ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పలు సమావేశాలలో ప్రసంగించిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మాత్యులు అమరనాథరెడ్డి గారు దాన్ని నిజమని నిరూపించారు. ఆ మేరకు శనివారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా శ్రమించడంతో పాటు, గత వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రికి ఇన్ఫెక్షన్ కారణంగా కారబంకుల్ (carbuncle)కు గురి అయ్యారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి, తన స్వస్థలమైన పలమనేరు చేరుకుని ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

amar 26082018 2

దీంతో అక్కడి వైద్యులు, సిబ్బంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు మంత్రి నిర్ణయం పట్ల హర్షం వెల్లబుచ్చారు. ప్రభుత్వాసుపత్రుల వైపు కన్నెత్తయినా చూడని ఎంతో మందికి మంత్రి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మంత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాసుపత్రులలో వైద్య సేవలను వినియోగించుకోవాలని సిబ్బంది కోరారు. నేడు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడంతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు ఇక్కడ పని చేయడం మెరుగైన సేవలను అందించడం జరుగుతుందని, కాబట్టి ప్రభుత్వాస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి మంత్రి ముందుకు రావడాన్ని అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు.

amar 26082018 3

ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకాన్ని కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపాలని ఆస్పత్రి వైద్యులు పిలుపునిచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో మంత్రి శస్త్ర చికిత్స చేసుకుంటున్నారన్న సమాచారం పట్టణంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు సైతం మంత్రి నిర్ణయాన్ని కొనియాడారు. ఆయన వెంట మంత్రి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి గారు,పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి గారు, ఆస్పత్రి సూపరింటిండెంట్ వీణా కుమారి,వైద్యులు హరగోపాల్, శారదా మరియూ సిబ్బంది ఉన్నారు.

గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్నో దారుణాలు చూస్తూ ఉంటాం. పేద ప్రజలను పీక్కు తింటూ, వారిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే, రాను రాను ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇలాంటివి దాదపుగా తగ్గిపోయి, ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం ఏర్పడేలా చేసాయి. కొన్ని అజాగ్రత్తగా ఉన్న సంఘటనలు మినిహా, ఇలా ప్రజలు దగ్గర డబ్బులు గుంజటం అనేది తగ్గిపోయింది. కాని, ఈ రోజు జరిగిన సంఘటన చూసిన తరువాత, ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే బాధ కలగక మానదు. పేదలను పీక్కుతింటున్న ఇలాంటి వారు ఉన్నంత కాలం, ఇలాగే ఉంటుంది.

vij 26082018 2

తాజగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన సంఘటన మానవత్వం ఎలా మంటగలిసిందో చెప్పే సంఘటన ఇది. ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసినందుకు ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు వైద్యులు. శివప్రాసాద్ అనే ఆటోడ్రైవర్ గత శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన శివప్రసాద్ నిన్న మృతి చెందాడు. ఐదు వేలు ఇస్తేనే పోస్టుమార్టం సక్రమంగా చేస్తామని డాక్టర్ తేల్చిచెప్పారు. ఆయన దీనికి చెప్పిన కారణం తెలిస్తే, ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు అనిపిస్తుంది. ఇలాంటి అసంఘిటిత కార్మికులకు, చంద్రన్న భీమా ఇస్తున్న సంగతి తెలిసిందే.

vij 26082018 3

దీన్నే సాకుగా చూపాడు ఆ డాక్టర్.. చంద్రన్న భీమాతో ఐదు లక్షల రూపాయలు మీకు వస్తున్నప్పుడు, మాకు ఐదు వేలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తారని డాక్టరే ప్రశ్నించారు. దాంతో అసలుకే మనిషి పోయి బాధలో ఉన్న బంధువులు, డబ్బులకి పీక్కుతింటు ఉండటంతో, వారికి ఏమి చెయ్యాలో తెలియక, స్థానిక ఎమ్మెల్యే బొండా వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో స్వయంగా ఎమ్మెల్యే బొండా ఉమ, ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చి సిబ్బందిని మందలించడంతో శవాన్ని పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఆ డాక్టర్ పై చర్య తీసుకునే విధంగా, సియంకు ఫిర్యాదు చేస్తానని, ఎమ్మల్యే చెప్పారు.

ఆర్ధిక రాజధాని ముంబైలోని బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ ఈ) లో నిర్వహించే అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ (ఆదివారం) రాత్రి ముంబై కి చేరుకుంటారు. 27న(సోమవారం) ఉదయం 9 గంటలకు బీఎస్ఈ కి వెళ్తారు. అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం అనంతరం.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముంబై నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సాగబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

mumbai 26082018 2

ముఖ్యంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, ప్రస్తుత ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఆయన పలువురు కీలక వ్యాపారవేత్తలను కలుసుకోనున్నారు. అనంతరం రిలయన్స్ ఇండస్డ్రీస్ అధినే ముఖేష్ అంబానీ, రిలయన్స్ సీఈవో పీఎంఎస్ ప్రసాద్ లతో భేటీ కానున్నారు. ఆతర్వాత గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఎండీ నడియార్ గోద్రేజ్ తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం మహేంద్ర వరల్డ్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ సీవోవో సంజయ్ శ్రీవాత్సవతో సీఎం భేటీ కానున్నారు. ఆ తర్వాత స్క్వేర్ గ్రూప్ ఛైర్మన్ బాలన్ తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.

