ఇక నుంచి రైతులు తమకు అవసరమైన రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయనక్కర్లేదు. క్షణాల్లో రుణాలే రైతు ఇంటికి వెళ్తాయి. అటువంటి అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో కూడిన ‘మొబైల్ ఏటీఎం’ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిఒక్క జిల్లాలోను నిర్వహిస్తారు. ఈ వాహనాలు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్)లు, డీసీసీబీ బ్రాంచీల పరిధిలో పనిచేస్తాయి. ఇవి మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వద్దకు వెళ్తాయి. డీసీసీబీ పరిధిలో నడుస్తున్న సొసైటీల్లో ఉన్న రైతు సభ్యులకు కల్పించిన రూపే కార్డులను ఈ మొబైల్ ఏటీఎంల ద్వారా ఉపయోగించుకుని తగిన రుణాన్ని పొందవచ్చు.

farmer 18082018 2

ఏపీలో ప్రతి జిల్లాలోను ఈ విధమైన మొబైల్ ఏటీఎంలను ప్రభుత్వం ప్రవేశపెట్టగా వీటికి నాబార్డు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఒక్కో మొబైల్ ఏటీఎం వాహనానికి రూ.15లక్షలు మేర ఖర్చు చేసింది. ప్రత్యేక వాహనంలో ఏటిఎం యంత్రాలను అమర్చింది. దీనిలో సహకార రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను నింపింది. ఈ విధంగా నిర్వహించే మొబైల్ ఏటిఎం వాహనం నేరుగా రైతుల ఇళ్ళ వద్దకే వెళ్తుండం ద్వారా రైతు సభ్యులు వద్ద ఉండే రూపే కార్డులను ఉపయోగించుకుని అవసరమైన రుణాలను పొందే సౌలభ్యం కలుగుతుంది. ఏపీ మొత్తం మీద 30 లక్షలకు పైగానే రైతుసభ్యులు ఉండగా, ఒక్క విశాఖ జిల్లాకు సంబందించి 96 సొసైటీల పరిధిలో 2.7లక్షల మంది కలిగి ఉన్నారు. వీరిలో 40నుంచి 60 శాతం ప్రతి ఏడాది పంట రుణాలు పొందుతుంటారు. ఇందులో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు పొందే అవకాశం కల్పించబడింది. రైతు పండించే పంటలు, కలిగి ఉన్న వ్యవసాయక్షేత్రాన్నిబట్టి రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కనీసం లక్ష నుంచి ఎంతైనా తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

farmer 18082018 3

ప్రధానంగా వరి, చెరకుతోపాటు పలు రకాలైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటల వేసుకునేందుకు, ఎరువులు, ట్రాక్టర్ల కొనుగోలు కోసం బ్యాంకు యాజమాన్యం ప్రతి ఏడాది రుణాలను మంజూరు చేస్తుంది. ఇలా.. మంజూరయ్యే రుణాల కోసం రైతులు జిల్లా నలుమూలల నుంచి నగరంలో ఉన్న ప్రధాన కార్యాలయానికి, లేదంటే సమీపంలో ఉండే బ్యాంకు శాఖల వద్దకు రావాల్సి ఉంటుంది. అనేకసార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ సిఫారసులు చేసుకున్నా రుణం కోసం సమయం పట్టే పరిస్థితులు ఉంటున్నాయి. దీనివల్ల సమయం, డబ్బు వెచ్చించాల్సి వస్తోందని జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతుల ఫిర్యాదులను దృష్టిలోపెట్టుకుని అన్నదాత సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి మొబైల్ ఏటీఎం వాహనాన్ని ట్రయిల్ రన్‌గా నిర్వహించి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏపీలో విశాఖ జిల్లా డీసీసీబీ పరిధిలో దీనిని అధికారికంగా ప్రారంభించి మరో నాలుగు రోజుల్లో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహాణాధికారి డివికె వర్మ శుక్రవారం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. దీనిపై బ్యాంకు సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తారని, ఏటీఎం వినియోగంపై కొన్నాళ్ళపాటు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జనసేన కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం రోజున, పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపిలోనే కాదు, తెలంగాణాలో కూడా విమర్శలకు గురి చేస్తున్నాయి. అక్కడ జనసేన కార్యాలయాల్లో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ, లోకేష్ పై విమర్శల వర్షం కురిపించి, కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్‌కు అనుభవం ఏది, అంటూ విమర్శలు చేసి, కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన మనిషి అంటూ, పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ఈ వ్యాఖ్యల పై ఆంధ్రప్రదేశ్ లో విమర్శలు వినిపించాయి. కేటీఆర్ ను పొగడటానికి, లోకేష్ ని తక్కువ చేసి మాట్లాడటం ఏంటి అని, కేటీఆర్ కు సొంత పార్టీలోనే హరీష్ వర్గమే వ్యతిరేకమని, కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన మనిషి కాదు, అమెరికాలో జీవినం సాగించి, రాజకీయాల్లోకి వచ్చాడని, ఏమి తెలియని కేటీఆర్‌ హడావిడి చూసే, హరీష్ వర్గం అసంతృప్తిగా ఉందని పవన్ ఇలా తెలంగాణా భజన చెయ్యటం ఆపాలి అని అన్నారు.

