తూర్ప గోదావరి జిల్లాలోనే, పవన్ పై పర్సనల్ అటాక్ చెయ్యటం, కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి, కాపులను రెచ్చగొట్టటం.. ఇవన్నీ జగన్ ఏమన్నా పిచ్చోడు అయ్యి చేస్తున్నాడా ? జగన్ కు మరీ అంత రాజకీయ పరిణితి లేదు అనుకోవాలా ? దీని వెనుక పెద్ద స్టొరీనే ఉంది. ఇది కూడా ఆపరేషన్ గరుడలో భాగమే, కాకపోతే ప్లాన్ మారింది అంతే.. పవన్, జగన్ తో బీజేపీ ప్రధానంగా చెయ్యాలి అనుకుంది, రాష్ట్రంలో కుల గొడవలు రేపి, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటం. దీని కోసమే పవన్ కళ్యాణ్ పదే పదే చంద్రబాబుని, లోకేష్ ని రెచ్చగొట్టాడు. పవన్ పై వ్యతిగత విమర్శలు చెయ్యాలనే ప్లాన్ వేసారు. కాని తెలుగుదేశం పార్టీ, చాలా పరిణితిగా వ్యవహరించింది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి, వాళ్ళ స్చూలే అంత.. ఇక్కడ పవన్ తో కుల గొడవలు రెచ్చగోడదాం అనే ప్లాన్ వొర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే ఆపరేషన్ గరుడ ప్లాన్ - బి ని వెంటనే అమలు పరుస్తుంది బీజేపీ..

jagan 30072018

కాపు, రెడ్డి ఓటు పోలరైజేషన్.. పవన్ పై పదే పదే పర్సనల్ అటాక్ చెయ్యటం, కాపులకు నేను వ్యతిరేకం అనే భావన జగన్ కలిగిస్తున్నాడు. తద్వారా, కాపులు అంతా కన్సాలిడేట్ అవ్వాలని, వారంతా పవన్ వైపు రావాలనేది వ్యూహం. ఇక రెడ్డి ఓటింగ్ మెజారిటీ జగన్ కు ఎలాగూ ఉంది... పవన్, తెలుగుదేశం మధ్యలో కాపు ఓట్లు ఎలాగూ చీలిపోతాయి, తనకు ఎలాగూ వాళ్ళు వెయ్యరు అని జగన్ కు తెలుసు, అందుకే తెలుగుదేశం వైపు ఉండే కాపులని కూడా కుల పరంగా రెచ్చగొట్టి, అందరినీ పవన్ వైపు తిప్పే ప్లాన్... ఇక ప్లాన్ ప్రకారం రేపో మాపో, జగన్ బీసీల తరుపున మాట్లాడతాడు. మీ కోసం, కాపు రిజర్వేషన్ కూడా వదులుకున్నా అంటాడు. కొన్ని బీసి సంఘాలు వచ్చి, జగన్ కు మద్దతు తెలుపుతాయి. తరువాత, కాపులకి, బీసిలకు మధ్య చిచ్చు పెడతారు. తద్వారా, తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ వోట్ బేస్ అయిన బీసిలను కొంత మేరకు దూరం చేసే ఎత్తుగడ ఇది..

jagan 30072018

దీంట్లో జగన్ కు లాభం ఉంది. చివరకు బీజేపీ, జగన్ చేతిలో బకరా అయ్యేది మాత్రం పవన్ కళ్యాణ్... కాపుల్లో మూడు పోలరైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ స్ట్రాంగ్ కాంగ్రెస్ ఓట్ బేంక్ (కృష్ణా, గుంటూర్, ప్రకాశం), రెండు ట్రెడిషనల్ స్ట్రాంగ్ తెదేపా బేంక్ (గోదావరి, ఉత్తరాంధ్ర, సీమ, నెల్లూరు), మూడు రాష్ట్రవ్యాప్తంగా మెగా ఫ్యామిలీ ప్రభావితం చేయగలిగిన యువ అభిమానులు. తెదేపాని వ్యతిరేకించే ట్రెడిషనల్ కాంగ్రెస్ కాపులకి రాజ్యాధికారం కంటే తెదేపాని గద్దె దించడమే ముఖ్యం. పవన్ తెదేపాని ఓడించలేడు, ముఖ్యమంత్రి అవలేడు కనుక తన పల్లకీ మోయడంతప్ప వాళ్ళకి వేరు దారి లేదని జగన్ ధీమా. ఎందుకంటే వీళ్ళే 2009 లో చిరంజీవికి దెబ్బేసి వైఎస్ రెడ్డికి గుద్దారు. అందుకే పవన్ ని తిట్టినా, రిజర్వేషన్లు లేవు పోండి అన్నా సరే వాళ్ళు తనకి దాసోహమే అని జగన్ కాలుక్యులేట్ చేసుకున్నాడు. ఈ మొత్తం డ్రామాలో చివరకు పవన్ కళ్యాణ్ ఒక పావుగానే మిగిలిపోతాడు. తెలుగుదేశం గెలిచినా, ఏదన్న అద్భుతం జరిగి జగన్ గెలిచినా, పవన్ కళ్యాణ్ మళ్ళీ తన అన్న లాగే వెళ్ళి సినిమాలు తీసుకోవటమే. పవన్ కు దీంట్లో పోయేది కూడా ఏమి లేదు, దానికి వేరే లెక్కలు ఉన్నాయి. అంతా అమిత్ షా మాయ... అయితే, అమిత్ షా, మోడీ, జగన్, పవన్, చంద్రబాబు కంటే, ప్రజలు చాలా తెలివిగలవారు, అన్నీ గమనిస్తున్నారు... వాళ్ళే సరైన నిర్ణయం తీసుకుంటారు.

