ఒక పక్క బీజేపీ , తెలుగుదేశం నేతలు కత్తులు దూస్తూ, చంద్రబాబు పై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే, బీజేపీ ఎంపీ మాత్రం చంద్రబాబు భేష్ అంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సీఎం చంద్రబాబు నాయుడ్ని బీజేపీ ఎంపీ గంగరాజు మెచ్చుకున్నారు. ఈ మాటలు విన్న గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు బీజేపీ నేతలు ఒకింత కంగుతిన్నారు. చంద్రబాబు తాముపోరాటం చేస్తుంటే మన నేతే ఆయన్ను పొగడడమేంటి? అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అయితే గోకరాజు కూడా చాలా తెలివిగా మాట్లడారు. రాష్ట్రంలో చంద్రబాబు చాలా గొప్ప నేత అంటూ, చెప్పారు. రాష్ట్రం వరకు చంద్రబాబు గొప్ప నేత అని, దేశానికి మోదీ గొప్ప నేత అంటూ బీజేపీ ఎంపీ గంగరాజు కితాబిచ్చారు.

cbn gangaraju 050820018 2

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జాతీయనేత కావాలంటే చంద్రబాబు గొప్పతనాన్ని నిరూపించుకోవాలని అన్నారు. అయితే వెంటనే అక్కడ ఉన్న బీజేపీ నేతలు కంగుతింటంతో ట్యూన్ మార్చారు. విభజన తర్వాత కట్టుబట్టలతో వస్తే రాష్ట్రానికి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. ఉపాధి నిధులు లేకుండా గ్రామాల్లో ఏం చేశారో చెప్పాలని, సహాయం పొందాక మర్చిపోతే అది విశ్వాసఘాతుకమేనని గంగరాజు ఆరోపించారు. అయితే.. మొదట ఎంపీ గంగరాజు మాటలు విన్న బీజేపీ నేతలు షాకయినప్పటికీ ఆ తర్వాత ఆయన చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించడంతో సరిసమానమయ్యాయిలే అని చెప్పుకుంటున్నారట. అయితే గంగరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడేది చాలా తక్కువ.. కాని మాట్లాడితే మాత్రం, ఎక్కడ పంచ్ పడాలో అక్కడ పడుతుంది... అవిశ్వాస తీర్మానం సమయంలో, బెజవాడ మోటార్ ఫీల్డ్ భాషాలో, కేశినేని నాని ఇచ్చిన లాస్ట్ పంచ్ తో, ఫీజులు ఎగిరిపోయాయి. వాట్ ఏ ఆక్షన్ అంటూ మోడీ చేసిన రాజకీయ ఉపన్యాసం తుస్సు మంది. అయితే, ఈ రోజు కూడా నాని, అదే రకమైన పంచ్ వేసారు. జీవీఎల్‌ నరసింహారావు ఉన్నట్టు ఉండి ఊడిపడి, ఈ రోజు రాష్త్రం పై చేస్తున్న ఆరోపణలు వింటున్నాం. రూ.53 వేల కోట్లను పర్సనల్ అకౌంట్స్‌లో వేశారని, పీడీ స్కాంలో చంద్రబాబు దొరికిపోయారని, కామన్వెల్త్ , 2జీ స్కాంల కంటే పీడీ కుంభకోణం పెద్దదని, తెగ హడావిడి చేస్తున్నాడు జీవీఎల్.

kesineni 05082018 2

దీంతో కేశినేని నాని, జీవీఎల్‌ నరసింహారావు పై, బెజవాడ స్టైల్ పంచ్ వేసారు. నరసింహరావుకు ఏపీలో అడ్రస్‌ లేదని, ఆయన అడ్రస్‌ ఒకచోట.. మాట్లాడేది మరోచోట అంటూ పంచ్ పేల్చారు. జీవీఎల్, C/O ఢిల్లీ ఆధర్ కార్డు అంటూ ఎద్దేవాచేశారు. ఢిల్లీ ఆధర్ కార్డు పెట్టుకుని, మన దగ్గరకు వచ్చి, ఎదో అయిపొయింది అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. జీవీఎల్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల అవినీతి అంటున్న జీవీఎల్‌, వెయ్యి రూపాయల అవినీతి జరిగిందని నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. నీకు డైరెక్ట్ సవాల్, లక్ష కోట్లు అవసరం లేదు, వెయ్య రూపాయలు అవినీతి చూపించు అంటూ జీవీఎల్ కు గట్టి పంచ్ ఇచ్చారు నాని. రాష్ట్రానికి హోదా కోసం పోరాటం చేస్తుంటే పార్లమెంట్‌కి ముప్పు వస్తుందని జీవీఎల్‌ అనడం దారుణమని నాని అన్నారు.

