ఢిల్లీలో ఆధర్ ఉండి, ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన జీవీఎల్ నరసింహారావు, అమిత్ షా ఆదేశాల మేరకు, వారినికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పై ఎదో ఒక విమర్శ చేస్తూ ఉంటాడు. వారం అంతా ఎక్కడ ఉంటాడో తెలీదు కాని, ఎదో ఒక రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఎదేదో మాట్లాడతాడు. ఈయన అలా మాట్లాడతాడో లేదో, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు లైన్ లోకి వచ్చి, ఫుల్ కోటింగ్ ఇచ్చి వదిలిపెడతారు. ఇంకా అంతే, మళ్ళీ ఆ టాపిక్ గురించి జీవీఎల్ మాట్లాడడు. మళ్ళీ కొత్త టాపిక్ పట్టుకుని, అర కోటు ఒకటి వేసుకుని వస్తాడు. వచ్చి, ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడే పని చేస్తాడా అంటే, అలాంటిది ఏమి ఉండదు. అమరావతి యుసిల దగ్గర నుంచి, అన్నీ ఇలాంటి గాల్లో ఆరోపణలు చేసి, కుటుంబరావు చేత కోటింగ్ తిని ఢిల్లీ వెళ్తాడు. ఈ కోవలోనే నిన్న మరో కొత్త ఆరోపణతో వచ్చాడు జీవీఎల్.
కామన్వెల్త్, 2జీ స్కాంల కంటే పెద్దది ఏపీలో జరిగిన పీడీ కుంభకోణమన్నారు. రూ.53వేల కోట్లను పర్సనల్ అకౌంట్స్‌లో వేశారని.. అవి దారిమళ్లాయని ఆరోపించారు. దేశంలోనే ఇదో పెద్ద స్కాం అంటూ, జీవీఎల్ హడావిడి చేస్తున్నాడు. మరి కేంద్రంలో అధికారం నీదే కదయ్యా, మీ మోడీకి, అమిత్ షా కి చెప్పి, ఇది ప్రూవ్ చేయ్యచ్చుగా అంటే, మళ్ళీ అడ్రెస్స్ ఉండడు. అయితే, ఆదివారం అని కూడా చూడకుండా, పాపం జీవీఎల్ ని ర్యగింగ్ చేసి పెట్టారు కుటుంబరావు. పీడీ అకౌంట్లంటే అర్థం తెలియని జీవీఎల్.. మిడి, మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు కుటుంబరావు. పీడీ అకౌంట్లలో రూ.20వేల కోట్లు మురిగిపోతున్నాయని మాట్లాడం సరికాదన్నారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనకు ట్రెజరీలో నిధులు నిలువ ఉండవనే విషయం తెలియకపోవడం దారుణమన్నారు.
యూపీ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీఎల్, ఆంధ్రప్రదేశ్ లో కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. జీవీఎల్‌కు దమ్ముంటే ఏపీలో కనీసం వార్డు మెంబర్‌గా అయినా గెలవాలని కుటుంబరావు సవాల్ చేశారు. ఇక యూసీల విషయానికొస్తే.. కేంద్రంలో చాలా శాఖలు యూసీలు ఇవ్వలేదని కాగ్ చెప్పిందని.. దీనిపై జీవీఎల్ విరణ ఇవ్వగలరా అని ప్రశ్నించారు కుటుంబ రావు. ఆరోపణలు చేయడం కాదని దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్నారు. మొత్తానికి జీవీఎల్, ప్రతి వారం, కుటుంబరావు చేతిలో పడే కోటా, ఈ వారం కూడా తీసుకుని, ఢిల్లీ బయలుదేరారు. పాపం జీవీఎల్ ను చూస్తుంటే, అదేదో సినిమాలో బ్రాహ్మీ సీన్ గుర్తుకువస్తుంది.