తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ తన సహచరుడని తెలుగుదేశం పార్టీలో ఆయన కీలకంగా పనిచేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కేసీఆర్ గౌరవంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. అధికార పర్యటనలో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ తాను వైకాపా ట్రాప్లో పడ్డానని ఆరోపించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ కన్నా ముందుగా తాను ముఖ్యమంత్రి అయ్యానన్న విషయం ప్రధాని గుర్తుంచుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించిన చంద్రబాబు..

cbnwarning 27072018 2

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మోడీ ప్రశంసించారని చెబుతూ ఆయన ఎవరినైనా ప్రశంసించుకోవచ్చని అయితే ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీకి తగదని చెప్పారు. ఎవరి సర్టిఫికెట్ తనకు అవసరం లేదని అన్నారు. తెదెపాలో కేసీఆర్ పని చేశారని, ఆయన తన సహచరుడని ఈ విషయం పార్టీలోని ప్రతీ ఒక్కరికి తెలుసునని గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వైకాపాను పొడుగుతూ ఆ పార్టీని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఒక ఓటు, సీటు లేదని, అందుకే అధికారం కోసం తమను వ్యతిరేకిస్తున్న పార్టీలతో మోడీ జత కడుతున్నారని దుయ్యబట్టారు.

cbnwarning 27072018 3

భావితరాల భవిష్యత్‌, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడేది లేదని రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరు ద్ఘాటించారు. ఇందుకోసం ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధ మేనని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని విశ్వసించే తాను గతెన్నికల్లో బీజేపీతో పొత్తెట్టుకున్నానన్నారు. ప్రయోజనాలు సిద్ధించే అవకాశాల్లేవని తేలడంతోనే ఎన్డీయే లోంచి బయటకొచ్చామన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే కేంద్రం పై పోరాటం సాగిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే కేంద్రంపై అవిశ్వాసం కూడా ప్రతిపాదించామని చెప్పారు. తన పోరాటానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జగన్ చేసిన వ్యాఖ్యలు, టిడిపి నేతలు చేసి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేది ?.. సోషల్ మీడియాలో విపరీతింగా షేర్ అవుతున్న ఈ పోస్ట్ చూడండి... ఏదో అనుకుంటాం...కానీ..కొంత మందే...అటువంటి మాటలు మాట్లాడగలుగుతారు...? తరువాత ఆ మాటల నుంచి వచ్చే రియాక్షన్‌ తట్టుకోగలుగుతారు..? ఎంత ఛండాలంగా మాట్లాడినా...వెర్రిమూక..నెత్తిన పెట్టుకుంటుంది...ఆహో...ఓహా...మా వాడు..హీరో..అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. అమ్మనా బూతులు తిట్టినా...వారి అభిమానం వారిదే...! ఇప్పుడు అచ్చం...'జగన్‌'లా...'పవన్‌కళ్యాణ్‌' కార్లు మార్చినట్లు..పెళ్లాలను మారుస్తాడని...'జగన్‌' అన్నా..కొందరికి..అది హీరోయిజంలా కనిపిస్తోంది. అదేమిటి..వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని..ప్రశ్నిస్తే...వ్యక్తిగత విషయాలే మున్నాయి..ఉన్నదే కదా..మాట్లాడాడని..సమర్థిస్తున్నారు. అతనికి అలానే కావాలని...భలే అయిందని..మరి కొందరు.. సంబరాలు చేస్తున్నారు. అయితే...ఇక్కడే..నాబోడి వాడికి కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఇదే కామెంట్లు...టిడిపి నేతలు ఎవరైనా చేస్తే..ఎలా ఉండేదో..ఒకసారి..ఊహించుకోండి...!?

pkk 27072018 2

'పవన్‌'పై ఇటువంటి వ్యాఖ్యలు కనుక..టిడిపి నేతలు ఎవరైనా చేసుంటే..ముందుగా..అధినేత చంద్రబాబుతోవారికి చివాట్లు పడేవి..తరువాత..ఆ వ్యాఖ్యలు చేసిన నేతలతో క్షమాపణ చెప్పించేవారు. 'ఆ మధ్య..ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ సినీనటుల గురించి..ఏదో వ్యాఖ్య చేశారు..కదా..తరువాత..సినీనటులకు..ఆయన క్షమాపణ చెప్పారు గుర్తుందా..? అదే విధంగా..ఇప్పుడు కనుక టిడిపి నేతలు...ఇటువంటి కామెంట్లు చేసుంటే ఆ విధంగా జరిగేది. అధినేత చంద్రబాబు అటువంటి వ్యాఖ్యలు చేసిన నేతకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చి ఉండేవారు కాదు. సరే...పార్టీ సంగతి వదిలేద్దాం..మిగిలిన వారి సంగతికి వద్దాం.

