కృష్ణా నదిలో ఉన్న దీవుల అభివృద్ధికి ఆసక్తి కనబర్చిన యూఏఈ కి చెందిన బీఎల్ఎఫ్ సంస్థ రెండు దీవుల అభివృద్ధికి సీఆర్‌డీఏతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ యూఏఈ లో అక్కడి ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్). కృష్ణానదిలో ఉన్న 14 దీవుల్లో ఏడు దీవులు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ రెండు ఐలాండ్ లను బీఎల్ఎఫ్ ప్రతినిధులు పరిశీలించారు.

uae 16082018 2

దాదాపు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, రిక్రియేషన్ విల్లాలు నిర్మించడానికి యూఏఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిగా ప్రారంభించే ముందు పర్యావరణ అంశాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మూడు నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు అక్టోబర్ 2017లో దుబాయ్ పర్యటన చేసిన సందర్భంలో, బిజినెస్ లీడర్స్ ఫోరమ్ తో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో నవ్యాంధ్రకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు, వారు అధ్యయనం చేసి, వచ్చారు.

uae 16082018 3

ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు. వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది.

అమరావతిలో తొమ్మిది సిటీల ఏర్పాటు ప్రతిపాదనలపై సిఎం చంద్రబాబు సీఆర్‌డీఏతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాసిటీ ప్రతిపాదనల విషయమై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తన ఆలోచనలను చంద్రబాబుకు వివరించారు. స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే ఏడాదిన్నరలో అమరావతిలో సినీ పరిశ్రమ రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సురేష్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో కేవలం స్టూడియోలు, నిర్మాణాల వరకే ఉన్నాయని, కానీ ఏపీలో సహజ సిద్ధమైన, ఆకర్షణీయమైన ప్రాంతాలున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

suresh 16082018 2

మీడియా సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని, అర్హత గల సంస్థలను ఆహ్వానించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అలాగే ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో సుందరంగా తీర్చి దిద్దాలని అధికారులను ఆదేశించారు. అక్కడ పూలవనాలు, హరిత వనంగా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. అక్కడ మూడు కాలువలు, బ్యారేజీ సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఆర్‌డీఏ అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.

suresh 16082018 3

ఇదిలావుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మూగ, చెవిటి, వికలాంగ ఉద్యోగ సంఘాల సభ్యులు గురువారం కలిశారు. ప్రయాణ భత్యం కింద రూ. 1300 మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్మానం చేస్తామని, అభినందన సభకు రావాలని ఆయన్ని ఆహ్వానించినట్లు తెలిపారు.

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి మృతిపై నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. 22 జూన్, 2000 సంవత్సరంలో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్ కు అటల్ జీ వచ్చిన ఫోటో పోస్ట్ చేసి, సంతాపం ప్రకటించారు బాలయ్య.

atal balayya 16082018 2

‘‘మా 'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్'ను 22 జూన్, 2000 సంవత్సరంలో మహానుభావుడు వాజ్‌పేయిగారు ప్రారంభించారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు..’’ అని బాలకృష్ణ తెలిపారు.

atal balayya 16082018 3

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి రాజకీయప్రస్థానం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. సామాన్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అసమాన్య స్ధితికి ఎదిగారు. 1924 డిసెంబర్‌ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ పట్టభద్రుడయ్యారు. 1947లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమంలో 23 రోజులు జైలు జీవితం గడిపారు. కుంభకోణాలకు తావు లేకుండా ప్రాంతీయ పార్టీల్ని కట్టడి చేసిన రాజనీతిజ్ఞుడు ఆయన. 1999-2004లో ఐదేళ్ల పాటు సంకీర్ణ సర్కార్‌ను నడిపిన అపర చాణక్యుడుగా ఆయన కీర్తింపడ్డారు. కాంగ్రెస్సేతర ప్రధానిగా ఐదేళ్ల పాలన పూర్తి చేసిన ప్రధానిగా రికార్డు కెక్కారు.

ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి లోకేష్, వాజ్‌పేయి గారి పై సంతాప సందేశంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. "ఏది సత్యం? ఉండటమా? లేక లేకపోవడమా? లేదా రెండూ సత్యమేనా? ఎవరైతే సజీవులో, వారున్నారనడం సత్యం... ఎవరైతే నిర్జీవులో, వారు లేరనడం సత్యం... అంటూ ఒక కవితలో రాసుకున్నారు వాజ్‌పేయిగారు. కానీ వాజ్‌పేయి వంటి వారిని లేరని ఎవరైనా అనుకోగలరా. ఎంత కష్టంగా అనిపిస్తోంది కదా. మనిషికి మరణం అన్నది సహజం. కానీ కొందరి విషయంలో అలా అనుకోలేం. ఏదో కోల్పోయిన బాధ ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకరు వాజ్‌పేయి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. రాజకీయం, కవిత్వం ఒకే వ్యక్తిలో ఉండటం అరుదు. కానీ వాజ్‌పేయి ఉత్తమ పార్లమెంటేరియన్ గానూ, ఉత్తమ కవిగానూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు రాగానే ఆయన వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవడం మొదలుపెట్టాయి. అంటే ఆయన ఎంత మంచి ఉపన్యాసకులో అర్థం చేసుకోవచ్చు.

