సచివాలయంలోని, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ నుంచి, కోస్తా జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక జారీ అయ్యింది. "రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడతాయి. అల‌లు 4 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఎగ‌సి ప‌డే అవ‌కాశం గాలులు గంట‌ల‌కు. 50 కిలో మీట‌ర్ల వేగంతో వీచే సూచ‌న‌లు మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్ల‌కూడదు. ప్ర‌జ‌లు కూడా స‌ముద్రం తీరం చెంత‌కు వెళ్ల‌కుండా ఉండాలి." అంటూ, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ నుంచి ఆదేశాలు వచ్చాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాసం ఉంది. మరో పక్క, ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో, రేపు అన్ని స్కూల్స్ కి కలెక్టర్ సెలవు ప్రకటించారు.

real 19082018 2

మరో పక్క, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు ఇతర కనీస అవసరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ ల సూచనలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. సహాయచర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

real 19082018 3

ప్రమాదపు అంచున ఉన్న వంతెనలపై ప్రయాణించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని.. కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం లేదా పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. వరి నాట్ల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు విష సర్పాల బారిన పడకుండా అప్రమత్తమయ్యేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పాము కాటుకు గురైన బాధితులకు తక్షణం మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పాము కాటు బాధితుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని, నిన్న ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, పార్లమెంట్ లో మోడీ పై సటైర్లు, ప్రస్తుత రాజకీయ స్థితి ఇలా అన్ని విషయాల పై పంచుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కంటే కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి 100 రెట్లు బలవంతుడు అని కేశినేని నాని అన్నారు. పవన్ కంటే చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ అని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని చాలా క్లోజ్ గా పరిశీలించిన వ్యక్తిగా తాను ఈ మాట చెబుతున్నానని తెలిపారు. ఇప్పటి పవన్ కంటే ఆ రోజు చిరంజీవి వంద రెట్లు బలవంతుడని చెప్పారు.

pk 19082018 2

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు రాదన్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం, పరిణితి లేవని చెప్పారు. పీఆర్పీని చాలా దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఇదే సమయంలో చిరంజీవి వ్యక్తిత్వం కూడా చాలా సున్నితమైనది అని చెప్పారు. ఆయన చాలా మృధు స్వభావి అని, ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి అన్నారు. పీఆర్పీ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, నాగబాబు అందరూ కలసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్నారు. అలాంటి చిరంజీవికే 18 సీట్లు వచ్చాయని కేశినేని అన్నారు. తన సొంత స్థానంలోనే చిరంజీవి ఓడిపోయారన్నారు. పవన్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఆయన కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

pk 19082018 3

2014 ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య అని, అప్పట్లో ఒక్క ఓటును కూడా తాము వదులుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే తమతో వచ్చే అందరినీ కలుపుకుని వెళ్లామన్నారు. వన్‌ను వదులుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదని కేశినేని చెప్పారు. పవన్ లేవనెత్తిన సమస్యలను అన్నింటిని చంద్రబాబు పరిష్కరించారని తెలిపారు. ఒక మిత్రపక్షంగానే జనసేనాని చెప్పిన వాటిని చంద్రబాబు చేశారని తెలిపారు. ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకుని చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను విమర్శిస్తున్నారన్నారు. స్థిరత్వం, పరణతి లేకపోవడం వల్లే పవన్ అలా వ్యవహరిస్తున్నారని కేశినేని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే మిగిలిన ఎంపీల మద్దతును కూడగడతానని ఆయన చెప్పారని, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. అంటే, బీజేపీతో కుమ్మక్కయ్యారా అన్నారు.

విశాఖ సాగర తీరానికి మధ్యాహ్న సమయాల్లో వచ్చేవారు కొద్ది సేపు చెట్లకింద సేదదీరడానికి అనువైన ప్రదేశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో, 12 గంటల వ్యవధిలో తీరంలో వంద కొబ్బరి చెట్లతో శనివారం ఏకంగా ఒక తోటనే సృష్టించేశారు. పగటి వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు తీరానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించడమే కాక తీరానికి కొత్త అందాలు అద్దాలనే ఉద్దేశంతో కొబ్బరిచెట్లు ఏర్పాటుచేశారు. సీఎస్ఆర్ లో భాగంగా నగర శివారులో ఉన్న సరే రిసార్ట్స్ అధినేత రాజాబాబు సామాజిక బాధ్యత కింద తాము వంద కొబ్బరిచెట్లు నాటి, తోటను పెంచుతామని జీవీఎంసీ అధికారులకు ప్రతిపాదించారు.

