మొన్నటి దాక కాపులకు రిజర్వేషన్‌ ఎప్పుడు చేస్తున్నారు, వారు అన్యాయం అయిపోతున్నారు అంటూ, హడావిడి చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు కాపులకు రిజర్వేషన్‌ పై నిర్ణయం తీసుకుని, కేంద్రానికి పంపించారో, అప్పటి నుంచి జగన్ ఈ విషయం పై నోరు తెరవటం లేదు. అయితే, తాజగా తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్‌ ప్రజా సంకల్పయాత్ర శనివారం జగ్గంపేటకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతుండగా కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు ప్లకార్డులు పట్టుకుని, కాపు రిజర్వేషన్‌ పై వైఖరి చెప్పాలి అంటూ నినాదాలు చెయ్యటంతో, అసహనానికి లోనైన జగన్, కాపులకు రిజర్వేషన్‌ కేంద్రం పరిధిలోనికి, అది ఇవ్వటం కుదరదు, నేను అధికారంలోకి వస్తే, ఎక్కువ నిధులు మాత్రం ఇస్తాను అని చెప్పారు.

jagan 29072018 3

దీని వెనుక ప్రధాన కారణం, ఇప్పుడు కాపులకు రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలో ఉంది. ఈ విషయం పై ఏమి మాట్లాడినా, కేంద్రాన్ని ప్రశ్నించాలి. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము మనోడి దగ్గర లేదు కాబట్టి, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాడు. జగన్ అంటున్నట్టు, కాపులకు రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలోనిది నేను ఏమి చెయ్యలేను అంటే, ప్రత్యేక హోదా కూడా కేంద్రం పరిధిలోనిదేగా ? దాని కోసం ఎలా కేంద్రం పై ఉద్యమాలు చేస్తున్నామో, దీని పై కూడా అలాగే చెయ్యాలి. కేంద్ర పరిధిలోనిది అని చెప్పి, ప్రతి విషయం ఇలా తప్పించుకుంటే ఎలా ?

jagan 29072018 2

సరే, రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిదని అందరికీ తెలుసు.. అసలు ఆ అంశానికి మద్దతు ఇస్తున్నారో లేదో చెప్పకుండా తప్పించుకోవడం ఏమిటి..? ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది.. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది.. దాన్ని కేంద్రప్రభుత్వం షెడ్యూల్ నైన్ లో పెడితే పనైపోతుంది.. ఆ విషయంపై జగన్ ఎలాంటి వైఖరీ చెప్పలేదు.. కేంద్రాన్ని డిమాండ్ చేయనూ లేదు.. అలాగే చేస్తాను అనీ చెప్పలేదు.. ఇవన్నీ పక్కన పెడదాం, జగన్ మోహన్ రెడ్డి 2014 మేనిఫెస్టోలో, కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని ఎందుకు చెప్పాడు ? ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాడు ?

ప్రజారాజధాని ...ఆంధ్రుల చారిత్రిక రాజధాని...అమరావతి ... విభజిత ఆంధ్రప్రదేశ్ .....రాజధానికి ముప్పై మూడువేల ఎకరాల భూమిని ...కేవలం...ఒక్క పిలుపుతో...ప్రభుత్వానికి అప్పగించారు. ద్రోహులు ఎగదోయటం వల్లనో...ఎందుచేతనో ..వెయ్యి ఎకరాలు రైతుల చేతులో ఉండిపోయాయి... అందులో చాలా మందికి ఇచ్చేయాలనే ఉంది..ఏదైనా అద్భుతం జరిగి ...ఎక్కువ రేటుకి అమ్ముకునే అవకాశం రావచ్చని ఆశలు రేపుతున్నారు. రాజధాని ప్రకటించిన నాటి నుండి ...జగన్ సహా చాలా మంది అనేక ఆటంకాలు కలిగించటానికి ప్రయత్నం చేసారు...రైతుల్ని ప్రభావితం చేయటానికి చేయని ప్రయత్నం లేదు.

pk 28072018 2

రాజధాని రైతులు ఒకేమాట ...ఒకే బాట...అదే చంద్రబాబు వైపే... మళ్ళీ కొత్తగా పవన్ ...భూములమీద విషం కక్కుతున్నారు...ఐవైయ్యార్.. వడ్డే..మధు..రామకృష్ణ... మీ ముఠాకి అసూయ..రైతులు చంద్రబాబుని నమ్మటం మీరు తట్టుకోలేక పోతున్నారు...బాబు సాధించిన ఈ ఘనత మీ కంటి మీద కునుకు రానివ్వటం లేదు.. రాజధాని ఆపుతారంట....! ఆపి చూడవయ్యా...! సభల్లో సమావేశాల్లో జనాన్ని చూసి పూనకం తెచ్చుకుని...వాపుని చూసి బలుపనుకుని మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. అయినా ఎక్కడో తెలంగాణా రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చి, నువ్వు మా రాజధాని ఆపుతావా ?

