ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ, జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. 1. ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం) - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, 2. సీదిరి అప్పలరాజు(పలాస) - మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ, 3. బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి) - విద్యా శాఖ, 4. పీడిక రాజన్నదొర(సాలూరు) - గిరిజన సంక్షేమం, 5. గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి) - పరిశ్రమల శాఖ, 6. బూడి ముత్యాలనాయుడు(మాడుగుల) - పంచాయతీరాజ్, 7. దాడిశెట్టి రాజా(తుని) రోడ్లు, భవనాలు, 8. పినిపే విశ్వరూప్(అమలాపురం) - రవాణా , 9. కారుమూరి వెంకట నాగేశ్వరావు(తణుకు) - పౌర సరఫరాల శాఖ, 10. తానేటి వనిత(కొవ్వూరు) - హోం శాఖ, 11. కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగుడెం) - దేవాదాయ శాఖ, 12. జోగి రమేష్(పెడన) - గృహ నిర్మాణం, 13. అంబటి రాంబాబు(సత్తెనపల్లి) - నీటి పారుదల శాఖ, 14. మేరుగ నాగార్జున(వేమూరు) - సాంఘిక సంక్షేమ శాఖ , 15. విడుదల రజిని(చిలకలూరిపేట) - వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, 16. కాకాణిగోవర్ధన్ రెడ్డి(సర్వేపల్లి) - వ్యవసాయం, సహకార శాఖ, 17. అంజాద్ బాషా(కడప) - మైనార్టీ సంక్షేమం.

ministers 11042022 2

18. బుగ్గనరాజేంద్రనాథ్రెకడ్డి(డోన్) - ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు, 19. గుమ్మనూరు జయరాం(ఆలూరు) - కార్మిక శాఖ, 20. పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి(పుంగనూరు) - విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ, 21. రాయణస్వామి (గంగాధరనెల్లూరు) - ఎక్సైజ్ , 22. ఆర్కే రోజా(నగిరి) - టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ, 23. ఉషా శ్రీ చరణ్(కళ్యాణదుర్గం) - స్త్రీ, శిశు సంక్షేమం, 24. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(రామచంద్రాపురం) - బీసీ సంక్షేమం, సమాచార, సినిమాటోగ్రఫీ , 25. ఆదిమూలపు సురేష్ - మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్‌మెంట్, గతంలో లాగే ఏపీ కేబినెట్‍లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. డిప్యూటీ సీఎంలుగా పి.రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, అంజాద్ బాషా ఉండనున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది, సీనియర్ మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డికి గతంలో పెద్ద శాఖలు ఉండేవి. గతంలో బొత్సాకు పురపాలక, పట్టణాభివృధి శాఖ ఉండేది, అది పీకి విద్యా సఖ ఇచ్చారు. పెద్దిరెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉంటే, అది పీకి విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ ఇచ్చారు. ఇక్కడ మరో అంశం, ఇప్పటికే బాలినేని కోపంగా ఉంటే, ఆదిమూలపు సురేష్ కు పురపాలక, పట్టణాభివృధి శాఖ లాంటి పెద్ద పదవి ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కళ తప్పింది. ప్రధానంగా గత క్యాబినెట్ లో ఉన్న అయుదు మంది మంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. ఇందులో ప్రధానంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, వీళ్ళిద్దరూ నిన్నటి నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే గతంలో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా పని చేసిన శ్రీరంగరాజు కానీ, అలాగే జలవనరులు శాఖా మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ, అదే విధంగా వీరితో పాటు, మాజీ డిప్యూటీ సియం ఆళ్ళ నాని కానీ, వీరు అయుదుగురు కూడా, ప్రమాణస్వీకర కార్యక్రమానికి రాలేదు. వీరితో పాటు, అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఎవరు అయితే ఉన్నారో, మంత్రి పదవి ఆశించి, భంగ పడిన వారు అంతా కూడా, ప్రమాణస్వీకర కార్యక్రమానికి రాలేదు. వీరితో పాటుగా, అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి హాజరు కాకపోవటంతో, వైసీపీ శ్రేణులు ఆశ్చర్య పోయాయి. అదే విధంగా, వైసీపీ వర్గాల్లో ఉన్న అసంతృప్తి కూడా, ఈ దెబ్బతో బయట పడింది. ఇక మంత్రిగా పని చేసిన శ్రీరంగరాజు కూడా అసంతృప్తితో, ఆయన ఫాం హౌస్ కి వెళ్లిపోయారని తెలుస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత అనుచరులు ఇప్పటికే నిరసన తెలపి రచ్చ రచ్చ చేస్తున్నారు.

