అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టారు అంటూ, ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు, రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చి, వారంలోగా సమాధానం చెప్పండి అంటూ, నోటీస్ పంపించిన విషయం తెలిసిందే. ఏపి సర్కార్ ఇచ్చిన మెమోకు, ఏబీ వెంకటేశ్వరరావు ధీటుగా సమాధానం ఇచ్చారు. రూల్ ని రూల్ తోనే కొడుతూ, ఆయన ఇచ్చిన సమాధానంతో ప్రభుత్వం అవాక్కయ్యింది. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కు ఏబీ వెంకటేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. పెగాసిస్ పై తన పేరు లాగి అనవసర రాద్దాంతం చేస్తున్నారు అంటూ ఆయన గత నెలలో ప్రెస్ మీట్ పెట్టి, పెగాసిస్ అనేది ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ప్రెస్ మీట్ లో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగానే, కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల పైన పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. అలాగే తన సస్పెన్షన్ పైన కూడా, ఆయన మీడియా సమావేశంలో అనేక ఆధారాలు రిలీజ్ చేసారు. అయితే ఈ ప్రెస్ మీట్ పైన ప్రభుత్వం షోకాజ్ నోటీస్ పంపించింది. దీని పైన వివరణ ఇస్తూ, వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలు చేస్తే స్పందించకూడదా అంటూ, ఆయన ఎదురు ప్రశ్నిస్తూ, ఒక విధంగా దమ్ముగా సమాధానం చెప్పారు.

abv 06042022 2

ఆలిండియా సర్వీస్ రూల్స్ రూల్-17కి అనుగుణంగానే తాను ఆ రోజు తన పైన వచ్చిన వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు సమాధానం చెప్పానని లేఖలో తెలిపారు. తాను మీడియా సమావేశంలో ఎక్కడా కూడా ఎవరినీ విమర్శించ లేదని, పెగాసిస్ కొనలేదు అని మాత్రమే చెప్పానని అన్నారు. ఆలిండియా సర్వీస్‌ రూల్‌- 6 ప్రకారం అధికారిక అంశాల మీద స్పష్టత ఇవ్వొచ్చు అని ఉందని, ఆ రూల్ ప్రకారమే తాను నడుచుకున్నా అని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అని మాత్రమే ఉందని, తాను ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని విమర్శించ లేదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తన గౌరవాన్ని కించపరుస్తూ, తన కుటుంబాన్ని లాగితే, స్పందించకుండా ఎలా ఉంటాను అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రాధమిక హక్కుతోనే, తన పైన వచ్చిన వ్యక్తిగత ఆరోపణల పై వివరణ ఇచ్చానని లేఖలో తెలిపారు. అలాగే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి తన పైన వేసిన ట్వీట్ ను కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా లేఖలో తెలిపారు. రూల్ తో కొట్టటంతో, ఇప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

నిన్న ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే జగన్ వెళ్లలేదని, ఢిల్లీ నుంచి పిలుపు వస్తే వెళ్ళారని కూడా టాక్ నడుస్తుంది. నిన్న ప్రధాని మోడీని కలిసిన జగన్, అమిత్ షా, నిర్మలా సీతారమాన్ షెకావత్, గడ్కరీ లాంటి కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. అయితే అసలు వీళ్ళను ఎందుకు కలిసారు, ఏమి చర్చించారు అనే విషయం పైన ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఎప్పటి లాగే, స్పెషల్, స్టేటస్, పోలవరం, అప్పులు, విభజన హామీలు అని బ్లూ మీడియా డబ్బా కొట్టినా, అధికారికంగా మాత్రం ఈ సారి కూడా సమాచారం లేదు. అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి మీడియా కంట పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రెండు రోజుల పర్యటనలో, జగన్ మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రధానితో సమావేశం అయిన తరువాత కూడా, బయట మీడియా ప్రతినిధులు ఉన్నా, అటు వైపు కూడా చూడాకుండా జగన్ జారుకున్నారు. ఇంతకు ముందు కూడా, జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినా, ఎప్పుడూ మీడియా నుంచి దూరంగా వెళ్ళిపోయే వారు. మొదటి సారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రమే జగన్ మీడియాతో మాట్లాడారు. అయితే అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తెలిసి తెలియకుండా చెప్పిన మాటలతో నవ్వుల పాలు అయ్యారు.

