11 సిబీఐ కేసులు, 5 ఐడీ కేసుల్లో A2 గా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, నీతులు చెప్తున్న విజయసాయి రెడ్డి కేసుల పై సిబిఐ ఉచ్చు బిగిస్తుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకే వస్తారని సీబీఐ తెలిపింది. ఈ కేసును విచారించే పరిధి సీబీఐ కోర్టుకు ఉందని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, రాంకీ కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్ఛార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. సీబీఐ తరఫున కె.సురేందర్‌ వాదనలు ఇలా వినిపించారు.

vijaysi 28072018

‘‘ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి సిఫార్సులతో ఓబీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. అవినీతి నిరోధక చట్టం కింద బ్యాంకు డైరెక్టర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకే వస్తారు’’ అని వివరించారు. వాన్‌పిక్‌ కేసులో సీబీఐ వాదనల నిమిత్తం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం విచారణకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్‌లు వై.శ్రీలక్ష్మి, మన్మోహన్‌సింగ్‌, వెంకట్రామిరెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాల సాధన కోసం తెదేపా పోరాట తీవ్రతను పెంచినప్పుడల్లా, దాన్ని దెబ్బతీసేందుకు తమ లాలూచీపరులతో భాజపా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. శనివారం తెదేపా ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, అదే రోజు భాజపా మరో పార్టీతో మరోచోట పోటీ దీక్షలు చేయిస్తోందన్నారు. ఇదంతా ఆ మూడు పార్టీలు కలిసి తెదేపాని దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, వైకాపా, జనసేనల లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయని, ప్రజలన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.

cbndharma 28072018 2

ముఖ్యమంత్రి శుక్రవారం తెదేపా ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంటులో ఎంపీలు అద్భుతంగా పోరాడారని, ప్రజల నుంచీ ప్రశంసలు అందుకుంటున్నారని కితాబిచ్చారు. ఇక ముందూ ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పార్లమెంటుకి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినందున ఎంపీలంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘కేంద్రానికి మన సంపద, వనరులు కావాలి. మనకిచ్చిన హామీలను మాత్రం నెరవేర్చరు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయరు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని ఆయన సూచించారు.

cbndharma 28072018 3

ఒంగోలులో జరిగే ధర్మపోరాట సభకు ఎంపీలంతా హాజరవ్వాలన్నారు. భవిష్యత్తు పోరాటానికి మరింత ఉత్తేజం పొందాలన్నారు. రాష్ట్రానికి న్యాయం చేసేంత వరకు భాజపాని విడిచిపెట్టే ప్రసక్తి లేదని సీఎం వ్యాఖ్యానించారు. భాజపాదే యూటర్న్‌ అని, తెదేపాది ఎప్పుడూ రైట్‌ టర్న్‌ అన్న విషయాన్ని ఎంపీలు గట్టిగా చెప్పాలన్నారు. ‘‘వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కు తీసుకోవడం యూటర్న్‌ కాదా? మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, రాజస్థాన్‌ పెట్రో కాంప్లెక్స్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను సగానికి తగ్గించి, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు మాత్రం మమ్మల్నే రూ.5,615 కోట్లు కట్టమనడం యూటర్న్‌ కాదా? దిల్లీ-ముంబయి కారిడార్‌కో న్యాయం, విశాఖ-చెన్నై కారిడార్‌కో న్యాయమా? ధొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం యూటర్న్‌ కాదా?’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నీ ప్రజలకు వివరించాలను ఎంపీలకు సూచించారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న వీవోయే, ఆర్‌పీలకు నెలనెలా రూ.5 వేలు అదాయం అందేలా ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు ఉద్యమంలో ముఖ్య భూమిక వహిస్తున్న వీరందరూ త్వరలో ప్రభుత్వం నుంచి రూ.3వేల గౌరవ వేతనం అందుకుంటారని చెప్పారు. ఈ వేతనంతో పాటు వారు పనిచేసే సంఘాలకు వచ్చే లాభాలను బట్టి నెలకు రూ.2 వేలు మించకుండా ప్రోత్సాహకం ఇస్తామని, ఈ రెండూ కలిపి నెలకు మొత్తం రూ.5వేలు ఆదాయం అందిస్తామని అన్నారు. దీనికోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లి ‘ప్రజావేదిక’ సమావేశ మందిరంలో వి.వో.ఎ., ఆర్.పీ.లతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి సమావేశం జరిపారు.