pkk 27072018 3

ఇదే వ్యాఖ్యలు టిడిపి నేతలు చేసుంటే..అది తప్పని... సిపిఎం, సిపిఐ, బిజెపి,కాంగ్రెస్‌ నేతలు...ఖండనలపై ఖండనలు ఇచ్చేవారు. అంతేనా..టిడిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసేవారు. పార్టీల సంగతి..అలా ఉంటే...కాపు సంఘాలు, జనసైనికులు.. ధర్నాలు, బంద్‌లతో రాష్ట్రాన్ని హడలెత్తించేవారు. ఎక్కడికక్కడ...నగరాలు హోరెత్తిపోయి ఉండేవి. కానీ..ఇక్కడ 'జగన్‌' ఆ కామెంట్లు చేశాడు..కనుక..ఆయనపై ఎవరూ..నోరెత్తడం లేదు. ఎత్తితే ఏమవుతుందో...వారందరికీ తెలుసు కనుక...వారు నోరెత్తరు. ఆశ్చర్యకరంగా..తిట్టించుకున్న 'పవన్‌' కూడా నోరెత్తడం లేదు, ముగించమని ట్వీట్ కూడా చేసాడు. అదే టిడిపి నేతలు చేసుంటే..నా సత్తా చూపిస్తా..నేను నడిస్తే..సముద్రం నా వెంట నడుస్తుందంటూ..డైలాగ్‌లు చెప్పేవాడు.. లేదా...తనను చంపడానికి.. ఇటువంటివి చేస్తున్నారని..తుపాకులకు ఎదురు నిలబడతానని..సినిమా మాటలు చెప్పేవాడు..ఎంతైనా...'జగన్‌' పెట్టి పుట్టినోడు..? ఆయన ఎవరిని ఏమన్నా...ఎదురే లేదు...ముఖ్యమంత్రిని నడిరోడ్డులో ఉరితీయాలన్నా..బావిలో దూకి చావమన్నా...? ఆయనకు ఎదు రేముంది..? అంతా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలం...! కొందరి జీవితాలు..అంతే...! అలా కలసి వస్తాయి.

ఇమ్రాన్ ఖాన్.. క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే పేరు... పాకిస్తాన్‌ క్రికెట్‌ లో ఫాస్ట్ బౌలర్ గా ఒక ఊపు ఊపేసాడు.. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు... వ్యక్తిగత జీవితం అంతా వివాదాలే.. అయినా సరే, ఇప్పుడు అక్కడ ప్రజలు ఆదరించటంతో ప్రధాని అయ్యారు. ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో, అన్ని పార్టీల కన్నా, 'పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌' 'పీటీఐ' ముందంజలో ఉంది. 272 స్థానాలకు నేరుగా జరిగిన ఎన్నికల్లో 'ఇమ్రాన్‌' పార్టీ 103 సీట్లు గెలుచుకుని, పాక్‌ జాతీయ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇమ్రాన్ ఖాన్ గెలుపు చూసి, పవన్ ఫాన్స్ సంబరి పడిపోతున్నారు. దానికి కారణాలు కూడా చెప్తున్నారు.

imran 27072018 2

ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నుంచి వచ్చి ప్రధాని అయ్యాడు, మా పవన్ సినిమాల నుంచి వచ్చి సియం అవుతాడు అని చెప్పుకుంటున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 22 ఏళ్ళు కష్టపడితే ఒక దేశానికి అధ్యక్షడు అయ్యాడని, మా పవన్ ఇప్పటికే 10 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో సియం అయిపోతాడు అని చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం కూడా పవన్ వ్యక్తిగత జీవితంలోని వివాదాలకి దగ్గరగా ఉంటుంది అని, అయినా అక్కడ ప్రజలు ఆదరించారు అంటే, వ్యక్తిగత జీవితం రాజకీయాల్లో పని చెయ్యదని, మరోసారి రుజువైందని చెప్తున్నారు, పవన్ ఫాన్స్. ఇమ్రాన్ ఖాన్ కు అక్కడ సైన్యంతో పాటు ఉగ్రవాదుల సపోర్ట్ ఉందని, ఇక్కడ కూడా పవన్ కు బీజేపీ సపోర్ట్ ఉందని చెప్తున్నారు.

