ప్రమాదవశాత్తూ అంగవికలురాలైన తనకు కృత్రిమ చేయి అమర్చడంలో మానవతాదృక్పథంతో సాయమందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్జ్ఞతలు తెలిపిన దాసుపురం శ్రీలత. శాసనసభ భవనంలోని ఛాంబర్ లో సీఎం చంద్రబాబును తల్లిదండ్రులతో వచ్చి కలసిన దాసుపురం శ్రీలత. అమరావతిలో నిట్ లో చదువుతున్న శ్రీలత గత మేలో నిట్ ను సందర్శించినప్పుడు శ్రీలతకు కుడిచేయి భుజం వరకూ లేకపోవడాన్ని గమనించి స్వయంగా కారణాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.

cbn 11092018 2

కృత్రిమ చేయి అమర్చుకునేందుకు శ్రీలతకు తక్షణం రూ. 4.20 లక్షలు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు. విజయవాడలోని ఆర్థోటిక్స్ ఇండియా ప్రై.లిమిటెడ్ లో కృత్రిమ చేయిని అమర్చుకున్న శ్రీలత. ప్రస్తుతం బయోనిక్ ప్రొస్థెటిక్స్ ప్రమాణం గల కృత్రిమ చేయితో రాయగలుగుతున్నానని సీఎం చంద్రబాబుకు తెలిపిన శ్రీలత. ఆత్మసైర్యంతో మసలుకుంటూ చదువులో మరింత రాణించాలని శ్రీలతకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు.

cbn 11092018 3

అయిదో ఏట బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో నిద్రలో కిటికీ బయటకు వచ్చిన శ్రీలత కుడి చేతిని లారీ ఢీకొంది. చికిత్స అనంతరం అప్పటి నుంచి కుడి భుజం వరకూ చేయి లేకపోవడంతో ఎడం చేతితోనే రాయడం అలవాటు చేసుకున్న శ్రీలత. పదో తరగతిలో 87 %, ఇంటర్ లో 91% మార్కులతో చదువులో మంచి ప్రతిభ చూపి ఈ ఏడాది నిట్ లో చేరిన శ్రీలత. శ్రీలతకు ఇప్పుడు కృత్రిమ చేయి అమర్చడంతో కుడి చేతితో రాయగలగడంలో మీ దయ, తోడ్పాటు మరవలేనిదని సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేసిన శ్రీలత తల్లిదండ్రులుఅవతారం, అప్పలమ్మలు

వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కడప నుంచి రౌడీలను తెచ్చి మర్డర్ చేసి పడేస్తా అంటూ, గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెస్ లో అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఓ మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చంద్రబాబు ప్రస్తావించారు.

vasantah 11092018 2

ఈ విషయం పై మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు, వైసిపీ స్టైల్ లో స్పందించారు. 24 గంటలు తరువాత విజయసాయి రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చెప్పారు. గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించలేదుదని, కేవలం మందలించానంతే అని ఆయన చెప్పుకోచ్చారు. మంత్రి ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు తన అనుచరులు చెప్పారని, దీంతో వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని మాత్రమే అడిగానని తాను ఎవరిని బెదిరించాలేదని స్పష్టం చేశారు.

vasantah 11092018 3

ఆయన్ని చంపుతా అని కాని, కడప నుంచి రౌడీలు వస్తారు అని కాని అనలేదని అన్నారు. తనకు, తన పార్టీ అధినేతకు హింస అనే మాటే తెలియదని అన్నారు. తన మాటలను అమరావతిలో కూర్చుని, కుట్రతో రికార్డు చేయించి, ఎడిట్ చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. నా ఎదుగుదల చూసి, మా జగన్ ముఖ్యమంత్రి అయిపోతారని తెలుసుకుని, ఇలా చేస్తున్నారని అన్నారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం సిగ్గుగా ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఏ అధికారినీ దుర్భాషలాడలేదని అని పేర్కొన్నారు. తాను చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, ఏడేళ్లు పనిచేశానని, తన మీద ఆ మాత్రం నమ్మకం అని ఆవేదన వ్యక్తం చేశారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, తాను ప్రజల మనిషిని అని మరోసారి నిరూపించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వృద్ధ దంపతులను ఎమ్మెల్యే వంశీమోహన్‌ తన కారులో స్వయంగా ఎక్కించి ఆసుపత్రికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. కానూరుకు చెందిన తుమ్మల లక్ష్మీనరసింహ (55), శైలజ (52) దంపతులు తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాలకు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. కేసరపల్లి సమీపంలోని వరుణ్‌ మోటార్స్‌ వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డుపై పడిపోయారు.

