కృష్ణా జిల్లా వైసీపీలో ముసలం చోటు చేసుకుంది.నూజివీడు పురపాలకసంఘంలో పాలకపక్షానికి చెందిన వైసీపీ కౌన్సిలర్‌లు ఎనిమిది మంది తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామాచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. గత మూడేళ్లుగా ఈ పాలక వైసీపీలో చైర్మన్‌ పదవిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు కొంత కృషిచేసి అసమ్మతి వర్గమైన రామిశెట్టి మురళీవర్గానికి చెందిన వారికి వైస్‌ చైర్మన్‌ పదవి అందేలా చేశారు. అయితే తొలుత ఇచ్చిన హామీమేరకు చైర్మన్‌ పదవి చివరి రెండుసంవత్సరాలు మురళీవర్గానికి ఇవ్వడానికి కుదిరిన ఒప్పందాన్ని అమలుపర్చటంలో జగన్‌తో సహా అందరూ విఫలం కావడంతో మనస్థాపంతోనే ఈ 8 మంది కౌన్సిలర్స్‌ పార్టీకి, పదవికి రాజీనామాలు చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ycp 01082018 2

పార్టీ రాష్ట్ర నాయకులకు, జగన్‌ కార్యాలయ ముఖ్య సిబ్బందికి, తమ హామీలు ఇంకా నెరవేర్చబడలేదని రామిశెట్టి మురళీ ఫోన్‌ద్వారా సంప్రదిం చినట్లు సమాచారం. దీంతో వారు ఆ బాధ్యత ఎమ్మెల్యేమీద పెట్టాం కదా అని సమాధానం రావడంతో, మురళీ ఎమ్మెల్యే ప్రతాప్‌ను హామీ గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. మీరు హామీ నెరవేర్చకపోతే మాకు రాజీనామాలు తప్ప మరో గత్యంతరం లేదని ఎమ్మెల్యేకు స్పష్టం చేయడంతో ఆయన కూడా తీవ్రస్థాయిలోనే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

ycp 01082018 3

దీంతో మంగళవారం జరిగిన సాధారణ కౌన్సిల్‌ సమావేశానికి అసమ్మతికి చెందిన 8 మంది గైర్హాజరు అయ్యారు. బుధవారం వీరు దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కౌన్సిల్లో మొత్తం 30మంది కౌన్సిలర్‌లు ఉండగా, వీరిలో 22మంది వైసీపీ, 8 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఒకవేళ వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు రాజకీయక్రీడ ప్రారంభించాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. దీనికి 16మంది కౌన్సిలర్ల మద్దతుతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇవ్వాలి. ఒకవేళ 16మంది మద్దతు లభించి, కౌన్సిల్‌ల్లో ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి కౌన్సిల్‌పై విశ్వాస పరీక్ష జరిగితే, 21మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఉండాలని తెలుస్తోంది.

సాగు నీటి ద్వారానే కరువు నివారణ సాధ్య మవుతుందని తలిచారు ఆనాటి కమ్యూనిస్టు యోధులు. రైతు మనుగడ సాగిస్తేనే పల్లెలు కళకళలాడతాయి. తద్వార గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. అనంతపురంలో, పేరూరు వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే వేలాది ఎకరాలలో బంగారు పంటలు పండుతాయని వారి ధృడసంకల్పం. అనుకున్నది సాధించడానికి నాటి యోధులు ఒకతాటి పై పోరాటం సాగించారు. కమ్యూనిస్టుల పిలుపు మేరకు పరిటాల శ్రీరాములుతో పాటు మరికొందరు ఒకతాటి పైకి వచ్చి రైతులతో కలిసి ఉద్యమబాట పట్టారు. 1942 నుంచి 1949 వరకు పోరాటాలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అప్పట్లో పేరూరు సమీపంలో అప్పర్ పెన్నార్ డ్యాం నిర్మించడానికి సమ్మతిం చింది. ఈ డ్యాం పరిధిలోని రామగిరి, కనగానపల్లి, కంబదూరు, రాప్తాడు, అనంతపురంరూరల్ మండలాల్లోని వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్దిచేకూ రుతుందని అప్పట్లో ఆ పరిధిలోని రైతులు ఎంతో సంబరపడ్డారు. కాని అది వాస్తవ రూపం దాల్చలేదు.