anil 11042022 2

వాళ్ళుకూడా రాజీనామా చేస్తారని వార్తలు రావటం, ఇప్పటికే సుచరిత రాజీనామా చేయటం, బాలినేని మరి కొద్ది సేపట్లో రాజీనామా చేస్తారని చెప్తున్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఎంత మంది వచ్చి బుజ్జగించినా, బాలినేని మాత్రం ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాలేదు. ఇక అనిల్ కుమార్ యాదవ్ కూడా రాకపోవటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. కొడాలి నాని, పేర్ని నాని లాగా, అనిల్ కుమార్ యాదవ్ కూడా విధేయంగా ఉంటారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు రాలేదో అని చర్చ జరుగుతుంది. అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు మాత్రం, ఈ విషయంలో ఏమి చెప్పటం లేదు. ఇక ప్రమాణ స్వీకారానికి వచ్చిన, మాజీ మంత్రులు కూడా ఏదో వచ్చాం అంటే వచ్చాం అనే విధంగా, ముభావంగా కూర్చున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎక్కడా కూడా కళ కనిపించ లేదు. ఈ అగ్రహ జ్వాలలు, నిరసనలు ఎక్కడి వరకు వెళ్తాయో అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అనవసరంగా తేనె తుట్టిని కదిపామా అనే అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో వ్యక్తం అవుతుంది.

బీసీ... బీసీ.. బీసి... నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడుతున్న పాట ఇది. ఇదో సామాజిక విప్లవ కార్యక్రమం అంటూ, డబ్బాలో గులక రాళ్ళు వేసి వాయిస్తున్నారు. నిజంగా అంత సామాజిక విప్లవం ఇందులో ఉందా ? ఇందులో ప్రాదామైన చర్చ జరుగుతున్న అంశం, ఇన్నాళ్ళు ఉన్న బీసీ మంత్రులకు అధికారం ఉందా ? సొంత నిర్ణయాలు తీసుకున్నారా ? ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు ఏమి చేస్తారు ? అధికారలు లేని పదవులు ఎందుకు ? పైకీ బీసీ అని చెప్పినా, వెనుక మాత్రం షాడో మంత్రి ఆ సామజిక వర్గానికి చెందిన వారే కదా అని చర్చ జరుగుతుంది. ఇక ఇందులో కూడా మరో మెలిక ఉంది. ఇందులో బీసీ అని చెప్పిన ఇద్దరు మంత్రులు, నిజంగా బీసీ కాదు అనే చర్చ నడుస్తుంది. భర్త ఒక కులం వారు కాగా, వీళ్ళు మాత్రం వేరే కులం అని ఎలా చెప్పుకుంటారు అనే చర్చ నడుస్తుంది. మరో అంశం కోట్లాది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా చేస్తుంది ఏమీ లేదు కానీ ఓ నలుగురికి నాల్రోజుల పాటు మంత్రి పదవులు ఇస్తే బీసీలందరికీ న్యాయం చేసినట్లా? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ మూన్నాళ్ళ ముచ్చట పదవులతో ఈ మూడేళ్ళు బీసీలకు చేసిన అన్యాయం ఒప్పు అయిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళు పని చేసిన మంత్రులు, బీసీలకు ఏమి చేసారు ? ఇప్పుడు మంత్రులు ఏమి చేస్తారు ? పదవులు ఇస్తే సరిపోతుందా అనే ప్రశ్న వస్తుంది.

