ఎలా అయినా పోలవరం ఆపాలని బీజేపీ, ఎలా అయినా పూర్తి చెయ్యాలని చంద్రబాబు... ఇలా, గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది... ప్రతి సారి చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు... నవయుగకు పనులు అప్పగించటం, కాఫర్ డ్యాం కోసం పర్మిషన్ తేవటం, ఇలా అన్ని విషయల్లో చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు. తాజాగా డీపీఆర్-2 విషయంలో కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతుంది. దీని పై కూడా చంద్రబాబు, పట్టు వదలకుండా, అధికారుల చేత ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళకి విసుగు రావాలి కాని, మీరు మాత్రం వెనుకడు వెయ్యద్దు, ఏది కావలి అంటే అది ఇవ్వండి, ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు ఇవ్వండి అని అధికారుల్ని పురమాయిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబం ధించి న డీపీఆర్-2పై కేంద్రం లేవనెత్తిన పలు అనుమానాల నేపథ్యంలో సరికొత్త నివేదికలను రూపొం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యుసీ) ఆదేశాలతో రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ఇందుకు సంబంధించిన గణాంకాలపై మదింపు ప్రక్రియను వేగవంతం చేశారు.
ఇటీవల ఢిల్లిలో జలవనరుల శాఖాధికారులతో జరిగిన భేటీలో ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సవరించిన అంచనాలతో రూపొందించిన డీపీఆర్ -2ను కేంద్రానికి గతంలోనే సమర్పించగా, దానిపై కేంద్ర జలవనరుల సంఘం అధికారులతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ సైతం అనేక అభ్యంతరాలు లేవనెత్తిన సంగతి విధితమే. డీపీఆర్ -2 వాస్తవదూరంగా ఉందని, మళ్లి దీనిని మదించి, క్లారిటీతో తాజా గణాంకాలతో నివేదిక అందజేయాలని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులను కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు మళ్లి డీపీఆర్ -2కు సంబంధించిన వివరాలతో పాటు భూసేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీ, పునరావాసం, సవరించిన అంచనాలు తదితర వివరాలతో కూడిన నివేదికలను మళ్లి రూపొదిందిస్తున్నట్లు సమాచారం. ఈ నివేదికను సోమవారం లేదా మంగళ వారం కేం ద్రానికి పంపించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
గతనెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్బంలో కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పనుల ను స్వయంగా పరిశీలించి, పలు అంశాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే లేవనెత్తారు. రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు కేంద్రం అడిగిన అన్ని అంశాలపై మళ్లి నివేదికలు రూపొందించే పనిలో పడ్డారు. ప్రధానంగా భూసేకరణ, ముంపు గ్రామాలు,పరిహారం,పునరావాసానికి సంబంధించిన నివేదికను ప్రత్యేకించి తయారు చేస్తున్నారు. అన్ని ముంపు గ్రామాలన్నింటి వివరాలతో పాటు ముంపు బాధితుల వివరాలు,వారికి చెల్లించిన పరిహారం వివరాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. మొత్తం మీద మళ్లి డీపీఆర్ -2కు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన నివేదికనలను ఒకటి రెండు రోజుల్లో సిద్ధం చేసి, కేంద్రానికి పంపించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.