peruru 01082018 2

దశాబ్దా లుగా నిరుప యోగంగా ఉన్న పేరూరు ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం పూర్తిగా నిరాశ నిస్పృహలో ఉండింది. 2012లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబా బునాయుడు వస్తున్నా మీకోసం పాద యాత్రలో భాగంగా పేరూరు డ్యాం వద్ద బస చేయడంతోనే దానిలో కదలిక వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ రైతులతో పాటు స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత విన్నవిస్తూ ఆ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా చెప్పారు. దీంతో ప్రభుత్వం రాగానే పేరూరు ప్రాజెక్ట్ కు నీరు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2015లో డీపీఆర్ కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేసి సర్వే పూర్తీ చేయించారు. చివరికి రవీంద్ర వర్ధంతి సందర్భంగా రూ.804 కోట్లతో జీఓను విడుదల చేస్తామని ప్రకటించిన చంద్రబాబున, ఆ మేరకు హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పుడీ పథకం పట్టాలెక్కే సమయం వచ్చింది. బుధవారం దీనికి భూమిపూజతో సీఎం శ్రీకారం చుడుతున్నారు.

peruru 01082018 3

ఈ పనులను ఏడాదిలో పూర్తి చేసేలా చూడనున్నారు. గుత్తేదారు సంస్థకు ఏడాది గడువు ఇచ్చారు. అయితే నాయకులు మాత్రం 8-9 నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని చెబుతున్నారు. మరోవైపు ఈ పథకానికి మొత్తం 2,315 ఎకరాలు అవసరం. ఇందులో ప్రభుత్వ భూమి కాకుండా, మిగిలిన పట్టా, డీకేటీలను భూసేకరణ ద్వారా సేకరించే ప్రక్రియ ఆరంభించారు. అలాగే కాలువ, ఎత్తిపోతల పథకాలు, జలాశయానికి ఇప్పటికే ఇంజినీర్లు పెగ్‌మార్కింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. కాలువ తవ్వకం త్వరగానే జరుగుతుందనీ.. అయితే దీనిపై వంతెనలు, యూటీలు, అక్విడెక్ట్‌లు కలిపి 117 నిర్మించాల్సి ఉందనీ... వాటితోపాటు ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా జరిగేలా చూస్తే, గడువులోపు పనులు పూర్తయ్యే వీలుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కిరణ్ టార్గెట్ అంతా జగన్ పైనే ఉందని, జగన్ ని దెబ్బ కొడితేనే మనకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని కిరణ్ భావిస్తున్నారు. జగన్, కాంగ్రెస్ కు చేసిన అన్యాయం పై, హైకమాండ్ కూడా ఆగ్రహంగా ఉండటంతో, కిరణ్, జగన్ వైపే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు చంద్రబాబుకి ధీటైన ప్రత్యర్ధి లేక, చంద్రబాబుని వ్యతిరేకించే వారు జగన్ వైపు చూస్తున్నారు. పవన్ వచ్చినా, అతని సామర్ధ్యం ఏంటో రోజు రోజుకి ఎక్ష్పొజ్ అయ్యి, సీరియస్ నెస్ లేని రాజకీయ నాయకుడుకిగా మిగిలిపోయాడు. ఇప్పుడు, జగన్ మీద కోపంగా ఉన్న పాత కాంగ్రెస్ వారిని, మళ్ళీ కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కిరణ్.

kiran 31072018 2

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని భయపడుతున్న జగన్, ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుని, 2-3 శాతం ఓట్లు తెచ్చుకున్నా, అది తన ఓట్లే చీలుస్తుంది అని జగన్ భావిస్తున్నారు. దీంతో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కెవిపి రామచంద్రరావు రంగంలోకి దిగారు. తన స్నేహితుడు కుమారుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బంది లేకుండా చూడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కెవిపి రామచంద్రరావు కొంత మంది కాంగ్రెస్ వారిని, జగన్ దగ్గరకు పంపించరనే ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో, కిరణ్ దూకుడుకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు కేవీపీ...