వాజ్‌పేయి వంటి వ్యక్తి పూర్తికాలం ప్రధానిగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ విశిష్టమైన పాత్రను పోషించింది అని తెలుసుకున్నప్పుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి హయాం నుండీ తెలుగుదేశంతో అనుబంధం ఉన్నప్పటికీ, ఎన్డీఏ పాలనాకాలంలో తెదేపాకు, చంద్రబాబుగారికి మరింత దగ్గరయ్యారు వాజ్‌పేయిగారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండానే వాజ్‌పేయిగారి విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలో ముఖ్యపాత్ర పోషించింది తెలుగుదేశం. సూక్ష్మ సేద్యం, నాలుగు వరుసల స్వర్ణ చతుర్భుజి, టెలి కమ్యూనికేషన్ విధానం, సెల్ ఫోన్ విధానాల విషయంలో తెలుగుదేశం ఎంతో ప్రముఖమైన పాత్రను నిర్వర్తించింది. తన ప్రభుత్వానికి అండగా నిలబడినందుకే కాకుండా దార్శనికత పరంగా కూడా చంద్రబాబుగారంటే వాజ్‌పేయిగారికి ఎంతో గౌరవం. చంద్రబాబుగారు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేవారు.

వాజ్‌పేయిగారి హయాంలోనే చంద్రబాబుగారు సైబరాబాద్ ను నిర్మించారు. మైక్రోసాఫ్ట్ ను హైద్రాబాదుకు తేగలిగారు. హైటెక్ సిటీ ప్రారంభోత్సవం వాజ్‌పేయిగారి చేతుల మీదుగానే జరిగిందంటే చంద్రబాబుగారికి ఆయనంటే ఎంత గౌరవం ఉండేదో అర్థం అవుతుంది. అదే సమయంలో చంద్రబాబుగారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానిగా వాజ్‌పేయిగారు ఎంతగా సహకరించేవారో తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలు ఎంతగా పట్టుబట్టినా ఐఆర్ డిఏను చంద్రబాబుగారు హైద్రాబాదుకు తీసుకురాగలిగారంటే అది వాజ్‌పేయిగారి చలవే.

రాష్ట్రంలో కరవు ఏర్పడినప్పుడు చంద్రబాబుగారు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి వాజ్‌పేయిగారిని కలిశారు. ఆ ఫలితంగా రూ.224 కోట్లతో పాటు రెండువిడతలుగా 15 లక్షల టన్నుల బియ్యం కేంద్రం నుండి సాయంగా అందింది. కలాంగారిని రాష్ట్రపతిని చేయడంలోనూ, దేశానికి తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగిని అందించడంలోనూ చంద్రబాబుగారు కీలకపాత్ర పోషించారు. ఈ రెండు చారిత్రాత్మక ఘటనలు వాజ్‌పేయిగారి హయాంలోనే జరిగాయి. 2002లో ఆంధ్రప్రదేశ్ 32వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే తొలి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ కూడా అంతే గొప్పగా ఏపీలో నిర్వహించబడ్డాయి. ఈ రెండిటి నిర్వహణతో చంద్రబాబుగారి పేరు ప్రపంచమంతా మారుమ్రోగింది. నిజానికి ఈ క్రీడా సంబరాలను ఢిల్లీలో నిర్వహించాలని ఎన్నో ఒత్తిడిలు వచ్చినా చంద్రబాబుగారి పట్టుదలకు మెచ్చి వాటిని ఏపీలో నిర్వహించుకునేందుకు అవకాశమిచ్చారు వాజ్‌పేయిగారు. అంతదాకా ఎందుకు! హైద్రాబాదులో శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబుగారు ఎంతో పోరాటం చేశారు.

కేంద్ర రక్షణశాఖ పరిధిలోని మిథాని సంస్థ ఇక్కడ విమానాశ్రయ ఏర్పాటును వ్యతిరేకించింది. పట్టువదలని చంద్రబాబుగారు వాజ్‌పేయిగారి వద్దకు వెళ్ళి కూర్చుంటే, శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా వాజ్‌పేయిగారు ఆదేశించారు. ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగుదేశం పార్టీతోనూ, తెలుగుప్రజలతోనూ వాజ్‌పేయిగారికి ఉన్న అనుబంధం ఒక చరిత్రే అవుతుంది. అలాంటి వాజ్‌పేయిగారు ఇకలేరు అన్న భావన బాధిస్తోంది.

''ఎదుటి వారిని కౌగిలించుకోలేనంతగా ఎదుగుదలని ఎప్పటికీ ప్రసాదించకు, అంత కాఠిన్యాన్ని నాకెప్పటికీ ఇవ్వకు'' ఒక కవితలో వాజ్‌పేయిగారు కోరుకున్న కోరిక ఇది. ఎంతటి సమతాభావం! ఎంతటి మానవతా దృక్పథం! ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం!! అందుకే ఆయన అజాత శత్రువు అయ్యారు. నాలాంటి వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. We will miss you Sir!

Advertisements

Latest Articles

Most Read