గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దనరావు అంటే తెలియని వారు ఉండరు. ఆయాన పార్టీ పెట్టిన మొదటి నుంచి, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరు ఉంది. గతంలో నియోజకవర్గంలో వంశీతో కొన్ని ఇబ్బందులు వచ్చినా, వంశీకి టికెట్ ఇవ్వటం, వంశీ గెలవటంతో, అప్పటి నుంచి వంశీకి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వివాదాలు జోలికి పోకుండా, ఆయన పని ఆయన చేసుకుంటూ, పార్టీలో ఎంతో గౌరవం ఉన్న నేత. అయితే, ఆయాన తాజాగా చేసిన పనితో, ఇటు కార్యకర్తలే కాదు, ఇటు అధిష్టానం కూడా ఆశ్చర్యపోయింది. చంద్రబాబు పిలిపించి, దాసరిని మందలించే దాకా వెళ్ళింది. అసలు వివాదానికి కారణం, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దనరావు, వైసిపీ నాయకుడి సపోర్ట్ తీసుకోవటం.

dasari 07092018 2

విజయ డెయిరీలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల పదవులకు పోటీ తీవ్రంగా ఉండటంతో చంద్రబాబు స్వయంగా జిల్లా నేతలతో మాట్లాడి ఎంపిక చేశారు. దాసరి బాలవర్దనరావుకు కూడా ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారు. అయితే, ఎమ్మల్యే వంశీ ముందు దీనికి అంగీకరించకపోయినా, చంద్రబాబు చెప్పటంతో ఒప్పుకున్నారు. నామినేషన్‌ వెయ్యటానికి, వంశీని కూడా వెళ్ళమన్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం నామినేషన్‌ వేసిన దాసరి తనకు మద్దతుదారుగా వైసీపీకి చెందిన సొసైటీ అధ్యక్షుడితో నామినేషన్‌ ఫాంపై సంతకాలు చేయించడం పార్టీలో కలకలం రేపింది.

dasari 07092018 3

ఈ విషయం పై, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసారు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో శుక్రవారం ఉదయం అందరిని పిలిపించారు. బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే వంశీమోహన్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి, గన్నవరం పార్టీ నాయకులతో ముందుగా పార్టీ కార్యదర్శి తొండెపు దశరథ జనార్దన్‌ మాట్లాడారు. తరువాత జరిగిన విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు వారిని తన రూంలోకి పిలిపించి దాసరిపై ఫైర్‌ అయ్యారు. డైరెక్టర్‌ పదవికి మీకు వైసీపీ సహకారం కావలసి వచ్చిందా? వారితో సంతకాలు చేయించడం ఏమిటి? ఇదేం పద్ధతని గట్టిగా ప్రశ్నించారు. మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు కదా గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదా అని నిలదీశారు. సీనియర్‌ నేత అయిన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగారు. దాసరి కూడా దీనికి సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో ఇక నుంచి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారు.

దివంగ‌త ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై, సీనియ‌ర్ నేత‌,రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడలేదని, తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. వైఎస్‌ మనీ టేకింగ్ చేశారన్నారు. కానీ మనీ మేకింగ్ చేయలేదని చెప్పారు. రెండు రోజుల కిందట.. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి.. అమరావతి బాండ్ల పై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.

cbn 07092018 2

రాజా ఆఫ్ కరెప్షన్ బుక్ పై కుటుంబరావు చేసిన బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ టీడీపీ ప్రతినిధిగా మారారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పై ఈర్ష్య ఉంటే తాను ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తానని వెల్లడించారు. మరిన్ని వాస్తవాలు బయటపెడతానని ఉండవల్లి స్పష్టం చేశారు. కాని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్.. టీడీపీ కన్నా… వైసీపీనే ఎక్కువ కలవర పెడుతోంది. వైఎస్ అవినీతి చేశాడని ఆయన చెప్పడం వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