vamsi 11092018 2

అదే సమయంలో విజయవాడ నుంచి మంత్రి నక్కా ఆనందబాబును తీసుకుని ముస్తాబాదలో జరిగే కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్యే వంశీ ప్రమాదాన్ని గమనించి వెంటనే మంత్రి కాన్వాయ్‌ను ఆపించారు. మంత్రి సహా కారు దిగి గాయపడిన దంపతుల వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే తన కారులో ఎక్కించి పిన్నమనేని ఆస్పత్రికి పంపారు. వారి వెంట అనుచరులను పంపి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని, ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చెయ్యమని చెప్పారు. తరువాత వారి పరిస్థితి పై ఆరా తీశారు.

పెట్రోల్ ధరలపై యావత్ దేశం భగ్గుమంటోంది. విపక్షాలన్నీ ఏకమై భారత్ బంద్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసనలు మాత్రమే కాదు.. పెట్రోల్ ధరలపై సోషల్ మీడియాలోనూ పంచ్‌లు పేలుతున్నాయి. పెరిగిన ధరలపై సామాన్యులతో పాటూ విపక్ష పార్టీల నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. దీంతో, ఇది కవర్ చెయ్యటానికి, బీజేపీ రంగంలోకి దిగింది. తనకు బాగా వచ్చిన విద్య, సోషల్ మీడియాలో మాయ చెయ్యటం.. ఇదే ఆయుధంగా తీసుకుని, ప్రజలను పిచ్చోల్లని చెయ్యాలని, తనే నవ్వుల పాలు అయ్యింది. బీజేపీ ఆఫిషియల్ ట్విట్టర్ ఎకౌంటులో వేసిన పోస్ట్ చూస్తే, వీళ్ళ ప్రజలను ఎలా బకరాలాను చేస్తున్నారో అర్ధమవుతుంది.

bjp 11092018 2

జేపీ ప్రభుత్వంలోనే పెట్రో ధరలు ‘తగ్గుముఖం’ పట్టాయి.. కావాలంటే చూడండి” అంటూ బీజేపీ ఒక పోస్ట్ పెట్టింది.గత పధ్నాలుగేళ్లలో దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల ఈ విధంగా వుంది.. అంటూ వివరిస్తూ, మోడీ హయంలో మాత్రం తగ్గినట్టు చూపించింది. 2004 మే 16న ఢిల్లీలో రూ. 33 వున్న లీటర్ పెట్రోల్ రిటైల్ ధర.. ఐదేళ్ల తర్వాత అంటే.. 2009 మే 16న రూ. 40కి పెరిగింది. ఇది 20 శాతం పెరుగుదల. కానీ.. అదే 40 రూపాయల ధర ఆదే మన్మోహన్ సర్కార్లో మరో ఐదేళ్ల తర్వాత ఏకంగా 75 శాతం పెరిగి రూ. 71 లకు చేరింది. మోదీ అధికారంలోకొచ్చాక ఈ రూ. 71 ధర 80 రూపాయల 73 పైసలకు చేరింది. ఈ పెరుగుదల కేవలం 13 శాతం మాత్రమే. ఇప్పుడు చెప్పండి.. మోదీ హయాంలో పెట్రోల్ ధరల దూకుడుకు కళ్లెం పడిందా లేదా? అంటూ ప్రశ్నిస్తూ, ప్రజలను పిచ్చోళ్లని చేసింది.

bjp 11092018 3

అంతకు ముందు, పెట్రోల్ ధరలపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రమ్య తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి టెస్టులో సాధించిన అత్యధిక స్కోరు కంటే పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు ఇవాళ భారత్ బంద్ చేపట్టిన నేపథ్యంలో ఆమె ట్విటర్లో స్పందిస్తూ... ‘‘86 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అత్యధిక స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే రూ.87కు దూసుకెళ్లిన పెట్రోల్ అంతకంటే టాప్‌లో కొనసాగుతోంది...’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read