రైతు రుణ ఉపశమన అర్హత పరిష్కార వేదికల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 9 లక్షల ఫిర్యాదులు స్వీకరించి రూ.680 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 25న కర్నూలులో జరగనున్న ధర్మపోరాట దీక్ష సభ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో కలిసి సోమవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో రైతు రుణ ఉపశమన అర్హత పరిష్కార వేదికకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. 

runamafi 21082018 2

రాజధాని లేకుండా, ఆర్థిక కష్టాలతో ఉన్నప్పటికీ రూ.24,500 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత తెదేపాదేనన్నారు. ఇప్పటివరకు 54.98 లక్షల మంది రైతులకు రూ.14,688 కోట్లను నేరుగా ఖాతాలో జమ చేశామన్నారు. గతంలో రైతు సాధికారసంస్థ గన్నవరంలో రైతు రుణమాఫీ ఫిర్యాదులను స్వీకరించేదని, రైతుల సమస్యల దృష్ట్యా జిల్లాలవారీగా పర్యటిస్తోందని పేర్కొన్నారు. త్వరలో డివిజన్‌స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. వరద నీటితో ప్రాజెక్టులు నిండుతుంటే, ఆ నీళ్లు చూసి ప్రతిపక్షాల గుండెలు బరువెక్కుతున్నాయని ఎద్దేవా చేశారు.

runamafi 21082018 3

భాజపా పాలిత రాష్ట్రాల్లో 70-80 శాతం పంట ఉత్పత్తులను కేంద్రం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తోందని, మన రాష్ట్రంలో 20 శాతం కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి మొక్కజొన్న, జొన్న ఒక్క క్వింటా కూడా కొనలేదన్నారు. మొక్కజొన్న, జొన్నకు రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాకు రూ.200 ప్రోత్సాహకం అందిస్తోందన్నారు. మరో పక్క, జూన్‌, జులై నెలల్లో వర్షపాతం ఆధారంగా కర్నూలులో 37 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. 2.77 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.295 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అజ్జంపూడి, అల్లాపురం, బుద్ధవరం, చినఅవుటపల్లి, కేసరపల్లి గ్రామాల్లో భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు సోమవారం తుళ్లూరు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో అమరావతి రాజధాని నగర పరిధిలో ప్లాట్ల కేటాయింపులు చేయడం జరిగింది. రైతుల సూచనలు, సలహాల మేరకు వారు కోరుకున్న విధంగా లేఅవుట్లు రూపొందించి పారదర్శకంగా లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిపారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రిపై నమ్మకంతో ఎయిర్ పోర్ట్ విస్తరణకు భూములిచ్చిన రైతులు ఎంతో సహకరించారని ప్రశంసించారు.

gannavaram 21082018 2

సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ ఎంతో కసరత్తు చేసి రైతులు కోరిన విధంగా ప్లాట్లను కేటాయించారని చెప్పారు. రాజధానిలో 27 వేల మంది రైతులకు 63 వేలకు పైగా ప్లాట్లను ఎలక్ట్రానిక్ విధానంలో పారదర్శకంగా కేటాయించామని ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. అదే రీతిలో గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారి ఆప్షన్ల ప్రకారం రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో సెమీ అర్బన్ ప్యాకేజీ కింద ప్లాట్లను కేటాయించామని కమిషనర్ చెప్పారు. ముందుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చామని, 6 సార్లు రైతులు ఎమ్మెల్యేతో కలిసి తమ అభిప్రాయాలు తెలిపారన్నారు. రాజధాని అభివృద్ధి చూసేందుకు వీలుగా రెండు బస్సుల్లో గన్నవరం రైతుల పర్యటనకు చర్యలు తీసుకున్నామని, వారు అన్ని విషయాలు అవగాహన చేసుకుని , వారిచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు.