delhi 06042022 2

అప్పట్లో ఆయన మాట్లాడుతూ, స్పెషల్ స్టేటస్ మెడలు వంచి వాళ్ళని అడిగే పరిస్థితి లేదు. ఢిల్లీ వచ్చిన ప్రతి సారి, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అంటూ, జగన్ చేసిన వ్యాఖ్యలతో, జగన్ ఎంత బలహీనుడు అనే విషయం అర్ధమైంది. దీంతో అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. మీడియా సమావేశం గురించి పక్కన పెట్టినా, అసలు ప్రధానికి కానీ, మంత్రులకు కానీ, జగన్ ఏ మెమోరాండమ్ లు ఇస్తున్నారు అనే విషయం పై కూడా, స్పష్టత ఇవ్వటం లేదు. అసలు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా, లేక పర్సనల్ విషయాలు గురించి చెప్తున్నారా అనేది తెలియటం లేదు. పార్టీ వైపు నుంచి మాత్రం ఒక వాట్స్ అప్ మెసేజ్ మీడియాకు పంపించి, ఢిల్లీలో మెడలు వంచేసాం అని చెప్తారు. దీని పై ఎన్ని విమర్శలు వచ్చినా,న జగన్ మాత్రం మీడియాకు మొఖం చూపించలేదు. అలాగే అమరావతి రైతులు ఢిల్లీలో ఉండటంతో, వాళ్ళు వచ్చి ఎక్కడ తన ముందు ఆందోళన చేస్తారో అని, గట్టి బందోభస్తు పెట్టుకుని, మొత్తానికి మీడియా కంట పడకుండా రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేసారు.

పేటీయం బ్యాచ్ తో పాటు, పైడ్ జర్నలిస్ట్ లను వాయించి పడేసారు టిడిపి ఎంపీలు. పేటీయం డబ్బుల కోసం ఆశ పడి, ఫేక్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువనే చెప్పుకోవాలి ఈ కోవలోనే మేము జరనలిస్ట్ లం అని చెప్పుకునే ఏర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. ఈ పేటీయం ఏర్నలిస్ట్ లకు, ఫేక్ చేస్తేనే కదా కాసులు వచ్చి పడేది. అందుకే ప్రతి క్షణం టిడిపి పైన ఫేక్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో డీఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో 20కు పైగా రాజకీయ పార్టీలు పాల్గున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీ వ్యవస్థ కోరుకునే టిడిపి కూడా, ఈ కార్యక్రమానికి హాజరు అయ్యింది. ఇంకేముంది, ఫేక్ బ్యాచ్ రెడీ అయిపొయింది. టిడిపి పైన ఫేక్ చేస్తే చాలు, మాకు డబ్బులు వస్తాయి అని భావించి, ఫేక్ స్టొరీ అల్లేసారు. సోనియా గాంధీతో టిడిపి ఎంపీలు ఉన్న ఫోటో చూపించి, మళ్ళీ టిడిపి కాంగ్రెస్ కలిసిపోతున్నాయి అంటూ ఫేక్ చేసి పడేసారు. అక్కడ డీఏంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అని కాకుండా, సోనియా మీటింగ్ పెడితే టిడిపి వెళ్ళింది అంటూ ప్రచారం చేసారు. దీంతో ఈ ఫేక్ ప్రచారం పై, టిడిపి, ఆ 4పైడ్ ఏర్నలిస్ట్ లకు, పేటీయం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చింది.

