలో అత్యున్నత నైపుణ్యం గల వారిని తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది.

nid 13092018

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంలో కొత్త పథకం ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ అభియాన్‌(పీఎం ఆశ)కు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇథనాల్‌ ధరను రూ.47.49 నుంచి రూ.52.43కు పెంచుతూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2021-22 నాటికి అన్ని బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గాలను వందశాతం విద్యుదీకరణ చేయడం, విజయవాడ, జోర్‌హాట్‌, భోపాల్‌, కురుక్షేత్రలో ఎన్‌ఐడీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకోనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రితో బాటు ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేష్‌ రానున్నారు. ముఖ్యమంత్రి గురువారం ఉదయం 11గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.45గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

cbntirupati 13092018

మధ్యాహ్నం 12గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి ఒంటిగంటకు తిరుమలలోని శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ఒంటి గంట నుంచి సాయంత్రం 6.30గంటల వరకు రిజర్వుగా నిర్ణయించారు. 6.45గంటలకు అతిథిగృహం నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటలకు శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి 8.30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 8.40గంటలకు అతిథిగృహం చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 14వ తేదీ ఉదయం 7.30గంటలకు బయలుదేరి 8.30గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

ఏపీలో రెండో పరిశ్రమ ఏర్పాటుకు నిషా డిజైన్స్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో నిషా డిజైన్స్ ఎంవోయు కుదుర్చుకుంది. ఎంవోయుపై రాష్ట్రం తరఫున ఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్ , నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ గోయంకలు సంతకాలు చేశారు. గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని సమీర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు జరిపిన పరిశీనలలో ఏపీ తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గార్మెంట్స్ పరిశ్రమలను నెలకొల్పాలని ఒత్తిడి చేసినా కాదని ఏపీని ఎంపిక చేసుకున్నామని తెలిపారు. గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ అత్యంత సానుకూలమైన ప్రాంతంగా గుర్తించామని తెలిపారు.

nisha 13092018 1

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "రాష్ట్రం హార్డ్ వేర్ పరిశ్రమ విస్తరణకు అధికప్రాధాన్యమిస్తున్నాము.ఇప్పటికే మొబైల్ పరిశ్రమ దూసుకుపోతోంది, గార్మెంట్స్, టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని, గార్మెంట్స్ పరిశ్రమలో మహిళలకు ఉపాధి కల్పించడంలో అధిక ప్రాధాన్యమివ్వాలని, మీరురాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడం సంతోషకరమని, మీతో పని చేయడం ఆనందంగాఉందని", సమీర్ బృందానికి తెలిపారు. అనంతపురం జిల్లా గోరంట్లలో నిషా డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమను నెలకొల్పనుంది. దేశంలోని ఎనిమిది పరిశ్రమల్లో విదేశీ అవసరాలకు తగ్గట్లుగా నిషా డిజైన్స్ అత్యుత్తమ నాణ్యతతో విలువైన దుస్తులను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా, మిడిల్ ఈస్ట్ దేశాలకు నాణ్యమైన దుస్తుల ఎగుమతులతో మంచి మార్కెట్ ను సాధించింది. రూ.65 కోట్ల వ్యయంతో గోరంట్లలో నిర్మిస్తున్న గార్మెంట్స్ పరిశ్రమలో డిసెంబరుకల్లా ఉత్పత్తి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబుకు నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ హామీ ఇచ్చారు.

nisha 13092018 1

ప్రత్యక్షంగా ఈ పరిశ్రమలో పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని నిషా డిజైన్స్ తెలిపింది. ప్రతి పరిశ్రమలోనూ 80% మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని నిషా డిజైన్స్ పేర్కొంది. అనంతపురం జిల్లా హిందూపూర్ లో నిషా డిజైన్స్ఇప్పటికే మొదటి పరిశ్రమలో ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఎనిమిది పరిశ్రమలకుగాను ఏడు కర్నాటకలో, ఒకటి ఏపీలో నెలకొల్పి గార్మెంట్స్ పరిశ్రమల రంగంలో నిషా డిజైన్స్ కీలక భూమిక వహిస్తోంది. ప్రస్తుతం ఎనిమిది పరిశ్రమల స్థాపన ద్వారా రూ.700 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఏపీలో మూడో గార్మెంట్స్ పరిశ్రమను నెలకొల్పడానికి అనంతపురము, చిత్తూరు, విశాఖ, విజయవాడ పరిసర ప్రాంతాలలో భూమి కోసం అన్వేషణ చేస్తున్నామని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో మూడు పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పంచాలన్న లక్ష్యాన్ని నిషా డిజైన్స్ పార్టనర్ సమీర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.పరోక్షంగా ఇరవయి వేలమందికి ఉపాధి కలుగుతుందన్న సమీర్ పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read