ప్రభుత్వం అయుదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే, ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను, ప్రతి పక్ష పార్టీలు కాష్ చేసుకుంటాయి. కాని మన రాష్ట్రంలో మాత్రం, ఆ ఊసే లేదు. ప్రభుత్వం మీద సహజంగా వచ్చే ఆ కొంత వ్యతిరేకత కూడా వెళ్ళు కాష్ చేసుకోకపోగా, ఈ ప్రతిపక్షాల మీద వచ్చే వ్యతిరేకత ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. ఎన్నికలు దగ్గరపేడే కొద్దీ, పార్టీలు మారటం సహజం. ఎక్కువగా ప్రతిపక్ష పార్టీల్లోకి వెళ్తారు. కాని మన రాష్ట్రంలో రివర్స్. ఎందుకంటే, అక్కడ ఉంది పవన్, జగన్. ఒకతనికి ఏమి తెలియదు, ఇంకో అతను అన్నీ తెలుసు అనుకుంటాడు కాని, ఏమి తెలియదు. ఇద్దరూ సెల్ఫ్ గోల్స్ వేసుకోవతంలో సిద్ధహస్తులు. అందుకే సీనియర్ నేతలు అందరూ, బలంగా ఉన్న తెలుగుదేశం వైపు చూస్తున్నారు.

tdp 24082018 2

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలనూ టిడిపిలో చేర్చుకో వాలనే వ్యూహంతో అధిష్టానం పావులు కదుపు తోంది. టిడిపిలో చేరాలనుకునే నేతలను ముఖ్య మంత్రితో మాట్లాడించేందుకు పార్టీ వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ నేతల రాకను టిడిపి నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్టీ బలోపేతానికి సర్దుకుపోవాలని ఆయా నియోజక వర్గ నేతలకు చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గురువారం ఉండవల్లిలోని సిఎం గ్రీవెన్స్‌హాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శ్రీకా కుళం జిల్లా రాజాం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళి, ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరశింహారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇరువురు నేతల చేరికపై ఆయా నియోజకవర్గాల నేతలతో మాట్లాడి నిర్ణయం చెబు తామని చంద్రబాబు వారితో అన్నట్లు తెలిసింది.

tdp 24082018 3

రాబోవు ఎన్నికల్లో టిక్కెట్‌ విషయంపై ఎటువంటి హామీ వారికి దక్కలేదని విశ్వసనీయ సమాచారం. ఇదే ఉత్తరాంధ్ర నుంచి సబ్బంహరి, రాయలసీమ నుంచి డిఎల్‌ రవీంద్రారెడ్డిలను టిడిపిలోకి తీసుకు రావాలని పార్టీలోని కీలకనేతలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. మాజీ ఎంపి ఉండ వల్లి అరుణ్‌కుమార్‌ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం గా ఉంటానని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాభి వృద్ధికి ఆయన సేవలను ఎలా ఉపయోగించుకోవా లన్న అంశాన్ని టిడిపి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టిడిపిలోకి రావాలనుకునే ఇతర పార్టీల నాయకులతో టచ్‌లో ఉండాలని కూడా ఆయా జిల్లాల సీనియర్‌ నేతలకు అధిష్టానం సంకేతాలిచ్చి నట్లు తెలిసింది.

రాఫెల్ డీల్ వివాదంపై రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాఫెల్ కుంభకోణాన్ని రిలయన్స్‌కు ముడిపెడుతూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు అనిల్ అంబానీ ఇటీవల లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ సునీల్ జఖార్ ఇవాళ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘రాఫెల్ డీల్‌పై ఆరోపణలు మానుకోవాలని రిలయన్స్ గ్రూప్ నుంచి నాకు లీగల్ నోటీసులు అందాయి. మిస్టర్ అనిల్ అంబానీ... నేను మళ్లీ చెబుతున్నాను... లోక్‌సభలో చెప్పినట్టు మీకంటే బాగా విమానాలు తయారుచేయగల నైపుణ్యం నాకుంది..’’ అని పేర్కొన్నారు. పేపర్‌తో చేసిన ఓ విమానం నమూనాను ఊపుతున్నట్టు ఓ ఫోటో కూడా జతచేశారు.

anil 24082018 2


‘‘నేను ఇంకా మంచి విమానాన్ని తయారుచేయగలను’’ అంటూ జఖార్ ఇటీవల పార్లమెంటులో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విమానం బొమ్మ పట్టుకొని లోక్‌సభ వెల్‌లోకి వెళ్లిన ఆయన.. రాఫెల్‌ కాంట్రాక్టు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాఫెల్‌ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ (రిలయన్స్ డిఫెన్స్)కు, తనకు ఆ రంగంలో అనుభవం సమానంగానే ఉందంటూ ఎద్దేవా చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్న తీరును తప్పుపడుతూ అనిల్ అంబానీ ఈ మధ్యే కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

