దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రధాన కార్యాలయ భవనంలో పోయిన శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు చెప్పారు. ఢిల్లీలోని, సుజాన్ సింగ్ పార్క్ దగ్గర ఉన్న, లోక్ నాయక్ భవన్ లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఉంది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు రావటంతో, అందరూ కంగారు పడ్డారు. అయితే, ఎవరూ గాయపడటం జరగలేదని తెలిపారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ చెప్పిన ప్రకారం శనివారం సాయంత్రం 4.25 నిమషాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.

ed 21082018 2

ఎనిమిది ఫైర్ ఇంజిన్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకుని మంటలు ఆర్పటానికి ప్రయత్నాలు చేసాయి. ఈ ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, దాదాపు గంట పాటు శ్రమించటంతో, మంటలు అదుపులోకి వచ్చాయని, చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ చెప్పారు. ఈ భవనం ఆరు అంతస్తుల్లో ఉందని, ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంతో పాటు, కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన కొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే సకాలంలో స్పందించటంతో, పెద్ద ప్రమాదం తప్పినట్టు చెప్పారు. ఈ ఘటన పై ఎంక్వయిరీ జరుగుతుందని, ప్రాధమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయని చెప్తున్నారు.

ed 21082018 3

మరో పక్క టైమ్స్ అఫ్ ఇండియా కధనం ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో, కొన్ని కీలక ఫైల్స్ , డాక్యుమెంట్లకు కూడా మంటలు అంటుకున్నాయనే సమాచారం ఉన్నట్టు చెప్తున్నారు. ఎన్నో ఆర్ధిక నేరాలు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తుంది. మనీ లాండరింగ్ కు సంబంధించి, దేశంలో ఎంతో మంది ప్రముఖుల పై విచారణ జరుగుతుంది. మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన దోపిడీ పై, ఇప్పటికే 5 ఈడీ కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల్లో జగన్ A1 కాగా, విజయసాయి రెడ్డి A2. మరి ఈ కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయో లేదో ఈడీ తెలిపల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వాళ్ళేనా, లేక ఎవరన్నా కావాలని చేసారా అనే దాని పై విచారణలో తేలనుంది.

మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావును కుశల ప్రశ్నలు వేసి ఆరోగ్య సమాచారాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా డిసెంబరు 16 న జరిగే వందో జన్మదిన వేడుకలకు రావాల్సిందిగా సి ఎం చంద్రబాబును యడ్లపాటి వెంకట్రావు ఆహ్వానించారు. తనకున్న సమాచారం ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే వస్తారని ప్రజల ఆశీర్వాదం ఉందని యడ్లపాటి , సి ఎం ను ఆశీర్వదించారు. యడ్లపాటితోపాటు ఆయన బంధువులు ఎస్. వెంకట కోటేశ్వరరావు , సుదీర్ బాబు, వంశీలు కూడా ముఖ్యమంత్రిని కలిసారు.

yadlapati 21082018 2

‘పెద్దాయనా! మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఈ వయస్సులోకూడా పార్టీకోసం మీరు చూపిస్తున్న తపన, శ్రమ మర్చిపోలేం. మీ వంటి నిస్వార్థ నాయకులు నేటి యువతకు ఆదర్శంగా ఉండాలి. మీ 100వ పుట్టిన రోజు వేడుకలకు తప్పనిసరిగా రావాలనుకుంటున్నా. మీ ఆశీర్వచనాలు మా అందరికీ ఉండాలి..’ అంటూ ఆప్యాయతను కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. యడ్లపాటికి ముఖ్యమంత్రి ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించారు. కుశల సమాచారం అడిగి తెలుసుకున్నారు. 100 సంవత్సరాల్లోకి అడుగుపెడుతూ కూడా ఇంత ఉత్సాహంగా ఎట్లా ఉంటున్నారంటూ ప్రశ్నించారని అడిగారు.

yadlapati 21082018 3

మీ ఉత్సాహం నేటి యువతలోనూ ఉండాలని, పార్టీనే మీకు రుణపడి ఉంటుందని చెప్పారు. మర్యాదపూర్వకంగా కలిసేందుకే వెళ్లినా, డిసెంబర్‌ 16న జరుపుకోనున్న 100వ జన్మదిన వేడుకలకు రావాలని కూడా ముఖ్యమంత్రిని కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని యడ్లపాటి పేర్కొన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా మీరే వస్తారనే నమ్మకం నాకుందని, రాష్ట్రానికి మీ నాయకత్వం అవసరమని జనం నమ్ముతున్నారని ముఖ్యమంత్రితో అన్నానని, ఆయన తన ఆశీర్వచనాలు తీసుకున్నారని చెప్పారు. యడ్లపాటితోపాటు ఎస్‌.వెంకటకోటేశ్వరరావు, సుధీర్‌బాబు, వంశీలు ఉన్నారు.