vizag 19082018 2

జీవీ ఎంసీ కమిషనర్ అనుమతించడంతో శనివారం ఉదయం పదిగంటలకు వంద చెట్లను వై. ఎం. సి. ఎ. ఎదురుగా ఉన్న తీరంలో నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పది నుంచి 15 ఏళ్ల వయసున్న కొబ్బరిచెట్లను వేళ్లతో పెరికించి లారీల్లో తీరానికి తీసుకొచ్చారు. సాధారణంగా బాగా పెరిగిన మొక్కను వేరే చోట నాటితే వాటికి భూమి నుంచి నీళ్లు, పోషకాలు అందేలోపే ఎండిపోతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి చెట్లకు ఉండే 85 శాతం మట్టలను తొలగించేశారు. అలా వాటికుండే ఆకుల నుంచి చెట్టులోని తేమ ఆవిరి కాకుండా నిరోధించారు. అదే సమయంలో ప్రతి కొబ్బరిచెట్టు కాండానికి గడ్డితో పేనిన తాడును చుట్టారు. వాటిని తడుపుతూ ఉంటే చెట్టుకు అవసరమైన నీరందుతుంటుంది. చెట్టు బతకడా నికి అవసరమైన పోషకాలను కూడా ఇస్తున్నారు. వారం పాటు జాగ్రత్తగా కాపాడుకుంటే చెట్టు బతికినట్లే.

vizag 19082018 3

సముద్రతీరంలో నాటడు వల్ల ఇసుక నుంచి పోషకాలు అందే అవకాశం లేదు. ఏడాదిపాటు పోషకాలను అందించాలి. ఆలోపు చెట్లు వేళ్లు భూమి లోపలికి బాగా చొచ్చుకుపోయి దానంతటదే బతికే స్థాయికి చేరుకుంటుంది. అప్పటి వరకు సన్ రే సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. 15 ఏళ్లపాటు పెరిగిన చెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు మార్చడం అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. వేళ్లు దెబ్బతినకుండా దాని చుట్టూ సుమారు ఎనిమిదడుగుల లోతున తవ్వి జాగ్రత్తగా పెకలిస్తారు. తల్లివేరు, పిల్ల వేళ్లు నిర్ణీత పొడవు ఉండేలా కత్తిరిస్తారు. అనంతరం చెట్టు మొదలు చుట్టూ వస్త్రం కట్టేసి మూడు నాలుగు గంటల వ్యవధిలో నాటాల్సిన ప్రదేశానికి తరలిస్తారు. చెట్టు మొదలు సహా నాటడానికి వీలుగా నాలు గైదు అడుగుల లోతున గొయ్యి తవ్వి అందులో చెట్టు మొదలు మొత్తం పట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తీరంలో ఐదు పొక్లెయిన్లు, రెండు క్రేన్లు ఉపయోగించి జాగ్రత్తగా చెట్లు నాటారు. శనివారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ప్రక్రియలో రాత్రి పదిగంటలకు వంద చెట్లు నాటారు.

 

 

రాష్ట్రానికి మరో సారి అరుదైన గౌరవం దక్కంది. కొన్ని రోజుల క్రితం, ‘ఆవాస యోగ్యమైన ప్రాంతాలు’ పేరుతో విడుదల చేసిన జాబితాలో మెట్రోనగరాలను వెనక్కి నెట్టి ఈ సారి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు స్థానాలు సంపాదించుకున్నాయి. అయితే, ఇప్పుడు మరోసారి తిరుపతి మళ్ళీ సత్తా చాటింది. దేశంలో భద్రత, రక్షణ ఉన్న నగరాల్లో తిరుపతికి రెండో స్థానం వచ్చింది. అంతేకాదు ఏపీ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో తిరుపతికి రెండో స్థానం చోటు దక్కింది. భద్రత, రక్షణ విషయంలో దేశంలోని 111 నగరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పరిశీలించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తిరుపతికి రెండో స్థానం ప్రకటించింది.

tirupati 19082018 2

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నిర్వహణ, హోటళ్లు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్, ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు, భక్తులకు అత్యంత భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. భద్రత, రక్షణలో తిరుపతికి రెండోస్థానంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మరో పక్క ఈ ఘనత సాధించిన పోలీసు డిపార్టుమెంటుని ప్రశంసిస్తూ, పోలీసులకు అన్ని విధాలుగా సహకరించిన, తిరుపతి ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వెనుక ఆనాటి డీజీపీగా పని చేసిన నండూరి సాంబశివరావు గారి కృషి కూడా ఎంతో ఉంది.

tirupati 19082018 3

ఇటీవల జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నంబర్‌ 1గా నిలిచిన మన రాష్ట్రం, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌లోనూ దూసుకెళ్లింది. సుఖమయ జీవనానికి వీలు కల్పిస్తున్న నగరాల్లో మన రాష్ట్రానికి చెందిన నాలుగు సిటీలు ఎంపికయ్యాయి. అందులోనూ తొలి పది నగరాల్లో రెండు ఏపీవే కావడం విశేషం! ఈ నగరాల ఎంపికకు ప్రాతిపదికగా తీసుకొన్న నాలుగు సూచీల్లో తిరుపతి, విజయవాడ స్థానం పొందాయి. ఒక సూచీలో అయితే, తిరుపతి దేశంలోనే అత్యున్నత నగరంగా ఎంపిక అయింది. సంస్థాగతంలో రెండు, భౌగోళికంలో ఆరు, ఆర్థికంలో తిరుపతి 38వ ర్యాంకు పొందింది.

Advertisements

Latest Articles

Most Read