imran 27072018 3

పవన్ ఫాన్స్ మాత్రమే కాదు, ఏకంగా పవన్ కూడా ఈ విషయం పై నిన్న స్పందించారు. ఇరవై రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌లో పార్టీ ఏర్పాటు చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ ఓపిక ఇప్పటికి ఫలించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క రాత్రిలో మార్పు రాదన్నారు. ఎవరికైనా ఆశయం, సహనం ఉండాలన్నారు. అందుకే తాను మరో ఇరవై అయిదేళ్లు రాజకీయాల్లోనే ఉంటానని, ఇమ్రాన్ ఖాన్ దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా, పవన్ తో పాటు అతని ఫ్యాన్స్ ఆలోచించాల్సింది, ఇది పాకిస్తాన్ కాదు, ఆంద్రప్రదేశ్... అక్కడ ఇమ్రాన్ ఖాన్ కంటే గొప్ప వాళ్ళు అక్కడ ప్రజలకు కనిపించలేదేమో, ఇక్కడ నిరంతర ప్రజా సేవకుడు చంద్రబాబు ఉన్నాడు. నిజంగా పవన్ కు అంత ఓర్పు ఉంటే, ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు. 2009 రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకునే పవన్, ప్రతి సారి ఎన్నికల ముందు వచ్చి వెళ్లిపోతుంటే, ప్రజలు ఏమన్నా తెలివి లేని వాళ్ళా ? అయినా, మనం ఎవరి సంతోషం, అభిప్రాయాలను కాదనలేం కదా, కాలమే వీరికి సమాధానం చెప్తుంది.

పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. మనల్ని యూటర్న్ తీసుకున్నారు అంటున్నారని, మనది ఎప్పుడు సరైన దారే అని, ప్రజల దారే మన దారని అన్నారు. యూటర్న్ తీసుకుందే బీజేపీ అని అన్నారు. ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం, మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి... ఇప్పుడు కుదరదని చెప్పడం.. ఇవన్నీ యూటర్న్‌ కాదా? అని ప్రశ్నించారు. దిల్లీ-ముంబై కారిడార్‌పై శ్రద్ధ చూపిస్తున్న కేంద్రం.. విశాఖ-చెన్నై కారిడార్‌ను గాలికొదిలేస్తోందని, గుజరాత్‌లోని థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం వంటివి యూ టర్న్ కాక మరేంటని ప్రశ్నించారు.

cbn 27072018 4

‘మన సంపద కావాలి, మన వనరులు కావాలి..కానీ మనకిచ్చిన హామీలు నెరవేర్చరు, విభజన చట్టాన్ని అమలు చేయరు’అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కేంద్రం చర్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. ఒంగోలు ధర్మపోరాట సభకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. భవిష్యత్ పోరాటానికి మరింత ఉత్తేజితులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. టీడీపీని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తారా అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి లాలూచీ చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పోరాటం పెంచినప్పుడల్లా లాలూచీపరులతో పోటీ కార్యక్రమాలు పెట్టిస్తారా అని, ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటీ దీక్షలు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీల లాలూచీ బయటపడిందని, అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

cbn 27072018 3

పార్లమెంటులో టీడీపీ ఎంపీల పోరాటంపై ప్రజల్లో ప్రశంసలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని అత్యున్నత చట్టసభల్లో ఎండగట్టారని, తమకు అప్పగించిన బాధ్యతను టీడీపీ ఎంపీలు పకడ్బందీగా నిర్వర్తించారని తెలిపారు. పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. జీరో అవర్‌, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. కేంద్రం ఒంటెత్తు పోకడలపై టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని అభినందించారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలను ఎంపీలు ఎండగట్టారని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, బీజేపీ చేసిన అన్యాయాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read