kesineni 05082018 3

మరో పక్క, ఇప్పటికే ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా జీవీఎల్ కు జ్ఞానోదయం చేసారు. జీవీఎల్ కు ప్రజా ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేదని, రేపు విజయవాడకు వస్తే అవగాహన కల్పిస్తామని కుటుంబరావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… పీడీ అకౌంట్ నుంచి నిధులు మళ్లాయని జీవీఎల్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. పీడీ అకౌంట్ నుంచి నిధులు మళ్లాయని రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్దమన్నారు. జీవీఎల్ చేసిన ఆరోపణల వల్ల లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచారన్నారు. పీడీ అకౌంట్‌లో రూ.20 వేల కోట్లు మురిగిపోతున్నాయంటూ.. జీవీఎల్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిధులే ఉంటే రాష్ట్రం ఎందుకు అప్పులు చేస్తుందని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేస్తుందని అనుమానం ఉంటే ఏపీ ప్రభుత్వ ఖాతాలు సరిగ్గా లేవనీ సీబీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.

జేఎన్టీయూ ప్రాంగణంలోని ఐటీ ఇంకుబేషన్‌ భవనంలో ఆదివారం కేంద్రమంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తరగతులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కేంద్రమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, రిజిస్ట్రార్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రిని ప్రశ్నించారు. విభజన హామీలు ఏమయ్యాయి అని ఆ స్టేజ్ మీదే, కేంద్ర మంత్రిని నిలదీశారు. జవడేకర్‌ మాత్రం నవ్వుతూ ఉండి పోయారు.

javdekar 05082018 2

మరో పక్క, ప్రకాశ్ జవడేకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి గంటా మాట్లాడుతూ కేంద్ర వర్సిటీలు కేవలం భూమిపూజకు మాత్రమే నోచుకున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వ్యాఖ్యలను మంత్రి గంటా ఖండించారు. పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు. 7వర్సిటీలకు 3,508 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని ఆయన తెలిపారు. వర్సిటీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

javdekar 05082018 3

దీని పై స్పందించిన, కేంద్రమంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 7వర్సిటీలకు వందల కోట్లు ఇచ్చామని అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని జవడేకర్‌ అన్నరు. త్వరలో సెంట్రల్‌ వర్సిటీ భవనాలకు శంకుస్థాపనలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి, ఏపి వచ్చిన కేంద్రం మంత్రికి ప్రజల ముందే, నిలదీశారు, తెలుగుదేశం ఎంపీ, మంత్రి. ప్రకాష్‌ జవడేకర్‌ మాత్రం, అందరి బీజేపీ నాయకుల లాగే, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, అన్నీ ఇచ్చేసాం, ఇవి ఇచ్చాం, అవి ఇచ్చాం, అయినా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం కోసం విమర్శలు చేస్తుంది అని చెప్పి తప్పించుకున్నారు.

కాపు రిజర్వేషన్ల విషయం పై జగన్ ఎన్ని మాటలు మరుస్తున్నాడో చూస్తున్నాం. ఒక రోజు అది కేంద్ర పరిధిలోని అంశం, నాకు సంబంధం లేదు అన్నాడు. మరో రోజు, నా మాటలు వక్రీకరించారు, నేను రిజర్వేషన్ ఇస్తాను అంటూ, కాపులని అన్ని విధాలుగా జగన్ మభ్యపెడుతున్నారు. పాదయాత్రలో కూడా జగన్ కు నిరసనలు తగులుతూనే ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జగన్ కు ఇబ్బంది అవుతున్న వేళ, అనుకోని వ్యక్తి వచ్చి జగన్ కు మద్దతు ఇచ్చాడు. జగన్ చెప్పింది చాలా కరెక్ట్ అని, జగన్ మాట మార్చటం తప్పేమీ కాదని, ఆ వ్యక్తి చెప్పారు. అనుకోని వ్యక్తి అని ఎందుకు అంటున్నాం అంటే, ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదు. తెలంగాణ వ్యక్తి. అతనే మోత్కుపల్లి నరసింహులు. మొన్నీ మధ్య ఆపరేషన్ గరుడ టీంలో చేరారు.

jagan 05082018 2

కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. కాపులను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొని చంద్రబాబునాయుడు వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోకూడదని ఆయన సూచించారు. ఇద్దరూ కలిసి కట్టుగా, చంద్రబాబు పై పోరాడాలని, మా లాంటి వారి సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు. అందరి లక్ష్యం చంద్రబాబుని దించటమే కావాలని అన్నారు.

jagan 05082018 3

తన లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తాను ఏ పార్టీలో చేరబోనని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. కాపులను తన స్వార్థానికి ఉపయోగించుకొని వదిలేశాడని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.ఈ విషయంలో బాబు వైఖరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కాపులకు హితవు పలికారు. రెండు రోజుల క్రితం మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. జనసేన చీఫ్ ను కలుస్తారని కూడ ప్రచారం సాగింది. అయితే పవన్ కళ్యాణ్ ను ఆయన కలువలేదు.

Advertisements

Latest Articles

Most Read