సోమవారం మొత్తం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ సమావేశాల్లో బిజీబిజీగా గడిపిన మంత్రి దేవినేని ఉమా, సమావేశాల అనంతరం రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వచ్చి, మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి విజయవాడ రావలసి ఉన్నది. కానీ సమావేశాల అనంతరం మంత్రి దేవినేని ఢిల్లీ నుంచి హైదరాబాదుకు రాత్రి 9 గంటలకు చేరుకొని, హైదరాబాదులోని తన నివాసానికి కూడా వెళ్లకుండా నేరుగా కారులో బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో పొంగిపొర్లుతున్న ఎర్ర కాలువను రైట్ మెయిన్ కెనాల్, 50వ కిలో మీటర్ వద్ద పరిశీలించారు.

uma 21082018 2

రాత్రి రెండు గంటలకు అనంతపల్లి కి చేరుకున్న మంత్రి దేవినేని ఎర్ర కాలవ ముంపునకు గురైన అనంతపల్లి లో స్వయంగా తిరిగి పునరావాస ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎర్ర కాలువ వరదతో ముంపునకు గురై నీళ్లమయమైన చోడవరం గ్రామంలో తిరగటానికి వీలు లేకపోతే, నడుము లోతు నీళ్ళలో సైతం మంత్రి దేవినేని తిరుగుతుంటే స్థానికులు ఒక ట్రాక్టర్ ను తీసుకువచ్చి దానిపై ఎక్కమని మంత్రి దేవినేనిని కోరారు. అనంతరం ట్రాక్టర్ పై గ్రామం మొత్తం తిరిగి పరిశీలించి స్వయంగా పునరావాస ఏర్పాట్లలో మంత్రి పాల్గొన్నారు.

uma 21082018 3

మంత్రి దేవినేని తోపాటు పశ్చిమగోదావరి కలెక్టర్ భాస్కర్, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాత్రి మొత్తం పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దేవినేని ఉదయం బయలుదేరి విజయవాడ వెళ్ళారు. కొసమెరుపేంటంటే మంత్రి దేవినేని తీరుకు అలవాటైన ఆయన సిబ్బంది, ఎప్పుడు ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. కానీ అటువంటి సిబ్బంది ఆలోచనికి కూడా అందని రీతిలో మెరుపువేగంతో, ఏ సిబ్బంది లేకుండా డిల్లీనుండి రాత్రికి రాత్రే పశ్చిమగోదావరి జిల్లాలో, మంత్రి చేసిన పర్యటన ఉదయం తెలుసుకున్న సిబ్బంది అవాక్కయ్యారు.

పోలవరం ప్రాజెక్ట్ ఆపటానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క కేంద్రం, మరో పక్క సొంత రాష్ట్రంలోని కొంత మంది, పక్క రాష్ట్రాలు, ఇలా అందరూ కలిసి ఆపటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా, పోలవరం ఆపెయ్యాలి అంటూ, ఒరిస్సా ప్రభుత్వం, సుప్రీం కోర్టులో సుమారు 1500 పేజీల దస్తావేజులు దాఖలుచేసింది. ఈ నెల 2న సర్వోన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా వీటిని సమర్పించింది. 1970 జూన్‌లో రూపొందించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నివేదిక నుంచి ఈ ఏడాది ఆగస్టు 14న ఐఐటీ రూర్కీ సమర్పించిన హైడ్రాలిక్‌ తాత్కాలిక నివేదిక వరకు ఇందులో పొందుపరిచింది.

poalvaram 21082018 2

పోలవరం ప్రాజెక్టును సవాల్‌చేస్తూ తాను దాఖలుచేసిన నిజదావా (ఒరిజినల్‌ సూట్‌)లో తుది విచారణ ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు తాజాగా ఈ దస్తావేజులు సమర్పించింది. గోదావరి నదికి అడ్డంగా 1970 జూన్‌లో అప్పటి పశ్చిమగోదావరి జిల్లా పీడబ్ల్యుడీ విభాగం ప్రతిపాదించిన పోలవరం బ్యారేజీ స్కీం, 1978 మేలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీడబ్ల్యుసీకి సమర్పించిన పోలవరం డీపీఆర్‌, 1980 జులై 26న నోటిఫికేషన్‌ రూపంలో విడుదలైన గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు కాపీలను ఇందులో ఉంచింది. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనల దగ్గరనుంచి దాని నిర్మాణంలో ఇప్పటివరకూ చోటుచేసుకున్న సంఘటనల్నింటినీ గుదిగుచ్చి ప్రమాణపత్రం రూపంలో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసింది.

poalvaram 21082018 3

పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. తాజాగా తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు అభ్యంతరం తెల్పడంతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కావాలనే చేపిస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రభుత్వ లేవనెత్తుతుంది. ఒక పక్క కేంద్రం నుంచి వచ్చిన అన్ని కమిషన్లు, పనులు బాగా జరుగుతున్నాయని, పర్యావరణం, గిరిజనులకు ఇబ్బంది లేకుండా, వారికి కావలసినవి అన్నీ చేస్తున్నారని చెప్తున్నా, కేసులు మాత్రం వేస్తూనే ఉన్నారు. ఒక్క చోట అన్నా స్టే రాక పోతుందా అనే ఆశతో, ఒకరి తరువాత ఒకరు, ఎలాగైనా పోలవరం ప్రాజెక్ట్ ఆపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read