 

anil 24082018 3

అయితే తాజగా, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ఆరోపణలు సరికాదు అంటూ, కాంగ్రెస్ నేతలకు రిలయన్స్ నోటీసులు పంపించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కు ఈ నోటీసులు జారీచేశాయి. ఆయనతో పాటుగా ఇతర కాంగ్రెస్ ప్రతినిధులైన రణ్ దీప్ సూర్జేవాలా - అశోక్ చవాన్ - సంజయ్ నిరుపమ్ - అనుగ్రహ్ నారాయణ్ సింగ్ - ఊమన్ చాందీ - శక్తిసిన్హ్ గోహిల్ - అభిషేక్ మను సింఘ్వి - సునీల్ కుమార్ జఖార్ - ప్రియాంకా చతుర్వేదిల పేర్లను కూడా ఈ నోటీసుల్లో చేర్చింది. వీళ్లంతా రిలయన్స్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ నోటీసుల్లో పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల తో పాటు శాసనసభ ఎన్నికలను నిర్వహించే అవకాశమే లేదని కేంద్ర ఎన్నికల సంఘం మరో సారి స్పష్టం చేసింది. రాజ్యాంగ సవరణ లేకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓపి రావత్‌ గురువారం వెల్లడించారు. జమిలి ఎన్నికల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు రావత్‌ పైవిధంగా స్పందించారు. భాజపా సారథి అమిత్‌ షా ఈనెల మొదటి వారంలో, ఒక దేశం…ఒకే ఎన్నిక వుండాలన్న ప్రధాని నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయకమిషన్‌కు లేఖ రాసిన విషయం విధితమే.

election commission 24082018 2

జమిలి ఎన్నికలకు ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలను ఆపాదిస్తున్నాయని ఆయన తన ఎనిమిది పేజీల లేఖలో పేర్కొన్నారు. న్యాయపరంగా చర్యలు చేపట్టి చట్టం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని, లోక్‌ సభ ఎన్నికలు నిర్వహించాలంటే 14 నెలల ముందుగానే తాము చర్యలు చేపట్టాల్సి వుంటుందని ఎన్నికల కమిషనర్‌ రావత్‌ తెలిపారు. ఎన్నికల సంఘానికి కేవలం 400 మంది సిబ్బంది మాత్రమే వన్నారని, ఎన్నికల నిర్వహణకు 1.11 కోట్ల మందిని నియమించాల్సి వుంటుందని ఆయన వివరించారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమయం, ఎన్నికల వ్యయం ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తున్నదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు.

election commission 24082018 3

వచ్చే ఏడాది లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను రెండు దశలలో నిర్వహించాల్సిందిగా న్యాయశాఖ నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలావుండగా, జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, వీటిని నిర్వ హించాలనుకోవడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, డిఎంకె, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, జెడి(ఎస్‌) పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఇంకొక అడుగు ముందుకు వేసి, లోక్‌సభను రద్దు చేసి రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలతో పాటు నిర్వహించాలని సవాలు విసిరింది. ఒక దేశం…ఒకే ఎన్నిక విధానం సరైందేకానీ, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదని భాజపా మిత్రపక్ష నేత నితీష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ నిలదీశారు. కేంద్రప్రభుత్వ పీడీ ఎకౌంట్‌లపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును జవహర్ ప్రశ్నించారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ముందుగా కేంద్రంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ నిర్వహించకుండా రాష్ట్రాలపై విచారణ కోరడం అనైతికమన్నారు.

gvl 24082018 2

పీడీ ఎకౌంట్‌లు అధికంగా ఉండే రాజస్థాన్, మహారాష్టల్రోని బీజేపీ ప్రభుత్వాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదంటూ నిలదీశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి ఆరోపణలపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ధమ్ము, ధైర్యం ఉంటే ముందుగా కేంద్రప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ స్వీకరించాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టం హామీల అమలుకోసం రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న ధర్మపోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే జీవీఎల్ ద్వారా మోదీ ప్రభుత్వం కల్పిత ఆరోపణలతో రాష్ట్రప్రభుత్వంపై దాడి చేయిస్తుందంటూ విమర్శించారు.

gvl 24082018 3

తన లాలూచీ మిత్రపక్షాన వైసీపీ, జనసేన ద్వారా తమ స్క్రిప్ట్‌తో రాష్ట్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కృషి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, రాజధాని అభివృద్ధిని కుంటుపర్చేందుకు మాయలేడి లాగా జీవీఎల్ నరసింహారావు వారానికి ఒకసారి రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై బండలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఏపీలో అడ్రస్‌ లేని జీవీఎల్‌ నరసింహారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మరో మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read