త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. శనివారం కూడా అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్యనేతల తోనూ చర్చలు జరిపారు. మంత్రివర్గ కూర్పు ఏవిధంగా ఉండాలనే దిశగా సమాలోచనలు జరిపారు. శాస్త్రపరంగా మంత్రివర్గ విస్తరణకు ఇప్పుడు మంచిరోజులు కావడంతో ఆ దిశగా ముఖ్యమంత్రి దృష్టిసారించడం జరిగింది. విస్తరణ అనివార్యం అంటూ తాజాగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆశావహుల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రత్యేకించి ఖాళీగా ఉన్న వైద్యశాఖ, దేవాధాయశాఖకు కొత్త మంత్రులను నియమించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.

cabinet 13082018 2

గత కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణ పై వస్తున్న ఊహాగానాలకు త్వరలోనే తెరదించేందుకు సమాయత్తమవుతున్నారు. మంత్రివర్గ విస్తరణను ఇద్దరికే పరిమితం చేయాలా లేదా నలుగురికి పెంచాలా అనే విషయంలో తీవ్రస్థాయిలో తర్జనభర్జన జరుగుతోంది. రానున్నవి కీలకమైన సాధారణ ఎన్నికలు కావడంతో వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మైనార్టీ వర్గానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని తొలుత ముఖ్యమంత్రి భావించారు. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి అసెంబ్లీక్లీ ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. ఫలితంగా అప్పట్లో మైనార్టీకి మంత్రివర్గం చోటు లభించని పరిస్థితి ఏర్ప డింది. అనంతరం సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన అత్తార్చాంద్ బాషా, విజయవాడకు చెందిన జలీల్ ఖాన్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

cabinet 13082018 3

అయితే వారు ఇరువురు కూడా మైనార్టీ కోటాలో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కానీ జలీల్ ఖాన్ కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఇవ్వడంతో రేసులో నుంచి తప్పుకున్నట్టయింది. ప్రారంభం నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శాసనమండలి సభ్యుడు, ప్రభుత్వ విప్ అయిన ఎమ్.ఏ.షరీఫ్ కూడా మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. అంతే క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన ప్రభుత్వ విప్ పదవి కూడా షరీఫ్ కు దక్కింది. దీనితో మంత్రి పదవి విషయంలో షరీఫ్, జలీల్ ఖాన్లకు బదులుగా అత్తర్ ఛాంద్ భాషాకు మంత్రి పదవి లభించేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. దీంతో రేసులో ముగ్గురు ఉన్నప్పటికీ ఛాంద్ బాషా, షరీఫ్ల మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

cabinet 13082018 4

ఒక స్థానం మైనారిటీ అని తేలిపోవటంతో, మిగతా స్థానం కోసం ఉత్తరాంధ్ర నుంచి, కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి కూడా ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. రాజధాని జిల్లానుంచి మంత్రి పదవికోసం రేసులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు పట్ల ముఖ్యమంత్రి పాజిటీవ్ దృక్పథంతో ఉన్నారు. అదే విధంగా కృష్ణాజిల్లా నుంచి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, పశ్చిమగోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, తూర్పు గోదావరి నుంచి తోట త్రిమూ ర్తులు లేదా చిక్కాల రామచంద్రారావు, కడప జిల్లానుంచి మేడా, కర్నూలు జిల్లా నుంచి ఎస్.వి.మోహన్ రెడ్డి లేదా కేఈ ప్రభాకర్ తదితరులు పదవుల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, పంచాయతీరాజ్ ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ మాత్రమే ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు.

cabinet 13082018 5

అయితే మంత్రివర్గ విస్తరణను రాయలసీమ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాల్లోని పల్నాడులో ఒక్కరికీ చోటు కల్పిస్తే ఏ విధంగా ఉంటుందనే దిశగా ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్కు ముఖ్యమంత్రి తెరదించనున్నారు. మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమని తేలిపో వడంతో శాఖలమార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పథకాల అమలు, శాఖల పనితీరు, మంత్రుల సమర్థతపై ఎప్పటికప్పుడు ముఖ్య మంత్రి నర్వేలు నిర్వహిస్తున్నారు. నివేదికలు తెప్పించుకుంటు న్నారు. కనీసం 40శాతం మంది మంత్రులపై అసంతృప్తి నెలకొంది. పలు సందర్భాల్లో వారిని ముఖ్యమంత్రి నేరుగానే హెచ్చరించినప్పటికీ పెద్దగా ఫలితాలు దక్కిన దాఖలాలు లేవు. ఫలితంగానే కనీసం పదిమంది మంత్రుల శాఖలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది.

రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఆదివారం నుంచి ప్రారంభించింది. 'ముఖ్య మంత్రి యువనేస్తం' పేరుతో రాష్ట్రప్రభుత్వం ఈ భృతిని అందజేయనుంది. ఈ పథకం విద్యావంతులైన నిరుద్యోగ యువత యొక్క నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, వారిని ఉద్యోగులుగా, పోటీదారులను మరియు పరిశ్రమ యొక్క అంచనాలను అధిగమించడానికి అదే విధంగా, వారిని పెట్టుబడిదారులుగా మార్చడానికి రూపొందించబడింది.ఈ పథకం తప్పనిసరిగా నిరుద్యోగ యువతపై భారాన్ని తగ్గిస్తుంది మరియు వారికి త్వరగా ఉద్యోగం పొందటానికి సహాయం చేస్తుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు , మంచి నైపుణ్యాలు గల శిక్షణ పొందటానికి ఈ పథకం ఆర్థికంగా సహాయం చేస్తుంది.

yuvanestam 13082018 2

దరఖాస్తు ప్రక్రియ సమయంలో,అభ్యర్థులు శిక్షణ పొందడానికి వారి ఆసక్తిగల నైపుణ్యాలను ఇవ్వవచ్చు అర్హతగల అభ్యర్థులు ప్రతి నెలా రూ. 1000 ను ప్రభుత్వం నుండి పొందుతారు. ప్రభుత్వం 10 లక్షల మందికి సహాయం చేస్తోంది. అర్హత ప్రమాణాల.. దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అయి ఉండాలి. అతను / ఆమె ఓటరు ఐడి / రేషన్ కార్డును అప్లోడ్ చేయాలి. ఆన్ లైన్ దరఖాస్తు సమీప ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కి లింక్ చేయబడుతుంది. కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. 22-35 సంవత్సరాల వయస్సు ఉండాలి. సాధారణ నిబంధనల ప్రకారం కుల మరియు కమ్యూనిటీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందిఉండాలి. ఒకే కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు గల లబ్ధిదారులు పరిగణనలోకి తీసుకోబడతారు.

yuvanestam 13082018 3

స్థిర /చర ఆస్తులు : వాహనాలు కలిగిన వారు అనర్హులు. 2.5 ఎకరాల బంజరు భూములు , గరిష్టంగా 5.00 ఎకరాల బీడు భూమిని కలిగిన వారు అర్హులు. ఆర్ధిక సహాయం అందించిన వారు/ ఏ రాష్ట్రం / కేంద్ర ప్రభుత్వం కింద స్వయం ఉపాధి పథకం ప్రాయోజిత పథకం కింద రుణం పొందిన వారు మరియు కనీస విద్యార్హత లేని వారు పొందలేరు. పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / ప్రభుత్వ అనుబంధ లేదా స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత లేదు. దరఖాస్తుదారు ఏదైన ప్రభుత్వ సేవ నుండి తొలగించిబడిన ఉద్యోగి అయి ఉండకూడదు. అభ్యర్థి ఏ క్రిమినల్ కేసు లోను దోషి అయి ఉండకూడదు.

yuvanestam 13082018 4

నిరుద్యోగ భృతి కోసం ఈ రోజు నుంచి నమోదు చేసుకోవచ్చు, అందుకోసం ఈ క్రింది లింక్ ద్వారా ఉపయెగించండి. https://portal.e-pragati.in/apjoy/index.html . ఇది కేవలం నిరుద్యోగ భృతి కే పరిమితం కాలేదు మీకు ఇష్ట పూర్వకమైన రంగాన్ని ఎంచుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆయా రంగాల్లో మీరు ఉద్యోగం పోందేలా మీకు ప్రభుత్వమే శిక్షణ ఉచితంగా ఇప్పిస్తుంది.. ఈ విధంగా మీరు ఎంచుకున్న రంగంలో ఉపాధి పోందేలా చేసే గోప్ప కార్యక్రమం ఈ " ముఖ్యమంత్రి యువనేస్తం " కార్యక్రమం. https://portal.e-pragati.in/apjoy/eligibility-criteria.hmtl