kiran 31072018 3

కిరణ్, ఎక్కువగా జగన్ పై ఫోకస్ చెయ్యటం తనకు ఇష్టం లేదని, జగన్ కు ఇబ్బంది అయితే కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేది తప్పని, జగన్ బలహీనపడితే చంద్రబాబు పుంజుకుంటాడని కేవీపీ వాదనగా ఉంది. అయితే కిరణ్ మాత్రం, జగన్ ను బలహీనం చేసేందుకు వచ్చే ఎటువంటి అవకాశాన్నైనా వదులు కోవద్దనే ఆలోచనలో ఉన్నారు. అలాగే కేవీపీ కావాలని కొంత మంది కాంగ్రెస్ నేతలను, జగన దగ్గరకు పంపిస్తున్నారని, ఇలా అయితే పార్టీకి చాలా ఇబ్బంది అని, కెవిపి తన వైఖరిని మార్చుకోవాలని అంటున్నారాని సమాచారం. మీకు స్నేహం ఎక్కువైతే వేరే ప్రయత్నాలు చేసుకోండి అంతే కాని, పార్టీని నాశనం చెయ్యవద్దు అని, కిరణ్ చెప్పినట్టు సమాచారం. ఇదే విషయం పై నేరుగా రాహుల్ గాంధీకే ఫిర్యాదు చెయ్యటానికి కిరణ్ కూడా రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది. మొత్తానికి, కేవీపీ - కిరణ్ మధ్య జగన్ చిచ్చు రేగింది.

నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఆలోచనలో ప్రముఖ సినీనటి జయప్రద ఉన్నట్టు సమాచారం. తొలత తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. తరువాత చంద్రబాబుకు దూరమై ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ తరుపున రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. సమాజ్ వాదీ పార్టీలో వచ్చిన నాయకత్వ మార్పులు కారణంగా తిరిగి స్వంత రాష్ట్రం నుంచి పోటీ చేయాలన్న తలంపుతో వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి రాజమండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది.

jagan 01082018 2

రాజమండ్రి స్థానం పై జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో జయప్రద సన్నిహితులు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దాని పై సొంత టీంతో సర్వే నిర్వహించినట్టు, సర్వేలో తనకు సానుకూలంగా స్పందన వచ్చినట్టు చెప్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు సన్నహాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదే సర్వే రిపోర్ట్ పట్టుకుని, జగన్ వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా జగన్ సరైన భరోసా ఇవ్వలేదని తెలుస్తుంది. నేను కూడా నా వైపు నుంచి సర్వే చేపిస్తాను, అప్పుడు చూద్దాంలే అని చెప్పినట్టు సమాచారం.

jagan 01082018 3

అయితే జగన్ మరో ప్రోపోజల్ కూడా జయప్రద ముందు ఉంచారు. మీరు ముందు పార్టీలో చేరండి, ప్రచారం మొదలు పెట్టండి, మీ గ్లామర్ మా పార్టీకి అవసరం అని చెప్పినట్టు సమాచారం. అయితే, దీని పై జయప్రద సుముఖంగా లేరని, ముందు ఎదో ఒక పార్లమెంట్ స్థానం ఓకే చేసి,బహిరంగంగా ప్రకటిస్తే కాని, పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం, చాలా సంతోషంగా ఉంది. జయప్రద లాంటి వారిని ఓడించటం చాలా తేలిక అని, ఇలాంటి గ్లామోర్ లు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పని చెయ్యవని, మన తరుపున పోరాడేవారు ఢిల్లీలో ఉండాలి అనే మూడ్ ప్రజల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో జయప్రద పోటీ చేస్తే, మాకు ఒక ఎంపీ సీట్ ఎన్నికలు జరగక ముందే గెలిచినట్టే అని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read