cbn 28072018 2

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో 27,750 మంది గ్రామ సమాఖ్యల సహాయకులు (వీవోయే), పట్టణ ప్రాంతాలలో 8 వేలమంది రిసోర్స్ పర్సన్స్ (ఆర్‌పీ) పనిచేస్తున్నారు. వీరికి నెలనెలా ఎంతో కొంత ఆదాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి గతంలో మెప్మా, డ్వాక్రా అధికారులకు సూచించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేసి వీరికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం అందించాలని నిర్ణయించారు. దీనిపై ఆదేశాలు జారీకానున్నాయి. అలాగే, వీవోయే, ఆర్‌పీల పని బాధ్యతలపై కొద్దిరోజుల్లో విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఈ ఏడాది రూ.14వేల కోట్ల మేర మహిళా సంఘాలకు రుణాలు అందించామని రిసోర్స్ పర్సన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొత్తం రూ.52 వేల కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించి మహిళా సంఘాలను ప్రోత్సహించామని చెప్పారు. ప్రతి ఇంటికి బ్యాంకును తీసుకువెళ్లిన ఘనత ఏపీలోని మహిళాసంఘాలకే దక్కిందని అన్నారు.

cbn 28072018 2

50 శాతం జనాభాగా వున్న మహిళలు అభివృద్దిలో భాగం కావాల్సిన అవసరాన్ని ఆనాడే గుర్తించానని చెప్పారు. ఆర్థికంగా మహిళ శక్తిమంతురాలు అయినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించానని, అందుకే ఆనాడు పొదుపు సంఘాలను ప్రోత్సహించానని, ఆనాడు ఏపీలో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలు దేశంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయని గుర్తుచేశారు. ‘అప్పట్లో మహిళలు భుజానికి బ్యాగులు వేసుకుని తిరుగుతుంటే వెనక నుంచి మగవాళ్లు కామెంట్లు చేసేవారని అన్నారు. ఈ వ్యాఖ్యల్ని లక్ష్య పెట్టవద్దని మహిళలందరికీ చెప్పానన్నారు. వంటింట్లో పొగచూరుతో తన తల్లి పడుతున్న బాధను చూసి ‘దీపం’ పథకాన్ని ప్రవేశపెట్టానని చెప్పారు. ఈ పథకంతో ఇల్లాలు నిజంగానే ఇంటికి దీపంగా మారిందని, తరువాత సమాజంలో చైతన్యవంతమైన భూమిక పోషించిందని చెప్పారు.

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు గుర్తించి సలహాలనిచ్చేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో త్వరలో ప్రత్యేక పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా, ప్రతి ఒక్కరికీ ఈ తరహా పరీక్షలు చేయించే బృహత్తర కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక విధానాలను, ఉపకరణాలను ఉపయోగించాలని నిర్ణయించింది. తొలుత ప్రయోగాత్మకంగా సచివాలయ ఉద్యోగులతో ప్రారంభించి... తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఒక ప్రఖ్యాత సంస్థ ఇటీవల ప్రత్యేక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దానిని చేతికి పెట్టుకొంటే రక్త పోటును పరిశీలించి, వివరాలను దానంతట అదే వెబ్‌సైట్‌కు పంపిస్తుంది.

cbn health 28072018 2

అలాగే... ఒక్క రక్తపు చుక్క ఆధారంగా పది నుంచి పదిహేను రకాల ఆరోగ్య విశ్లేషణలను చేస్తుంది. మొత్తం సమాచారాన్ని ఇంటర్నెట్‌లోని సంబంధిత వెబ్‌సైట్‌కు పంపిస్తుంది. ప్రతి వ్యక్తికి సంబంధించి ఒక కోడ్‌ను కేటాయిస్తారు. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమకు కేటాయించిన నంబర్‌ను ఇవ్వగానే... రక్త పరీక్షల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే... కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే చెప్పి వదిలివేయకుండా, ఆ ఫలితాలను విశ్లేషించేలా రిపోర్ట్స్‌ ఉంటాయి. ఉదాహరణకు... తిన్న తర్వాత బ్లడ్‌ షుగర్‌ 200 వచ్చిందనకుందాం! అది ఎక్కువా, తక్కువా, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వైద్యుడిని సంప్రదించాలి... ఇలాంటి సూచనలన్నీ ఇస్తారు.

cbn health 28072018 3

అది కూడా... తెలుగులోనే! ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. ఏదైనా వ్యాధి బారిన పడితే... డాక్టర్ల సూచనమేరకు పరీక్షలు చేయించుకుంటున్న వారే ఎక్కువ. ప్రతినెలా ప్రాథమిక స్థాయిలో పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్సతోపాటు జాగ్రత్తలు తీసుకుంటే... ‘చికిత్స కంటే నివారణ మంచిది’ అనే నానుడిని పాటించినట్లవుతుంది. పైగా... ఈ పరికరం ద్వారా పరీక్షలు, విశ్లేషణ దానంతట అదే జరుగుతుంది. వయసు, బరువు, స్త్రీలా, పురుషులా... వంటి ప్రాథమిక వివరాలనూ పరిగణనలోకి విశ్లేషిస్తుంది. రాష్ట్రంలోని వారికి ఈ పరీక్షలు ప్రతి నెలా చేయగలిగితే మెరుగైన ఫలితాలు లభిస్తాయని, సమస్యలు ముందుగానే బయటపడి చికిత్స తేలిక అవుతుందని సీఎం భావిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read