pk 28072018 3

ఈ మధ్య కత్తి ...శ్రీరెడ్డి...ల ఉదంతం చూసాము..పవన్ వెకిలి ట్వీట్ లు చూసాము...అదుపు తప్పిన ప్రవర్తన చూసాము... నిన్న గాక మొన్న జగన్ ...పవన్ గుడ్డలూడదీసాడు...ఏం పీకాడు ?పవన్ కళ్యాణ్... ఈయన వచ్చి రాజధాని ఆపుతాడంట...ఆపి చూడవయ్యా...అప్పుడు కదా నీకు సరైన సత్కారం జరిగేది... ఏమైనా విమర్శించు...సమస్యల పై ప్రశ్నించు...జనంలో తిరుగు...గెలుపు కోసం నీ ప్రయత్నం చేసుకో... రాజధాని ...పోలవరం లాంటి ఆంధ్రుల ఆశలపై విషం చిమ్మితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్తారు.

కోస్తా ప్రజల చిరకాల స్వప్నం మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు కార్పొరేట్ సంస్థలను తలదన్నే వైద్య సేవలను అందించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శరవేగంగా సిదమవుతోంది. నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. చిన్న చిన్న పనులు, ఫినిషింగ్ పూర్తి చేసి త్వరలోనే ఇది ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కాంట్రాక్టు సంస్థ కేఎంవీ గ్రూప్ పనులును పూర్తి చేస్తుంది.

super 28072018 1

ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 293 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. రూ.150 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రూ.120 కోట్ల నిధులను కేంద్రం కేటాయించగా రూ.30 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో మొత్తం ఎనిమిది విభాగాల వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి.

super 28072018 1

గుండె, మెదడు, న్యూరాలజీ, నెప్రాలజీ, నవజాత శిశువు, మూత్రశయం వంటి విభాగాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ విభాగాలకు సంబంధించిన రోగులు గుంటూరు, హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్‌ స్పెషాలిటీ అందుబాటులోకి వస్తే విజయవాడలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఎన్నికలకు ఏడాది ముందుగానే పెందుర్తిలో వేడి రేగుతోంది. బరిలో నిలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలపెట్టేశారు. కేడర్‌లో పట్టు సాధించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో టీడీపీ నేత, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముందున్నారు. విజయంలో కీలకం కీలకపాత్ర పోషించే పెందుర్తి మండలంలో పూర్తి స్థాయి ఆధిపత్యం దక్కేలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. పెందుర్తి లేదా సుజాతానగర్‌లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

viskah 28072018

నియోజకవర్గంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ మండలాలున్నాయి. ఇక్కడి అభ్యర్థులకు విజయావకాశాలను నిర్ణయించేది పెందుర్తి మండలమే. నియోజకవర్గంలో సుమారు 2.50 లక్షల మంది ఓటర్లుండగా పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం మండలాల్లో 1.25 లక్షల మంది ఓటర్లున్నారు. సగానికి పైగా ఓటర్లు పెందుర్తి మండలంలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో బండారు విజయంలోనూ ఇక్కడి ఓటర్లే కీలకమయ్యారు. పెందుర్తి మండలంలో పెందుర్తి, చినముషిడివాడ, సుజాతానగర్‌, పురుషోత్తపురం, నాయుడుతోట, చీమలాపల్లి తదితర ప్రాంతాలలో టీడీపీ కార్యాలయాలున్నాయి. ఎమ్మెల్యే బండారు, అతని తనయుడు అప్పలనాయుడు ఈ కార్యాలయాల్లోనే కార్యకర్తలతో సమావేశాలు ఇతర వ్యవహారాలు చేస్తున్నారు.

viskah 28072018

గత ఎన్నికల్లో బండారు విజయానికి కృషి చేసిన ఆ ప్రాంత విద్యావేత్త ఇటీవల పవన్‌ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడం, రానున్న ఎన్నికలలో పెందుర్తి నుంచి పోటీకి సమాయత్తమవుతుండటం టీడీపీలో గుబులు రేపుతోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులను జనసేన నేత కూడగట్టి మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల పరిస్థితి మళ్లీ బండారుకు కలసివచ్చేనా అని చర్చించుకుంటున్నారు. ఈ మేరకు ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా బండారు వ్యూహ రచనలు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read