రౌడీ పార్టీగా పేరు ఉండి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీవ్ర పదజాలంతో తిడుతూ, మీ అంతు చూస్తూ, మిమ్మల్ని జైలుకి తీసుకుపోతా అంటున్నాడు A1.... A2 అయితే, కొంత మంది అధికారులు పేర్లు చెప్పి మరీ, వీరు మా హిట్ లిస్టు లో ఉన్నారు, మా A1 సియం అయిపోతున్నాడు, సియం అవ్వగానే, వీరి సంగతి చూస్తాం అంటున్నాడు.. తిరుపతిలో ఉండే ఒక స్మగ్లర్ ఏమో, ఉరికించి ఉరికించి కొడతాం అంటాడు.. ఇప్పుడు లిస్టు లో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మల్యేగా ఉన్న అనిల్ కుమార్ యదావ్ చేరాడు. ఇతగాడి నోటి దూల గురించి, ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి కూడా. ఈ సారి ఏకంగా, జర్నలిస్ట్ లనే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. బెదిరించటం అంటే, అలా ఇలా కాదు, తన బాస్ పులివెందుల స్టైల్ లో..

jagan 15082018 2

రేపు అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి రాగానే, నెల్లూరులో జరిగే ఫస్ట్ మర్డర్ నీదే అంటూ, గుంటమడుగు దినకర్ రాజు అనే మహా న్యూస్ రిపోర్టర్ పై చిందులు తొక్కాడు. పాపం ఆ రిపోర్టర్, ఇలాంటి అరాచక వాదులు నుంచి కాపాడమని పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీసు కంప్లైంట్ ప్రకారం, ఆగష్టు 14న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తటంతోనే, బూతులతో విరుచుకుపడ్డాడు అనిల్ కుమార్ యాదవ్. త్వరలో అధికారంలోకి వస్తున్నా, ఫస్ట్ మర్డర్ నిన్నే చేస్తా, నీ శవాన్ని చూస్తా అంటూ బెదిరించసాగాడు అని ఆ కంప్లైంట్ లో రాసారు. ఎవరు మీరు అని అడిగితే, నేను రా మీ ఎమ్మల్యే అనిల్ కుమార్ యాదవ్ ను అని అన్నారని చెప్పాడు.

jagan 15082018 3

ఎందుకు అలా తిడుతున్నారు అని అడిగితే, మంత్రి నారాయణ గెలుస్తాడు అని రాసినందుకు తిడుతున్నా అంటూ అనిల్ బూతులు తిట్టాడు. నారాయణకు అమ్మాయలు సప్లై చేసే బ్రోకర్ గాడివి నువ్వు అంటూ, ఆ జర్నలిస్ట్ పై విరుచుకుపడ్డాడు అనిల్. దీనికి స్పందించిన జర్నలిస్ట్, మీకు వార్తలో ఏమన్నా ఇబ్బంది ఉంటే, లీగల్ గా వెళ్ళండి, ఇలా బెదిరించటం కరెక్ట్ కాదు, భాష మార్చుకోండి అని చెప్పినా కాని, నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను చంపేస్తున్నా, రోజులు లెక్క పెట్టుకో, మా జగనన్న సియం అవ్వగానే, నెల్లూరులో ఫస్ట్ మర్డర్ నిన్నే చేస్తాం, నా మనుషులతో నరికించేస్తా అంటూ, అనిల్ కుమార్ బెదేరించాడని, నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా, అందుకు అనిల్ కుమార్ యాదవ్ బాధ్యుడు అని, నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేసి, రక్షణ కోరారు. ఇది, జగన్ పార్టీ నిర్వాకం...

బీజేపీ పార్టీ ఆడిన విష క్రీడకు, మొదటి బానిస ఎవరు అంటే, ఎవరైనా తమిళనాడు రాష్ట్రమనే చెప్తారు. అందుకే, తమిళనాడు ప్రజలు, మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా తరిమి తరిమి కొడతారు. జయలలితకు ఆరోగ్యం బాగోలేకపోవటం, తరువాత ఆమె మరణం, శశికళకు జైలు, అన్నాడీఎంకేలో ముసలం, ఆ పార్టీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవటం, ఇలా అన్ని విషయాల్లో బీజేపీ సక్సెస్ అయ్యింది. తాము సొంతగా తమిళనాడులో ఎదగలేదు అని గ్రహించి, జయలలిత మరణంలో వచ్చిన సంక్షోబం, తమకు అనుకూలంగా తిప్పుకుని, తమిళనాడును ఆడిస్తుంది బీజేపీ... అయితే, ఇప్పుడు మరో పార్టీ డీయంకే చాలా బలంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా, అన్నాడీయంకే, బీజేపీ లొంగిపోవటం చూసి, తమిళనాడు ప్రజలు, డీయంకే వైపు చూస్తున్నారు.