ప్రధాని రాష్ట్రానికి చేస్తున్న మోసం పై అన్ని విధాలుగా చంద్రబాబు పోరాడుతున్నారు. మంత్రులని బయటకు తీసుకురావటం, ఎన్డీఏ నుంచి బయటకు రావటం, ధర్మ పోరాట దీక్షలు, ఢిల్లీలో ఆందోళనలు, దేశంలో అన్ని పార్టీల మద్దతు, అవిశ్వాసం, ఇలా అన్ని విధాలుగా పోరాడుతున్న చంద్రబాబు, తాజగా కడప ఉక్కు పరిశ్రమ సాధనకు పోరాటం మరింత తీవ్రం చేయాలని భావిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఆగస్టు 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రపతి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలవాలని కడప జిల్లా తెదేపా నేతలు నిర్ణయించారు.

cbn 29072018 2

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం జూన్‌12న సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి నిరాహార దీక్ష చేసినా కేంద్రం స్పందించలేదు. రెండు నెలల్లో కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం ప్రకటనలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించి దీక్ష విరమింపజేశారు. నెలరోజులైనా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనలేదు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో తెదేపా ఎంపీలు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.

cbn 29072018 3

సీఎం రమేష్‌తో పాటు ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కడపలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉక్కు పరిశ్రమ సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశం పై చర్చించారు. చంద్రబాబు సూచనలు ప్రకారం, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున జాతీయ పార్టీలను కలిసి సమస్యలను ప్రస్తావించాలని నిర్ణయించారు. కడప జిల్లా తెదేపా నాయకులు అఖిలపక్షం, ప్రజా సంఘాలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 1న దిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ ‌కోవింద్‌ను, ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ను కలవాలని నిర్ణయించారు. ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పోరాటం చేస్తుంటే వైకాపా మాత్రం పట్టించుకోవడంలేదని సీఎం రమేష్‌ విమర్శించారు.

అందరికీ శకునం చెప్పే బల్లి, కుడితలో పడింది అనే సామెత గుర్తుందా ? ఆంధ్రప్రదేశ్ లో నా అంత ఉత్తముడు లేడు అంటూ, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కూడా సంకించే పవన్ కళ్యాణ్ కు, ఎదురైన సంఘటన చుస్తే ఇదే గుర్తుకు వస్తుంది. చెప్పేందుకే నీతులు ఉంటాయి, ఆచరించటానికి కాదు అని పవన్ ను చూస్తే అర్ధమవుతుంది. "అన్నా మేము బళ్ళు సైలేన్స్ ర్ తీసి సౌండ్ చేసుకుంటూ తోలతంటే, పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నా" అని పవన్ అభిమానులు చెప్తే, దానికి పవన్ ఇచ్చిన రియాక్షన్ అదేమన్నా పెద్ద తప్పా ? మీరు తప్పులు చెయ్యటం లేదా అని. పవన్ ఎలాంటి వాడో ఇక్కడే అర్ధమవుతుంది. అయితే, అందరూ ఒకేలా ఉండరు కదా. ఎక్కడో ఒక చోట మనకు సరైన వాడు దొరుకుతాడు. అలాంటి అనుభవమే పవన్ కు ఎదురైంది.

