మునుపెన్న‌డూ చూడ‌ని ఓ సుంద‌ర‌మైన రైల్వే స్టేష‌న్ చూడాలంటే ఇక మంగ‌ళ‌గిరి రావాల్సిందే రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతానికి అతి స‌మీపంలో ఉన్న రైల్వేస్టేష‌న్ ఇప్పుడు ప‌ర్యాట‌క కేంద్రంగా మారింది. రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణా తీర్చిదిద్ద‌టంలో ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోని రాష్ట్ర ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ మంగ‌ళ‌గిరి రైల్వేస్టేష‌న్‌ను సైతం అదే కోణంలో చూసింది. ఫ‌లితంగా స్టేష‌న్ రూపురేఖ‌లు మారిపోయాయి. క‌నువిందు క‌లిగించే పెయింటింగ్స్ ఇప్ప‌డు ద‌ర్శ‌నమిస్తున్నాయి. స్టేష‌న్ ప్రాంగ‌ణంలో ప్ర‌యాణీకులు ఎక్క‌డ కూర్చున్నా, ఓ సుంద‌ర‌మైన క‌ళంకారీ చిత్రం క‌నువిందు చేస్తుంది. మ‌న‌స్సును ఆహ్ల‌దప‌రుస్తూ సాంప్ర‌దాయ‌త‌కు పెద్ద‌పీట వేస్తూ ప్ర‌తి గోడ‌ను ఒక ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణగా తీర్చిదిద్దుతూ చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం వెనుక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ కృషి ఎంతో ఉంది.

mangalgiri 28082018 2

కేంద్ర ప్ర‌భుత్వ నేతృత్వంలోని రైల్వేస్టేష‌న్‌ను సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని భావించ‌టం ఒక ఎత్తైతే అందుకు అనుగుణంగా అనుమ‌తులు పొంద‌టం మ‌రో పెద్ద క‌స‌ర‌త్తే. ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి సూచ‌న‌ల మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క సాధికార సంస్ధ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి హిమాన్షు శుక్లా స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప్ర‌త్యేకించి అమ‌రావ‌తి ప్రాంతం ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను రైల్వే శాఖ‌కు వివ‌రించి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు పొందారు. స్వ‌యంగా ప‌లుమార్లు రైల్వేస్టేష‌న్‌ను సంద‌ర్శించిన అధికారులు ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం స్టేష‌న్‌లో క‌ళాకృతులు ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

mangalgiri 28082018 3

ఫ‌లితంగా మంగ‌ళ‌గిరి రైల్వేస్టేష‌న్ నుండి రాక‌పోక‌లు సాగించే ప్ర‌యాణీకులు ఇప్ప‌డు ప్ర‌త్యేక అనుభూతికి లోన‌వుతున్నారు. కేవలం మంగ‌ళ‌గిరి నుండి బ‌య‌లుదేరి అక్క‌డ దిగే ప్ర‌యాణీకులే కాకుండా ఆ మార్గం వెంబ‌డి సాగే రైళ్ల నుండి ఈ స్టేష‌న్‌లో బ‌య‌ట‌కు చూసిన‌ప్ప‌డు ప్ర‌యాణీకులు ఆహా అన‌కమాన‌రు. ఈ నేప‌ధ్యంలో బుధ‌వారం ఈ ప‌ర్యాట‌క ఆక‌ర్షితంగా మారిన మంగ‌ళ‌గిరి రైల్వేస్టేష‌న్‌ను అధికారికంగా ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ ఛైర్మ‌న్ జ‌య‌రామిరెడ్డి, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా, ఉన్న‌త స్దాయి డివిజిన‌ల్ రైల్వే అధికారులు పాల్గొంటార‌ని ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా తెలిపారు. బుధ‌వారం ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా విజయవాడ నగరంలో ప్రయోజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే మూడు కూడళ్లను ఎంపిక చేసుకుని వినూత్న తరహాలో జనచైతన్యానికి తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని, కారు నడిపే వారు- ముందు సీటులో కూర్చునే వారు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకోవాలని సూచిస్తూ మంగ‌ళ‌వారం ఉద‌యం బెంజిసర్కిల్‌ కూడలి వద్ద యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధార‌ణ‌లో ట్రాఫిక్‌ జాగ్రత్తల గురించి వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.

vija traffic 28082018 2

నగరంలో ఉన్న ట్రాఫిక్ కూడళ్ళ వద్ద యమధర్మ రాజు, చిత్ర గుప్తుడు వేషదారణలో ఉన్న వ్యక్తులతో పాటు, 15 అడుగల ఎట్టు కలిగిన వ్యక్తులతో రోడ్ సేఫ్టీ పై అవగాహాన కలిగించారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరగనుంది. హెల్మెట్ లేని వారికి, సీట్ బెల్ట్ పెట్టుకొని వారికి గులాబీ పువ్వుతో పాటు హెల్మెట్‌ కీచైన్‌, కరపత్రం అందిస్తారు. రహదారి భద్రతపై ఎవరు ఎంతగా ప్రయత్నించిన‌ప్ప‌టికీ వాహనదారుల్లో సొంతంగా తమ ఆలోచనల్లో మార్పు తీసుకురావడం వల్లే సత్ఫలితాలు సాధించే వీలుంటుందని ఈ సంద‌ర్భంగా విజయవాడ ట్రాఫిక్‌ ఏసీపీ శివరామిరెడ్డి తెలిపారు.

