రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనులను చూడ్డానికి గోదావరి నది వద్దకు ఇక వెళ్లనవసరం లేదు. ఇంటి నుంచే నేరుగా టీవీలో వీక్షించే అవకాశాన్ని రాష్ట్ర ఫైబర్ నెట్ సంస్థ కల్పించింది. సంస్థ పరిధిలోని వినియోగదారులకు ఆదివారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సంబంధిత పనులు చేయిస్తోంది. చుట్టూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పైబరినెట్ తో అనుసంధానం చేశారు. ఈ కనెక్షన్లు ఉన్న వారు రిమోట్ తో మెనూ పేజీలో సర్లెన్స్ అప్లికేషన్ ను ఎంపిక చేయగానే పోలవరం లోగో కనిపిస్తుంది.

polavaram 06082018 2

దాన్ని ఎంపిక చేస్తే వరుసగా అయిదు వీడియో కెమెరాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా ప్రాజెక్టు దృశ్యాలను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ఎంపిక చేసుకున్న కెమెరాలతో స్పిల్ వే, స్పిల్ వే కెనాల్ నిర్మాణ పనులు చూడొచ్చు. ఇంట్లో టీవీ నుంచి ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా చూస్తున్న వినియోగదారులు కొత్త అనుభూతికి లోనవుతున్నారని ఏపీ ఫైబర్ నెట్ అధికారులు చెబుతున్నారు. మరో పక్క, పోలవరం పై ఈ రోజు రివ్యూ జరిగింది. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను వెంటనే తీసుకురావాలని ఇంజనీరింగ్‌ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి 70వ సారి వర్చువల్‌ పద్ధతిలో పోలవరం పనులపై సమీక్షించారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను డ్రోన్‌ కెమెరాల సాయంతో పరిశీలించారు. పనుల వివరాలను ప్రాజెక్టు ప్రభుత్వ సలహాదారుడు రమేశ్‌బాబు వివరించారు.

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ ఒక ఆంధ్రా బ్రహ్మానందం అని, ప్రధాని నరేంద్ర మోదీకి ఊడిగం చేయడం జీవీఎల్ నైజమని, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అని అన్నారు. .కన్నా అవినీతిపై జీవీఎల్ సీబీఐ విచారణ ఎందుకు కోరరని ప్రశ్నించారు. మోదీ తాతగారి సొమ్ము ఏమైనా ఏపీకి ఇస్తున్నారా? అని ప్రశ్నించిన బుద్ధా వెంకన్న, పోస్టర్లు వేసి మరి, మిమ్మల్ని ద్రోహులు అని ప్రజలకు చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో పక్క, జీవీఎల్‌ నరసింహరావు పై, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్.

gvl 06082018 2

జీవీఎల్‌ పొద్దెరగని పిచ్చోడని, ఏది పడితే అది వాగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని దారి మళ్లించేందుకు జీవీఎల్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎల్‌, కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీయే కాబట్టి సీబీఐ విచారణ చేపట్టమని సలహా ఇచ్చారు. అంతే కాకుండా వీటితో పాటు పీడీ యాక్టు, రాఫెల్‌ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. జీవీఎల్‌ నరసింహారావుపై మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

gvl 06082018 3

పీడీ అకౌంట్స్‌ అంటే ఏంటో జీవీఎల్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. పీడీ అకౌంట్స్‌లో అవినీతికి ఆస్కారం ఉండదని, ఆర్థిక పరిజ్ఞానం లేని జీవీఎల్‌ రాజ్యసభలో ఏం చర్చిస్తారని నిలదీశారు. పీడీ అకౌంట్స్‌ అనేవి ఆర్ధికశాఖ నియంత్రణలో జరిగే కార్యక్రమాలని, పీడీ అకౌంట్స్‌కు 2జీ స్కామ్‌కు పోలిక ఏంటని మరోసారి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 72,652 పీడీ ఖాతాలు నిర్వహించేవారని, పీడీ ఖాతాల్లో అత్యధికం స్థానిక సంస్థలకు చెందినవేనని యనమల రామకృష్ణుడు తెలిపారు. పీడీ ఖాతాలపై జీవీఎల్‌కు కనీస అవగాహన లేదని, బీజేపీ నేతల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవాచేశారు. అన్ని రాష్ట్రాలు పీడీ ఖాతాలను నిర్వహిస్తాయని, స్థానిక నిధులు దుర్వినియోగం కాకుండా పీడీ ఖాతాలు ఓపెన్‌ చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 72,652 పీడీ ఖాతాలు ఉన్నాయని, 14వ ఆర్థికసంఘం నిధుల కోసం, అదనంగా ఏపీ 13199 పీడీ ఖాతాలను ఓపెన్‌ చేసిందని కుటుంబరావు వెల్లడించారు. గుజరాత్‌లో 29వేలు, పశ్చిమబెంగాల్‌లో34వేల బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది అవయవ దానానికి ముందుకు వచ్చి.. చాటిన ఉదారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆనందాన్ని వెల్లిబుచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద నిర్వహించిన ఒక కార్యక్రమంలో అవయవ దాతలు ఇచ్చిన అంగీకార పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) అందజేసింది. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు... పట్టణ ప్రాంతాల్లో అవయవ దానం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) ఉద్యమంలా చేపట్టడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే స్వచ్చంధగా తమ అవయవాలను దానం చేసేందుకు లక్షా 20 వేల మంది దాతలు ముందుకు వచ్చారు. నేటి నుంచి అవయవ దానం వారోత్సవాల నేపథ్యంలో అవయవ దానాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

