నవ్యాంధ్ర రాజధాని అమరావతికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకం. తాజాగా ఆ స్థాయికి తగ్గట్టు ప్రత్యేక ఆకర్షణగా ఇస్తాంబుల్‌ తరహాలో ఆధునిక టవర్‌ బిల్డింగ్‌ నిర్మించనున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్‌వేకు తోడు నూతనంగా నిర్మిస్తున్న రన్‌వేకు మధ్య భాగంలో.. వీకేఆర్‌ కాలేజీ వైపుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో రన్‌వే మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టవర్‌ బిల్డింగ్‌లో ఆర్కిటెక్చర్‌ నైపుణ్యం అణువణువూ కనిపిస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా... అలాంటి టవర్‌ ఏర్పాటుకు రూ.25 కోట్ల అంచనాతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టవర్‌ బిల్డింగ్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అధికారులు తాత్కాలిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

gannavaram airport 31072018 2


ఆరు అంతస్థులుండే ఈ టవర్‌ బిల్డింగ్‌ పొడవు 30 మీటర్లు.. అంటే 100 అడుగుల పొడవుంటుంది. బిల్డింగ్‌ పై భాగంలో టవర్‌ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో పాత టెర్మినల్‌ దగ్గర ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ ఉంది. ఈ ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ పశ్చిమ దిశన రన్‌వే మొదట్లో ఉం టుంది. ఎయిర్‌ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుంటే.. రన్‌వే మధ్య భాగంలో ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ ఏర్పాటు శ్రేయస్కరం. రన్‌వే రెండు వైపులా కనిపించటానికి వీలుగా ఒక పక్కన దీన్ని నిర్మించాలి. దీనిపై నుంచి చేస్తూ విమా నం ల్యాండింగ్‌, టేకాఫ్‌ వంటివి కూడా స్పష్టం గా కనిపిస్తాయి. కొత్త టవర్‌ బిల్డింగ్‌ డిజైన్లకు అప్పుడే శ్రీకారం చుట్టారు.

gannavaram airport 31072018 3

వీటిలో ఒక దానిని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, ఎయిర్‌పోర్టుకు ఇటీవలే ఆస్ర్టియా దేశం నుంచి అత్యంత శక్తివంతమైన రెండు ఫైర్‌ ఫైటర్లను ఒక్కొక్కటీ రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. టేకాఫ్‌, ల్యాండింగ్‌లో రన్‌వేపై ప్రమాదం జరిగితే రెండు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుంటాయి.

అత్యాధునిక హంగులతో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపొందుతోంది. ఈ క్రికెట్ స్టేడియం భవిష్యత్తులో, అమరావతికి ఒక కలికితురాయి కానుంది. అమరావతి టౌన్-షిప్ లో, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 22 ఎకరాల్లో స్టేడియం నులు జోరుగా సాగుతున్నాయి. 2000వ సంవత్సరంలో స్టేడియం నిర్మించాలి అని తలిచినా, 2010 వరకు నిర్మాణం ప్రారంభం కాలేదు. అప్పటి నుంచి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత, పనుల్లో వేగం పుంజుకుంది. 2018 చివరి నాటికి, పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ సిద్ధం అయ్యింది. స్టేడియం గ్యాలరీ, గదులు మొదలగు పనులు జరుగుతున్నాయి.

mangalagiri 31072018 2

ఆగస్టు మూడోవారం నుంచి స్టేడియంలో రూ.కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకే ఏసీఏ ప్రయత్నిస్తోంది. సీలింగ్‌లు, ఎయిర్‌ కండిషనింగ్‌, ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్విప్‌మెంట్స్‌, వివిధ గ్యాలరీ బాక్సుల మధ్య రెయిలింగ్‌, షట్టరింగ్స్‌, కోలాప్సబుల్‌ గేట్ల వంటివాటిని ఏర్పాటు చేస్తారు. ఈ ఫినిషింగ్‌ వర్కులతో పాటు స్టేడియం వెలుపల పక్క రోడ్లు, డ్రెయిన్లు, ఇవిగాక స్టేడియంలో మొత్తం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగువేల అడుగుల ఎత్తువరకు లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. వచ్చే డిసెంబరు నాటికి స్టేడియంలో ట్రయల్‌ మ్యాచ్‌లను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లను నిర్వహించాలనుకుంటున్నారు. 2020 నాటికి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

mangalagiri 31072018 3

ఇవి హైలైట్స్: 23.20 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం... 180 గజాల వ్యాసంలో ఉండే మైదానం మధ్య నుంచి బౌండరీ లైను 75 గజాల వ్యాసార్థంలో ఏర్పాటవుతోంది.. గ్రౌండు చుట్టూ ఉండే అండర్‌గ్రౌండు డ్రెయినేజికి, బౌండరీలైనుకు మధ్య మళ్లీ 15 గజాల జాగా ఉంటుంది.. మైదానంలో మొత్తం 11 పిచ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పిచ్‌లు ఒక్కోటి 66 అడుగుల పొడవు, పదడుగుల వెడల్పుతో ఉంటాయి.. అత్యాధునిక సాట్రమ్‌ వాటర్‌ డ్రెయిన్లతో, దాదపు 10 వేల లీటర్ల నీటిని బయటకు పంపే సామర్ధ్యం.. 34 వేల మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు గ్యాలరీ.. 5 కోట్లతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం.. మొత్తం ఖర్చు రూ.120 కోట్లు (అంచనా)

