దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నిన్న, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో సీఆర్డీఏ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం మొదలుకుని సాయంత్రం పొద్దుపోయేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా చేసిన గర్జన సౌండ్ కి, ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది. తర తరాలుగా దేశ గర్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూన్న టాటాల వారసులు, అయిన రతన్ టాటా, చంద్రబాబును ఆప్యాయంగా చేయి పట్టుకొని స్వయంగా తీసుకువెళ్తు, గౌరవంగా బాబు నమస్కరిస్తూ వస్తున్న ఫోటో చూసి, ఢిల్లీలో చాలా మందికి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఈ మధ్య మోడీ గారిని ఎవరూ అడగకపోయినా, తడుముకొంటూ, “కార్పోరేట్ అధినేతల ప్రక్కన నిలుచోడానికి మాకు భయంలేదు, చీకట్లో కలిసి వాళ్లకు కావాల్సింది చేసి, భయపడము” అని అన్నారు.
ఆ మాటలు ప్రధాని ఎందుకు అన్నారో కాని, అమరావతి బాండ్ లు బాంబే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసే సమయంలో, బాబు ఆ బుల్ కొమ్ములను వంచుతున్నట్టు సరదాగా దిగిన ఫోటో చూసి, మనకి ఏమన్నా సంకేతాలు ఇస్తున్నాడా అనేలా ఢిల్లీ వర్గాలు కంగారు పడేలా సాగింది చంద్రబాబు పర్యటన. చంద్రబాబు సింహ గర్జన చూస్తే, హిట్ సినిమాల్లో హీరో ఫ్లాష్ బ్యాగ్ లు గుర్తుకువస్తున్నాయి. ఆయన ముంబైలో అడుగు పెట్టిన దగ్గర నుంచి, కార్పొరేట్ ప్రపంచం ఆయనకు ఇచ్చిన మర్యాద చూస్తుంటే, ఇది జస్ట్ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు దగ్గర ఆగేలా లేదు, ఇంకా వేరే సంకేతాలు కూడా ఢిల్లీ వర్గాలకు వెళ్ళాయి. ఆ రీసౌండ్ మాములుగా లేదు అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
బంతిని వేసి నేలకేసి కొట్టాం అనుకుంటారు. కాని ఆ బంతి, తిరిగి ఎంత వేగంగా పైకి వెళ్తుందో తరువాత తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు ప్రాక్టికల్ గా కనపడుతుంది. అమరావతి అని, అభివృద్ధి అని, ఆయన పిచ్చలో ఆయన ఉన్నారు. ఆయనకు సహకరిస్తే, అయిపోయే దానికి, ఎదురు తిరిగి, ఇంత వరకు తెచ్చుకున్నారు. 85 మంది అగ్ర పారిశ్రామిక వేత్తలతో మీటింగ్ పెట్టారు. అదీ ఒక్క రోజులోనే. రిలయన్స్ గ్రూప్ అధినేత, టాటా గ్రూప్ చైర్మన్, గోద్రేజ్ గ్రూప్ చైర్మన్, మహేంద్ర గ్రూప్, ఆదిత్య గ్రూప్ చైర్మన్, రహేజా గ్రూప్ అధ్యక్షుడు, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, ఇలా అనేక మంది దిగ్గజాలను కలిసారు. ఇలా కార్పొరేట్ ప్రపంచం మొత్తం, ఒక సియం ముందు వాలింది అంటే, ఇది ఆషామాషీగా, సాదాసీదాగా జరిగిన వ్యవహారం కాదు. ఢిల్లీ వర్గాలకు, నిన్న జరిగింది ఏంటో బాగా తెలుసు.