గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై, నిన్న బీభత్సం సృష్టించిన జీవీఎల్ కారుకి గొప్ప చరిత్రే ఉంది. బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ పేరున రిజిస్టర్‌ అయిన కారు. అందులో జీవీఎల్‌ నరసింహరావు లాంటి నాయకుడు తిరిగే కారు. ఆగుతుందా? సరిగ్గా గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద అదే జరిగింది. జీవీఎల్‌ ఉపయోగిస్తున్న కారు విజయవాడలో అడుగడుగునా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించింది. మరో జిల్లాలో కొన్న ఇన్నోవాను ఏపీ16సీఎస్‌1616 నంబర్‌తో విజయవాడలో రిజిస్టర్‌ చేశారు. విజయవాడ వచ్చినప్పుడల్లా ఎంపీ దీనిని ఉపయోగిస్తున్నారు.

gvl 25082018 2

విజయవాడలోని చుట్టుగుంట, ఈఎస్ఐ ఆస్పత్రి బస్టాప్‌, వెటర్నరీ జంక్షన్‌, సీతారామపురం జంక్షన్‌లలో ఈ కారు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసింది. దీనిపై ఐదు చలానాలు ఉన్నాయి. వాటిలో అతివేగానికి సంబంధించి రెండు ఉన్నాయి. మొత్తం 1275 రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విజయవాడవైపు వెళ్తున్నారు. మంగళగిరి బాలాజీనగర్‌కు చెందిన తెన్నేరు అంజమ్మ(38), తోట శైలజ ఆటోలో కొలనుకొండ సాయిబాబా గుడి వద్ద దిగారు. బంధువు బాబూరావు ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా వస్తున్న వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. శైలజ తీవ్రంగా గాయపడింది.

gvl 25082018 3

యాక్సిడెంట్లు జరగడం సర్వసాధారణం కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారులో ఉన్న వ్యక్తులను, కారు నడిపిన వారిని సంఘటన స్థలం నుంచి పంపటం, లేదా వారు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోవటం సామాన్యుల విషయంలో జరుగుతదా? జరగనే జరగదు కానీ బిజెపి ఎంపి విషయంలో మాత్రం జరుగుతుంది. ఇద్దరు మహిళలను ఢీ కొట్టాడు అందులో ఒక మహిళ తల పగిలి అత్యంత దారుణంగా మరణించింది, తీవ్రంగా గాయపడింది. కానీ మానవత్వం లేని సదరు ఎంపీ సంఘటనా స్థలం నుంచి తనకేమీ పట్టనట్టు పార్టీ ఏర్పాటు చేసిన కారులో వెళ్లిపోయారు. లేచిన దగ్గర్నుంచి నీతులు చెప్పే జీవీఎల్ దీనికేం సమాధానం చెబుతాడు. సవరించిన మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం, ఆక్సిడెంట్ జరిగినప్పుడు గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తీసుకు వెళ్ళటం కానీ, వారికి వైద్య చికిత్స అందించకపోవడం కానీ, ఈ రెండిటిని నేరంగా పరిగణిస్తారు.

కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బెర్లిన్‌లో ఇండియన్ ఓవర్సీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. రాహుల్‌ అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని, దీన్ని తామంత తేలిగ్గా తీసుకోమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఇది ఏపీ ప్రజలకు తాను ఇస్తున్న హామీ అని అన్నారు. అప్పట్లో తెలంగాణా ఇస్తామని మాటిచ్చామని, అన్నట్టుగానే ఇచ్చామని, ఇప్పుడు కూడా హోదా పై మాట ఇస్తున్నామని అన్నారు.

rahul 25082018 2

ఈ సందర్భంలోనే, ఏపిలో పరిపాలన గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే, డైరెక్ట్ గా చంద్రబాబు పేరు చెప్పకుండా, మోడీ ఏ విధంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో చెప్పారు, రాహుల్.. బీజేపీ అధికారంలోకి లేని రాష్ట్రాల్లో పాలనను ప్రధాని మోదీ బలహీనపరుస్తున్నారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. ‘‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదేమీ ఆంధ్రప్రదేశ్‌కు అయాచితంగా ఇచ్చే బహుమతి కాదు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు. పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ. నేను దానిని తేలికగా తీసుకోను. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. నేను ప్రత్యేక హోదా ఇస్తానని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