tdp 05042022 2

టిడిపి ఎంపీలు గల్లా, రామ్మోహన్, కేశినేని నాని ఒక ప్రకటన విడుదల చేసారు. తాము తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం మేరకు, ఢిల్లీలో డీఏంకే కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్లామని అన్నారు. ఈ కార్యక్రమానికి, టిడిపి ఎంపీలతో పాటుగా, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఈ వేడుకకు హాజరు అయ్యరని అన్నారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, శుభకార్యం అని, మనలని ఒకరు పిలిస్తే ఎలా ఒక వేడుకకు వెళ్తామో, అలాగే వెళ్ళమని అన్నారు. తమతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా వచ్చారని, అయితే అక్కడ ఫోటోలను తీసి, కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజకీయాల కోసం శుభకార్యానికి రాజకీయాలు అంటగట్టడం దారుణం అని అన్నారు. తాము ఏమి చేసినా స్వచ్చమైన రాజకీయలు చేస్తాం కానీ, చాటు మాటు రాజకీయలు చేయం అని అన్నారు. తప్పుడు రాజకీయాలు మానుకుని, ఉండాలని, టిడిపి పార్టీ ఎంపీలు తమ ప్రెస్ నోట్ లో తెలిపారు. ఇప్పటికైనా ఈ పైడ్ బ్యాచ్, ఇలాంటి విష ప్రచారం, ఫేక్ ప్రచారం కాకుండా, వాస్తవాలు రాస్తుందని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ అధికారులు విచిత్ర ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యంగా APEPDCL గత రాత్రి జారీ చేసిన ఆదేశాలు చూసి షాక్ తిన్నారు. ప్రతి నెల చివరి వారంలో మీటర్ రీడర్లు వెళ్లి, విద్యుత్ ఎంత కాల్చారు, ఎంత బిల్లింగ్ అయ్యింది అనేది తీసి, స్పాట్ బిల్లింగ్ రూపంలో, రీడింగ్ తీసి, వెంటనే కరెంటు బిల్లు తీసి వెళ్తారు. అయితే ఈ నెలలో మాత్రం విచిత్ర ఆదేశాలు వచ్చాయి. రీడింగ్ తీయండి కానీ, బిల్లు ఎంత వచ్చిందో చెప్పొద్దు అని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు ఎంత పెరిగాయో అర్ధం అవ్వాలి అంటే, బిల్లు ఇస్తేనే తెలిసేది. ఈ నెలలో బిల్లు ఎంత, గత నెలలో బిల్లు ఎంత వచ్చింది, ఎంత పెరిగింది అనేది ప్రజలు పోల్చి చూసుకుంటారని, ఎంత ఎక్కువ పెరిగింది అనేది తెలిసిపోతుంది కాబట్టి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, విద్యుత్ శాఖ అధికారులు, ఇటువంటి విచిత్ర ఆదేశాలు జారీ చేసారు. రీడింగ్ తీస్తాం , బిల్లులు ఇవ్వం, SMS రూపంలో మీరు ఎంత కట్టాలో పంపిస్తాం అని చెప్తున్నారు. SMSలో సంక్షిప్త సందేశం ఉంటుంది, అంటే అందులో బిల్లు మాత్రమే ఉంటుంది. రీడింగ్ తీసేసి బిల్లు ఇస్తే, ప్రజలు ఎంత పెరిగాయో చుసుకోలేరని, ఈ విధంగా ప్రజల ఆగ్రహం తగ్గించుకోవచ్చని చూస్తున్నారు.

current 06042022 2

అయితే ప్రజలు మాత్రం, ఈ విచిత్ర ఆదేశాలు చూసి షాక్ తిన్నారు. పోయిన నెల ఎండలు విపరీతంగా పెరిగిపోవటంతో, సహజంగా ఎక్కువ సేపు విద్యుత్ వాడి ఉంటారు. ఈ నెల బిల్లు మామూలుగా ఎక్కువ వస్తుందని, అయితే ఇప్పుడు పెరిగిన విద్యుత్ చార్జీలతో, మరింత పెరిగే అవకాసం ఉందని, ఎంత పెరిగిందో తాము చూడకుండా, విద్యుత్ అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని, ప్రజలు వాపోతున్నారు. SMSలు ఇస్తే తమకు అర్ధం కాదని, నేరుగా బిల్లు ఇవ్వాలని, ఎక్కువ మంది వినియోగదారులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం సాఫ్ట్ వేర్ రెడీ అవ్వలేదని, అందుకే ఇలా చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ప్రజల నుంచి ఇంత వ్యతిరేక వస్తుంటే, అధికారులు ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి. మరో పక్క విద్యుత్ చార్జీలు ఇలా ఉంటే, రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా, 6 గంటలకు తక్కువగా కరెంటు తీయటం లేదు. ఒక పక్క చార్జీల బాదుడు, మరో పక్క విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read