pk 18082018 2

అయితే, పవన్ వ్యాఖ్యల పై, ఆంధ్రా లోనే కాదు, తెలంగాణాలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కు నాయకత్వ లక్షాణాలున్నాయన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని తాను స్వయంగా కలుస్తానని, కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ఆయనకు ఓ మంచి సలహా ఇవ్వాలని పవన్ ని కోరతానని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేటీఆర్ కు పెద్దలకు గౌరవం ఇవ్వటమే రాదని, అలాంటి కేటీఆర్ లో పవన్ ఏమి చూసాడో అని వ్యంగ్యంగా మాట్లాడారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులకు శిక్షణ ఇస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. పెద్దలను గౌరవించే సంప్రదాయం కేటీఆర్ కు ఏమాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవన్ తీరు మార్చుకోవాలని అన్నారు.

pk 18082018 3

పవన్ ఒక పక్క కేటీఆర్ కు భజన చేస్తాడు. కేసీఆర్ పాలన అద్భుతం అంటాడు.చెల్లలు కవితకు ధన్యవాదాలు అంటాడు. కాని అవిశ్వాస తీర్మానంలో మద్దతు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అన్నా, ఒక్క మాట కూడా మాట్లాడడు. దీనికి కారణాలు ఏంటో తెలియదు. ఎక్కడ లొంగిపోయాడో తెలియదు. తెలంగాణా అంటే నాకు పిచ్చి అని నిన్న పవన్ అన్నాడు. మరి తెలంగాణాలో జరిగే అక్రమాలను ఒక్క రోజు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ? తెలంగాణాలో పరిమితి సీట్లలో పోటీ అంటున్నాడు, అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కెసిఆర్ తో చేసుకున్న ఒప్పందం ఏమిటో. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలనే యోజనలో టీఆర్ఎస్ ఉంది. దీని కోసం, ఎదో బలమైన కారణం చూపి, పవన్ కళ్యాణ్ ను కెసిఆర్ లొంగదీసుకున్నాడు. అందుకే, పాపం పవన్ కళ్యాణ్ కు ఈ పాట్లు. అటు అమిత్ షా చేతిలో, ఇటు కెసిఆర్ చేతిలో, నలిగిపోతున్నాడు.

'జగన్ కు ఉన్న ఆస్తలు ఏంటో నాకు తెలుసు. మాట త‌ప్ప‌ను మ‌డ‌మ తిప్ప‌ను అని జ‌గ‌న్ ప‌దే ప‌దే సొంత డ‌బ్బా కొట్టుంకుంటారు. కానీ వాస్త‌వానికి వ‌స్తే మాట త‌ప్పడం జ‌గ‌న్ స్థిరాస్తి, మ‌డ‌మ తిప్ప‌డం జ‌గ‌న్ చ‌రాస్తి' అని ఏపిసిసి ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్‌ ఎన్‌.తుల‌సిరెడ్డి మండిప‌డ్డారు. ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఇందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయ‌న్నారు. స‌మైక్య‌వాదం, పార్ల‌మెంట్‌లో టీడీపీ ఎంపీల నుంచి స‌మైక్య‌వాదం ప్లకార్డుల‌ను తీసుకుని త‌మ స‌మైక్య‌వాది అని ప్ర‌చారం చేసుకున్న జ‌గ‌న్ అదే వ్య‌క్తి 2012 డిసెంబ‌ర్ 28న తాను రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకం కాద‌ని, అనుకూల‌మ‌ని అప్ప‌టి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఉత్త‌రం రాశారు. మిగ‌తా దిన ప‌త్రిక యాజ‌మాన్యాలు ప‌దే ప‌దే ధ‌ర‌లు పెంచుతున్నార‌ని, జ‌గ‌న్ మాత్రం సాక్షి దిన‌ప‌త్రిక ధ‌ర‌ను పెంచ‌న‌ని ప్ర‌క‌టించిన నెల రోజుల్లోపే ధ‌ర‌ను పెంచ‌డం.