mumbai 26082018 3

అనంతరం ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళంలో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ తర్వాత వెల్సపన్ గ్రూప్ ఛైర్మన్ బీ. కే గోయింకా తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం పిరామిల్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆ తర్వాత లోథా గ్రూప్ ఛైర్మన్ మంగళ ప్రభాత్ లోధాతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్, సెయింట్ గోబెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రహేజా గ్రూప్, టాటా ఇంటర్నేషనల్, హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రేపు రాత్రి ముఖ్యమంత్రి తిరిగి విజయవాడ చేరుకుంటారు.

గత శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి సోయగాలకు నిలువుటద్దంగా నిలుస్తున్న కేరళ రాష్ట్రాన్ని, ఉన్నపళంగా వరదలు బీభత్సం సృష్టించిన, నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం, సామాజిక స్పృహ కలిగిన పౌరులు చూపించిన విజ్ఞత, అందించిన సౌజన్యానికి కేరళ రాష్ట్ర ప్రజలు వివిధ సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వందలాది మంది ఈ వరద బీభత్సానికి మృతి చెందగా, వేల సంఖ్యలో నిరాశ్రయులు కాగా, సుమారు 25వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిన పరిస్థితుల్లో యావత్ ప్రపంచం కదిలి వచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ఆర్థిక, హార్థిక సహాయంతో పాటు ఉన్నతాధికారులసైతం, సామాన్య పౌరుడిగా వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై చిత్తశుద్ధితో తమ వంతు సహకారం పట్ల అక్కడి ప్రజలు తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

kerala 26082018 2

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉన్నతాధికారులు కేరళ రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపి మన రాష్ట్రం పక్షానే ఎంపిక చేసి, శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ సహాయ సహకార కార్యక్రమలను నిర్వహిస్తున్న తీరు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశ విదేశాల్లోని భారతీయులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో వరదలు సంభవించిన తరుణంలోనే రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర వరదలు కారణంగా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ కేరళ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితికి చలించిన రాష్ట్రప్రభుత్వం, స్వచ్ఛందసేవా సంస్థలు కలిపి ఇప్పటికే 2 వేల మెట్రిక్ టన్నుల బియాన్ని కేరళకు పంపిణీ చేయడం అక్కడి ప్రజానీకాన్ని విశేషంగా కదిలించింది. ఈ తీవ్ర వరద బీభత్సం కారణంగా ఆ రాష్ట్రంలో నేలకు ఒరిగిన కరెంటు స్తంబాలు, ట్రాన్స్ ఫార్మర్లను శీఘ్రగతిన పునరుద్దరించడంలో మన రాష్ట్ర విద్యుత్శాఖ సిబ్బంది చూపిస్తున్న సేవా భావం పట్ల అక్కడి ప్రజల్లో అత్యంత విశ్వాసం ఏర్పడింది.

kerala 26082018 3

రాష్ట్ర ప్రభుత్వం నగదు రూపంలో ఆ రాష్ట్రానికి రూ.10 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వంతు సహకారాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రాష్ట్రానికి అందజేశారు. ప్రభుత్వం అందించిన వస్తు సహకారంతో పాటు వివిధ స్వచ్చంద సేవా సంస్థలు, ఎన్జీవోలు, రోటరీ క్లబ్బుల ప్రతినిధులు విరాళాల రూపంలో సేకరించిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నమూనాగా దర్శన మిచ్చింది. ప్రభుత్వ వర్గాల ద్వారా గాని, లేదా ఇతర మాధ్యమాల ద్వారా గాని ఇప్పటి వరకూ మన రాష్ట్రం నుండి కేరళకు ధన, వస్తురూపేణ అందిన వివరాలను విశ్లేషిస్తే.. గత రెండు మూడు రోజుల్లో 105 లారీలలో 2025 మెట్రిక్ టన్నుల బియ్యం కేరళకు చేరింది.

kerala 26082018 4

ఇక విద్యుత్ పునరుద్దరణకు వస్తే.. తీరుపతి ఎస్పీడీసీఎల్ కేంద్రం నుండి సుమారు 120 మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది కేరళ రాష్ట్రానికి చేరుకొని అక్కడి భారీ వర్షాలకు ఛిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తూ.. వరద బాధితులకు అంధకారంలో వెలుగులు చూపించిన మార్గదర్శకులుగా మారారు. అయితే పూడ్చుకోలేని నష్టంలో కూరుకుపోయి వరద బీభత్సానికి కుటుంబాలకు కుటుంబాలు ఛిన్నాభిన్నమైన పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ నుండి ఆ రాష్ట్రానికి అందుతున్న నిత్యావసర వస్తువులు కొంత మంది వరద బాధితులకైనా అక్కరకు వస్తున్నాయన్న సంతోషం కేరళ ప్రజానీకంలో వెల్లువిరుస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కేరళ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు చేస్తున్న సందేశాలు ఇక్కడి వారికి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read