మహా మహా నేతలు, ఇందిరా గాంధీ దగ్గర నుంచి నేటి నరేంద్ర మోడీ దాకా, మూడు దశాబ్దాలుగా, తెలుగుదేశం పార్టీని లేకుండా చెయ్యటానికి ప్రయత్నాలు చేసి, విఫలం అయినవారే... రాజశేఖర్ రెడ్డి చనిపోయే రెండు రోజుల ముందు, తెలుగుదేశం ఫినిష్ అని చెప్పి, రెండు రోజుల తరువాత హెలికాప్టర్ ఎక్కి, ఏమయ్యారో తెలిసిందే. ఇలా మహా మహా నేతలే, ఆ పార్టీని ఏమి చెయ్యలేకపోతే, గుడివాడలో ఉండే కొడాలి నాని మాత్రం, టీడీపీ జెండాను 10 ముక్కలుగా చించేస్తా అని టైం ఇచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా రెండువందల రోజుల తర్వాత చుక్కలు చూపిస్తా... వారి రాజకీయ జీవితాలను భూస్థాపితం చేస్తా.. టీడీపీ జెండాను 10 ముక్కలుగా చించేస్తా అంటూ కొడాలి నాని తెలుగుదేశం నాయకులకు వార్నింగ్ ఇస్తున్నాడు.

nani 29072018 2

నిన్న గుడివాడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అడపా బాబ్జీ పై అవిశ్వాసం పెట్టారు తెలుగుదేశం నేతలు. అయితే, కొడాలి నాని కొంత మందిని కిడ్నాప్ చెయ్యటంతో, వారు కనిపించ కుండాపోయారు. దీంతో కోరం లేదని సమావేశం వాయిదా వేసారు. తన వ్యూహం బెడిసికొట్టటంతో, కొడాలి నాని ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం నేతలను చించేస్తా, పొడిచేస్తా, అసలు పార్టీనే లేకుండా చేస్తా అంటూ, 200 రోజులు టైం ఇచ్చారు. బహుసా జగన్ చెప్పాడేమో, 200 రోజుల్లో నేనే సియం అవుతాను, నువ్వు హోం మంత్రివి ఆవుదూగాని అని. అందుకే టైం చెప్పి మరీ, ఊహల్లో తేలుతూ, తెలుగుదేశం జెండాను 10 ముక్కలు చేస్తా అని నాని అంటున్నాడు.

nani 29072018 3

2004లో టీడీపీ టికెట్‌పై అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెంది వైఎస్‌ఆర్‌ అండతో ప్రభుత్వ పదవి దక్కించుకున్న ఆర్డీవో టీడీపీకి తొత్తుగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, టీడీపీ నేతల డ్రామాలు ప్రజలు చూస్తున్నారన్నారు. 200 రోజుల్లో అధికారుల సంగతి కూడా చూస్తా అని నాని వార్నింగ్ ఇస్తున్నాడు. మొత్తానికి జగన్ ఒక్కడే అనుకుంటే, జగన్ పార్టీలో ఉన్న ఇలాంటి నేతలు అందరూ, తరువాత ప్రభుత్వం మాదే, మా జగన్ అన్న సియం, మాకు మంత్రి పదవులు వచ్చేస్తున్నాయి, ఇక తెలుగుదేశం పార్టీ అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, అంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. పాపం ఎవరన్నా నిద్ర లేపి, అది డ్రీం మషీన్ అని చెప్పండి..