bjp 15082018 2

ఈ తరుణంలో, కరుణానిధి చనిపోవటంతో, ఇద్దరు కుమారులు, స్టాలిన్, అళగిరి మధ్య విభేదాలను రాజకీయంగా వాడుకోవటానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. డీయంకే పార్టీ ప్రస్తుతం, స్టాలిన్ చేతిలో ఉంది. అందరూ స్టాలిన్ నే నాయకుడుగా గుర్తిస్తున్నారు. ఈ తరుణంలో కరుణానిధి మరో కొడుకు అళగిరి, ఈ పరిణామాల పై గుర్రుగా ఉన్నారు. స్టాలిన్ ను దెబ్బ తియ్యటానికి, పావులు కదుపుతున్నారు. ఈ తరుణంలో, అళగిరికి బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రచారం, తమిళనాడులో ఉంది. అళగిరి ద్వారా, డీయంకే పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రచారం జరుగుతుంది.

bjp 15082018 3

అళగిరి వెనుక భారతీయ జనతా పార్టీ ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ స్పందించారు. అళగిరి వెనుక బీజేపీ లేదా బీజేపీ నేతలు లేరని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డీఎంకేనే కాదే ఏ ఒక్క పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదన్నారు. అలాంటి చర్యను తాము ఇష్టపడబోమన్నారు. డీఎంకేలో జరుగుతున్న పరిణామాలకు కూడా రవ్వంత సంబంధం కూడా లేదన్నారు. పైగా భారతీయ జనతా పార్టీ శరవేగంగా వృద్ధి చెందుతోందన్నారు. అలాంటి పార్టీని చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని గుర్తుచేశారు. అదేసమయంలో ఏ క్షణం ఎన్నికలు జరిగినా తాము పోటీ చేసందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. ప్రాజెక్ట్ ప్రతి స్టేజ్ లో, ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. సకాలంలో డబ్బులు ఇవ్వక, ఆ వడ్డీ భారం రాష్ట్రం మీద పడి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మరో పక్క, ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వక, డిజైన్స్ అప్రోవ్ చెయ్యక, నానా రకాలుగా విసిగిస్తున్నారు. రోజుకి ఒక కొర్రీ పెడుతూ, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకుండా, అడ్డు పడుతూ, ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ చెయ్యాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనే కాని, ఎక్కడా ప్రాజెక్ట్ త్వరతిగతిన పూర్తి చేద్దాం అనే ఆలోచన కొంచెమైనా లేదు. మరో పక్క ఇన్ని ఇబ్బందులు పెడుతూ, వంద రకాల తనిఖీలు చేసి, వంద రూల్స్ చెప్పి, రూపాయి రూపాయి విడుదల చేస్తూ, పోలవరంలో అవినీతి ఉందని ఆరోపిస్తారు..

modi 15082018 2

ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ పెద్దలు, నిన్న అన్ని దినపత్రికల్లో, తెలుగులో ప్రకటనలు ఇచ్చారు.'పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు' ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని ప్రత్యేక బహుమతి' అంటూ ప్రకటనలు గుప్పించారు. గత కొన్నాళ్ల నుంచి వివిధ అంశాలపై తాము ఆంధ్రాకు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నామంటూ, బిజెపి నేతలు ప్రచారం సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు, పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం చేస్తున్నారు. సహాయం చేస్తున్నాం అంటే అదో పద్ధతి, కాని, పోలవరం ప్రాజెక్ట్ మోడీ బహుమతి అంటూ, రాసి, తమ అవగాహాన రాహిత్యం, ప్రచార పిచ్చ మరోసారి బయట పెట్టుకున్నారు.

modi 15082018 3

పోలవరం ప్రాజెక్ట్ అనేది, విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హక్కు. ఇది మోడీ బహుమతీ కాదు, ఏమి కాదు. మోడీ ఉన్నా, మరో వ్యక్తి ఉన్నా, పోలవరం కట్టి తీరాలి. పోలవరం ప్రాజెక్ట్ మోడీ బహుమతి అంటున్న బీజేపీ వాళ్ళు, మిగతా 15 జాతీయ ప్రాజెక్ట్ ల పరిస్థితి ఎలా ఉందో చుస్తేనే అర్ధమవుతుంది. మరి ఈ బహుమతులు, మిగతా జాతీయ ప్రాజెక్ట్ లలో ఎందుకు కనిపిచటం లేదు ? ఇది మా ఆంధ్రల హక్కు.. ఎవరి భిక్షా, బహుమతి కాదు. పోలవరం ప్రాజెక్ట్ ఎవరి వల్ల, ఈ స్థాయికి వచ్చిందో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ బహుమతుల గురించి ప్రచారం చేసుకోకుండా, మాకు రావాల్సిన డబ్బులు టైంకి ఇచ్చి, ఏ కొర్రీలు లేకుండా అన్ని అనుమతులు టైంకి ఇస్తే, అప్పుడు మా ఆంధ్రులు కూడా, మోడీజీకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే వాళ్ళం.. ఇలాంటి మీడియా జిమ్మిక్కులు ఉత్తరాదిలో వేసుకోండి, మా రాష్ట్రంలో కుదరదు...