cabinet 11042022 2

మరో పక్క, ఆ సామాజిక వర్గం వారిని తీసి, మళ్ళీ అదే సామాజిక వర్గం వారికి ఇచ్చి, ఇదే సామాజిక విప్లవం అని చెప్పటం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అవంతీ శీను (కాపు) కి పదవి తీసేసి అంబటి రాంబాబు (కాపు) కి ఇచ్చారు. కురసాల కన్నబాబు (కాపు) కి పదవి తీసేసి కొట్టు సత్యనారాయణ (కాపు) కి ఇచ్చారు. పాలుబోయిన అనిల్ కుమార్ (యాదవ్)కి పదవి తీసేసి కారుమూరి నాగేశ్వరరావు (యాదవ్) కి పదవి ఇచ్చారు. పేర్ని నాని నాయుడు (కాపు) కి పదవి తీసేసి దాడిశెట్టి రాజా నాయుడు (కాపు) కి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ(BC) కి పదవి తీసేసి చెల్లుబోయిన వేణు గోపాల్(BC)కి పదవి ఇచ్చారు. ధర్మాన కృష్ణ దాస్ (వెలమ) కి పదవి తీసేసి ధర్మాన ప్రసాదరావు (వెలమ) కి మంత్రి పదవి ఇచ్చారు, ఒకే కుటుంబంకూడా). పాముల పుష్ప శ్రీ వాణి (ఎస్టి) కి పదవి తీసేసి రాజన్నదొర (ఎస్టి )కి మంత్రి పదవి ఇవ్వడం ఎస్టీ లకు మేలు అని చెప్పాలా ? సుచరిత (sc) కి తీసేసి నాగార్జున ( sc) కి ఇవ్వడం గొప్ప విప్లవం అని చెప్పాలా ? బాలినేని శ్రీనివాస రెడ్డి కి పదవి తీసేసి, ఇద్దరు రెడ్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి , రోజా రెడ్డి కి పదవి వచ్చింది, ఇదేనా సామాజిక న్యాయం ? సామజిక న్యాయం అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పై, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి.

జగన్ అనే బుడగ బద్దలయ్యే సమయం వచ్చిందా ? 12 ఏళ్ళ నుంచి పెరుగుతూ వచ్చిన గాలి బుడగ, ఇక పేలిపోయే సమయం వచ్చిందా ? జగన్ మోహన్ రెడ్డి బలహీనతలు అన్నీ బయటపడుతున్నాయా ? ప్రజల్లో వ్యతిరేకతతో పాటుగా, సొంత పార్టీలో కూడా జగన్ మీద నమ్మకం పోతుందా ? నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే సమాధానమే వస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితి ఎదురైందనే చెప్పాలి. ఇన్నాళ్ళు తనకు ఎదురు లేదు, తానో మోనార్క్ అని భావించిన జగన్ రెడ్డికి, నిన్నటి నుంచి సొంత పార్టీ నేతలే సినిమా చూపిస్తున్నారు. మరో రెండేళ్ళ అధికారం ఉందని తెలిసినా, జగన్ ను ఈక ముక్కను తీసి పడేసినట్టు తీసి పడేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎంతో బలంగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని నమ్మించారు కానీ, జగన్ బలంగా లేడు, అదో గాలి బుడగ మాత్రమే అని అర్ధమైంది. మంత్రి వర్గ మార్పు చేర్పులతో జగన్ మోహన్ రెడ్డి బలహీనత మొత్తం బయట పడింది. తనకు తిరుగు లేదని తనకు తాను భ్రమ పడే జగన్ రెడ్డికి, అసలు వాస్తవం నిన్నటితో బయట పడింది. అసెంబ్లీలో భజనలు చూసి, నేనో గోప్ప రాజుని అనుకునే జగన్ రెడ్డికి, తన పైన సొంత పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందని, అసలు ఊహించి ఉండరు.

jagan 11042022 2

పార్టీ సీనియర్ నేతలతో పాటుగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా జగన్ పై విమర్శలు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, శిల్పా చక్రపాణిరెడ్డి, కరణం ధర్మశ్రీ,, రక్షణనిధి, ముస్తఫా, అన్నా రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే జగన్ పై వ్యతిరేకత వ్యక్తం చేసారు. మరో 40 మంది వరకు, లోలోపల రాగిపోతూ, మిగిలిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి, ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి గాలి బుడగ పేలిపోయే సమయం దగ్గర పడింది. ఒక పక్క ఇప్పటికే ప్రభుత్వం గాడి తప్పింది, పెంచిన చార్జీలు ఒక వైపు, అసమర్ధ పాలన మరో వైపుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సొంత పార్టీలో నేను చెప్పిందే వేదం ఆని భావించిన జగన్ రెడ్డికి, సొంత పార్టీ నేతలే సినిమా చూపిస్తున్నారు. మరో రెండేళ్ళు మిగిలి ఉండగానే, ఇంత అసంతృప్తి నేతల్లో ఉంటే, రాను రాను జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమవుతుంది.

Advertisements

Latest Articles

Most Read