నిన్న జగన్ కాపు రిజర్యేషన్లు సాధ్యంకాదని చేసిన వ్యాఖ్యల పై ముద్రగడ స్పందించారు. ఆయన ఆదివారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కాపు జాతి ఓట్లు అడిగే అర్హత జగన్‌కు లేదని, వైసీపీ తరఫున కాపు జాతికి టికెట్లు కూడా ఇవ్వొద్దని అన్నారు. ఒకో నియోజక వర్గంలో కాపు జాతి సోదరులను ముగ్గురిని ఎగదోస్తూ... వాళ్ళతో లక్షల రూపాయలు ఖర్చు చేయిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. రెట్టింపు నిధులిస్తానంటూ మాపై సవతి తల్లి ప్రేమ చూపొద్దని, జగన్ కాపు జాతిని ఈ విధంగా కించపరచడం చాలా పెద్ద తప్పుని ముద్రగడ వ్యాఖ్యానించారు. జగన్‌కి తాను రేడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించాలని జగన్ తన అనుచరులతో కబురు పంపారని, కాపు జాతికి జగన్ ఏంచేసాడని స్వాగతం పలకాలని అడిగానని, ఆ ఉక్రోషంతోనే జగన్ కాపు జాతిని అవమానించారని ఆయన అన్నారు.

mudragada 29072018 2

తన కుటుంబంపై నిన్న జగన్ దొంగ ప్రేమ, మొసలి కన్నీరు కార్చారని, తాను అవమాన పడిన రోజు ఆయన ఏమయ్యారని ముద్రగడ ప్రశ్నించారు. జగన్ దొంగ ప్రేమ తనకక్కర్లేదన్నారు. తన జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నారు. ‘అవి మీ పరిధి కాదన్న మీ పల్లకీ మొయ్యం. మా జాతికి రిజర్యేషన్ ఇచ్చేవాళ్ళ పల్లకీనే మోస్తాం’అని ముద్రగడ స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవీ కాంక్ష వదిలేస్తే మా జాతి రిజర్వేషన్ల ఆకాంక్ష వదులుకుంటామని ఆయన అన్నారు. జగన్ తన పాదయాత్రకు ప్రజలను తరలించడానికీ, ప్లెక్సీలు కట్టడానికి కాపు జాతి సోదరులు ఆస్తులు ఆర్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వల్ల కాపు రాజకీయనేతల జీవితాలు, కుటుంబాలు నాశనమయిపోతున్నాయన్నారు.

mudragada 29072018 3

పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన కామెంట్స్ చాలా తప్పని అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం దారుణమన్నారు. కాపు ఉద్యమాల గడ్డ అయిన తూర్పుగోదావరి జిల్లాలోనే జగన్ కాపులను అవమానించాడని, పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశాడని ముద్రగడ చెప్పారు. ‘‘జగన్ అపర మేధావి. కాపు జాతి ఏమీ చేయలేదనే మిగిన జాతుల ఓట్ల కోసం ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. ఈ జిల్లా నుంచే పవన్‌ని వ్యక్తిగతంగా అవమానించాడు. రిజర్వేషన్లు సాధ్యం కాదంటూ కాపుజాతి ఆశలపై నీళ్ళు చల్లాడు.’’ అని ముద్రగడ విమర్శించారు.

విలక్షణ నటుడు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు పూర్తి దృష్టంతా రాజకీయాలపైనే.. శనివారం జరిగిన "టైమ్స్ నౌ" నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు. తన రాష్ట్రం కోసం పనిచేయడానికి తాను సిద్ధపడ్డానని, దానికి తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు... ఇలా చాలా ప్రశ్నలు మీద చర్చ జరిగింది... ఈ సందర్భంలో, చర్చలో భాగంగా, రాబోయే ఎన్నికల్లో మహాకూటమి కనుక వస్తే, ఆ కూటమికి ప్రధాని అభ్యర్ధిగా మీరు ఎవరిని కోరుకుంటారు అని అడిగిన ప్రశ్నకు కమల్ హసన్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు... "మహాఘట్బంధన్"లో మమతా ఉంది, నవీన్ పట్నాయక్ ఉన్నారు, ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, మరి "మహాఘట్బంధన్"కి నేతృత్వం వహించగలరు అని అడిగితే మళ్ళీ కమల్ నుండి అదే సమాధానం వచ్చింది..