అంకుర సంస్థల ప్రోత్సాహం, చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అలీబాబా సంస్థ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ లో వినియోగించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవెలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్, అలీబాబా క్లౌడ్ ఇండియా ఎండీ డాక్టర్ అలెక్స్ లీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నివాసం లో ఈ కార్యక్రమం జరిగింది. స్మార్ట్ సిటీల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ లో తమకున్న అనుభవాన్ని మరింత పదును పట్టి, ఆంధ్రప్రదేశ్ లో వినూత్న ఆవిష్కరణలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు అలీబాబా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి కి వివరించారు.

alibaba 28082018 2

వివిధ ప్రభుత్వ శాఖల్లో సాంకేతికతను జోడించి మరింత సులభతరమైన విధానాలు అమలయ్యేలా శిక్షణ కార్యక్రమాలు ఆ సంస్థ చేపట్టనుంది. ఈ వ్యవస్థలో భాగస్వామ్యులైన ప్రభుత్వ శాఖలతో అవగాహన సదస్సు లో పాల్గొన్న ఆ సంస్థ తమ అధికారులను కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి పంపనున్నారు. దేశంలో సుమారు ఆరు వేల కంపెనీలతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పని చేస్తున్న అలీబాబా సంస్థ తమ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ లో మరింత విస్తరించనుంది. ప్రపంచంలో ఎటువంటి సృజనాత్మకమైన విధానం అందుబాటులోకి వచ్చినా, అది ఆంధ్రప్రదేశ్ కు కూడా ఉపయోగపడేలా తాము దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకానొకప్పుడు పాలనా వ్యవహారాల్లో ఇంటర్నెట్ అంటే తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా ఈ ప్రయోగాలు చేసి ప్రజలకు పాలనను మరింత సౌలభ్యంగా ఉండేలా చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు.

alibaba 28082018 3

అభివృద్ధి జరగాలంటే తగు వాతావరణం ఏర్పాటు చేయాలి, ఆధునిక సాంకేతికతను జోడించి భవిష్యత్ కి చక్కటి బాటను వేయాలన్నదే తమ ఆలోచన విధానమని ఆయన తెలిపారు. ఆధార్ లాగే భూధార్ తెచ్చాం.. భూములన్నిటి సమగ్ర సమాచారాన్ని పొందుపరచగలిగాం. సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్ధిక పరిస్థితి, ఆదాయ వ్యయాలను పూర్తి అదుపులోకి తెచ్చుకుని సమర్థ ఆర్థిక నిర్వహణ వ్యవస్థను తేగలిగాం... ఈ-ప్రగతి ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే సాంకేతిక వ్యవస్థ లోకి తెచ్చి సేవలన్నిటిని ప్రజలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి ఉంచే అవకాశం కల్పించాం..రియల్ టైం గవెర్నెన్స్ ద్వారా పాలన ను ప్రజలకు మరింత చెరువులోకి తెచ్చాము..."అని ముఖ్యమంత్రి వివరించారు. ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకోగలిగే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

అమరావతి బాండ్లకు బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్సీఈ) లో అద్వితీయమైన స్పందన వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. ఏపీ సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల విలువ గల బాండ్లు జారీ చేసిన గంట వ్యవధిలోనే బీఎస్సీఈలో మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరినట్లు చెప్పారు. ఆశించిన దానికంటే ఒకటిన్నర రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయిందని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇంత స్పందన వచ్చిందని.. ఇది గొప్ప విజయమని అన్నారు. అమరావతి బాండ్ల విడుదలతో జాతీయ, అంతర్జాతీయ మదుపరుల్లో రాష్ట్ర ఇమేజ్ పెరిగిందని చెప్పారు.

kutumba 28082018 2

ముంబయిలో నిన్న జరిగిన బాండ్ల లిస్టింగ్‌ (బాండ్లను కొనుగోలు చేసిన సంస్థలకు స్టాక్‌ మార్కెట్‌లో ఇతరులకు విక్రయించుకునే వీలు కల్పించడం) కార్యక్రమానికి దేశంలోని వ్యాపార దిగ్గజాలు హాజరైనట్లు తెలిపారు. ముఖేష్ అంబానీ, గోద్రెజ్, కుమార మంగళం బిర్లా, మహేంద్ర గ్రూప్ ప్రతినిధులు, బీకే గోయంకా, రహేజా సంస్థ ప్రతినిధులు తదితరులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరిచారని, విదేశీ పెట్టుబడిదారులు కూడా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు.

kutumba 28082018 3

ఏపీకి కేంద్రం సాయం చేయకపోయినా చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధిని చూసి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఓర్వలేకపోతున్నారని, ఈర్ష్యతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాండ్ల విడుదల వ్యవహారం అంతా పారదర్శకంగా జరిగిందని, ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసినా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కుటుంబరావు తెలిపారు. రుజువు చేయలేని పక్షంలో జీవీఎల్ రాజీనామా చేస్తారా? కనీసం క్షమాపణలైనా చెబుతారా? అని అడిగారు. ఎందుకు ఇలా విషం కక్కుతున్నారో అర్ధం కావడం లేదని, ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారు నష్టపోతారని చెబుతున్నారని, వారు ఎలా నష్టపోతారని కుటుంబరావు ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read