సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, రోడ్డు ప్రమాదంలో మరణించారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను నార్కెట్ పలిలోనే హాస్పిటల్ కు తరలించినా, ఫలితం దక్క లేదు. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా, ఆయన దేహం చికిత్సకు స్పందించలేదు. ఆయన మరణ వార్తా విని, తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు సోక సముద్రంలో మునిగిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్ట వశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆయనే స్వయంగా కార్ నడుపుతున్నట్టు తెలుస్తుంది. AP28BW 2323 కార్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన పరిష్తితి విషమంగా ఉందని, శ్వాస తేసుకొవటానికి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. సంఘటనా స్థలం చూసిన వారు, కార్ అదుపుతప్పి, కార్ బోల్తా పడి, ఆక్సిడెంట్ అయినట్టు చెప్తున్నారు.

ప్రమాదంలో ఆయన కార్ లో నుంచి రోడ్డు పై పడ్డారు. ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదోమో అనే అక్కడి వారు చెప్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారును హరికృష్ణే నడుపుతున్నట్టు సమచారం. హరికృష్ణను హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రమాద సమాచరం తెలిసిన వెంటనే హరికృష్ణ సోదరి పురందేశ్వరి ఆస్పత్రికి బయలుదేరారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జనకిరామ్‌ మృతిచెందారు.

మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి రూ. 5 వేలు లంచం డిమాండ్ చేసిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు డాక్టర్ శ్రీను నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మొన్న జరిగిన ఘటన పై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. 24 గంటలు తిరక్కుండానే లంచం డిమాండ్ చేసిన వైద్యుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు సోమవారం సాయంత్రం ఉత్త ర్వులు విడుదల చేశారు. విజయవాడలోని అయోధ్యనగర్ కు చెందిన ఆటో డ్రైవరు శివప్రసాద్ వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గత శనివారం సాయంత్రం శివప్రసాద్ చనిపోయారు.

vij 28082018 2

ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బి.శ్రీనునాయక్ రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశారు. నిరుపేదలమైన తాము లంచం ఇచ్చుకోలేమని బాధితులు ప్రాధేయపడితే.. చంద్రన్న బీమా పథకం కింద రూ. 5 లక్షలు వస్తుందిగా. అందులో రూ. 5 వేలు మాకివ్వలేరా? అంటూ వైద్యుడు ఎదురు ప్రశ్నించారు. తాను అడిగినంత లంచం ఇవ్వకుంటే మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇస్తానంటూ డాక్టరు బెదిరించడంతో బాధితులు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. ఆయన వెంటనే ఆసుపత్రికి వచ్చి పోస్టుమార్టం విభాగంలో వైద్యుడిని, సిబ్బందిని గట్టిగా మందలించిన తర్వాతగాని శివప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు.

vij 28082018 3

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న ఈ అవినీతి వ్యవహారం పై యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ఘటన పై వీడియో ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోవైపు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబూలాల్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, డాక్టర్ నాంచారయ్య తదితరులు సమగ్ర విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సమక్షంలో చర్చించి లంచం డిమాండ్ చేసిన డాక్టరు శ్రీనునాయక్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే డీఎంఈ సస్పె న్షన్ ఉత్తర్వులను విడుదల చేశారు.

వెలగపూడి సచివాలయంలో, పెద్ద వర్షం పడి జల్లు లోపాలకి కొడితేనో, ఏసి పైప్ లైన్ బ్లాక్ అయ్యి, నీళ్ళు లోపలకి వస్తేనో, హడావిడి హడావిడి చేసేసి, సచివాలయం కూలిపోతుంది అనే బ్యాచ్ ని చూస్తున్నాం. 6 బ్లాకుల అతి పెద్ద సచివాలయంలో, ఒక రూమ్ లో చిన్న సమస్య వస్తేనే, అమరావతిని ఎగతాళి చేసే బీజేపీ నేతలు, వారు అధికారం ఉన్న రాష్ట్రంలో, ముచ్చటపడి కట్టుకున్న కొత్త ఎయిర్ పోర్ట్ లో, వర్షానికి జలపాతం వచ్చింది. అసోంలోని గువహటి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా వేసిన రూఫ్‌ నుంచే నీళ్లు కురుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

airport 28082018 2

దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షం పడడంతో విమానాశ్రయ రూఫ్‌ నుంచి నీళ్లు ఏకంగా షవర్‌ నుంచి వస్తున్నట్లుగా కిందకు పడుతున్నాయి. సీలింగ్‌లోని ఏసీ వెంట్స్‌, లైట్‌ సాకెట్లు, సీలింగ్‌ టైల్స్‌కు మధ్య ఉన్న సందుల నుంచి షవర్‌లో నుంచి నీళ్లు పడుతున్నట్లుగా నీళ్లు కిందకు కురిశాయి. దీంతో అక్కడంతా తడిసిపోయి గందరగోళంగా మారింది. సిమెంట్‌ స్లాబ్‌ నుంచి ఇంత ఎక్కువగా నీళ్లు కారుతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

airport 28082018 3

విమానాశ్రయంలోని ప్యాసింజర్‌ లాంజ్‌ను ఇటీవలే కొంత పొడిగించారు. బ్యాగేజీ చెకింగ్‌ ప్రాంతంలో రూఫ్‌ నుంచి కారిన నీళ్లు ఇలా సీలింగ్‌ నుంచి కురవడంతో ప్రయాణికులు వీడియోలు తీశారు. చాలా మంది పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్‌ సిన్హా, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో ఈ వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరారు. ఈ వీడియో రెండ్రోజుల కిందటిదని విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షం వల్ల రూఫ్‌ నుంచి నీళ్లు లీకయ్యాయని, సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారని చెప్పారు. నీళ్లు లీకవ్వడం వల్ల విమానాశ్రయంలోని పరికరాలేమీ పాడవ్వలేదని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read