పెనుకొండ వద్ద నిర్మితమవుతున్న కియా కంపెనీ కార్ల తయారీకి వేగంగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలో కీలకమైన సాంకేతిక మానవ వనరులు సమీకరణకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారిలో కియా ఆశిస్తున్న ఐదు అంశాలు ఉన్న వారిని ఎంపిక చేయనుంది. జిల్లాలో యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా మోటార్స్‌ ఇండియా సంయుక్తంగా ఆటో మొబైల్‌ పరిశ్రమలపై సాంకేతిక శిక్షణ కోర్సు ప్రారంభించాయి. ఈ నెల 20వ తేదీన ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, కె.ఎం.ఐ. ఎండీ హ్యూన్‌కుక్‌షిమ్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ పొందటం కోసం పాలిటెక్నిక్‌ అభ్యర్థులు అర్హులు.

kia 31072018 3

అర్హులైన వారు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం నమోదు (రిజష్టరు) చేసుకోవాలి. ఇలా ఇప్పటి వరకు 6 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకొన్నారు. దరఖాస్తు చేసుకున్న డిప్లమో విద్యార్థుల్లో ఎంపిక చేసిన 2,145మందికి గాను 1,100మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైనవారికి ఆటోమొబైల్‌ పరిశ్రమల కోసం ప్రాథమిక సాంకేతిక కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కియలో నేరుగా 4వేల మందికి, పరోక్షంగా 7వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు పలు విభాగాల్లో శిక్షణ జోరుగా సాగుతోంది. నేరుగా ఉద్యోగ అర్హత సాధించినవారితో పాటు సాంకేతిక శిక్షణలో నైపుణ్యం కనబరచిన అభ్యర్థులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు.

kia 31072018 2

33మంది చొప్పున బ్యాచ్‌లుగా విభజించి కారు విడిభాగాలు అమర్చడం, తొలగించడం, బాడీషాప్‌, పెయింట్‌షాప్‌ విభాగాల్లో 11మంది ప్రత్యేక ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయం ఏపీఎస్‌ఎస్‌డీసీ కల్పిస్తోంది. రోజుకు 8 గంటల పాటు శిక్షణ కొనసాగుతుంది. మొత్తం 4వారాలకు శిక్షణ ఉంటుంది. ఇందులో సైద్ధాంతిక శిక్షణ, 20 విభాగాల్లో ప్రయోగ శిక్షణ (ప్రాక్టికల్స్‌) ఇస్తారు. ఒక్కో విభాగాంలో శిక్షకుడు అవగాహన కల్పిస్తారు. తరువాత అభ్యర్థి ప్రాక్టికల్స్‌ పూర్తి చేయాలి. ఈ శిక్షణలో అభ్యర్థి, సహనం, పనిపట్ల నిబద్ధత, పనిలో కచ్చితత్వం, సమయపాలన, నైపుణ్యత కొలమానంగా అభ్యర్థులను తరువాత పరీక్షకు ఎంపిక చేస్తారు. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వారు, ముందుగా ఇక్కడ అప్లై చేసుకోండి. http://www.kia-motors.in/web/html/india/Careers.jsp

మాట తప్పను, మడం తిప్పను అంటాడు... నోరు తెరిస్తే చేసేది ఇదే... సరిగ్గా రెండు రోజుల క్రితం, కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ ఏమి అన్నాడు ? రాష్ట్ర రాజాకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు వచ్చాయో చూసాం. తాను మాట ఇస్తే అదే మాట మీద నిలబడతానని, చేయగలిగింది మాత్రమే చెబుతానని, చేయలేనిది చేస్తానని చెప్పే అలవాటు తనకు లేదని రెండు రోజుల క్రితం జగన్ చెప్పిన మాటలు విన్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ, ''ఇక్కడ కాపు సోదరులు అందరికీ చెబుతున్నా. కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు ఉంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్ల అంశం. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పున్న పరిస్థితుల్లో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు. ఇది నేను చేయగలిగిన అంశం కాదు కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నానని మీ అందరికీ ఏ మాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నాను'' అని జగన్ అన్నారు.

jagan mkapu 31072018 2

దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి, జగన్ పాదయాత్రలో కాపు యువత జగన్ ముందు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాపు ప్రజలు, నాయకులు జగన్‌కు నిరసన తెలిపారు. కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి పోరాడాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాపు నాయకులు స్పష్టం చేశారు. కాపుల ఆందోళన చూస్తూ ఉంటే తన పాదయాత్ర ముగించే వరకు ఆ సామాజిక వర్గం నుంచి నిరసనలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ వెనక్కు తగ్గారు.

jagan mkapu 31072018 3

మడం తిప్పని మహా నేతను అని చెప్పుకునే జగన్, రెండే రెండు రోజుల్లో మడం తిప్పారు. జగన్ వ్యఖ్యలను సమర్ధిస్తూ, సాక్షిలో వచ్చిన కధనాలు ఇక చెత్త కుప్పలో వేసుకోవాలి, అంతలా యుటర్న్ తీసుకున్నాడు జగన్. ఈ రోజు, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగ్గంపేట బహిరంగసభలో కాపు రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, దీనిలో చంద్రబాబు పాపం ఉందని, ఎల్లో మీడియా కుట్ర అని అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతు యిస్తోందని, ఈ విషయంలో సలహాలిస్తే స్వీకరిస్తానని అన్నారు. యూటర్న్ తీసుకునే అలవాటు తమ ఇంటావంటా లేదని, ఎల్లో మీడియా మద్దతు ఉందని బాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read