rahul 25082018 3

ప్రధాని మోదీని తాను ఆలింగనం చేసుకున్న అంశంపై అడిగిన ప్రశ్నకు 'నిజాలు కంటే వేగంగా అబద్ధాలు ప్రచారమవుతాయి. మోనీ నిరంతరం నాపైన, ఇతర విపక్ష పార్టీలపై దాడి చేస్తూనే ఉన్నారు. నన్ను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మీరు చెప్పండి, నేను కౌగిలించుకున్న అంశం కంటే అవి వేగంగా ప్రచారంలోకి వచ్చాయా? అభిమానం అనేది చాలా శక్తివంతమైన విషయం. అలాంటి అనుభూతి చెందిన వాళ్లకు మాత్రమే ఆ చర్యలోని అర్ధం అవగతమవుతుంది. వాళ్లలో నైరాశ్యం ఎక్కువైంది. అందుకే అలా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్లకు మేం అధికారంలోకి రాగనే సహాయపడతాం' అని రాహుల్ పేర్కొన్నారు. జర్మనీలో రెండురోజుల పర్యటన జరుపుతున్న రాహుల్ అక్కడ్నించి యూకే వెళ్తున్నారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ విద్యార్థులతోనూ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌తోనూ ఆయన సమావేశమవుతాయి.

కేరళ వరద బాధితులకు రాష్ట్రం నుంచి అందిస్తున్న సహాయంలో భాగంగా గుంటూరు జిల్లా వాసులు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన 10వేల కిట్లను శుక్రవారం ఉదయం ఆ రాష్ట్రానికి పంపారు. ఈ కిట్ల లోడుతో వెళుతున్న లారీల‌కు సచివాలయం 1వ బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా దాతలను, కలెక్టర్ కోన శశిధర్‌ని, సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు అభినందించారు. ఒక కుటుంబానికి కావలసిన ముఖ్యమైన 30 వస్తువులను మూత ఉన్న బక్కెట్‌లో ఉంచి కిట్‌గా తయారుచేశారు.

kreala 24082018 3

ఈ కిట్ల మొత్తం విలువ రూ.1.5 కోట్లని, ఒక్కో కిట్ ఖరీదు రూ.1400 అని అధికారులు చెప్పారు. ఈ బక్కెట్లలో చీర, టవల్, లుంగీ, నైటీ, పళ్లెం, గ్లాస్, గెరిట, కందిపప్పు, పంచదార, ఉప్పు, కాపీ పొడి, సబ్బులు, టూత్ పేస్ట్, బ్రెష్ లు, గొదుమ పిండి, టార్చ్ లైట్, పసుపు, కారం, కొబ్బరి నూనె, కొవ్వొత్తులు, దోమల మందు కాయిల్స్ వంటి వాటిని ఉంచారు. ఇటువంటి పదివేల బక్కెట్లను పది ట్రక్కులలో నింపి కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు పంపుతున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. ఆ జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అక్కడ 4 లక్షల కుటుంబాలు నిరాశ్రయులైనట్లు తెలిపారు. వారికి కావలసినవి ఏమిటో తెలుసుకొని ఈ కిట్లు తయారుచేసినట్లు చెప్పారు.

kreala 24082018 2

సంఘం డైరీ తరపున ఎమ్మెల్యే నరేంద్ర 10,800 లీటర్ల టెట్రా ప్యాకెట్ పాలను అందజేసినట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలలు నిల్వ ఉంటే ఈ పాలను కూడా కేరళ పంపినట్లు తెలిపారు. ఈ కిట్లతో పాటు గుంటూరు జిల్లా ప్రజల తరపున బాధితులకు ‘‘మీరు తొందరగా కోలుకోవాలి’’అని ఒక సందేశం కూడా పంపినట్లు చెప్పారు. ఈ ట్రక్కులు సకాలానికి బాధితులకు చేరే విధంగా రవాణాలో ఎటువంటి ఆటంకాలు కల‌గకుండా పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్ అధికారులను పంపినట్లు వివరించారు. దాతలు ఇంకా సహాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారని, మరోసారి కూడా ఇటువంటి ట్రక్కులు పంపుతామని కలెక్టర్ చెప్పారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒక మహిళ మృతిచెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఎంపీ కారు ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి జీవీఎల్ కారు డివైడర్‌ని ఢీకొట్టింది. అనంతరం కారు అదుపు తప్పి మహిళతో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

gvlaccident 24082018 2

ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారులోనే ఉన్నారు. ప్రమాదం తర్వాత మరో కారులో విజయవాడ వెళ్లారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జీవీఎల్ తీరు పై విమర్శలు వస్తున్నాయి. ఆక్సిడెంట్ పొరపాటున జరిగినా, ఒక పక్క మహిళ చనిపోవటం, మరో పక్క ఇంకో మహిళ తీవ్రంగా గాయపడినా, జీవీఎల్ అలా విదిలి, తాను వేరే కార్ లో వెళ్ళిపోవటంతో అందరూ అవాక్కయ్యారు. ఒక ఎంపీగా ఆయనకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు చేసి, పారిపోయే అలవాటు ఉన్న జీవీఎల్, ఇక్కడ కూడా ఆక్సిడెంట్ చేసి పారిపోయాడని, ఆయనికి, హిట్ అండ్ రన్ బాగా అలవాటు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చనిపోయిన ఆ మహిళకు శ్రద్ధాంజలి

Advertisements

Latest Articles

Most Read