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్ 1 నుండి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో పామాయిల్‌ను కూడా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నగరంలోని కృష్ణలంక నెహ్రూనగర్‌లోని చౌకధరల దుకాణం (నెం.300)లో ఆదివారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 300వ నెంబర్ రేషన్ దుకాణం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాసంతృప్తి స్థాయి 37మాత్రమే ఉండడంతో విచారించేందుకు ఆకస్మిక తనిఖీ చేశామని చెప్పారు.

cbn 13082018 2

డీలర్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ప్రజాపంపిణీలో జాప్యం జరిగిందని, అయితే సమయపాలన, సరుకుల పంపిణీ, ధరలు, తూకం వంటి అంశాల్లో కార్డుదారులను విచారించగా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి సామాజిక తనిఖీలు నిర్వహించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, ప్రజాపంపిణీ రంగంలో సంబంధం వున్న ప్రతిఒక్కరిలో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి అన్నారు. కార్డుదారులకు సకాలంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని, ఈవిషయంలో అలసత్వం వహించినా, అవకతవకలకు పాల్పడినా డీలర్‌షిప్‌లను రద్దుచేసేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి పుల్లారావు హెచ్చరించారు.

cbn 13082018 3

ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు అక్టోబరు 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు రాగులు, జొన్నలను సరఫరా చేయనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో లీటల్‌ పామాయిల్‌ రూ.20 సబ్సీడీతో పామాయిల్‌ కూడా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని, ఈ విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. విలేజ్‌మాల్స్‌ ద్వారా తక్కువ ధరకే ని త్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. ప్రైవేట్‌ షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్స్‌తో ఆహార పదార్థాలు, పానీయాలు అమ్మకాలపై ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు విక్రయించే మాల్స్‌పై కఠినచర్యలు తప్పవని మంత్రి తెలిపారు.

ఎన్నికలు ఏవైనా సరే.. టికెట్‌ ఆశిస్తున్న నాయ కుల పనితీరుపై సూక్ష్మ పరిశీలన తర్వాతే.. గెలుస్తాడని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే సీఎం చంద్రబాబు టికెట్లు ఇస్తారని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అందుకు అనుగుణంగానే గత నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జీల పనితీరుపై పలు నివేదికలు తెప్పించుకున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యంపై పార్టీ పరిశీలకులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆరు నెలలకు ఒకసారి గ్రేడింగ్‌లు ఇస్తున్నారు. ఇదే కోవలో, జగన్, తన సలహదారుడు ప్రశాంత్ కిషోర్ చేతే సర్వే చేపించారు. నాయకుడికి టికెట్‌ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది? ప్రభుత్వ సానుకూలత ఎంత? వ్యతిరేకత ఎంత?.. ఇలా పలు అంశాల పై సర్వే సాగింది.

jagansurvey 13082018

అయితే ఈ సర్వే పై వైసీపీ నాయకుల్లో భయం వెంటాడుతోంది. పీకే బృందం సభ్యులు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులకు తెలీకుండానే ప్రజలతో మమేకమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా నాయకులకు ఇప్పటికే జగన్‌ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఓ బృందం జిల్లాలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నివేదిక ఇటీవలే ప్రతిపక్షనేత జగన్‌ చేతికి వెళ్లిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. గత నెల 27న సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించాలని సన్నాహాలు చేశారు. వివిధ కారణాలతో తాత్కాలికంగా వాయిదా పడింది.

jagansurvey 13082018

త్వరలోనే భేటీ ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా ముఖ్య నాయకులకు సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఇద్దరు నియోజకవర్గ ఇన్‌చార్జిలకు సర్వే ఫలితాలు ఆశాజనకంగా లేవని, ఏడాదిలోపు మెరుగు పడకపోతే మరొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోలేదని విశ్వసనీయ సమాచారం. సర్వే జరిగిన విషయం నిజమేనని, ఏ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని ఓ వైసీపీ నాయకుడు పేర్కొన్నారు. జగన్ పార్టీ టికెట్ కోసం, చాలా మంది అశావాహులు లైన్ లో ఉన్నారని, అందుకే సర్వే చేసి మరీ టికెట్ ఇస్తున్నాం అంటూ, ఆ నాయకుడు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తరువాత, అసలు ముందు జగన్, గెలుస్తాడో లేదో, పులివెందులలో సర్వే చేసారో లేదో అని పార్టీలోనే సటైర్ లు వేసుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read