doctor 29072018

రెండు రోజుల క్రితం భీమవరంలో అభిమానులతో పవన్‌కళ్యాణ్‌ సమావేశమయ్యారు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని పవన్ ప్రసంగం చేస్తుంటే, పవన్ అభిమానులు కేకలు ఈలలు. ఇలా జరుగుతూ ఉండగా, ఓ డాక్టర్‌ లేచి మైకు అందుకున్నారు. ఆ డాక్టర్‌ పేరు సోమరాజు. ఆయన గురించి పవన్ కు పూర్తిగా తెలియదు ఏమో కాని, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి తెలుసు. ఈయన మైక్ అందుకోవటంతోనే, ఇక పవన్ పని అయిపొయింది అనుకున్నారు అక్కడి వారు. ఇక పవన్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మా మెయిన్‌ ప్రాబ్లం లీడర్స్‌ అండి, ఎలాగో చెబుతాను, అంటూనే ఎప్పుడైతే లీడర్‌ తప్పు చేశాడో సొసైటీలో అదే అంగీకారరమైపోతోంది. ఆయన చేస్తే తప్పులేదూ నేను చేస్తే ఏంటీ అంటున్నారు అంటూ ఆయన చురక అంటించారు.

doctor 29072018

దీంతో పవన్ బిత్తరపోయాడు. బయటకు కనిపించకుండా ఒక వెర్రి నవ్వు నవ్వాడు. కొంపదీసి జగన్ లాగా వ్యక్తిగత జీవితం గురించి అడుగాతారేమో అని కంగారు పడ్డాడు. కానీ ఆ డాక్టర్‌ అంతటితో వదిలేయలేదు సింపుల్‌గా నేను ఒక్కటే అడుగుతాను నేను తప్పు చేయలేదు, తప్పు చేసేవాడిని సిగ్గుపడేలా చేస్తాను అంటూ ఒక మాట మాట్లాడండి అందరం ఓట్లు వేసి వెళ్లిపోతాం అన్నారు. యధారాజా తథా ప్రజా అన్నట్లుంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అంటూ దులిపేశారు. దీంతో పవన్ కు ఒక్క నిమిషం అర్ధం కాలేదు. వెర్రి నవ్వులు నవ్వుతూ ఉండిపోయాడు. కాలికి దెబ్బ తగిలితే చేతి బ్యాండేజీ వేసుకున్నారేంటి, కాలిది వేసుకోండి అంటూ ఒక డాక్టర్ గా పవన్‌ కు సలహా ఇచ్చారు. దీంతో పవన్‌ మరో వెర్రి నవ్వు నవ్వాల్సి వచ్చింది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మీరు చూడండి… https://youtu.be/QkG70s30zyw

ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు. జగన్ పాదయాత్ర 223వ రోజు తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో కొనసాగుతోంది. కిర్లంపూడి మండలం గోనేడలో కాపు నాయకులు పాదయాత్రను అడ్డుకున్నారు. కాపులను మోసం చేయవద్దంటూ నినాదాలు చేశారు. కాపు యువత నాయకులు జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్నకాపు నేతలను జగన్‌ సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేసింది. వైసిపీ నాయుకులు కూడా వారిని గెంటేసారు, ప్లకార్డులు తీసి చించేశారు. దొరికిన వారిని దొరికినట్టు పిడి గుద్దులు గుద్దారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

jagan security 29072018 2

శనివారం జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతే కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే తాను మాట ఇవ్వలేనన్నారు. తాను మాటిచ్చి తప్పలేనని, చేయగలిగే వాటికే తాను హామీ ఇస్తానన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని జగన్ గుర్తు చేశారు.
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్‌ యూటర్న్‌ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను ఆయన అవమానించారని, కాపులకేనా.. మొత్తం రిజర్వేషన్లకు జగన్‌ వ్యతిరేకమా అంటూ ప్రశ్నించారు.

 

jagan security 29072018 3

రెట్టింపు నిధులిస్తానంటూ తమపై సవతితల్లి ప్రేమ చూపొద్దని, కాపులకు సీఎం చంద్రబాబు రిజర్వేషన్లు కల్పిస్తారని, జగన్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. కాపులను ఓట్లు అడిగే అర్హత జగన్‌ కోల్పోయారని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు, ముద్రగడ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలతో, కాపుల రిజర్వేషన్‌ రాద్దాంతం మరింత వేడెక్కింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం గోనాడ పాదయాత్ర శిబిరం నుంచి జగన్‌ బయలుదేరిన పది నిమిషాల్లోనే గోనాడలో కాపు వర్గీయులు తమను మోసగించొద్దంటూ ఫ్లకార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది కొడుతున్నా, జగన్‌ పట్టించుకోకుండా, వారందరికీ అభివాదం చేసుకుంటూ పాదయాత్ర ముందుకు కొనసాగించారు.

Advertisements

Latest Articles

Most Read