cbn 07092018 3

వైఎస్ అవినీతి చేశాడని ముందు స్టేట్‌మెంట్ ఇచ్చేసి తర్వాత ఎంత సమర్థించుకున్నా అది ప్రజల్లోకి వెళ్లదు. ఆయన అవినీతి ఆరోపణే ప్రజల్లోకి బాగా వెళుతుందని వైసీపీ వర్గాలలో చర్చనీయంసం అయ్యింది. అదే సమయంలో రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని అందులో ఉన్న అంశాల్ని మరోసారి హాట్ టాపిక్ చేసేలా.. బహిరంగచర్చకు సిద్ధమని, ఉండవల్లి అనడం వైసీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. జరిగిపోయిన అవినీతి వ్యవహారాల అంశాలను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రకటనలు ఉండవల్లి ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.ఆఖరిలో మరిన్ని వాస్తవాలతో ముందుకు వస్తాననని ఉండవల్లి అరుణ్ కుమార్ అనటం వైసీపీ వర్గాలను మరింత కంగారు పెడుతోంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో రాష్ట్రీయ లోకదళ్ (ఆర్ఎల్డీ) నాయకుడు అజిత్ సింగ్ గురువారం నాడు కలిశారు. జాతీయ రాజకీయాలపై చంద్రబాబు, అజిత్ సింగ్ ల మధ్య చర్చ జరిగింది. దేశ రాజకీయాల గురించి అజిత్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించారు. అయితే ఈ భేటీ పై అమిత్ షా అరా తీసినట్టు సమాచారం. అమరావతి దాకా వెళ్లి, అజిత్ సింగ్, చంద్రబాబుని కలవాల్సిన అవసరం ఏముంది అంటూ, అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో గత రెండు నెలలుగా చంద్రబాబు ఆక్టివ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 17 పార్టీలను చంద్రబాబు ఏకతాటి పై తెచ్చారు.

ajithsingh 06092018 2

పోయిన వారం కూడా, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. జాతీయ పార్టీలతో మరోసారి భేటీ కావాల్సిన అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది... జాతీయ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్‌లపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరువురు నేతల భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ అమరావతి రావటంతో, మరోసారి చర్చ ప్రారంభం అయ్యింది. రానున్న రోజుల్లో చంద్రబాబు ఎలాంటి పాత్ర, జాతీయ రాజకీయాల్లో పోషిస్తారో చూడాల్సి ఉంది.

ajithsingh 06092018 3

మరో పక్క, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి పచ్చజెండా ఊపారు. ఈ నెల 14 నుంచి ఆన్ లైన్‌లో యువనేస్తం కార్యక్రమం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో అక్టోబర్ రెండో తేదీ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీపీఎస్‌ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కు 151 జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30వేల మందికి నెలసరి జీతం వేయి నుంచి రెండు వేల రూపాయలు పెరగనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాకున్నా కేసీఆర్ తనను విమర్శించడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నడుస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో, చంద్రబాబు, మంత్రులు, కొందరు పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేయడం, ఆ సందర్బంగా జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ పై విరుచుకుపడటం పై ఆయన చర్చించారు.

cbn 07092018 3

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అయితే, తననుతిట్టడం ఏంటని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఒక అవగాహనకు వచ్చారని తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నట్లు చెప్పారు. ‘‘అసెంబ్లీ రద్దుకు ముందు కేసీఆర్‌ రెండు మూడుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. ఆయన వెళ్లి వచ్చిన మరుక్షణం జోనల్‌ వ్యవస్థ పై ఆగమేఘాలపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదంతా టీడీపీని, తనను చెడుగా చూపించి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారని ఈ విషయంలోనూ మోదీ-షాల వ్యూహం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

cbn 07092018 2

అసెంబ్లీ రద్దు పై మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్‌కు కేసీఆర్‌ ఇవ్వగానే వెంటనే అప్పటికప్పుడు దానిని ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమిస్తూ లేఖ కూడా ఇచ్చి పంపారు. జరుగుతన్న పరిణామాలను చూస్తుంటే టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంత కుమ్మక్కయారో తెలుస్తుందని, అందుకనే సమయం, సందర్భం లేకుండా మన పై విరుచుకుపడుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే ఏపీలో జగన్‌, పవన్‌ ఇద్దరూ కూడా మోదీ నడిపిస్తున్న శక్తులే అనే ఆయన అన్నారు.

Advertisements

Latest Articles

Most Read