gannavaram 21082018 3

ఎలక్ట్రానిక్ లాటరీ విధానం ఎంతో విశిష్టమైనదని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, మన అమరావతి యాప్ల గురించి రైతులకు తెలియజేశారు. వారం రోజుల తర్వాత రాజధాని పరిధిలో ఏర్పాటైన ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాల ద్వారా గన్నవరం రైతులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని, సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాల్లోని హెల్ప్ డెస్క్ల్లో ఉన్న తహశీల్దార్లకు తమ ఒరిజినల్ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు అందజేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భూములిచ్చిన రైతులకు తొలుత సోమవారం సాయంత్రం 4 గంటలకు తుళ్లూరు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిపారు. రెసిడెన్షియల్ ప్లాట్ల లాటరీ ట్రయల్ రన్ ను 4సార్లు, ఐదోసారి రెసిడెన్షియల్ ప్లాట్ల ఫైనల్ లాటరీని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ద్వారా తీయించి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు చేశారు.

భారత్‌లో ఆమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ఈరోజు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించారు. ఏపీలో సమర్థ నాయకత్వం ఉందని కితాబు ఇచ్చిన కెన్నెత్ ఐ జస్ట .అమెరికాలోని పరిశ్రమలు ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని తెలిపిన కెన్నెత్ ఐ జస్టర్. పెట్టుబడులు, అభివృద్ధికి మంచి వాతావరణం ఏపీ లో ఉంది. యువత భవిష్యత్ కు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ఏపీలో చేపట్టిన సాంకేతిక పరిజ్ఞానం, సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని జస్టర్ కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ కలిశారు. ఈ సందర్భంగా ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్, సాంకేతిక వినియోగం తదితర అంశాలను సీఎం వివరించారు. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానానికి అనుసరించిన విధానాలను ముఖ్యమంత్రి తెలియజేశారు.

america 21082018 2

అమరావతి మ్యూజియాన్ని సందర్శించి.. బౌద్ధ మత వ్యాప్తిని, విశిష్టతను తెలుసుకున్నారు. అమరావతిలో బుద్ధుడి అవశేషాలు కొలువైన మహా చైత్యం స్థూపాన్ని సందర్శించారు. ఇటలీ కంటే వెయ్యేళ్ల ముందే భారతీయ నాగరికత, సంస్కృతి విలసిల్లిందని తెలుసుకొన్నారు. ఇక్కడ బుద్ధుని విగ్రహం, పురాతన శిల్పాల ప్రత్యేకతను.. ఏపీ వారసత్వ నగరాల సలహాదారు గల్లా అమరేశ్వరరావు అమెరికా రాయబారికి వివరించారు. అనంతరం రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కుటుంబంతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదారాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కూడా పాల్గొన్నారు.

కేరళ వరద బాధితుల సహాయార్థం ఏపీ పోలీసు శాఖ విరాళంగా ఒక రోజు వేతనం కేరళ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఒకరోజు విరాళాన్ని ప్రకటించింది. కానిస్టేబుల్ నుంచి రాష్ట్ర డీజీపీ స్థాయి వరకు వివిధ హోదాలలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం ఇవ్వడానికి అంగీకారం తెలిపారని డీజీపీ ఆర్పీ ఠాకూర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ మొత్తం సుమారు రూ. 8 కోట్లు వరకూ ఉంటుందన్నారు. ఆ మొత్తాన్ని త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ సచివాలయంలో కలిసి తెలిపారు. కేరళ ప్రభుత్వానికి విరాళాన్ని పంపుతున్న పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

appolice 21082018 2

మరో పక్క, భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన కేరళ వరద బాధితుల సహాయార్ధం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాన‌వ‌తా హృద‌యంతో ముందుకొచ్చారు. తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం సుమారు రూ.3.25 కోట్ల మేర ఉంటుంద‌ని ఈ మేరకు సంస్థ వైస్‌ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్.వి.సురేంద్రబాబు సోమ‌వారం విడుద‌ల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన అనేక సందర్భాల్లో సంస్థ ఉద్యోగులు ఆపన్నులకు అండగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటుకున్నార‌ని ఆయ‌న తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read