cbn donation 06082018 2

మరణించే వ్యక్తి తన అవయవాలను దానం చేసే సంప్రదాయం ప్రజల్లో మరింత పెరగాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మనస్సుల్లో నుంచి మూఢనమ్మకాలను పారద్రోలి.. వాటి నుంచి ప్రజలను చైతన్యం చేసి అవయవ దానం వైపు మరలించాలన్నారు. ఇటువంటి కార్యక్రమంలో మెప్మా పాల్గొడం.. సమాజానికి సేవ చేయాలని ముందుకు రావడం చాల గొప్ప విషయం. మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఆదాయం కూడా పెరిగే అన్ని మార్గాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తానూ కూడా అవయవ దానాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ఈ సందర్భంలో ప్రకటించిడం విశేషం. ఈ కార్యక్రమంలో వచ్చిన సూచన మేరకు అవయవ దానంను పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లో అవయవదానం ఒక షరతు గా పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

cbn donation 06082018 3

అవయవ దానంపై మరింతగా చర్చ జరగాలి... మరో వారంలో వచ్చే అవయవ దాన దినోత్సవం నాటికి రాష్ట్రమంతా భారీగా దాతలను నమోదు చేయించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు... ఇలా అవయవాల దానం గురించి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. అవయవ దానం కార్యక్రమానికి జీవన మిత్ర అనే వ్యవస్థ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. అవయవ దాతలకు నగదు రూపం లోనే కాకుండా ఇతరత్రా ప్రోత్సాహం కూడా ఇవ్వాలన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా రెండు గంటల పాటు ఈ అంశంపై చర్చ జరగాలని అభిలషిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ ప్రకటించారు.

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా సీఎం రమేష్‌ ఎన్నికయ్యారు. 106 ఓట్లతో టీడీపీ ఎంపీ రమేష్ గెలుపొందారు. 69 ఓట్లతో బీజేపీ ఎంపీ భూపేంద్రయాదవ్ ఎన్నికయ్యారు. ఇక జేడీయూ అభ్యర్థి మాత్రం ఓటమి చవిచూశారు. కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐలు రమేష్‌కు ఓటేశాయి. సీఎం రమేష్ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఆయన ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తన గళాన్ని విప్పుతున్నారు. విభజన హామీల అమలుపై రాజ్యసభ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ 11 రోజుల పాటు దీక్ష చేశారు. దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్‌ వచ్చే వరకు పోరాటం ఆగదని అప్పట్లో స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను విరమించారు.

ramesh 06082018 2

కేంద్ర ప్రభుత్వ వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్పించే నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) పర్యవేక్షిస్తుంది. ఇదే ఈ కమిటీ ప్రధాన విధి. ఇది భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కొనసాగుతోంది. ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు పార్లమెంటు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో 22 మంది ఎంపిక చేసిన ఎంపీలు (15 మంది లోక్‌సభ, 7 మంది రాజ్యసభ) సభ్యులుగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడిని చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సభ్యుడి ఎంపికను పార్లమెంటు స్పీకర్ చూసుకుంటారు.

ramesh 06082018 3

రైల్వే, రక్షణ, పోస్టల్ శాఖలతో పాటు ఇతర ప్రధాన పౌర శాఖలకు సంబంధించిన వ్యయాలపైన కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది. పార్లమెంటు ద్వారా ఏ శాఖలకు ఎంత నిధులు మంజూరయ్యాయి. వాటి వినియోగం, ఖర్చులపై ఆరా తీస్తుంది. అలాగే వివిధ శాఖల వ్యయాలపై కాగ్ ఇచ్చిన నివేదికలపైనా పరిశీలన జరుపుతుంది. ఆయా శాఖలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని అధికంగా ఖర్చు పెడుతున్నాయో ? లేదా? పర్యవేక్షణ జరుపుతుంది. అంటే కేవలం పెట్టిన ఖర్చులపై మాత్రమే కాకుండా పెడుతున్న ఖర్చులపై కూడా కన్నేసి ఉంచుతుంది. ఆయా శాఖల ఖర్చుల పద్దులపై ఉన్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. వాటిని యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచుతుంది. 2011లో 2జీ కుంభకోణంలో జరిగిన అవకతవకల్ని ప్రజా పద్దుల కమిటీ ప్రజల దృష్టికి తీసుకువచ్చింది.

Advertisements

Latest Articles

Most Read