tulasireddy 18082018 2

బీజేపీకి ప్ర‌త్యేక్షంగానీ, ప‌రోక్షంగానీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ని ప్ర‌క‌టించిన త‌రువాత రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో సాగిల‌ప‌డి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం. కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంటరి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో యూ ట‌ర్న్ తీసుకోవ‌డం. 2018 ఆగ‌స్టు 9వ తేదీన జ‌రిగిన రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి అయిన బి.కె. హ‌రిప్ర‌సాద్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా, ఓట్లు వేయ‌కుండా ఉండ‌టం ద్వారా వైకాపా నిజ‌స్వ‌రూపం బ‌ట్ట బ‌య‌లైంది. రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మ‌ద్ద‌తిస్తామ‌ని, మేము మాట త‌ప్పం, మ‌డ‌మ తిప్ప‌మ‌ని వైకాపా నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నా దానికి మొన్న రాజ్య‌స‌భ‌లో ప్ర‌వ‌ర్తించిన దానికి పూర్తి వైరాధ్యం ఉందన్నారు. ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని, విభ‌జ‌న చ‌ట్టంలోని అన్ని అంశాల‌ను అమ‌లు చేస్తామ‌ని కాంగ్రెస్ ప‌దే ప‌దే చెప్ప‌డ‌మే కాకుండా 2018 మార్చి 17, 18వ తేదీల్లో జ‌రిగిన ఏఐసిసి 84వ ప్లీన‌రీలో, 2018 జూలై 22న జ‌రిగిన సిడ‌బ్ల్యు సి స‌మావేశంలో తీర్మానం చేయ‌డం జ‌రిగిందని గుర్తు చేశారు.

tulasireddy 18082018 3

కాబ‌ట్టి వైకాపా చెబుతున్న‌దాని ప్ర‌కారమైతే రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో వైకాపా రాజ్య‌స‌భ స‌భ్య‌లు కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఓటు వేయాలి. కానీ వేయ‌లేదు. దీనిని బ‌ట్టి వైకాపా దృష్టిలో రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా గానీ, రాయ‌ల‌సీమ‌కు, ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌త్యేక అభివృద్ధి ప్యాకేజీ గానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ‌ధాని, క‌డ‌ప జిల్లాలో ఉక్కు క‌ర్మాగారం, విశాఖ రైల్వే జోన్‌, దుగ‌రాజ ప‌ట్నం ఓడ‌రేవు, విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, ఐఐటి లాంటి కేంద్రీయ సంస్థ‌లు రాష్ట్రానికి అవ‌స‌రం లేన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే వైకాపాకు, జ‌గ‌న్‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని, అందు కోసం వైకాపా అధినేత జ‌గ‌న్ ఎన్ని సార్లు అయినా మాట త‌ప్పుతారు, ఎన్ని సార్లు అయినా మ‌డ‌మ తిప్పుతార‌ని అన్నారు. జ‌గ‌న్ దృష్టిలో లౌక్యం అంటే లొంగిపోవ‌డం, దౌత్యం అంటే దాసోహం, పోరాటం అంటే పారిపోవ‌డమ‌ని తుల‌సిరెడ్డి ఎద్దేవా చేశారు.

కేరళ సీఎం విజయన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని బాబు చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి సిబ్బంది మరబోట్లు, పడవలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను మంగళగిరి నుంచి కేరళకు ఏపీ ప్రభుత్వం పంపింది. ఆహార పదార్ధాలు, పాలు, పండ్లు, బిస్కెట్లను ప్రభుత్వం పంపనుంది. ఇప్పటికే చంద్రబాబు కేరళకు రూ.10కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ వరద బాధితులకు తమ నైతిక సాయం ఉంటుందని, వస్తు సామగ్రి రూపంలోనూ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏపీ నుంచి సహాయ బృందాలను పంపేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేరళ త్వరగా విపత్తు నుంచి బయటపడాలని, అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు.

kerala 18082018 2

కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. donation.cmdrf.kerala.gov.in ద్వారా సాయం చేయాలని కోరారు. మరో పక్క, కేరళ రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ.500 కోట్ల తాత్కాలిక సాయాన్ని ప్రకటించారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం మోదీ ఈ సాయాన్ని ప్రకటించారు. అయితే తక్షణ సాయంగా రూ.2000 కోట్లు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. అయితే ప్రధాని మోదీ ప్రకటించిన తాత్కాలిక సాయం రూ.500 కోట్లు కాగా, ఇంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం తరఫున ప్రకటించిన సాయం రూ.100 కోట్లు దీనికి అదనం.

kerala 18082018 3

కాగా, కేరళకు రూ.500 కోట్ల తక్షణ సాయంపై పీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. 'ప్రస్తుతం ప్రకటించన రూ.500 కోట్లకు, ఈనెల 12న హోం మంత్రి ప్రకటించిన రూ.100 కోట్లు అదనం. దీనికి తోడు వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు' అని పీఎంఓ తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీని ఓ ట్వీట్‌లో కోరారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, లక్షలాది మంది ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read