12 ఓట్లుతో గెలిచిన ఎమ్మల్యే... ఎవరైనా ప్రజలకి మంచి చేసి, వచ్చే ఎలక్షన్స్ లో ఇలా 12 ఓట్లుతో కాకుండా, 12 వేల ఓట్లతో గెలివాలి అనుకుంటారు... కాని ఈయన ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ళ పార్టీ అధినేత సేవలు తరిస్తూ ఉంటాడు... ఏ లిటిగేషన్ దొరుకుతుందా, ఎవరి మీద కేసు వేద్దామా అని చూస్తూ ఉంటాడు... చివరకి ఏ కేసు నిలబడు అనుకోండి అది వేరే విషయం... కాని, ఈ లోపు కేసు వేసి, సాక్షి టీవీలో హడావిడి చేస్తూ ఉంటారు... కేసు కొట్టేసిన రోజు మాత్రం, అసలు సాక్షిలో వార్తే ఉండదు... అమరావతి పై కేసులు, సధావర్తి భూములు, ఫైబర్ గ్రిడ్ పై కేసు, ఇలా ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో కేసులు వెయ్యటం, మొట్టికాయలు తినటం, ఈయనకు బాగా అలవాటు. మంచి పని కోసం అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు, కాని ప్రతిది రాజకీయ ఉద్దేశంతో వేస్తే ఇలాగే ఉంటుంది.

alla 15082018 2

చాలా రోజులుగా సైలెంట్ అయిన ఆళ్ళ మళ్ళీ, హైకోర్ట్ లో ఒక కేసు వేసారు. ‘సాధికారమిత్ర’ అనే వ్యవస్థతో, ప్రభుత్వం, రాజకీయ ప్రయోజనం ఆశిస్తుందని, ఇవి రద్దు చెయ్యాలని కోరారు. నవంబర్ 23,2017న ‘సాధికారమిత్ర’లను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీని వల్ల పంచాయతీల వ్యవస్థ దెబ్బ తింటుందని, అందుకే వీరిని రద్దు చెయ్యాలని కోరారు. ‘సాధికారమిత్ర’లను తన సొంత బ్రాండింగ్ కోసం, చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని పిటీషన్ లో చెప్పారు. అయితే, దీని పై హై కోర్ట్ అభ్యంతరం చెప్పింది. రాజ్యాంగంలో కాని, పంచాయతీ రాజ్ చట్టంలో కాని, ఇలాంటి పనులు పంచాయతీ సిబ్బంది మాత్రమే చెయ్యాలని ఎక్కడా లేదని కోర్ట్ చెప్పింది.

alla 15082018 3

మంచి పని చేసే ఎవరైనా, ఈ పనులు చెయ్యవచ్చు అని చెప్పింది. చట్టంలో లేని దాని గురించి, మేము ఏమి చెయ్యలేము అంటూ, పిటీషన్ కొట్టేసింది. దీంతో ఆళ్ళ ఖాతాలో మరో, అపజయం ఆడ్ అయ్యింది. నిజానికి, ‘సాధికారమిత్ర’ అనే వ్యవస్థ, గ్రామాల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు స్వయం సహాయక సంఘాలను ఎన్నుకుంది. ఇందుకు ప్రత్యేకంగా ‘సాధికార మిత్ర’ వ్యవస్థను రూపొందించింది. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వంతో సంబంధంలేకుండా ప్రతి 35 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, దానికి ఓ ‘సాధికార మిత్ర’ను నియమిస్తారు. వారు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. సేవే లక్ష్యంగా ముందుకు వచ్చేవారికి ‘సాధికారమిత్ర’లుగా అవకాశం కల్పిస్తారు. ఆ 35 కుటుంబాల బాధ్యత, ఆ ‘సాధికారమిత్ర’కు ఉంటుంది. అన్ని ప్రభుత్వ పధకాలు వారికి అందేలా, వీరు దగ్గర ఉండి పని చేస్తారు. అలాంటి ‘సాధికారమిత్ర’లని కూడా రద్దు చెయ్యమని, మన జగన్ పార్టీ అడుగుతుందంటే, వీరికి ప్రజల సమస్యల పై ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది.

Advertisements

Latest Articles

Most Read