kamal 29072018 2

ఇంకా ఎవరు నా ఫావరేట్ లీడర్ చంద్రబాబు అని సమాధానం ఇచ్చారు కమల్. మా పక్క రాష్ట్రంలో జరుగుతున్న ప్రోగ్రెస్ చూస్తే, చెన్నై ను మించి పోయే విధంగా ఉందని, ఆయన కంటే సమర్ధులు ఎవరు ఉంటారని కమల్ అన్నారు. ఇది వరకు కూడా కమల్ హసన్ ఇదే అభిప్రాయం చెప్పారు "ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు... ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు.... ఆయన పనితనం అద్భుతం (హీ ఈజ్ కమెండబుల్)... ఆయనకు చేతనైన దాంట్లో, ఆయన చెయ్యదగ్గ వరకు, ఆయన చేస్తున్నారు.. హి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అంటూ, అందుకే నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకే నేను చంద్రబాబుకి ఫ్యాన్ అంటూ, కమల్ హసన్ చెప్పారు...

kamal 29072018 3

తన కొత్త పార్టీ గురించి ప్రకటన చేసిన సందర్భంలో కూడా, కమల్ చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్‌ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు." అంటూ కమల్ తన రాజకీయ జీవితం మొదలు పెట్టిన స్పీచ్ లోనే చెప్పారు. కమల్ ఒక్కరే కాదు, తమిళనాడు ప్రజల్లో చాలా మందికి ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు ఆంధ్రాని పరుగులు పెట్టిస్తున్నారని, తమిళనాడు వెనుకబడి పోతుందని, చంద్రబాబు లాంటి నాయకులు మనకు ఉండాలని, అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు మనం చూసాం. కాని దౌర్భాగ్యం, మన తెలుగు హీరోలు మాత్రం ఇలాంటి నాయకుడుని గుర్తించటం లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న జగన్ కాపు రిజర్యేషన్లు సాధ్యంకాదని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఆదివారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తుని ఘటన తరవాత.. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపు రిజర్యేషన్‌లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని, అసెంబ్లీలోనూ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో అంశం కాదని, జగన్ యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్ళు తాగుతూ మీ పల్లకీలే మోస్తూ ఉండాలా? అంటూ ఆయన ద్వజమెత్తారు.

mudragada 29072018 2

కాపు ఉద్యమం పుట్టిన గడ్డమీదే జగన్ కాపులను అవమానించడం దుర్మార్గమని, తమ జాతిపై జగన్‌కు చిన్నచూపెందుకో చెప్పాలని, తమ జాతి ఏం తప్పు చేసిందో జగన్ చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపు రిజర్యేషన్లతో జగన్‌కు సంబంధం లేకపోతే... కేంద్రం పరిధిలో ఉన్న అనేక విషయాలపై ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత ఆరునెలలుగా జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు సరిపోతాయా? అని ప్రశ్నించారు. పదవీ కాంక్షతో జగన్ ఇలాంటి హామీలు ఇవ్వొచ్చు కానీ.. కాపు జాతికి రిజర్యేషన్ ఇవ్వలేరా? అని ముద్రగడ ప్రశ్నించారు.

mudragada 29072018 3

ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుజాతికి రిజర్యేషన్లు కల్పించేస్తారేమోనని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై తనకు నమ్మకముందని.. తమ రాజకీయ వ్యూహాలు తమకున్నాయని అన్నారు. ప్రస్తుతానికి అధికారంలో ఉన్న చంద్రబాబే తమ రిజర్యేషన్లు అమలు చేస్తారని ఆశిస్తున్నామని ముద్రగడ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లను కేంద్రం పరిధిలో అమలు చెయ్యటం తరువాత చెయ్యవచ్చు అని, ముందుగా రాష్ట్ర పరిధిలో తక్షణం అమలు చేయాలని, ఆ అధికారం ముఖ్యమంత్రికి ఉందని ముద్రగడ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read